గిరిడి
గిరిడి | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
నగరం | ||||||||
from the top: Shikharji Parasnath, Usri Falls | ||||||||
Coordinates: 24°11′N 86°18′E / 24.18°N 86.3°E | ||||||||
దేశం | India | |||||||
రాష్ట్రం | జార్ఖండ్ | |||||||
జిల్లా | గిరిడి | |||||||
విస్తీర్ణం | ||||||||
• Total | 87.4 కి.మీ2 (33.7 చ. మై) | |||||||
Elevation | 289 మీ (948 అ.) | |||||||
జనాభా (2011) | ||||||||
• Total | 1,43,529 | |||||||
• జనసాంద్రత | 1,600/కి.మీ2 (4,300/చ. మై.) | |||||||
భాషలు | ||||||||
• అధికారిక | హిందీ, ఉర్దూ | |||||||
Time zone | UTC+5:30 (IST) | |||||||
PIN | 815301 | |||||||
Telephone code | 0-6532 | |||||||
Vehicle registration | JH-11 |
గిరిడి జార్ఖండ్ రాష్ట్రం, గిరిడి జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. గిరిడి అనే పేరు,గిరి నుండి వచ్చింది కొండల భూమి అని దీనికి అర్థం. 1972 కి ముందు, గిరిడి హజారీబాగ్ జిల్లాలో భాగంగా ఉండేది. జాతీయ నమూనా సర్వే కార్యాలయం (NSSO) వారి డేటా ప్రాసెసింగ్ డివిజన్ (DPD) కు చెందిన ఆరు డేటా ప్రాసెసింగ్ కేంద్రాలలో ఒకటి గిరిడిలో ఉంది.
చరిత్ర
[మార్చు]18 వ శతాబ్దం చివరి వరకు గిరిడి జిల్లా ఖరగ్దిహా ఎస్టేట్‌లో భాగంగా ఉండేది. బ్రిటిషు రాజ్ సమయంలో గిరిడి, అటవీ ప్రాంతంలో భాగంగా ఉండేది. 1831 లో జరిగిన కోల్ తిరుగుబాటు తరువాత, రామ్‌గఢ్, ఖరగ్డిహా, కెండి, కుండా పరగణాలు నైరుతి ఫ్రాంటియర్ ఏజెన్సీలో భాగమయ్యాయి. వీటన్నిటినీ కలిపి హజారీబాగ్ పరిపాలనా ప్రధాన కార్యాలయంగా ఒక విభాగం ఏర్పడింది. ఖరగ్డీహా రాజాలు 1809 లో రాజ్ ధంవార్ రాజులుగా స్థిరపడ్డారు. ఖరగ్డీహా గడీలు విడిగా జమీందారీ ఎస్టేట్లుగా ఏర్పడ్డాయి. ఖరగ్డీహా జమిందారీ ఎస్టేట్లలో ముఖ్యమైనవి - కోడెర్మా గడీ, పాల్‌గంజ్, లేడో గడీ, గండే గడీ, ఘోరంజీ గడీ, సిర్సా గడీ. [1] గిరిడి పట్టణం సలీంపూర్ కు చెందిన ఖరగ్డీహా జమిందారీ ఎస్టేటు, కర్హర్బారి ఎస్టేట్ల పాలనలో ఉండేది.
గిరిధ్ జిల్లాలో 1972 డిసెంబరు 6 న హజారీబాగ్ జిల్లా నుండీ కొన్ని భాగాలను విడదీసి ఏర్పరచారు. 1999 లో ఈ జిల్లా లోని కొంత భాగం బొకారో జిల్లా లోకి వెళ్ళింది. [2] ప్రస్తుతం ఈ జిల్లా మావోయిస్టుల ఎర్ర నడవాలో భాగం.
భౌగోళికం
[మార్చు]గిరిడి 24°11′N 86°18′E / 24.18°N 86.3°E వద్ద, [3] సముద్రమట్టం నుండి సగటున 289 మీటర్లు (948 అ.) ఎత్తున ఉంది. గిరిడిలో ఉన్న శ్రీ సమ్మద్ శిఖర్జీ జార్ఖండ్‌లోని ఎత్తైన పర్వత శిఖరం. దీని పారస్‌నాథ్ హిల్స్ అని కూడా అంటారు. ఇది సముద్ర మట్టానికి 1,365 మీటర్ల ఎత్తున, శంఖాకారపు గ్రానైట్ శిఖరం. [4] [5]
శీతోష్ణస్థితి
[మార్చు]గిరిడి వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. అక్టోబరు - మార్చి మధ్య ఉండే శీతాకాలంలో శీతోష్ణస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే వేసవి కాలం సాధారణంగా వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రత 47 oC వరకు పెరుగుతాయి. అధిక ఉష్ణోగ్రతతో పాటు అధిక తేమ స్థాయిలు కూడా ఉంటాయి. ప్రత్యేకించి జూన్‌లో ముందస్తుగా వర్షాలు కురుస్తాయి. జూలై, ఆగస్టుల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. వర్షాకాలం అక్టోబరు మధ్య వరకు కొనసాగుతుంది.
రవాణా
[మార్చు]రైలు
[మార్చు]గిరిడి రైల్వే స్టేషన్ (GRD) గిరిడి నుండి తూర్పున 38 కి.మీ. దూరంలో ఉన్న మధుపూర్ జంక్షన్ (MDP) కి బ్రాడ్‌గేజ్ రైల్వే మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది. రెండు స్టేషన్ల మధ్య ఒక ప్యాసింజర్ రైలు, రోజుకు ఐదుసార్లు నడుస్తుంది. ఈ ప్రయాణానికి ఒక గంట పడుతుంది. [6] గిరిడి భారతీయ రైల్వేల తూర్పు రైల్వే జోన్ లోని అసన్సోల్ డివిజన్ లోకి వస్తుంది. గిరిడి నుండి కోల్‌కతా, పాట్నాలకు నేరుగా రైళ్ళున్నాయి.
న్యూ గిరిడి రైల్వే స్టేషను (ఎన్‌జిఆర్‌హెచ్) గిరిది నగరానికి ఉత్తరాన ఉంది. కోడెర్మా జంక్షన్ (KQR), మహేష్ముండా (MMD) ల మధ్య రైలు మార్గం నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ స్టేషను పనిచెయ్యడం మొదలైంది. ఇది తూర్పు మధ్య రైల్వే జోన్ లోని ధన్బాద్ డివిజనులో ఉంది. ప్రస్తుతం రైలు కోడెర్మా మహేశ్‌ముండా ల మధ్య ఒకసారి, కోడెర్మా మధుపూర్ ల మధ్య ఒకసారి నడుస్తోంది.
రోడ్డు
[మార్చు]జాతీయ రహదారి 19 (పాత NH 2)/ గ్రాండ్ ట్రంక్ రోడ్ గిరిడి జిల్లా గుండా వెళుతుంది. కానీ ఇది నగరానికి కొంత దూరంలో పోతుంది. గిరిడి పట్టణ కేంద్రంలో ఒక బస్టాండు ఉంది. ఇందులో ప్రైవేటు బస్సుల కోసం ప్లాట్‌ఫారమ్‌లున్నాయి. ప్రభుత్వ బస్ టెర్మినస్ ప్రధాన బస్ టెర్మినస్ పక్కనే ఉంది. నగరం నుండి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి. ధన్ బాద్, బొకారో, హజారీబాగ్, దేవ్‌ఘర్, అసన్సోల్, దుర్గాపూర్, కోల్‌కతా, హౌరా, పాట్నా, రాంచీ, జంషెడ్‌పూర్ లకు ఇక్కడి నుండి బస్సు సౌకర్యం ఉంది.
వైమానిక
[మార్చు]గిరిడిలో బోరో ఏరోడ్రోమ్ అనే పిలువబడే ల్యాండింగ్ ఎయిర్‌స్ట్రిప్ ఉంది. [7] గిరిడికి సమీపంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లలో ఉన్న ప్రముఖ విమానాశ్రయాల దూరాలివి:
- బిర్సా ముండా విమానాశ్రయం, రాంచీ 155 కిలోమీటర్లు (96 మై.)
- గయ విమానాశ్రయం 169 కిలోమీటర్లు (105 మై.)
- లోక్ నాయక్ జయప్రకాష్ విమానాశ్రయం, పాట్నా 223 కిలోమీటర్లు (139 మై.)
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం, కోల్‌కతా 309 కిలోమీటర్లు (192 మై.)
జనాభా వివరాలు
[మార్చు]గిరిడి జనాభా | |||
---|---|---|---|
Census | Pop. | %± | |
1901 | 9,433 | — | |
1911 | 10,668 | 13.1% | |
1921 | 18,874 | 76.9% | |
1931 | 21,122 | 11.9% | |
1941 | 25,325 | 19.9% | |
1951 | 29,167 | 15.2% | |
1961 | 36,881 | 26.4% | |
1971 | 40,308 | 9.3% | |
1981 | 65,444 | 62.4% | |
1991 | 78,097 | 19.3% | |
2001 | 98,989 | 26.8% | |
2011 | 1,14,533 | 15.7% | |
మూలం:[8] |
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం[9] గిరిడి పట్టణప్రాంత జనాభా 1,43,529. ఇది జార్ఖండ్‌లో 8 వ అతిపెద్ద నగరం. జనాభాలో పురుషులు 53%, మహిళలు 47% ఉన్నారు. గిరిడి సగటు అక్షరాస్యత 69%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ; పురుషుల అక్షరాస్యత 74%, స్త్రీల అక్షరాస్యత 63%. గిరిడి జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. ఇక్కడీ ప్రజలు మాట్లాడే భాషను ఖోర్తా అంటారు.[10] గిరిడి పట్తణ ప్రాంతంలో గిరిడి (నగర్ పరిషత్), పరాతిహ్ (జనగణన పట్టణం), సిర్సియా (జనగణన పట్టణం), పెర్టోడిహ్ (జనగణన పట్టణం), దండిది (జనగణన పట్టణం) లు భాగం. [11]
మతం
[మార్చు]ప్రముఖులు
[మార్చు]- అనురాగ్ ఆనంద్ - గిరిడిలో జన్మించాడు. BBC, ఛానల్ 4, నేషనల్ జియోగ్రాఫిక్ & డిస్కవరీ వంటి అంతర్జాతీయ దిగ్గజాల కోసం వివిధ డాక్యుమెంటరీలు, టేల్ షోలను నిర్మించిన దర్శకుడు & నిర్మాత.
- సర్ జగదీష్ చంద్రబోస్ తన చివరి రోజులను గిరిడిలో గడిపాడు. అతని గౌరవార్థం సర్ జెసి బోస్ బాలికల ఉన్నత పాఠశాలకు అతని పేరు పెట్టారు. అతను గిరిడిలో మరణించాడు. అతని అప్పటి నివాసాన్ని ఇప్పుడు "విజ్ఞాన కేంద్రం" అని పిలుస్తారు, దీనిని "బీహార్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ" నిర్వహిస్తోంది.
- జ్ఞాన్ చంద్ర ఘోష్ పురులియాలో జన్మించాడు. గిరిది హైస్కూల్‌లో చదువుకున్నారు, అక్కడ నుండి 1909 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాడు. అతను ఒక శాస్త్రవేత్త. భారతదేశంలో సైన్స్, ఇంజనీరింగ్ విద్యను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ కు మొదటి డైరెక్టరు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టరు, కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలరుగా కూడా పనిచేసాడు.
- సాహితీవేత్త, నోబెల్ గ్రహీత, రవీంద్రనాథ్ టాగూర్ కూడా గిరిడిలో కొంత సమయం గడిపాడు. అతను గిరిదిలో నివసిస్తున్నప్పుడు 1904 లో తన శివాజీ ఉత్సవ్ రాశాడు. అతను నివసించే ఇల్లు, దవాసిక భవన్, ఇప్పటికీ గిరిడిలో ఉంది.
- భారతదేశం నుండి ఆస్కార్ గ్రహీతలలో ఒకరైన చిత్ర నిర్మాత సత్యజిత్ రే తన బాల్యాన్ని గిరిడిలో గడిపారు. అతను తన కల్పిత పాత్రను (సైన్స్ ఫిక్షన్ పుస్తకాల శ్రేణిలో కనిపించాడు), శాస్త్రవేత్త ప్రొఫెసర్ షోంకు ఉస్రి నది పక్కన గిరిడిలో నివసిస్తున్నట్లు స్కెచ్ వేశాడు.
- కృష్ణ బల్లభ్ సహాయ్ 1963 - 67 సమయంలో అవిభక్త బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అనేక సార్లు గిరిడి నియోజకవర్గం నుండి బీహార్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- బాబులాల్ మరాండి గిరిడి జిల్లాలోని తిస్రీ బ్లాక్‌లోని మారుమూల కొడియా బ్యాంక్ గ్రామంలో జన్మించారు. [13] అతను జార్ఖండ్ మొదటి ముఖ్యమంత్రి. జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతంత్రిక) రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. [14]
మూలాలు
[మార్చు]- ↑ Hazaribagh District Gazetteer.
- ↑ Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Archived from the original on 17 October 2011. Retrieved 2011-10-11.
- ↑ "Falling Rain Genomics, Inc – Giridih". Fallingrain.com. Archived from the original on 6 March 2014. Retrieved 2011-12-01.
- ↑ "Jharkhand". Encyclopædia Britannica. Archived from the original on 8 March 2012. Retrieved 7 March 2012.
- ↑ "Official website of the Giridih district". Retrieved 7 March 2012.
- ↑ "Trains Between Giridih and Madhupur". India Rail Info. Archived from the original on 2 October 2013. Retrieved 7 March 2012.
- ↑ "Welcome to Giridih: "The Land of Jain Piligrims"". Jharkhand Darshan. Archived from the original on 12 March 2012. Retrieved 7 March 2012.
- ↑ "District Census Handbook Giridih, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Section II Town Directory, Statement I: Status and Growth History, Pages 1310-1311. Directorate of Census Operations, Jharkhand. Retrieved 7 December 2020.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "Giridih City Census 2011". Census2011.co.in. 2011. Archived from the original on 5 May 2012. Retrieved 2012-03-20.
- ↑ "Provisional population totals, Census of India 2011" (PDF). Constituents of Urban Agglomerations haing population above 1 lakh and above, Census 2011. Government of India. Retrieved 12 December 2020.
- ↑ "Giridih City Census 2011 data". Archived from the original on 6 మే 2019. Retrieved 6 మే 2019.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "MP Biodata Government of India". India.gov.in. 22 May 2006. Archived from the original on 11 May 2012. Retrieved 2011-12-01.
- ↑ "Giant-killer will be Jharkhand CM". Rediff.com. 14 November 2000. Archived from the original on 24 September 2015. Retrieved 2011-12-01.