భాగల్పూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాగల్పూర్
Bhagalpur, भागलपुर
Champa
Coordinates: 25°09′N 87°01′E / 25.15°N 87.02°E / 25.15; 87.02
Population (2001)
 • Total3,50,133
Websitehttp://bhagalpur.bih.nic.in

భాగల్పూర్ అనేది భారతదేశంయొక్క, బీహార్ రాష్ట్రంలోని నగరం మరియు మునిసిపల్ కార్పొరేషన్. భాగల్పూర్, దక్షిణ ప్రాంతపు బీహార్ లోని పురాతన జిల్లాలలో ఒకటి. అది గంగానది మైదానంలో సముద్ర మట్టానికి 141 అడుగుల ఎత్తున ఉంది. ఇది బీహార్లోని పెద్ద నగరాల్లో మూడవది. దీని వైశాల్యం 2569.50 కి.మీ2. మరియు ఇది 25o-07' - 25o30' ఉ అక్షాంశములు మరియు 86o 37 ' - 87o 30 ' తూ రేఖాంశముల మధ్య ఉంది. ఇది భాగల్పూర్ జిల్లా యొక్క పరిపాలక ముఖ్యాలయము. భాగల్పూర్ అక్కడి పట్టు ఉత్పత్తులకు ప్రపంచమంతటా ప్రసిధ్ధిచెందింది మరియు భారతదేశంలో దీనిని టస్సర్ పట్టు & టస్సర్ చీరలకు ప్రసిధ్ధిచెందిన "పట్టు నగరం"గా పిలుస్తారు. భాగల్పూర్ అన్నది భాగ్దత్పురం (అదృష్టకరమైన నగరం అని అర్థం) అన్న పదానికి వికృతి, దీనికి ఈ పేరు అంగరాజ్యంలో వికాసం చెంది, అప్పటి నుండి అధికార కేంద్రంగా ఉంది.

అవలోకనం[మార్చు]

బీహార్(జనాభా)లో పాట్నా & గయల తరువాత భాగల్పూర్ 3వ అతి పెద్ద నగరం. చారిత్రిక ప్రాముఖ్యత కల ఈ నగరం గంగానది తీరంలో, పాట్నాకు తూర్పున 220 కి.మీ. మరియు కలకత్తాకు పశ్చిమంగా 410 కి.మీ. దూరంలో ఉంది. 7వ శతాబ్దపు చైనీస్ యాత్రికులు హ్యుయాన్-త్సాంగ్ మరియు ఫా-హియాన్లు ఈ నగరాన్ని తూర్పు భారతదేశంలో అతిపెద్ద వ్యాపార కేంద్రాల్లో ఒకటిగా వర్ణించారు. ఈ నగరానికి చెందిన చంపానగర్ (భాగల్పూర్ కే మరొక పేరు) అన్న ప్రదేశంలో గంగానదీ తీరంలో పెద్ద ఓడరేవు ఉండేది, దానినే ప్రస్తుతం చంపానాలాగా పిలుస్తారు, ఇది ప్రస్తుత నగరంలో నాథానగర్ సమీపంలోని నగరం యొక్క పశ్చిమ సరిహద్దులో ప్రవహిస్తోంది. పురావస్తు త్రవ్వకాలలో, మధ్య మరియు దూర ప్రాచ్యానికి చెందిన నావలు మరియు నాణేలు ఈ ప్రదేశంలో లభించాయి. భాగల్పూర్ ఎన్నో రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా కలపబడి ఉంది. భాగల్పూర్ లోని విమానాశ్రయం 1980ల చివరివరకూ కార్యానుకూలంగా ఉండినా, అప్పటి నుండి పునరుద్ధరణకై వేచి ఉంది.

ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి పట్టు(టస్సర్ పట్టు) మరియు మామిడిపండ్ల ఉత్పత్తికి ప్రసిధ్ధి చెందింది. ఈ నగరంలోని పట్టు పరిశ్రమ వందల సంవత్సరాల నాటిది, ఇక్కడి స్థానికులు తరతరాలుగా పట్టును ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ పట్టు కేంద్రం మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నాయి, అంతేకాక ఇంజనీరింగ్, మెడికల్ మరియు హోమియోపతీ కళాశాలలు ఉన్నాయి.

ఇక్కడి గంగానది తలాలు ఎంతో సారవంతమైనవి మరియు ఇక్కడి ప్రధానమైన పంటలు ముఖ్యంగా వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లీ, మరియు నూనెగింజలు. భాగల్పూర్ యొక్క ఆర్ధిక వ్యవస్థ ముఖ్యంగా వ్యవసాయం మరియు కుటీర పరిశ్రమలపై ఆధారపడింది.

చరిత్ర[మార్చు]

గంగానది యొక్క సారవంతమైన తీరాల్లో ప్రారంభ నాగరికతలు ఎంతగానో వృద్ది చెందాయి. భాగల్పూర్ తరచూ ప్రాచీన సంస్కృత సాహిత్యమైన రామాయణ, మహాభారత మరియు పంచతంత్రలలో భాగద్దత్ పురంగా చెప్పబడింది. మతపరమైన పండుగ "విష్-హరి పూజ" లేదా "సర్ప రాణి పూజ" లేదా "మానసా దేవి, శివుడు మరియు సర్ప రాణీల పుత్రికగా చెప్పబడింది" యొక్క మూలాలు వందల సంవత్సరాల క్రితం నాటివి మరియు ఈ నాటికీ ప్రతి సంవత్సరం వేలకొద్దీ భక్తులు మరియు పాములను ఆడించేవారు నాగ్ (సర్ప రాజు) మరియు నాగిన్ (సర్ప రాణి) లకు పాలు అర్పించడం ద్వారా ఉత్సవం జరుపుకుంటారు.

భాగల్పూర్ వర్ణన భారతదేశంలోని పురాణాలు రామాయణ మరియు మహాభారతాలలో భాగల్పూర్‌ను అంగరాజ్యంగా వర్ణించినప్పుడు చూడవచ్చు. అశోక చక్రవర్తి కాలం (274 క్రీ.పూ.-232 క్రీ.పూ.) లోని ప్రాచీన గుహల శిల్పాలు ఇరుగుపొరుగులో మరియు భాగల్పూర్‌కు పశ్చిమంగా 20 కి.మీ. దూరంలోని సుల్తాన్గంజ్‌లో కనిపిస్తాయి, ఇప్పటికీ భాగల్పూర్లో గుప్తయుగం (320-500) నాటి దేవాలయం ఉంది. పట్టణం నడిమధ్యలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సోదరుడు సుజా యొక్క సమాధి, ఈ నగరానికి మొగల్ కాలంతో గల సంబంధాన్ని గుర్తుచేస్తుంది.

ప్రాచీన విక్రంశిల విశ్వవిద్యాలయ శిథిలాలు భాగల్పూర్ కు తూర్పున 44 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. విక్రంశిల రాజ విశ్వవిద్యాలయం, నలంద తరువాతి స్థానాన్ని ఆక్రమిస్తుంది, ఇది తనను తాను పరమసౌగత (బుద్ధయొక్క ప్రధాన భక్తుడు) గా చాటించుకున్న పరమభక్తుడైన పాల రాజు మరియు మహాయాన బౌద్ధమతంయొక్క ప్రధాన పోషకుడు అయిన ధర్మపాల (770-810 A.D.) కారణంగా ఆవిర్భవించింది. ఇది బౌద్ధ విద్య పాలన మరియు ప్రచారానికి మధ్య స్థానంగా ఉండేది, దీనిని బెంగాల్ రాజు ధరంపాల్ (783-820) 8వ శతాబ్దం చివర్లో స్థాపించాడు.

మహాభారత పురాణంలో దాతృత్వంలో ప్రసిధ్ధిచెందిన కర్ణ మహారాజు పాలించిన ప్రాచీన సంస్కృత అంగరాజ్యంలో భాగంగా భాగల్పూర్ చెప్పబడింది. తరువాతి కాలంలో ఇది శక్తివంతమైన హిందూ రాజ్యం మగధ లేదా బెహర్‌లో భాగమైంది, అటుపై 7వ శతాబ్దంలో ఇది స్వతంత్ర రాష్ట్రంగా ఉండేది, అప్పటి దీని రాజధాని చంపా. ఆ తరువాత అది గౌర్ యొక్క మహమ్మదీయ రాజ్యంలో భాగంగా ఉండేది, తరువాతి కాలంలో అక్బర్ ఆక్రమణకు గురై, ఢిల్లీ సామ్రాజ్యంలో భాగంగా చాటింపబడింది. చక్రవర్తి షా ఆలం IIచే 1765లో భాగల్పూర్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది.

భాగల్పూర్ మరియు పరిసర ప్రాంతాలలో అక్టోబరు 1989 లో జరిగిన మతకలహాలు సుమారు రెండునెలలు కొనసాగాయి, ఇందులో దాదాపు 1,070 మంది ప్రాణాలు కోల్పోయారు.

పౌరాణిక ప్రాముఖ్యత[మార్చు]

భాగ్దత్పురం (ప్రస్తుతం భాగల్పూర్) అప్పటి "ఆర్యావర్తం" (భారతదేశానికి అప్పటి పేరు) లో ప్రముఖ పట్టణాల్లో ఒకటి. ఇది పాటలీపుత్ర లేదా పాట్నాకు సమకాలికంగా చెబుతారు. భాగ్దత్పురం గురించి వేదములు మరియు రామాయణంలోనూ చెప్పబడింది. ఇది కుంతి మరియు సూర్య దేవుల పుత్రుడైన దానవీర కర్ణరాజ్యంగా చెబుతారు. అతడి పరిపాలనలో, ఈ పట్టణాన్ని "అంగ ప్రదేశ్" లేదా "అంగదేశ్" అనేవారు. భాగ్దత్పురం యొక్క అర్థం సాహిత్యపరంగా "అదృష్టకర నగరం".

భాగల్పూర్ కు దక్షిణంగా 52 కిలోమీటర్ల (రమారమి 32 మైళ్ళు) దూరంలో ఉన్న మందర పర్వతం, హిందూ పురాణంలో సముద్ర-మంథనానికి (సముద్రాన్ని చిలకడానికి) దేవతలు మరియు రాక్షసులు (దానవులు) వాడినట్టూ చెబుతారు. సముద్ర-మంథనానికి మందర పర్వతం వాడడం ఈ పర్వతాన్ని దేవతలు సముద్రాన్ని చిలికి అమృతం పొందడానికి ఉపయోగించారని సూచిస్తుంది. సర్పం, వాసుకి స్వయంగా చిలికేందుకు తాడుగా ఉపయోగపడి, ఆ నల్లరాయి కొండపై చుట్టుకున్న గుర్తులను వదిలినట్టూ చెబుతారు. మహాభారతంలో వాడిన శంఖం పాంచజన్యం, ఇక్కడి "శంఖ్ కుండ్"లో దొరికిందని నమ్ముతారు. పురాణాలు కూడా ఈ కొండను వర్ణిస్తాయి. దీనికి విష్ణువు మధుసూదన (మధు అనే రాక్షసుడిని నాశనం చేసినవాడు) అవతారంలో వచ్చాడని నమ్ముతారు . రాక్షసుడైన మధును చంపి విష్ణువు ఈ కొండ క్రింద ఉంచాడని చెబుతారు. కాళిదాసు యొక్క కుమారసంభవంలో మందర వాలుల్లో విష్ణువు పాదముద్రల గురించి చెబుతుంది. ఈ కొండ పురాతన యుగాల చిహ్నాలతో నిండి ఉంది. శాసనాలు మరియు విగ్రహాలే కాక, హిందూ దేవతల ఆకృతులకు చెందిన ఎన్నో శిలా శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. ఈ కొండను జైనులుకూడా పవిత్రంగా భావిస్తారు, ఈ పర్వతశిఖరం మీదే వారి 12వ తీర్థంకరుడు నిర్వాణం పొందాడని వారు విశ్వసిస్తారు. మందర పర్వతం చుట్టుప్రక్కల ప్రాంతం నిండా అసాధారణ సౌందర్యం కలిగిన దృశ్యాలు కనిపిస్తాయి. 800 అడుగుల ఎత్తున్న నల్లరాయి పర్వతం పగటి వెలుగులో తప్పక చూడదగ్గది. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఇది ప్రసిద్ధ విహారస్థలం.

ఆర్ధిక లావాదేవీలు[మార్చు]

ఈ నగరంలోని పట్టు పరిశ్రమ 200 ఏళ్ళ నాటిది, తరాల కాలంగా పట్టు ఉత్పత్తి చేసే పూర్తి వంశం ఇక్కడ ఉంది. భాగల్పూర్ పట్టుపురుగుల పెంపకం, పట్టు దారాల తయారీ మరియు వాటి అందమైన ఉత్పత్తుల నేతకు ప్రసిధ్ధి. ఈ పట్టు విభిన్నమైనది మరియు ప్రత్యేకమైనది. దీనిని టస్సా లేదా టస్సర్ పట్టు అంటారు. పట్టు నేత భాగల్పూర్ లో పురాతనమైన సంప్రదాయిక కుటుంబ పరిశ్రమ. ఇక్కడ పట్టు కేంద్రం మరియు వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి, అంతేకాక ఒక విశ్వవిద్యాలయం మరియు ఇంజనీరింగ్, మెడికల్ మరియు హోమియోపతి కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ భాగల్పూర్ లో చేనేతకారుల సేవాకేంద్రం (GOI) 1974లో స్థాపించబడింది. దీని ఉద్దేశం బీహార్ రాష్ట్రంలో చేనేత పట్టు పరిశ్రమను వృద్ది చేయడం. భాగల్పూర్ లో ఉత్పత్తి చేసిన పట్టుచీరలు స్వదేశీ మార్కెట్లో ఎంతో పేరుగాంచాయి. కర్ణాటక రాష్ట్రం తరువాత పట్టు వస్త్రం ఉత్పత్తి మరియు ఎగుమతికి భాగల్పూర్ రెండవ స్థానం ఆక్రమిస్తుంది. భాగల్పూర్ లోని పట్టుతో తయారుచేసిన గృహసంబంధ వస్త్రాలు నెమ్మదిగా విదేశీ మార్కెట్లోనూ ప్రసిధ్ధి చెందుతున్నాయి.

జనాభా[మార్చు]

As of 2001 భారతదేశం జనగణన, [1] భాగల్పూర్ పట్టణంయొక్క జనాభా 452,427 కాగా, జిల్లా మొత్తం 2.4 మిలియన్ జనాభా కలిగి ఉంది. పట్టణ జనాభా ప్రకారం పాట్నా మరియు గయల తరువాత ఇది బీహార్లో మూడవ అతిపెద్ద నగరం. ఈ జనాభాలో పురుషులు 49%, స్త్రీలు 51% ఉన్నారు. భాగల్పూర్ యొక్క సగటు అక్షరాస్యత శాతం 50%, ఇందులో పురుషుల అక్షరాస్యత 59% మరియు స్త్రీలది 40%.

సంస్కృతి[మార్చు]

భాగల్పూర్ లోని హిందువుల ప్రధాన పండుగలు ఛట్ పూజ, కాళి పూజ మరియు దసరా.భాగల్పూర్ లో బిహుల మరియు బిషహరి పూజ ప్రత్యేకంగా జరుపుతారు.ఇతర ముస్లిం పండుగలకన్నా భాగల్పూర్ లోని ముహర్రం ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటుంది.

భాష[మార్చు]

భాగల్పూర్ ప్రధాన భాష అంగిక, ఇది ప్రపంచ వ్యాప్తంగా 30 మిలియన్ ప్రజలకన్నా ఎక్కువమంది మాట్లాడే ప్రాంతీయ భాష, దీనిని ప్రపంచంలోని అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటిగా భావిస్తారు.[2][3]

మాధ్యమం[మార్చు]

అచ్చు మాధ్యమాలు :- భాగల్పూర్ నుండి ప్రచురింపబడే వార్తాపత్రికలు దైనిక్ జాగరణ్, హిందూస్తాన్, అజ్' ప్రభాత్ ఖబర్. ఎలక్ట్రానిక్ మాధ్యమం :- అంగిక బీహార్ ఛానల్. Angvani.com, భాగల్పూర్ యొక్క మొదటి ఆన్లైన్ వార్తాపత్రిక 2007 ఆగస్టు 15 నాడు ప్రారంభమయింది. ఈ వెబ్ పోర్టల్ భాగల్పూర్ లోని తాజా వార్తలను చదువరులకు అందిస్తుంది. ఇంటర్నెట్ మాధ్యమం : Angika.com, 2004 నుండి అంగదేశ సేవలో అంగిక భాష వెబ్ పోర్టల్.

ఆసక్తి ఉన్న ప్రాంతాలు[మార్చు]

 • Temple](at Sultanganj or Jahangira)
 • జైన దేవాలయం (చంపానగర్)
 • మహర్షి మేహి ఆశ్రం, కుప్ప ఘాట్ (గంగానది తీరం)
 • కర్ణగఢ్ (నాథ్ నగర్) -కర్ణుడి (మహాభారతంలోని) రాజభవనంగా భావించే ప్రాంతం.
 • బుధనాథ్ లోని శివ దేవాలయం
 • రబీంద్ర నాథ్ భవన్ (తిల్హా కోఠి)
 • సందిష్ ప్రాకారం
 • శరత్ చంద్ర చటోపాధ్యాయ నివాసం
 • లజపత్ ఉద్యానవనం
 • ఘురన్ సాహ పీర్ బాబా దర్గా (సమాధి)
 • విక్రంశిల సేతు
 • విక్రంశిల విశ్వవిద్యాలయం (ప్రాచీన) & వస్తుప్రదర్శనశాల
 • విక్రంశిల గంగాతీర డాల్ఫిన్ రక్షితప్రాంతం
 • సంజయ్ గాంధీ జైవిక్ ఉద్యాన్ (ఉద్యానవనం)
 • రాజ్ మహల్ శిలాజ రక్షణశాల (సాహిబ్ గంజ్ దగ్గర)
 • ఉదువ పక్షుల రక్షణశాల (బర్హర్వ దగ్గర)
 • విష్ హరి స్థాన్ (సర్ప దేవాలయం), చంపానగర్
 • ఘంటా ఘర్ (క్లాక్ టవర్), బ్రిటిష్ సమయంలో తయారయింది
 • బతేహ్వర్ నాథ్ (కహల్గావ్ దగ్గర)
 • ఫుల్వారియా శివ మందిర్ (నగరానికి 8 కి.మీ దక్షిణాన) 1893 లో బ్రాహ్మణ సమాజం ద్వారా ఏర్పాటు చేయబడింది

భాగల్పూర్ నుండి ప్రజలు[మార్చు]

 • తిలక మంఝి మొదటి సంతల్ స్వాతంత్ర్య సమరయోధుడు.
 • కాదంబిని, భాగల్పూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బ్రజ కిషోర్ బోస్ కుమార్తె, బ్రిటిష్ సామ్రాజ్యంలో మొదటి స్త్రీ విద్యావంతులలో ఒకరు మరియు దక్షిణ ఆసియాలో మొదటి స్త్రీ వైద్యురాలు.
 • సుచిత్రా భట్టాచార్య, ప్రసిద్ధ భారతీయ నవలా రచయిత్రి భాగల్పూర్లో 1950 జనవరి 10న జన్మించింది.
 • నేహ సింగ్, సిస్కో సిస్టమ్స్ ఇండియాలో SVP.

ఇక్కడ కొంత కాలం గడిపిన వారు:

 • అశోక్ కుమార్, కిషోర్ కుమార్ మరియు అనూప్ కుమార్: హిందీ చలనచిత్రాలకు చెందిన ఈ ముగ్గురు ప్రసిద్ధ సోదరులు వారి బాల్యంలో ఎక్కువ భాగాన్ని నగరం మధ్యలో ఆదంపూర్ ప్రాంతంలో గడిపారు. హిందీ చలనచిత్రాల్లో దాదా మునిగా పేరుపొందిన అశోక్ కుమార్ తన చదువు మొత్తం భాగల్పూర్ లోని C.M.S. ఉన్నత పాఠశాలలో చదివాడు. ఈ నగరం వారి తల్లితరఫు తాత స్వస్థలం కావడంతో ఆ ముగ్గురికీ ప్రియమైనది, దాదా ముని తన మరణం వరకూ ఈ నగరానికి క్రమం తప్పకుండా వచ్చేవాడు.
 • శరత్ చంద్ర చటోపాధ్యాయ ఈ నగరంలో మూలాలు కలిగినట్టు చెబుతారు. అతడి ప్రసిద్ధ నవల దేవదాసు భాగల్పూర్ లోనే వ్రాసాడు. అతడు తన జీవితంలో 20 ఏళ్ళు భాగల్పూర్లో గడిపాడు, అతడి నవలల్లో ప్రధాన భాగాలు ఇక్కడ వ్రాయబడినవి లేదా భాగల్పూర్లో అతడి అనుభవాలపై ఆధారపడినవి.
 • రబీంద్ర నాథ్ టాగోర్ కొంతకాలంపాటు విశ్వవిద్యాలయ ప్రాంగణం దగ్గరలోని తిల్హా కోఠిలో ఉండేవాడు. నోబెల్ బహుమతి పొందిన గీతాంజలి లోని భాగాలు తిల్హా కోఠిలో వ్రాసినవే.

విద్య[మార్చు]

భాగల్పూర్ విద్యకు సంబంధించి పాట్నా తరువాత బీహార్లోనే 2వ ప్రధాన నగరం. తిలక మంఝి భాగల్పూర్ విశ్వవిద్యాలయం (మునుపు భాగల్పూర్ విశ్వవిద్యాలయం) బీహార్లోనే రెండవ అత్యంత పురాతన విశ్వవిద్యాలయం. దీనిని 1961లో స్థాపించారు. TNB కళాశాల, భాగల్పూర్ బీహార్లోనే అత్యంత పురాతన కళాశాలలలో ఒకటి, నాణ్యమైన విద్యకు రాష్ట్రమంతటా పేరుపొందినది. భాగల్పూర్లో ఇంకా ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం బీహార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (మునుపు సబౌర్ వ్యవసాయ కళాశాల, భాగల్పూర్) 2010 ఆగస్టు 4న స్థాపించబడింది.

భాగల్పూర్లో ఇంకా రాష్ట్రానికి చెందిన వైద్య కళాశాల (జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాల & వైద్యశాల, భాగల్పూర్), ఇంజనీరింగ్ కళాశాల (భాగల్పూర్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్), పాలిటెక్నిక్, హోమియోపతిక్ కళాశాలలు ఉన్నాయి. TNB కళాశాల, మార్వారీ కళాశాల & S.M కళాశాలలతో పాటు మరెన్నో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

బీహార్లోనే అత్యుత్తమమైన పాఠశాల స్థాయి విద్య భాగల్పూర్లో కూడా లభిస్తుంది. సెం. జోసెఫ్స్ స్కూల్, మౌంట్ అసిసి, మౌంట్ కార్మెల్ క్రితం 30 ఏళ్ళుగా ప్రథమ శ్రేణి ICSE స్కూళ్ళు, వీటిలో నుండే ఒకరు I.C.S.E.లో మొదటి 20 మందిలో ఉండేవారు. క్రితం 10 ఏళ్ళలో, విక్రంశిల అకాడెమి స్కూల్, SKP విద్య విహార్, సెయింట్ తెరెసా, DAV, సెయింట్ పాల్, నవయుగ్ విద్యాలయవంటి పాఠశాలలు నాణ్యతగల విద్యను అందిస్తున్నాయి.

భాగల్పూర్లో అద్భుతమైన పాఠశాల స్థాయి విద్య లభించినా, నాణ్యమైన విద్యయొక్క గిరాకీ మరియు పంపిణీల మధ్య అంతరాల కారణంగా విద్యార్థులు వారి ఇంజనీరింగ్ లేదా మెడికల్ చదువులకు నగరాన్ని విడిచి వెళ్ళడం జరుగుతూ ఉంది.

సూచనలు[మార్చు]

 1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. మూలం నుండి 2004-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-01. Cite web requires |website= (help)
 2. Angika.com
 3. "Dishagvm.org". మూలం నుండి 2010-11-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-27. Cite web requires |website= (help)

విక్రంశిల పాఠశాల, తిల్కమంఝి, భాగల్పూర్ సరస్వతి విద్య మందిర్, నర్గాకోఠి, భాగల్పూర్ డాన్ బాస్కో అకాడమి D.A.V. పబ్లిక్ స్కూల్, బరారి భాగల్పూర్

బాహ్య లింకులు[మార్చు]