సివాన్
సివాన్ | |
---|---|
పట్టణం | |
నిర్దేశాంకాలు: 26°13′N 84°22′E / 26.22°N 84.36°ECoordinates: 26°13′N 84°22′E / 26.22°N 84.36°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | సివాన్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 69.4 కి.మీ2 (26.8 చ. మై) |
విస్తీర్ణపు ర్యాంకు | 53rd |
సముద్రమట్టం నుండి ఎత్తు | 72 మీ (236 అ.) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,35,066 |
• ర్యాంకు | 18th |
• సాంద్రత | 1,900/కి.మీ2 (5,000/చ. మై.) |
భాష | |
• అధికారిక | హిందీ[3] |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 841226-841227 |
ISO 3166 కోడ్ | IN-BR |
వాహనాల నమోదు కోడ్ | BR-29 |
జాలస్థలి | siwan |
సివాన్ బీహార్ రాష్ట్రం, సివాన్ జిల్లా లోని పట్టణం. [4] ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. ఇది ఉత్తర ప్రదేశ్ సరిహద్దుకు దగ్గరలో ఉంది. [5]
భౌగోళికం, శీతోష్ణస్థితి[మార్చు]
సివాన్ పట్టణం 26°13′N 84°22′E / 26.22°N 84.36°E అక్షాంశ, రేఖాంశాల వద్ద, [6] సముద్ర మట్టం నుండి 72 మీటర్ల ఎత్తున ఉంది. పట్టణం పశ్చిమ ప్రాంతం గుండా దహా నది ప్రవహిస్తోంది. వేసవిలో ఇది ఎండిపోతుంది. ఇది అత్యంత కలుషితమైన నది కూడా
సివాన్ శీతోష్ణస్థితి సాధారణంగా తేలికపాటి వేడిగా, సమశీతోష్ణంగా ఉంటుంది. కొప్పెన్-గీగర్ వాతావరణ వర్గీకరణ ప్రకారం ఈ వాతావరణం క్వాగా పరిగణించబడుతుంది.
నెల | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగస్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | సంవత్సరం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సగటు అధిక °C (°F) | 23.1 | 26.1 | 32.4 | 36.2 | 38.6 | 36.2 | 32.8 | 32.3 | 32. | 31.8 | 28.7 | 24.7 | — |
రోజువారీ సగటు °C (°F) | 16.4 | 18.9 | 24.5 | 28.9 | 32 | 31.4 | 29.4 | 29.2 | 28.7 | 26.7 | 21.6 | 17.6 | — |
సగటు అల్ప °C (°F) | 9.8 | 11.8 | 16.7 | 21.7 | 25.5 | 26.6 | 26 | 26.2 | 25.5 | 21.7 | 14.5 | 10.5 | — |
అవక్షేపం mm (inches) | 21 | 7 | 11 | 7 | 25 | 164 | 257 | 316 | 192 | 54 | 6 | 2 | — |
Source: Climate-data.org[7] |
జనాభా[మార్చు]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సివాన్ జనాభా 1,35,066, వీరిలో 70,756 మంది పురుషులు, 64,310 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 18,282. సివాన్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 92,967, ఇది జనాభాలో 68.8%. పురుషుల్లో అక్షరాస్యత 73.6% కాగా, స్త్రీలలో ఇది 63.6%. సివాన్‌లో ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 79.6%, ఇందులో పురుషుల అక్షరాస్యత 85.2%, స్త్రీల అక్షరాస్యత 73.5%. షెడ్యూల్డ్ కులాలు జనాభా 8,244, షెడ్యూల్డ్ తెగల జనాభా 1,514. 2011 లో సివాన్‌లో 21,223 గృహాలు ఉన్నాయి. [2]
మతం[మార్చు]
మెజారిటీ ప్రజలు హిందూ మతాన్ని (65%), ఇస్లాంను (34%) అనుసరిస్తున్నారు. సిక్కు మతం, బౌద్ధమతం, జైన మతలను అవలంబించినవారి సంఖ్య స్వల్పంగా ఉంది. [8]
రవాణా[మార్చు]
జాతీయ రహదారి-531 సివాన్‌ను గోపాల్‌గంజ్, ఛప్రా లతో కలుపుతుంది. ఈ రహదారి గోపాల్‌గంజ్ వద్ద జాతీయ రహదారి-27 తో కలుస్తుంది. ఇది భారతదేశంలో రెండవ పొడవైన రహదారి. బీహార్ రాష్ట్ర రహదారి -47 బర్హారియా, మైర్వా, గుథానీలను సివాన్‌తో కలుపుతుంది. రాష్ట్ర రహదారి -73, 89 సివాన్‌ను సమీప పట్టణాలతో, గ్రామాలతో కలుపుతుంది.
రైల్వేలు[మార్చు]
సివాన్‌లో లోని సివాన్ జంక్షన్ రైల్వే స్టేషను పట్టణాన్ని భారతదేశంలోని ప్రధాన పట్టణాలతో కలుపుతుంది. ఇది ఛప్రా, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్, థావేలను నేరుగా కలుపుతుంది. ఇతర రైల్వే స్టేషన్లు మైర్వా, దురౌంద, జిరాడే, మహారాజ్గంజ్ .
మూలాలు[మార్చు]
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>
కాదు;smc
అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 2.0 2.1 "Census of India: Siwan". www.censusindia.gov.in. Retrieved 4 December 2019.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 9 March 2019.
- ↑ "Municipalities of Siwan district". siwan.nic.in. Retrieved 22 April 2019.
- ↑ "Siwan News". www.siwanonline.com. Retrieved 14 June 2018.
- ↑ "Siwan, Bihar, India". www.latlong.net. Retrieved 19 June 2018.
- ↑ "Climate:Siwan". Retrieved 19 June 2018.
- ↑ 8.0 8.1 "C-1 Population By Religious Community - Siwan". census.gov.in. Retrieved 17 August 2020.