మాధేపురా
మాధేపురా | |
---|---|
Coordinates: 25°55′12″N 86°47′31″E / 25.920°N 86.792°E | |
దేశం | India |
రాష్ట్రం | బీహార్ |
ప్రాంతం | మిథిల |
జిల్లా | మాధేపురా |
Government | |
• Type | పురపాలక సంఘం |
• Body | మాధేపురా పురపాలక సంఘం |
విస్తీర్ణం | |
• Total | 26 కి.మీ2 (10 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 54,472 |
• జనసాంద్రత | 2,100/కి.మీ2 (5,400/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | |
ISO 3166 code | IN-BR |
Vehicle registration | BR-43 |
లోక్‌సభ నియోజకవర్గం | మాధేపురా |
మాధేపురా బీహార్ రాష్ట్రం, మాధేపురా జిల్లాలోని పట్టణం, జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
జనాభా వివరాలు
[మార్చు]2001 జనగణన ప్రకారం,[1] మాధేపురా జనాభా 45,015. జనాభాలో పురుషులు 55%, స్త్రీలు 45% ఉన్నారు. మాధేపురా అక్షరాస్యత రేటు 62%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 71%, స్త్రీల అక్షరాస్యత 51%. మాధేపురా జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.[2]
రవాణా
[మార్చు]పట్టణం నుండి ఇతర ప్రాంతాలకు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు, టాక్సీలూ అందుబాటులో ఉన్నాయి.
రైలు
[మార్చు]దౌరమ్ మాధేపురా రైల్వే స్టేషన్ బరౌని-కతిహార్, సహర్సా, పూర్ణియా విభాగాల్లో, బరౌని-గువహతి మార్గంలో ఉంది. ఇక్కడి నుండి పూర్ణియా, బర్హరా కోఠీ సహర్సా జంక్షన్ లకు మూడు జతల ప్యాసింజర్ రైళ్ళున్నాయి. పాట్నా జంక్షన్, దర్భంగా, జయానగర్, కటిహార్, రాంచీ, ఢిల్లీ, అమృత్సర్, సీల్దాకు నేరుగా రైళ్లున్నాయి.
త్రోవ
[మార్చు]ఎన్‌హెచ్ 231, ఎన్‌హెచ్ 131 మాధేపురా గుండా వెళ్తాయి NH-231 పూర్ణియా, సహర్సా & మహేష్‌ఖుంట్ లకు వెళుతుండగా, NH-131 బీర్‌పూర్, బీహ్‌పూర్ లకు కలుపుతుంది. పట్టణం నుండి పూర్ణియా, సహర్సా, సుపాల్, దర్భాంగా & పాట్నాకు రోజువారీ బస్సు సర్వీసు ఉంది.
గాలి
[మార్చు]సమీప విమానాశ్రయం దర్భంగా విమానాశ్రయం. (119 కి.మీ.)
మూలాలు
[మార్చు]- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ http://www.telegraphindia.com/1130908/jsp/bihar/story_17323700.jsp#.Ui0_ztI3tFs