అక్షాంశ రేఖాంశాలు: 25°33′38″N 83°58′50″E / 25.56049°N 83.98054°E / 25.56049; 83.98054

బక్సర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బక్సర్
పట్టణం
బక్సర్ రైల్వేస్టేషను
బక్సర్ రైల్వేస్టేషను
బక్సర్ బ్లాకులో బక్సర్ స్థానం
బక్సర్ బ్లాకులో బక్సర్ స్థానం
బక్సర్ is located in Bihar
బక్సర్
బక్సర్
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°33′38″N 83°58′50″E / 25.56049°N 83.98054°E / 25.56049; 83.98054
దేశం India
రాష్ట్రంబీహార్
జిల్లాబక్సర్
Elevation
55 మీ (180 అ.)
జనాభా
 (2011)
 • Total1,02,861
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
802101
టెలిఫోన్ కోడ్06183
Vehicle registrationBR-44

బక్సర్ బీహార్ రాష్ట్రం, బక్సర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. అలాగే బక్సర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌కు ప్రధాన కార్యాలయం. ఇందులో 132 గ్రామాలతో పాటు జనగణన పట్టణం సరింపూర్ కూడా భాగంగా ఉంది. ఈ పట్టణం మినీ కాశీగా ప్రాచుర్యం పొందింది. బక్సర్‌ను మహర్షి విశ్వమిత్ర నగరంగా, రాముడి విద్యా ప్రదేశంగా భావిస్తారు. ఈ పట్టణానికి ప్రాచీన కాలం నుండి గొప్ప మత, సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఆధునిక కాలంలో చారిత్రాత్మక చౌసా యుద్ధం, బక్సర్ యుద్ధం ఈ పట్టణానికి సమీపం లోనే జరిగాయి.[1][2][3] బక్సర్ రైల్వే స్టేషన్ హౌరా-ఢిల్లీ ప్రధాన మార్గంలో పాట్నా-మొఘల్‌సరాయ్ విభాగంలో ఉంది. ఇది రాష్ట్ర రాజధాని పాట్నా నుండి సుమారు 125 కి.మీ. దూరంలో ఉంది. బక్సర్ స్థానిక భాష భోజ్‌పురి.

చరిత్ర

[మార్చు]

చరిత్రవన్ లో ఉన్న బక్సర్ కోట, గంగా నది ఒడ్డున ఉన్న మధ్యయుగ కాలపు కోట. సా.శ. 1054 లో పర్మార్ రాజవంశానికి చెందిన రాజు, రుద్రదేవ్ దీన్ని నిర్మించాడు. విశ్వామిత్ర ఆశ్రమం ఉన్న ప్రదేశంలోనే, రాముడు తాటకను సంహరించిన ప్రదేశం లోనే ఈ కోటను నిర్మించాడు. తరువాతి కాలంలో ఈ కోటను ఖాళీ చేసి వదలివెయ్యగా, భోజ్‌దేవ్ రాజు దానికి మరమ్మతులు చేయించాడు. ఆ తరువాత దీనిని పర్మార్ రాజవంశ పాలకులు ఉపయోగించారు.

చారిత్రాత్మక చౌసా యుద్ధం, బక్సర్ నగరానికి 10 మైళ్ళ దూరంలో ఉన్న చౌసా యుద్ధభూమిలో జరిగింది. 1539 జూన్ 26 న ఆఫ్ఘన్ రాజు షేర్ షా సూరి, మొగలు చక్రవర్తి హుమాయున్ దళాల మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఆఫ్ఘన్ రాజు చేతిలో మొగలు చక్రవర్తి చిత్తుగా ఓడిపోయాడు.

హెక్టర్ మున్రో నేతృత్వంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలకు, బెంగాలు నవాబైన మీర్ ఖాసిమ్, అవధ్ నవాబు షుజా-ఉద్-దౌలా, మొఘల్ చక్రవర్తి షా ఆలం II ల సంయుక్త సైన్యాలకూ మధ్య 1764 అక్టోబరు 22 న బక్సర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయాత్మక విజయం సాధించింది. ముస్లిము పాలకుల సంయుక్త దళాలను బ్రిటిషు దళాలు మట్టికరిపించాయి. చివరికి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజకీయాలపై బలమైన పట్టు సాధించడానికి ఈ విజయం దోహదపడింది.

జనాభా

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
191111,309—    
192110,098−10.7%
193113,449+33.2%
194114,879+10.6%
195118,087+21.6%
196123,068+27.5%
197131,691+37.4%
198142,952+35.5%
199155,753+29.8%
200183,168+49.2%
20111,02,861+23.7%

2011 జనగణన ప్రకారం [4] బక్సర్ జనాభా [5] 1,02,861. అందులో పురుషులు 52.65% కాగా, స్త్రీలు 47.35%. జనాభాలో 16% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

2011 జనాభా లెక్కల ప్రకారం బక్సర్ నగరంలో అక్షరాస్యత 83.82%, పురుషుల అక్షరాస్యత (89.13%), స్త్రీల అక్షరాస్యత (77.89%).

భౌగోళికం

[మార్చు]

బక్సర్ జిల్లా 1,703 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Archived copy". Archived from the original on 12 March 2017. Retrieved 2017-03-11.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Archived copy". Archived from the original on 12 March 2017. Retrieved 2017-03-11.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. https://www.telegraphindia.com/1151027/jsp/bihar/story_49751.jsp#.WMNcKfnyuM8 Archived 12 మార్చి 2017 at the Wayback Machine
  4. "Census of Buxar". Census of India. Archived from the original on 11 December 2013. Retrieved 9 December 2013.
  5. Buxar Population, Buxar Population from 2001-2020. "Buxar Population". Archived from the original on 2021-02-07. Retrieved 2021-01-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Census of India 2011: Bihar District Census Handbook - Buxar, Part A (Village and Town Directory)". Census 2011 India. pp. 19–20, 23–98, 681–82, 358–421, 730–746. Retrieved 3 July 2020.


"https://te.wikipedia.org/w/index.php?title=బక్సర్&oldid=3557856" నుండి వెలికితీశారు