అక్షాంశ రేఖాంశాలు: 25°11′49″N 85°31′05″E / 25.197°N 85.518°E / 25.197; 85.518

బీహార్ షరీఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీహార్ షరీఫ్
బీహార్ షరీఫ్ is located in Bihar
బీహార్ షరీఫ్
బీహార్ షరీఫ్
Coordinates: 25°11′49″N 85°31′05″E / 25.197°N 85.518°E / 25.197; 85.518
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుపాట్నా
జిల్లానలందా
విస్తీర్ణం
 • City152.94 కి.మీ2 (59.05 చ. మై)
 • Urban
23.5 కి.మీ2 (9.1 చ. మై)
 • {{{area_blank2_title}}}78.53 కి.మీ2 (30.32 చ. మై)
Elevation
55 మీ (180 అ.)
జనాభా
 (2011)[1]
 • City2,97,268
 • జనసాంద్రత15,743/కి.మీ2 (40,770/చ. మై.)
భాష
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
803101 803118 803216 803111 803113
టెలిఫోన్ కోడ్+916112
ISO 3166 codeIN-BR
Vehicle registrationBR-21
లోక్‌సభ నియోజకవర్గంనలందా

బీహార్ షరీఫ్, బీహార్ రాష్ట్రం, నలందా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. రాష్ట్రంలోకెల్లా ఇది ఐదవ అతిపెద్ద ఉప-మెట్రోపాలిటన్ ప్రాంతం. దీని పేరు రెండు పదాల కలయిక: బీహార్, (విహార -అంటే మఠం అని అర్ధం) షరీఫ్ (గొప్ప అని అర్థం) అనే రెండు పదాల నుండి ఉద్భవించింది, . [3] ఈ నగరం దక్షిణ బీహార్‌లో విద్యా వాణిజ్య కేంద్రంగా ఉంది. ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ప్రధానాధారం కాగా, పర్యాటకం, విద్యారంగం, గృహ ఉత్పత్తులు అనుబంధంగా ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన పురాతన నలందా మహావిహర శిధిలాలు పట్టణానికి సమీపంలో ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

బీహార్ షరీఫ్ బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నుండి జాతీయ రహదారి 30, 20 ద్వారా 74 కి.మీ. దూరంలో ఉంది. ఇది బడీ పహాడీ (హిరణ్య పర్బత్) పాదాల వద్ద, పంచానన్ (పంచనే) నది ఒడ్డున ఉంది. బీహార్ షరీఫ్ చుట్టూ ఉన్న భూమి చాలా సారవంతమైనది, ఒండ్రు మట్టి అనేక నదుల ద్వారా నిక్షిప్తం చేయబడింది. ఈ స్థానిక నదులలో మహానే, పంచనే ఉన్నాయి - ఇది పావపురికి పశ్చిమాన గోయిత్వా, సోయాబా, చిన్న నదులుగా విభజిస్తుంది. పశ్చిమాన గంగా యొక్క ఉపనది అయిన పైమార్ నది ప్రవహిస్తోంది. [4]

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనగణన్ ప్రకారం బీహార్ షరీఫ్ జనాభా 2,97,268,[1] 2001 లో ఇది 2,31,972[5] and around 130,000 in 1981.[6] లింగ నిష్పత్తి 916. పిల్లలలో ఇది 927. పట్టణ అక్షరాస్యత 75.30%, పురుషుల అక్షరాస్యత 80.80%, స్త్రీ అక్షరాస్యత 69.28%.

బీహార్ షరీఫ్‌లో మతం[7]
మతం శాతం
హిందూ మతం
  
65.86%
ఇస్లాం
  
33.59%
ఇతరాలు†
  
0.54%
ఇతరాల్లో
=సిక్కుమతంs (0.01%), బౌద్ధం (0.01%) ఉన్నాయి

2011 జనాభా లెక్కల ప్రకారం, నగర జనాభాలో 65.86% మంది హిందువులు కాగా, 33.59% మంది ముస్లింలు, 0.34% మంది జనాభా లెక్కల ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, 0.17% మంది క్రైస్తవులుగా గుర్తించారు. యాభై కంటే తక్కువ మంది ఇతర మత సమూహాలకు చెందినవారు. [1] 1981 లో విడూదలైన ఒక నివేదిక ప్రకారం ముస్లింలు జనాభాలో 48% ఉన్నట్టు తెలిపింది. ఇది ఈ ప్రాంతానికి అసాధారణమని పేర్కొంది. [6]

2012 లో, బీహార్ షరీఫ్‌లో స్థానిక బహాయి ఆరాధన సభ నిర్మాణానికి ప్రణాళికలు ప్రకటించారు. [8] ఇది భారతదేశంలోని దాదాపు రెండు మిలియన్ల బహాయిలకు ఇది రెండవ ప్రార్థనా మందిరం [9] (మొదటిది ఢిల్లీలోని ప్రసిద్ధ లోటస్ టెంపుల్ ), [10] ఇది ఆసియా లోని మొదటి రెండు స్థానిక బహాయి ఆరాధనలలో ఒకటి. (మరొకటి కంబోడియాలోని బట్టాంబంగ్‌లో ఉంది ).

రవాణా

[మార్చు]

రహదారులు

[మార్చు]

బోఈహార్ షరీఫ్ నుండి పాట్నా, రాజ్‌గిర్, నలంద, నవాదా, హర్నాట్, జంషెడ్పూర్, రాంచీ, ధన్బాద్, బొకారో, కోడెర్మా, కోలకతా, గయ, హజారీబాగ్, బార్హి, జహానాబాద్, బక్తి,యార్‌పూర్, బర్హ్, మొకామా, రాంగడ్ . వంటి ప్రధాన నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది. ఇది జిల్లా ముఖ్యపట్టణం కావడంతో, ఇది ఒక ప్రధాన రవాణా కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలోని అన్ని ఇతర ప్రధాన ప్రదేశాలకు బస్సులు నడుస్తున్నాయి.

ఆసియా హైవే నెట్‌వర్క్ లో భాగమైన NH 33, NH 20, AH42 లు నగరం గుండా వెళ్తాయి. NH 33 , NH 20 లు నగరంలో ఒకదానితో ఒకటి కలుస్తాయి. NH 20 పట్టణాన్ని బక్తియార్‌పూర్ ద్వారా పాట్నా , నవాదా బార్హి, కోడెర్మ, హజారీబాగ్, రాంచీ లకు కలుపుతుంది.. NH 33 పట్టణాన్ని మోకామా, బార్బిఘా, అస్తవాన్, జహానాబాద్, అర్వాల్ లతో కలుపుతుంది.

NH 120 ఇక్కడ మొదలై, దమ్‌రావ్ ద్వారా నలందా, రాజ్‌గిర్, గయ లకు వెళ్తుంది. .

ఎస్‌హెచ్ 78, పట్టణాన్ని చండి, దానివాన్, హిల్సా లతో కలుపుతుంది.

నగరానికి పబ్లిక్ సిటీ బస్ సర్వీస్ కూడా సేవలు అందిస్తుంది. పాట్నా, గయల తరువాత ఈ సేవ అందుబాటు లోకి వచ్చిన బీహార్ పట్టణాల్లో బీహార్ షరీఫ్ మూడవది. 2018 డిసెంబరులో ప్రారంభమైన ఈ సేవ రాజ్‌గీర్ మోర్ (కార్గిల్ చౌక్) -సోహ్సరై మార్గంలో నగరానికి సేవలు అందిస్తుంది.

రైల్వేలు

[మార్చు]

బీహార్ షరీఫ్ జంక్షన్ జాతీయ బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో భాగమైన బక్తియార్‌పూర్-తిలైయా మార్గంలో ఉంది . నగరం నుండి న్యూ ఢిల్లీకి రోజువారీ సూపర్ ఫాస్ట్ రైలు శ్రమజీవి ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. రాష్ట్ర రాజధాని పాట్నాకు, దేశంలోని అనేక గమ్యస్థానాలకూ అనుసంధానించే అనేక ప్రయాణీకుల, ఎక్స్‌ప్రెస్ రైళ్ళు నడుస్తున్నాయి. ఇటీవల, డానియావన్‌ను బీహార్ షరీఫ్‌తో కలపడంతో ఫతుహా-ఇస్లాంపూర్ బ్రాంచ్ లైన్ ఈ మార్గానికి అనుసంధానించబడింది. బీహార్ షరీఫ్‌ను హిల్సా, స్కేఖ్‌పురా, గయలను కలపడంతో 2013 లో ప్రయాణీకుల సేవల విస్తరణ జరిగింది. పావపురి రోడ్ పట్టణపు దక్షిణ శివార్లలో ఉన్న మరొక ముఖ్యమైన రైల్వే స్టేషన్.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Biharsharif City Census 2011 data". 2011 Indian Census. Retrieved 27 March 2016.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 7 December 2018.
  3. "Definition of 'sherif'". Collin's dictionary. Retrieved 29 November 2020.
  4. "Bihar Sharif". Encyclopædia Britannica. Retrieved 19 March 2016.
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  6. 6.0 6.1 Engineer, Ashgar Ali (16 May 1981). "Biharsharif Carnage: A Field Report". Economic and Political Weekly. 16 (20): 887–889. JSTOR 4369828.
  7. "Census 2011 Bihar Sharif". Census 2011. Retrieved 8 July 2017.
  8. "Plans to build new Houses of Worship announced". Baha'i World News Service. 22 April 2012. Retrieved 25 March 2016.
  9. "Most Baha'i Nations (2005)". The Association for Religion Data Archives. Archived from the original on 14 April 2010. Retrieved 23 June 2016.
  10. "Iconic "Lotus Temple" focus of worldwide campaign". Bahá'í World News Service. 6 October 2011. Retrieved 25 March 2016.