నలందా జిల్లా
నలందా జిల్లా
नालंदा जिला,ضلع نالندہ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | పాట్నా |
ముఖ్య పట్టణం | బీహార్ షరీఫ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | నలందా |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,367 కి.మీ2 (914 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 28,72,523 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,100/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 66.41 (M=77.11; F=54.76) |
• లింగ నిష్పత్తి | 921 (2011) |
ప్రధాన రహదార్లు | NH 31, NH 82, NH 110 |
Website | అధికారిక జాలస్థలి |
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో నలందా జిల్లా (హిందీ:) ఒకటి. బీహార్ షరీఫ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
చరిత్ర
[మార్చు]1976లో పాట్నా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి నలందా జిల్లాను రూపొందించారు.[1]
భౌగోళికం
[మార్చు]నలందా జిల్లా వైశాల్యం 2355 చ.కి.మీ.[2] ఇది కెనడా లోని కార్న్‌వాల్ ద్వీపం వైశాల్యానికి సమానం.[3] జిల్లాలో ప్రధానంగా ఫల్గు, మొహన్, జిరాయన్, కుంభారి నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లా పాట్నా డివిజన్‌లోభాగం.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,872,523,[4] |
ఇది దాదాపు. | జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | కంసాస్ నగర జనసంఖ్యకు సమం..[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 134 వ స్థానంలో ఉంది..[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1220 .[4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.18 %.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 921:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 66.41 %.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ఆర్ధికం
[మార్చు]కొత్తాగా స్థాపించబడిన ఆర్డినెంస్ ఫ్యాక్టరీ దేశంలోని 41 ఇండియన్ ఆర్డినెంస్ ఫ్యాక్టరీలలో ఒకటి. దీనిని డిఫెంస్ మంత్రిత్వశాఖ స్థాపించింది. నలందాలో ఆర్టిల్లరీ షెల్స్‌ను తయారు చేయడానికి ఈ సంస్థ స్థాపించబడ్జింది.[7][8] 2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో నలందా జిల్లా ఒకటి అని గుర్తించింది.[9] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహారు రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[9]
విభాగాలు
[మార్చు]- జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి :-బీహార్ షరీఫ్, రాజగిరి, హిల్సా, బీహార్ హిల్సా.
- జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి :- రహుయి, అజయ్పుర్ నూర్సరై, హర్నౌత్, చండి (నలంద), ఇస్లాంపూర్ (నలంద), రాజగిరి, అస్థవన్, సర్మెర, హిల్సా, బీహార్,బిహర్షరిఫ్,ఎకంగర్సరై,బెన, నగర్నౌస, కరై పర్సరై, సిలవొ, నలంద పర్వల్పుర్,కత్రిసరై, బైండ్, తర్థరి
వృక్షజాలం, జంతుజాలం
[మార్చు]1978లో నలందా జిల్లాలో 36కి.మీ విస్తీర్ణంలో " రాజ్‌గిర్ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " స్థాపించబడింది. .[10]
ప్రస్తుత స్తితి
[మార్చు]నలందా జిల్లా త్వరితగతిలో అభివృద్ధి చెందుతూ ఉంది. అంతర్జాతీయ, జాతీయ పర్యాటకులను " నలందా విశ్వవిద్యాలయం " విపరీతంగా ఆకర్షిస్తుంది. పర్యాటకుల రాకవలన ప్రాతీయ వాసుల ఆర్థికంగా అభివృద్ధికి సహకరిస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Districts of India".
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11.
Cornwall Island 2,358km2
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Jamaica 2,868,380 July 2011 est
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Kansas 2,853,118
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-11. Retrieved 2014-12-15.
- ↑ http://www.thehindubusinessline.com/government-and-policy/ofb-nalanda-to-develop-indigenous-artillery-shells/article3342557.ece
- ↑ 9.0 9.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: బీహార్". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
బయటి లింకులు
[మార్చు]- Nalanda Information Portal Archived 2011-04-30 at the Wayback Machine