Jump to content

శివ్‌హర్ జిల్లా

వికీపీడియా నుండి
శివ్‌హర్ జిల్లా
शिवहर जिला,ضلع شیوہر
బీహార్ పటంలో శివ్‌హర్ జిల్లా స్థానం
బీహార్ పటంలో శివ్‌హర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుతిర్హుత్
ముఖ్య పట్టణంశివ్‌హర్
Government
  లోకసభ నియోజకవర్గాలుశివ్‌హర్
  శాసనసభ నియోజకవర్గాలుశివ్‌హర్
Area
  మొత్తం
443.99 కి.మీ2 (171.43 చ. మై)
Population
 (2011)
  మొత్తం
6,56,916
  Density1,500/కి.మీ2 (3,800/చ. మై.)
జనాభా వివరాలు
  అక్షరాస్యత56%
  లింగ నిష్పత్తి890
ప్రధాన రహదార్లుNH-104
Websiteఅధికారిక జాలస్థలి

బీహార్ రాష్ట్ర 39 జిల్లాలలో జిల్లా షెవోహార్ ఒకటి. శివ్‌హర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.జిల్లా తిరుహట్‌ డివిజన్‌లో భాగం. 1994లో సీతామఢీ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు. ప్రముఖ హిందీ నవలారచయిత డాక్టర్ భగవతి శరణ్ మిశ్రా షెవోహార్ జిల్లా మొదటి మెజిస్ట్రేట్‌గా నియమించబడ్డాడు. జిల్లావైశాల్యం 443 చ.కి.మీ 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 514,288. జిల్లాలో హిందువులు, ముస్లిములు అధికంగా ఉన్నారు. జిల్లా వాసులకు వ్యవసాయం ప్రధాన జివనాధారంగా ఉంది. బీహార్ రాష్ట్రంలోని వరదబాధిత జిల్లాలలో ఇది ఒకటి. బగ్మతి, బుధి గందక్ నదులకు అధికంగా వరదలు సంభవిస్తుంటాయి. దెకులిలో పురాతనమైన ప్రముఖ శివాలయం ఉంది. 2011 గణాంకాల ప్రకారం బీహార్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా షెవోహార్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవది అని గుర్తించబడింది. .[1]

భౌగోళికం

[మార్చు]

జిల్లా వైశాల్యం 349 చ.కి.మీ.[2]

ఆర్ధికం

[మార్చు]

జిల్లాలో వ్యవసాయం ప్రజలకు ప్రధాన ఆదాయవనరుగా ఉంది. జిల్లాలో అనిరకాల పంటలు పండించబడుతున్నాయి.వరి, గోధుమ, పలు రబీ పంటలు పండినబడుతున్నాయి. 2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో షెవోహార్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[3]

ఉపవిభాగాలు

[మార్చు]
  • జిల్లాలో ఒకేఒక ఉపవిభాగం ఉంది: శివ్‌హర్
  • జిల్లాలో 4 మండాలాలు ఉన్నాయి : శివ్‌హర్, తరియాని, పిప్రాహి, దుంరి - కత్సరి,,పుర్నహియా.

ప్రయాణవసతులు

[మార్చు]
  • సమీపంలో ఉన్న విమానాశ్రయాలు :-
  • జైప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.
  • గయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ( పాట్నా). 17కి.మీ.
  • సమీపంలోని రైలు మార్గం : సీతామఢీ.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 656,916,[1]
ఇది దాదాపు. మోంటెంగ్రొ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. వర్మోంట్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 551 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1882 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 27.32%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 890:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 56%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

సంస్కృతి

[మార్చు]

ఈ జిల్లాలోని దేకులి ధామ్ లో ఉన్న బాబా భువనేశ్వర్ నాథ్ మహాదేవ్ మందిరం ప్రసిద్దమైనది. ఈ ఆలయ గర్భగుడిలో ఒక సొరంగం ఉండేదని, మహాభారతం లోని లక్క ఇంటి దహనం నుండి ఐదుగురు పాండవులు ఈ సొరంగం గుండా తప్పించుకుని తమ ప్రాణాలను కాపాడుకున్నారని చెబుతారు.

  • పర్యాటక సీజన్ : అక్టోబరు నుండి మార్చి
  • పండుగలు : దివాలి, చాత్, దుర్గ పూజ, హోలి

రాజకీయ నాయకులు

[మార్చు]
  • ఠాకూర్ జుగల్ కిషోర్ సిన్హా స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, సహకార ఉద్యమ మూలపురుషుడు.
  • రామ్ దులారి సిన్హా స్వాతంత్ర్య సమర యోధుడు, కేంద్ర మాజీ మంత్రి మాజీ గవర్నర్
  • శ్రీ బైధ్నాథ్ పటేల్, సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నేత
  • డాక్టర్ మధురేద్ర కుమార్ సింగ్, సీనియర్ కాంగ్రెస్ నేత
  • రామ దేవి, పార్లమెంట్ బి.జె.పి సభ్యుడు
  • రఘునాథ్ ఝా మాజీ మంత్రి sheohar జిల్లా స్థాపకుడు
  • డాక్టర్. ధర్మేంద్ర కిషోర్ మిశ్రా (అధ్యక్షుడు, బిజెపి), బీజేపీ స్థాపకుడు (శివ్‌హర్)

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 5 6 7 "District Census 2011". Census2011.co.in. 2011. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-30.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7.
  3. 1 2 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. the original (PDF) నుండి 2012-04-05 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 27, 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". the original నుండి 2011-09-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-10-01. Montenegro 661,807 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. the original నుండి 2011-08-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-30. Vermont 625,741