అరారియా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరారియా జిల్లా
अररिया जिला,اریا ضلع
బీహార్ పటంలో అరారియా జిల్లా స్థానం
బీహార్ పటంలో అరారియా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుపూర్ణియా
ముఖ్య పట్టణంఅరారియా
Government
 • లోకసభ నియోజకవర్గాలుఅరారియా
విస్తీర్ణం
 • మొత్తం2,830 కి.మీ2 (1,090 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం28,06,200
 • జనసాంద్రత990/కి.మీ2 (2,600/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత53.1 %
 • లింగ నిష్పత్తి921
ప్రధాన రహదార్లుNH 57
Websiteఅధికారిక జాలస్థలి
సుల్తాన్ పోఖర్, ఫోర్బ్స్‌గంజ్ వద్ద సూర్యాస్తమయం

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో అరారియా జిల్లా ఒకటి. అరారియా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. అరారియా జిల్లా పూర్ణియా డివిజన్‌లో భాగం. అరారియా జిల్లా వైశాల్యం 2830 చ.కి.మీ. జిల్లా నుండి హిమాలయ పర్వతాల లోని "కాంచన్‌జుంగ" పర్వతం కనిపిస్తుంది.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

బ్రిటిష్‌రాజ్ కాలంలో ఫోర్బ్స్ బంగళాను రెసిడెంషియల్ ఏరియా అనిపిలిచేవారు. ప్రజలు దానిని సంక్షిప్తంగా " ఆర్ ఏరియా " అనేవారు. కాలక్రమేణ ఆర్ ఏరియా అరారియా అయింది.

చరిత్ర

[మార్చు]

1964లో అరారియా భూభాగం మునుపటి పూర్ణియా జిల్లాలో ఉపవిభాగంగా ఉండేది. 1990 జనవరి న అరారియా ఉపవిభాగం పూర్ణియా డివిజన్‌లో ఒక జిల్లాగా రూపుదిద్దుకుంది.

భౌగోళికం

[మార్చు]

అరారియా జిల్లా వైశాల్యం 2830.[1] ఇది రష్యాలోని జమాలియా జియోర్గా జనసంఖ్యకు సమానం.[2]

నదులు

[మార్చు]

జిల్లాలో కోసి, సువర, కాలి, కొలి.

ఆర్ధికం

[మార్చు]

పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ, 2006 గణాంకాల ప్రకారం భారతదేశం లోని వెనుకబడిన 250 జిల్లాలలో అరారియా జిల్లా ఒకటి అని గుర్తించింది. [3] వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. [3]

వ్యవసాయం

[మార్చు]

జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్నలు, జ్యూట్ పంటలు పండుతున్నాయి.

విభాగాలు

[మార్చు]
  • అరారియా జిల్లా 2 ఉపవిభాగాలు ఉన్నాయి:- అరారియా,ఫోర్బెస్‌గంజ్.
  • అరారియా ఉపవిభాగంలో 4 బ్లాకులు ఉన్నాయి:- అరారియా, భర్గమా, సిక్తి, రాణిగజ్.
  • ఫోర్బెస్‌గంజ్ ఉపవిభాగంలో 5 బ్లాకులు ఉన్నాయి:- కుర్సకాంతా, ఫోర్బ్స్‌గంజ్, భర్గమ, రాణిగంజ్, నర్పత్‌గంజ్.
  • భర్గమ, రాణిగంజ్ ఉపవిభాగాలు ఒకే న్యాయపరిధిలో ఉన్నాయి.
  • జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉన్నాయి : రాణిగంజ్, ఫోర్బ్స్‌గంజ్, నర్పత్‌గంజ్, అరారియా, జోకిఖత్, సిక్తి.
  • పార్లమెంటు నియోజకవర్గం :- అరారియా

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,806,200,[4]
ఇది దాదాపు. జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. ఉటాహ్ నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 139 వ స్థానంలో ఉంది..[4]
1చ.కి.మీ జనసాంద్రత. 992 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 30%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 921:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 55.1%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
ప్రజలు ముస్లిములు అత్యధికంగా ఉన్నారు.[4]

ప్రముఖులు

[మార్చు]
  • ఫణీశ్వర్నాథ్ రేణు : నవలా రచయిత, కథారచయిత.
  • సుబ్రతా రాయ్ : సహారా గ్రూప్ చైర్మన్.
  • పరమానంద్ రిషిడియో : రాజకీయ నాయకుడు. ముషర్ సమూహంలో ఎం.ఎ ఫ్రెంచ్ చదివిన మొదటి వ్యక్తి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7.
  2. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Zemlya Georga 2,821km2
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Jamaica 2,868,380 July 2011 est
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Utah 2,763,885

బయటి లింకులు

[మార్చు]

వెలుపలిలింకులు

[మార్చు]