ఔరంగాబాద్ జిల్లా (బీహార్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఔరంగాబాద్ జిల్లా
औरंगाबाद जिला,ضلع اورنگ آباد
బీహార్ పటంలో ఔరంగాబాద్ జిల్లా స్థానం
బీహార్ పటంలో ఔరంగాబాద్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుమగధ
ముఖ్య పట్టణంఔరంగాబాద్ (బీహార్)
Government
 • లోకసభ నియోజకవర్గాలుఔరంగాబాద్
Area
 • మొత్తం3,305 km2 (1,276 sq mi)
Population
 (2011)
 • మొత్తం25,11,243
 • Density760/km2 (2,000/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత72.77 %
 • లింగ నిష్పత్తి916
ప్రధాన రహదార్లుNH 2
Websiteఅధికారిక జాలస్థలి
దేవో సూర్య మందిరం, బీహార్‌లోని దేవ్ వద్ద

" ఔరంగాబాద్ జిల్లా " బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో ఒకటి. ఇది ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో లేదు.[1]

పేరువెనుక చరిత్ర[మార్చు]

ఔరంగజేబు ఈప్రాంతానికి వచ్చివెళ్ళిన కారణంగా ఈ ప్రాంతానికి ఔరంగజేబు గుర్తుగా ఔరంగాబాద్ అనే పేరు వచ్చింది.

చరిత్ర[మార్చు]

పురాతన చరిత్ర[మార్చు]

జిల్లా పూర్తిగా పురాతన మగధ సామ్రాజ్యంలో పశ్చిమ మద్య ప్రాంతంలో ఉంది. త్రేతాయిగ, ద్వాపరయుగలోని శ్రీరామ, శ్రీకృష్ణ సంబంధిత సమస్త సాహిత్యం లభిస్తుంది. ప్రంపంచంలోని నలుమూలల నుండి వచ్చే హిందువులు ఇక్కడ పిండప్రధానం చేద్తుంటారు. మొదటి పిండం సమీపంలో ఉన్న పున్- పున్ నదిలో వదులుతుంటారు. పుపు- పున్ నదిని పురాణాలలో అర్ధగంగ అంటారు. ఈ ప్రాంతానికి చెందిన కచ్చితమైన చరిత్ర వ్రాయడం కష్టం. జిల్లాలోని ప్రతి ప్రాంతానికి ఒక స్వంత చరిత్ర ఉంటుంది.

భృగు[మార్చు]

భృగు మహర్షి ఇక్కడ తపసు చేసాడని విశ్వసిస్తున్నారు. పున్- పున్, మదార్ నదీ సంగమం వద్ద భృగుమహర్షి ఆరాధించిన భవాని మందిరం ఉంది. ఆలయంలో భావానీమాత శిల్పం ఇంకా ఉనికిలో ఉంది. శిల్పం ముక్కు విరిగింది. అందుకని ప్రజలు భావానీమాతను " నక్తి భవాని " అంటారు. భృగు మహర్షి విరవిత భృగుసంహిత (భారతీయ జ్యోతిష గ్రంథం) ఇక్కడ వ్రాయబడిందని విశ్వసిస్తున్నారు.

తపోస్థలి[మార్చు]

తపోస్థలి చవన్ మహర్షి తపోభూమి అని విశ్వసిస్తున్నారు. చ్యవన మహర్షి ఆయుర్వేదిక ఔషధం చ్యవనప్రాసను కనిపెట్టాడు. ఆయన ఆరాధించిన పరమశివ లింగం ఇప్పటికీ ఉనికిలో ఉంది. శివలింగం బ్లాక్‌సఫైర్‌తో చేయబడింది. ప్రాంతీయ ప్రజలు చ్యవన మహర్షి ఆరాధిత శివలింగాన్ని " ధూధేశ్వర్ నాథ్ " అంటారు. చ్యవన మహర్షి ఆశ్రమంలో ఇప్పటికీ అఖండ ధుని ఉనికిలో ఉంది. అఖండ ధునికి ముందు బాలయోగి సమాధి ఉంది. ఇప్పటికీ ప్రజలు సమాధి చుట్టూ కూర్చుని వారి ప్రార్థనలు వినిపిస్తుంటారు. యోగి ఆత్మ ఇప్పటికీ సజీవంగా ఉందని తమ సమస్యలకు మార్గదర్శకం వహించి పరిష్కారం చూపిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజలు ఇక్కడ ప్రమాణపూర్వకంగా సమస్యలకు పరిష్కారం అంవేషిస్తుంటారు.

సూర్యదేవాలయం[మార్చు]

జిల్లాలో కోణార్క శైలిలో సూర్యదేవాలయం ఉంది. త్రేతాయుగంలో రాజా అయేల్ ఈ ఆలయాన్ని నిర్మించాడని భావిస్తున్నారు. ఆయన శ్రీరాముని వంశజుడని భావిస్తున్నారు. ముగల్ పాలనా కాలంలో ఆలయంలోని సూర్యుని శిల్పం విరగకొట్టబడింది. తరువాత త్రికాల సూర్యుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ప్రాంతీయ ప్రజలు ఆదివారాలలో సూర్యుని విశేషంగా ఆరాధిస్తుంటారు. చైత్రమాసం, ఆర్ద్రా నక్షత్రం, కార్తిక మాసంలో వచ్చే సూర్యాష్టమి దినాలలో ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించబడుతుంటాయి. జిల్లా ప్రజలు, సమీపప్రాంత ప్రజలు సూర్యుని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తుంటారు. సూర్యుని నుండి ప్రాణులన్ని శక్తిని పుంజుకుంటాయి కనుక అలా ఆరాధిస్తుంటారు. రాణాప్రతాప్ సింగ్ వంశజుడు రాజా ఫతేహ్ నారాయణ సింగ్ కుష్టు వ్యాధి పీడితుడని ఆయన వేటాడుతూ గుర్రానికి దాహం తీర్చడానికి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న జలకుండంలో పడగానే ఆయన కుష్టు వ్యాధి నుండి విముల్తుడయ్యడని ఇక్కడ ఒక జానపద కథనం ప్రచారంలో ఉంది.

బ్రహ్మ[మార్చు]

బ్రహ్మదేవుడు ఇక్కడ ఒకే రాత్రిలో మూడు ఆలయాల నిర్మాణం ఆరంభించాడని మరొక కథనం ప్రచారంలో ఉంది. వాటిలో దేవ్, ఉంగ పూర్తి అయ్యాయని మూడవ దేవకుండ్ నిర్మించే లోపు సూర్యోదయం అవడం కారణంగా కాకి అరచిందని బ్రహ్మదేవుడు నిర్మించలేక పోయాడని మరొక కథనం ప్రచారంలో ఉంది. ఉంగ కొండా మీద పూర్తిగా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ దేవసమూహాల విగ్రహాలు అనేకం ఉన్నాయి.ప్రస్తుతకాలంలో పురాతన వస్తువులను దొంగరవాణా దారులకు జిల్లా కేంద్రంగా మారిందని వ్హావిస్తున్నారు..

ఆధునిక చరిత్ర[మార్చు]

ఔరంగాబాద్ చరిత్ర పురాతన మగధ్ చరిత్రలో భాగంగా ఉంటుంది. ఇందులో మునుపు పాట్నా, గయ భాగంగా ఉండేవి. భారతదేశ పురాతన చరిత్రలో చాలాభాగం మగధతో ముడివడి ఉంది. పురాతన మగధ ప్రస్తుత ఔరంగాబాదుగా ఉంది కనుక పూరాతన చరిత్ర జిల్లా వాసులు సగర్వంగా చెప్పుకుంటారు. ఇది మగధ మహాజనపధంలో భాగంగా ఉండేది. జిల్లా వంశానుగత, సంస్కృతికు చిహ్నంగా ఉంది. మగధసామ్రాజ్యంలో భాగంగా దీనిని బింబిసారుడు, అజాతశతృ పాలించాడు. తరువాత చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు పాలించారు. సోనా నది మగధ సామ్రాజ్యానికి సరిహద్దుగా ఉండేది.

కుషాన్లు[మార్చు]

మౌర్యుల పతనం తరువాత ఈ ప్రాంతం సుంగాలు, కుషానుల పాలనలోకి మారింది. ఈ ప్రాంతం కొంతకాలం హర్షవర్ధనుడి పాలనలో ఉంది. సంస్కృత సహిత్యంలో పేరుపొందిన కాదంబరి, హర్షచరిత్ర బాణభట్టుడి చేత వ్రాయబడ్డాయి. ఆయన పిరూ గ్రామంలోని ప్రితకులపర్వతంలో జన్మించాడు. భోజ్పత్ర, తాళపత్రాల మీద అనేక చేవ్రాతలు పిరూ గ్రామంలోని బాణభట్టా పుస్తాకాలయంలో భద్రపరచబడి ఉన్నాయి. బెంగాల్ లో పాల్ సామ్రాజ్యం తలెత్తి స్వల్పకాలంలోనే తన ప్రాభవం కోల్పోయింది.

అశోకుడు[మార్చు]

ఈ ప్రాంతాన్ని అశోకుడు పాలించిన సమయంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అశోకుని పాలన ముగింపుకు వచ్చిన తరువాత ఈ భూభాగం బౌద్ధమత విస్తరణను అడ్డగించింది. తరువాత ఈ ప్రాంతానికి వచ్చిన రాజపుత్రులు గయలో తమ పితరులకు పిండప్రధానం చేయడం ఆరంభించారు. ఈ ప్రాంతపు సహజ సౌందర్యం వారిని ఆకర్షించింది. వారు వారిక్కడ స్థిరపడి సహజంగా వారి స్థానాలను బలపరచుకున్నారు. దేవ్.మాలి, పావై, చంద్రఘర్, సిరిస్ మొదలైన రాజపుత్రుల వారసులు ఈ ప్రాంతానికి పాలకులయ్యారు. రాజపుత్రులు ధైర్యసాహసాలతో ముగల్ సుల్తానులను, బ్రిటిష్ పాలకులను ఆధిక్యాన్ని శక్తివంతంగా ఎదుర్కొన్నారు.

మొగల్ పాలన[మార్చు]

ఈ ప్రాంతం ముగల్ సుల్తానుల పాలనలో ఉన్న సమయంలో ఇది సేన్, ఘర్వాల్ రాజపుత్రుల ఆధిక్యంలో ఉండేది. ఈ ప్రాంతం సూర్యవంశ ఘర్వాల్ రాజపుత్రుల ధైర్యసాహసాలకు పేరుగాంచింది. రాజపుత్రులు ఈ ప్రాంతంలో పలువురు ముగల్ పాలకులను ఎదుర్కొని ఓడించారు. తరువాత ఘర్వాల్ రాజపుత్రులు జగదీష్ పూర్ రాజు వీర్ కుంవర్ సింగుకు మద్దదతుగా నిలిచారు. కుంవర్ సింగ్ సాగించిన పలు యుద్ధాలలో ధైర్యవంతులౌన రాజపుత్రసైన్యాలతో మద్ధతు పలికారు.

షెర్ షాహ్[మార్చు]

షేర్ షాహ్ పాలనలో ఈ ప్రాంతానికి వ్యూహాత్మకమైన ప్రాధాన్యత వచ్చింది. ఇది రోహ్తార్ సిరకార్‌లో భాగం అయింది. ఆఫ్గన్ పాలకుడు ప్రఖ్యాత గ్రాండ ట్రంక్ రోడ్డు నిర్మాణం చేపట్టాడు. షేర్షా మరణం తరువాత ఇది అక్బర్ సంరాజ్యంలో భాగం అయింది. అయినప్పటికీ ఇప్పటికీ ఆఫ్ఘన్ నిర్మాణాలు దర్శనం ఇస్తుంటాయి. ఔరంగజేబు పాలనాకాలంలో ఆయన సుబేదార్ దావుద్ ఖాన్ కురాషి దావుద్ నగరును స్థాపించాడు.

జమీందార్లు[మార్చు]

ముగల్ పాలన పతనం తరువాత ఈ ప్రాంతం జమీందారుల అధికారంలోకి మారింది. తరువాత కొంతకాలం దేవ్, కుతుంబ, మాలి, పావై, చంద్రఘర్, సిరీస్ పాలన కొనసాగింది. దేవ్, కుతుంబ, సిరీస్, పావై పాలకుల తిరుగుబాటు ధోరిణిని ఈ ప్రాంత చరిత్రలో గర్వకారణంగా మారింది. బ్రిటిష్ పాలకులను మొదటిసారిగా రియాసత్ పావై పాలకుడు రాజనారాయణ్ సింగ్ ఎదిరించాడు. ఆయన పూర్వీకులు పృధ్విరాజ చౌహాన్ వంశజులని భావిస్తున్నారు. పాత స్వతంత్రదమరయోధుడు వీరకుంవర్ సింగుకు దేవ్ రాజాస్థానంతో సంబంధబాంధవ్యాలు ఉండేవి. కొంతమంది ఆయన అత్తింటి వారు దేవ్ కుటుంబానికి చెందినవారని భావిస్తున్నారు. రాజానారాయణ్ సింగ్ రాజపుత్ర సైన్యాలను సమైక్యంచేసి ఒక ఉమ్మడి సైన్యాలను సిద్ధం చేసి 1857లో జగదీష్ పూర్ రాజు వీర కుంవర్ సింగుకు మద్ధతుగా నిలిచాడు. ఆయన వీరవంశి పాలకుడైన రాజా చేత్ సింగు, తెకరి పాలకుడు పీతాంబర్ సింగ్, ససరం పాలకుడు కులీ ఖానుకు కూడా మద్ధతు ఇచ్చాడు. సోనే నదీ ప్రాంతంలో వేలాది బ్రిటిష్ సైన్యాలు, రాజపుత్ర సౌన్యాలకు మధ్య జరిగిన సమరంలో రాజనారాయణ సింగ్ మరణించాడు. 1857లో దనపూర్, బెనారస్ లలో సిపాయీల కలహం పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం పాలన పరమైన పట్టుబిగించింది. పాట్నా నుండి గయజిల్లా వేరుచేయబడింది. 1865లో ఔరంగాబాదు సబ్ డివిజన్‌గా చేయబడింది. 1873 వరకు అది గయజిల్లాలో భాగం. .

స్వాతంత్ర్య సమరం[మార్చు]

స్వతంత్ర సమరం సమయంలో పాల్గొన్నవారికి బ్రిటిష్ ప్రభుత్వం తరఫున చిత్రహింసలు మొదలైయ్యాయి. కమీషనర్ కార్యాలయం నుండి ఈ క్రింది జమీందారుల ఆస్తుల జప్తుకు ఆర్డర్లు జారీచేయబడ్డాయి.

  • భాను ప్రతాప్ సింగ్ మాలి
  • బాల్ గోవింద్ సింగ్ (బర్హర గ్రామం)
  • జగు సింగ్ ( ఉర్దనదిహ్ గ్రామం)
  • జగ్దంబ్ సొహొరి మనౌర
  • ఘులమన్ ఖాన్ ( కొరయ్పుర్ గ్రామం)
  • లాల్ బహదూర్ సింగ్
  • దిన్ దయాల్ సింగ్ -ంఉతని గ్రామ రెండూ నివాసుల
  • దర్శన్ సింగ్ ( మాలి గ్రామం)
  • అయోధ్య సింగ్ (మిహౌలి గ్రామం)
  • షేక్ చకౌరి (ఘొత గ్రామం)
  • మహాబుల్ సింగ్ (మిర్జపుర్)
  • ఝగర్నథ్ సింగ్ (సిమ్ర)
  • ఫితంబర్ సింగ్ (ంఅంఝౌలి గ్రామం)
  • భిసందెఒ సింగ్ (ఖర్సర గ్రామం)

20వ శతాబ్ధపు స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో ఈ ప్రాంతపు ప్రజలు కూడా క్రియాశీలక పాత్ర వహించారు. వీరికి దేశంలో స్వాతంత్ర్య సమరయోధులతో దగ్గర సంబంధాలునుండేవి. ఇక్కడకు మహాత్మాగాంధీ కూడా వచ్చాడు. గాంధీ పిలుపు మీద వారివారి స్వంత వృత్తులను వదులుకుని వందలాది మంది ప్రజలు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. కుమార్బద్రీ నారాయణ్ 1930లో నమక్ సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. బిభూతి అనురాగ్ సింగ్ స్వాతంత్ర్యసమర పోరాటం కూడా చాలా గుర్తింపు పొందింది. ఆసమయంలో ప్రముఖ స్వాతంత్ర్య యోధులు ఇక్కడ కొంతకాలం ఆశ్రయం పొందారు. హాజారీబాగ్ జైలు నుండి తప్పించుకున్న లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ ఇక్కడ కొంతకాలం తలదాచుకున్నాడు. కుమార్ బద్రీ నారాయణ్ చౌరాం ఆశ్రమంలో నేతాజీ సుభాష్ చంద్రా కొంతకాలం ఆశ్రయం పొందాడు. అమర్ సాహిద్ జగపతి కుమార్ 1942 ఆగస్టు 9 న స్వతంత్రసమరంలో భాగంగా రాష్ట్ర రాజధాని పాట్నా నగరంలోని సెక్రటరేట్ భవనం మీద త్రివర్ణ పతాకం ఎగరువేసిన సందర్భంలో ఆరుగురు పోరాటయోధులతో కలిసి ప్రాణాలను త్యాగం చేసాడు. వారి త్యాగానుకి గుర్తుగా అమరవీరుల స్మృతి చిహ్నం బీహార్ అసెంబ్లీ భవనం ముందు ఎగురవేయబడింది. కియాఖాప్ గ్రామానికి చెందిన సర్వస్వరూప్ సింగ్, కర్షర గ్రామం నుండి సుఖదీప్ సింగ్, బద్వా గ్రామం నుండి దరోగా సింగ్, బుధయి గ్రామం నుండి రాం నరేష్ సింగ్, కర్మా గ్రామం నుండి రామనారాయణ్ సింగ్, జంహోర్ గ్రామం నుండి మిథిలేష్ సింగ్ స్వతంత్ర సమరంలో భాగంగా బాంబుల తయారీలో పాల్గొన్నారు. వారు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఆయుధాలను ప్రయోగించారు.

ఆంగ్రేజో భారత్ చార్తొ[మార్చు]

మహాత్మాగాంధీ ఆంగ్రేజో భారత్ చార్తొ నినాదం అందించాడు. ఔరంగాబాద్ ప్రజలను భారతజాతీయ కాంగ్రెస్ గొప్పగా ప్రభావితం చేసింది. బీహార్ బిభూతి అనురాగ్ నారాయణ్ సింగ్, కమ్తా సింగ్, అబ్దుల్ గఫార్, రామచంద్ర సావో (తంద్వా గ్రామం), తంద్వా సైనిక్ రామనారాయణ (చత్రా గ్రామం), బలరాం సింగ్, రాందేవ్ సింగ్ (బెని గంఝార్), రాచా ప్రదాద్ లాల్ (మంఝౌల్), బాలకృశ్వర్ రాం (చంద్రఘర్ గ్రామం), ప్రియాభారత్ నారాయణ్ సింగ్ (సొనౌర) స్వతంత్ర సమరంలో పాల్గొన్న వారిలో ప్రముఖులు.

ప్రియాబత్[మార్చు]

ప్రియాబత్ నారాయణ్ సింగ్ జౌలులో ఆస్మాతో మరణించాడు. సర్వశ్రీ లల్లూప్రసాద్ కుర్మీ, హుస్సైన్ సావో, రాంవ్రిచా లాల్, పండిట్ బద్రీనాథ్ శాస్త్రి తివారి, రాంచంద్ర తివారి ఆగస్టు క్రాంతి ఉద్యమమ్లో భాస్వామ్యం వహించారు. వీరంతా దేవ్ గ్రామవాసులే.

జిల్లా ఔరంగాబాద్[మార్చు]

1973 జనవరి 26న ఔరంగాబాద్ జిల్లాను రూపొందించారు.

1991 వరకు ఔరంగాబాదు జిల్లాలో ఒకేఒక సబ్డివిజన్ (ఔరంగాబాద్ సాదర్) ఉండేది. 1931 మార్చి 31 దావుద్ సబ్డివిజన్ చేర్చబడింది.

ఉంగా[మార్చు]

మదంపూర్ మండలంలో ఉన్న చిన్న పర్వతం ఉంగా. ఇది మదన్‌పూర్ బజారు వెనుక ఉంది. ఇక్కడ ప్రఖ్యాతి చెందిన సప్త సూర్య మందిరాలు ఉన్నాయి. ఈ భూభాగాన్ని చంద్రవంశరాజు భైరవేంద్ర పాలించాడని భావిస్తున్నారు. తరువాత ఈ ప్రాంతాన్ని సిసోడియా పాలకుడు రాజా సహారమల్లు సింగ్ పాలించాడు. సూర్యకుండు వాద ఇప్పటికీ వారి అవశేషాలు ఉన్నాయి. ఇప్పటికీ సజీవంగా ఉన్న సూరూమందిరం బీహార్ పర్యాటకం ఆధ్వర్యంలో ఉంది.

దేవ్[మార్చు]

ఉంగాకు చెందిన సిసోడియా పాలకుడు స్థాపించిన నగరం దేవ్. ప్రబిల్ సింగ్, మహారాజా ప్రబిల్ సింగ్ 17వ శతాబ్దంలో దేవ్ రాజాస్థానాన్ని స్థాపించాడని విశ్వసిస్తుంబారు. ఇక్కడ ప్రబలమైన సన్ ఆలయం, చైతి చాత్ పూజ, కార్తిక్ చాత్ పూజలు నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ ఉన్న సూర్యకుండం బీహార్ పర్యాటక రంగం ఆధ్వర్యంలో పని చేద్తుంది. సిసీదయా రాజు ఔరంగాబాదును 17వ శతాబ్దంలో సిసోదయా రాజు స్థాపించాడు. ఉమగా రాజ్య రాజధానిని ఇక్కడకు మార్చిన తరువాత దేవ్ రాజ్యం స్థాపించబడింది.తరువాత పాలనా ప్రాంతం ఔరంగాబాదు నుండి పాలం, చత్రా, షెర్గతి వరకు రాజ్యవిస్తరణ జరిగింది. జిల్లాలో దేవ్ నుండి 1 కి.మీ దూరంలో ఉన్న పాతాళగంగ వద్ద నాలుగు మూలలతో నిర్మించబడిన కుండం ఒకటి, త్రికోణాకారంలో నిర్మించబడిన కుండం ఒకటి ఉన్నాయి. ఈ కుండాలలో నీరు ఎప్పటికీ ఎండదు.

జ్యుడీషియరీ చరిత్ర[మార్చు]

జిల్లా కేంద్రం ఔరంగాబాదులో కోజొ మొహల్లా, దివాన్ మొహల్లా ఉన్నాయి. ఇక్కడ కాజి మొహమ్మద్, కాజి షరుల్లా కబ్రాలు ఉన్నాయి. ఔరంగజేబు కాలంలో ఇవి నిర్మించబడ్డాయి. ఔరంగాబాదు జ్యుడీషనరీ చరిత్ర చాలా పురాతనమైనది. ముస్లిం ఆచారం అనుసరించి ప్రజల వివాదాలను పరిష్కరించే బాధ్యత ఖాజీ తీసుకునేవాడు...

వ్యాసం[మార్చు]

1973లో జ్యుడీషియల్ కోర్టు స్థాపించడానికి ముందు మంసిబ్ న్యాయపరిష్కార బాధ్యత వహించేచాడు. 1846లో ఔరంగాబాదు సబ్‌డివిషంగా మారింది.దావూద్ నగర్ వద్ద హానరరీ మెజిస్ట్రేట్ శాఖ ఉండేది. అందువలన ఔరంగాబదు న్యావవ్యవస్థ పురాతనమైనది. ఔరంగాబాదు సబ్డివిజన్ ఏర్పాటు చేసిన తరువాత అదనపు అధికారంతో ముంసిఫ్ నియమించబడ్డాడు.

కోర్టు[మార్చు]

1973లో ఉపన్యాయాధిపతి కోర్టును అప్పటి చీఫ్ జడ్జి నద్లాల్ ఉంత్వాలియా ప్రాంరంభించాడు.మొదటి సబ్‌జడ్జిగా నారాయణ్ ప్రసాద్ సింగ్ పనిచేసాడు. నారాయణ్ ప్రసాద్ సింగ్ ఔరంగాబాదు మొదటి చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా పనిచేసాడు. జిల్లాకోర్టు, సెషన్ జడ్జి 1977ఇ సెప్టెంబరు 10న ప్రారంభించబడిందిత్. హైకోర్ట్ జడ్జిగా సాంబు ప్రసాద్ సింగ్ నియమితుడాఅయ్యాడు. మొదటి డిస్ట్రిక్, సెషంస్ జడ్జిగా శ్రీ భగవద్ ప్రసాద్ జైస్వాల్ నియమినచబడ్డాడు.

స్వతంత్ర సమరం[మార్చు]

ఔరంగాబాదు స్వతంత్రసమరంలో ప్రధానపాత్ర పోషించింది. గంధీయవాది [2] మొదటి ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మత్రిగా పనిచేసిన బీహారి విభూతి [3] డాక్టర్ అనురాగ్ నారాయణ సింహా నాయకత్వంలో ఔరంగాబాదు స్వతంత్రసమరంలో క్రియాశీలకపాత్ర వహించింది.అనురాగ్ మిశ్రా గాంధీజీ మిత్రుడు, రాజేంద్రప్రసాద్‌తో (భారతదేశ మొదటి అధ్యక్షుడు ) కలిసి పనిచేసి బీహారులో సత్యాగ్రహా ఉద్యమాన్ని నడిపించాడు. ఔరంగాబాదు సత్యేంద్రనారాయణ్ సింగాకు జన్మస్థలం. ప్రజలచేత చోటా సాహెబ్ అనిపిలువబడిన సత్యేంద్రనారాయణ్ సింగా స్వాతంత్ర్యసమరంలో పాల్గొన్నాడు. ఆయన బీహారు ముఖ్యమత్రులలో ఒకరుగా పనిచేసాడు. 1972లో ఔరంగాబాదుకు గయ జిల్లా నుండి విడదీసిన తరువాత పూర్తి స్థాయి జిల్లా అంతస్తు ఇవ్వబడింది. [4]

ప్రముఖులు[మార్చు]

చరిత్రకాలానికి ముందు అనేకమంది ౠషులు ఇక్కడ నివసించారు. అందుకు జిల్లాభూభాగంలో ఉన్న సహజసౌందర్యం వారిని ఆకర్షించడమే ఒక కారణం. భృగుమహర్షి, చ్యవన మహర్షి ఇక్కడ నివసించారు.

ముస్లిం సన్యాసులు[మార్చు]

అలాగే 1200 సంవత్సరంలో సిరియా నుండి భారతదేశానికి వచ్చిన షాహ్ సద్రుద్దీన్ సుఫీ ఇక్కడ నివసించాడు. రెండవ సయ్యద్ మొహమ్మద్ అల్‌కదరి బగ్దాది 1446 లో 40 మంది అనుయాయులతో ఇక్కడకు వచ్చాడు.మూడవ షాహ్ జలాలుద్దీన్ కబీర్ పానిపతి, నాలుగవ మొహమ్మద్ సయ్యద్ స్యాల్కోటి కూడా తనఙాపకాలను ఇక్కడ వదిలి వెళ్ళాడు. వీరంతా మహిమాంవితులని ప్రజలు విశ్వసించారు. వారంతా వారివారి మార్గంలో ప్రజలకు సేవలు అందించారు. అంఝర్ షర్ఫి వద్ద సయ్యద్ మొహమ్మద్ అలకాద్రి బగ్దాది సమాధి చేయబడ్డాడు. సిహులి గ్రామంలో సయ్యద్ స్యాల్‌కోటి సమాధిచేయబడ్డాడు. వీరిద్దరూ హిందూ, ముస్లిం సామరస్యానికి కృషిచేసారు. ముస్లిములు వారిని కానుకలతో ప్రార్ధిస్తారు. అలాగే హిందువులు కూడా వారిని చైత్రమాసం నవరాత్రి, ఆశ్వీజమాసం నవరాత్రులలో కానుకలతో ప్రార్థిస్తుంటారు. వీరు ప్రజలలో విద్యాతృష్ణను కూడా ఉద్దీపింపజేసారు.

రాజనారాయణన్[మార్చు]

రాజనారాయణన్ సింగ్ 1857 లో మున్ముందుగా స్వాతంత్ర్యసమరంలో పాల్గొన్నాడు. ఆయన వీరుడు మాత్రమేకాదు. సంప్రదాయ ఆరాధకుడుగా కూడా ఉన్నాడు. సంప్రదాయ గాయకులకు ఆయన దేశభక్తిని కలిగించాడు.వారు జాతి రీత్యా బ్రాహ్మణులైనా వారిని ప్రజలు బిరితియాలు అనేవారు. వీరిలో కొందరు దేశాంతటా ఖ్యాతి గడించారు.

జగన్నాథ్ సింగ్[మార్చు]

జగన్నాథ్ సింగ్ దేవ్ రాజాస్థానానికి చివరి వారసుడు. ఆయన కత్తి విద్యలో ఆరితేరినవాడు. ఆయన సంప్రదాయ ఆరాధకుడు. బీహర్ విభూతి డాక్టర్ అనురాగ్ నారాయణ సింగ్, ఆయన కుమారుడు నారాయణ సింగ్ లకు ఆయన పోషకుడు.

బెగలి[మార్చు]

20వ శతాబ్దంలో కొన్ని బెగలి కుటుంబాలు మాత్రమే ఇక్కడ మిగిలి పోయాయి. వారు స్వాతంత్ర్యసమరయోధులకు ప్రేరణ, సహాయాసహకారాలు అందించారు. వీరిలో కుంద, హంసౌలి, సుందర్‌గంజ్ ప్రథమ స్థానంలో ఉన్నారు. శ్రీ పూర్బిచంద్ర ముఖర్జీ, మాణిక్ చంద్ భట్టాచార్జీ చిరస్త్యాయిగా నిలిచారు. వీరిరువురు గేట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో గేట్ ఉన్నత పాఠశాల రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థగా ప్రాముఖ్యత సంతరించుకుంది. పండిత మాణిక్ చంద్ భట్టాచార్జీ సాంఘిక సంస్కర్తగా ప్రజలకు సేవలు అందించారు. ఆయన ఆయన శిష్యులకు దేశభక్తిని నూరిపోసాడు. ఆరోజులలో ఇక్కడ పదవీ స్వీకారం చేసిన బ్రిటిష్ అధికారులు వీరిని చూసి భయపడేవారు. ఆయన శిష్యులు దేశవిదేశాలలో ఖ్యాతి గడించారు.

ముక్తార్[మార్చు]

ఔరంగాబాద్ న్యాయవాదులు అందరూ ఆద్వకేట్ లేక ముఖతార్ ప్రాక్టీస్ చేసారు. వీరంతా స్వాతంత్ర్య సమరానికి నేరుగానూ, వెనుక నుండి సహకరిస్తూ ధనసహాయం కూడా చేసారు. వారిలో సర్వశ్రీ రామేష్ ప్రసాద్ సింగ్, సర్యూ ప్రసాద్ సింగ్, ప్రియభారత్ నారాయణ్ సింగ్ మొదలైనవారు ప్రథమ స్థానంలో ఉన్నారు. వారు పార్లమెంటు సభ్యులుగానూ, అసెంబ్లీ సభ్యులుగానూ సేవలందించారు. మొక్తియార్లలో సర్వశ్రీ జీవరతన్ ప్రసాద్ సింగ్, రాం జనం సింగ్, త్రివేణి సింగ్, రానణేశ్వర్ ప్రసాద్ సింగ్, జనార్ధన్ ప్రసాద్, సర్యూ సింగ్ మొదలైనవారు ముఖ్యులు. రెండు బార్ అసోసియేషన్‌లకు చెందిన లాయర్లు సాంఘసేవకు కృషిచేసారు. బీహార్ బిభూతి దువంగత అనురాగ్ నారాయణ్ సింగ్, ఆయన కుమారుడు శ్రీ సత్యేంద్ర నారాయణ సింగ్‌లు కూడా న్యాయవాదులే.దివంగత అనురాగ్ సింగ్ మొదటి బిహార్ ఉపముఖ్యమంత్రిగా, సత్యేంద్ర నారాయణ సింగ్ విద్యామంత్రిగాన్ సేవలు అందించారు.

కమత[మార్చు]

దివంగత కంత సింగ్ క్వాం, ఆయన కుమారుడు శంకర్ దయాళ్ సింగ్ జాతికి మరువలేని సేవలు అందుంచారు. వారిరువురు రాజకీయంగానే కాక హిందీసాహిత్యంలో కూడా మరువలేని సేవ అందించారు. శ్రీ క్వాం రాష్ట్రరాజధాని పాట్నా నగరంలో పారిజాత్ ప్రకాశన్ పేరుతో ప్రచురణా సంస్థను స్థాపించాడు. అది ప్రస్తుతం హిందీ రచయితలకు యాత్రాస్థలంగా మారింది. శ్రీ శంకర్ దయాళ సింగ్ ప్రతిసంవత్సరం శ్రీ కాం పుట్టినరోజున కవిసమ్మేళనం నిర్వహించేవాడు. ఈ కవి సమ్మేళనానికి దేశం అంతటి నుండి కవులు పాల్గొనేవారు.

లలిత[మార్చు]

డాక్టర్ లలిత ప్రసాద్ దింహా (1921-1887) జిల్లాలలో డాక్టరుగా ప్రఖ్యాతి చెందాడు. ఆయన ప్రముఖ అమెచ్యూరు నాటకనటుడుగ ప్రఖ్యాతి గడించాడు. జిల్లాలోని నాటకసంస్కృతికి మార్గదర్శకత్వం వహించి జిల్లాలోని నాటక పరిషద్‌కు వెన్నముకగా నిలిచాడు.

శ్రీ రాం[మార్చు]

శ్రీరాం నరేష్ సింగ్ ఇప్పటికీ ఔరంగాబాదు పితృస్థానంలో గౌరవించబడ్జుతున్నాడు. ఆయన రాజకీతనాయకుడుగా ప్రజలకు సేవలు అందించారు. ఆయన 1977, 1978, 1985, 1990 లలో రాజకీయంగా విజయం సాఫ్హించాడు. ఆయన కుమారుడు సుషీల్ సింగ్ ప్రస్తుతం ఔరంగాబాదున్పార్లమెంటు సభ్యునిగా సేవలందిందిస్తున్నాడు. కేతకి పంచాయితీ నుండి మనీష్ పతక్ (ముఖియా), ఇబ్రహీంపూర్ నుండి మృత్యుంజయ మిశ్రా, కర్మా రోడ్డు నుండి ప్రసన్ ఉదిత్ జిల్లాలో యువరాజకీయ నాయకులుగా గుర్తించబడుతున్నారు.

భౌగోళికం[మార్చు]

జిల్లా వైశాల్యం 3389 చ.కి.మీ [5] ఇది రష్యాలోని వాయ్గాచ్ ద్వీపవైశాల్యానికి సమానం.[6] ఔరంగాబాదు (భారత్) పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఔరంగాబాదు జిల్లా మగధ్ డివిజన్‌లో భాగం. జిల్లాలో సన్, పంపన్, ఔరంగ, బతానే, మొర్హర్, ఆద్రి.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఔరంగాబాద్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[7] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[7]

విభాగాలు[మార్చు]

ఉప విభాగాలు[మార్చు]

ఔరంగాబాద్ జిల్లా ఉపవిభాగాలు :

  • ఔరంగాబాద్.
  • దౌద్ నగర్.
  • మండలాలు : మదంపూర్, కుతుంబా, దౌద్ నగర్, ఔరంగాబాద్, బరున్ (భారతదేశం), ఒబ్రా, దేవ్, నబీనగర్, హాస్పురా, గోహ్, రఫీగంజ్.
  • రఘునాథ్పూర్ (ఔరంగాబాద్), హస్పురా మండలంలో ఉన్న ఒక గ్రామం.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,511,243,[8]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[9]
అమెరికాలోని. నవాడ నగర జనసంఖ్యకు సమం.[10]
640 భారతదేశ జిల్లాలలో. 172 వ స్థానంలో ఉంది..[8]
1చ.కి.మీ జనసాంద్రత. 760 .[8]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 24.75%.[8]
స్త్రీ పురుష నిష్పత్తి. 916:1000 [8]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 72.77%.[8]
జాతియ సరాసరి (72%) కంటే.

భౌగోళికం[మార్చు]

19వ శతాబ్దంలో భోజ్పురి కవి " జౌన్ జౌన్ భయ్యా రే బతోహి దేఖి అవున్ జహన్ సొనేభద్రా మితె స్వర్ గవె రె బతోహియ " పాటను వ్రాసాడు. జిల్లా నదీతీరంలో ఉంది. అర్ధ్ గంగ్ పూన్- పూన్ నది జిల్లాలో ఉత్తరదిశ నుండి దక్షిణ దిశ వరకు ప్రవహిస్తుంది.

నదులు, కొండలు[మార్చు]

నదులు, కొండలు భవననిర్మాణానికి మూలపదార్ధాలుగా ఉపకరిస్తున్నాయి. జిల్లాలో ముప్పాతిక భాగం వ్యవసాయభూములకు సోనెనదీ జలాలు, ఇతర నదీ కాలువలు నీటిని అందిస్తున్నాయి. గత నాలుగు దశాబ్ధాలుగా జిల్లా పచ్చదనం అధికరిస్తూ ఉంది. జిల్లాలో మగాహి తమలపాకుకు పెద్ద ఎత్తున పండించబడుతున్నాయి. ఇవి దేశీయ, విదేశీ మార్కెట్లలో విక్రయించబడుతున్నాయి.

రైలు మార్గం[మార్చు]

జిల్లా మధ్య నుండి గ్రాండ్ చోర్డ్ రైలు మార్గం పయనిస్తుంది. జిల్లాకు సమీపంలో గ్రాండ్ చోర్డ్ రైలు మార్గంలో " అనుగ్రహ్ నారాయణ్ రోడ్డు " రైలు స్టేషన్ ఉంది. ఇది జిల్లాకేంద్రం నుండి 13 కి.మీ దూరంలో ఉంది. జిల్లాలో జాతీయరహదారి -2 (పాత గ్రాండ్ ట్రంక్ రోడ్డు), జాతీయరహదారి 98 రహదార్లు జిల్లా కేంద్రం మీదుగా పయనిస్తున్నాయి. జిల్లాలో విమానాశ్రయం లేదు. జిల్లాకు 25కి.మీ దూరంలో ఉన్న రోహతాస్ జిల్లాలో జాతీయరహరి -2 సమీపంలో సౌరా ఎయిర్ స్ట్రిప్ ఉంది.

సరిహద్దులు[మార్చు]

సరిహద్దు వివరణ జిల్లా
తూర్పు సరిహద్దు గయ
పశ్చిమ సరిహద్దు రోహ్‌తాస్
దక్షిణ సరిహద్దు పాలము జిల్లా జార్ఖండ్
ఉత్తర సరిహద్దు అర్వల్

విభాగాలు[మార్చు]

విషయాలు వివరణలు
సబ్‌డివిజన్లు 2 ఔరంగాబాదు, దావుద్ నగర్
తాలూకాలు
మండలాలు 11
పురపాలకాలు 2
సబ్ షెడ్యూల్డ్ ప్రాంతాలు 3
పంచాయితీలు 203
గ్రామాలు 1884
పోలీస్ స్టేషన్లు 19
పోలీస్ ఔట్ పోస్టులు 06
వైశాల్యం 3305
అక్షరాస్యత 57.5%
జనసంఖ్య 20,35,757
పురుషుల అక్షరాస్యత 71.95%
స్త్రీ అక్షరాస్యత 42.04%

వాతావరణం[మార్చు]

విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ విధానం
అక్షాంశం 24-750 డిగ్రీలు
రేఖాంశం 84-370 డిగ్రీలు
వేసవి 40-50 డిగ్రీల సెల్షియస్
శీతాకాలం 5 డిగ్రీల సెల్షియస్
గరిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
వర్షపాతం 50-75 సెం.మీ
వ్యవసాయ పంటలు వరి,గోధుమలు - చెరకు
నీటిపారుదల వ్యవసాయానికి అత్యంత అనుకూలం

వలసలు[మార్చు]

నబినగర్, కుటుంబ, దేవ్, మదన్‌పూర్ మండలాలు కొండలమద్య ఉపస్థితమై ఉన్నాయి. ఇక్కడ ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందువలన యువకులు ఉపాధి వెతుక్కుంటూ దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. నిరుద్యోగం, పేదరికం యువతను తీవ్రవాదం వైపు నడిపిస్తున్నాయి.

సంస్కృతి[మార్చు]

మానవ వికాసానికి సాహిత్యం, సంస్కృతి దోహదం చేస్తుంటాయి. సాహిత్యం, సంస్కృతి అభివృద్ధిచెందకుండా ఎసంస్కృతి వర్ధిల్లదు. వ్యవసాయం భూమిని సారవంతం చేస్తుంది. సంస్కృతి ఙానం వికదుంపజేస్తుంది. సంస్కృతి స్వతంత్రంగా వృద్ధిచెందినపూడు సౌరభాలు వెదజల్లుతుంది. ఔరంగాబాదు సాహిత్యం, సస్కృతిలలో ప్రంతీయంగానే కాక దేశీయంగా కూడా తనకంటూ ప్రత్యేకత సాధించుకుంది. ఔరంగాబాదు భూమి తరతరాలుగా పలువురు ప్రముఖులను అందిస్తూనే ఉంటుంది. పవుత్ర గ్రంథంగా దేశమంతా ప్రస్తుతించబడిన కాదంబరి పుస్త్తకం ఇక్కడ రచించబడింది. వీరిలో పీరూ, రాజా జగన్నాథ్ ప్రసాద్, కింకర్, పండిట్ గంగాధర్ శాస్త్రి (గ్వాలియర్ ఆస్థానంలో గౌరవించబశ్డాడు), రుద్రాష్ట పాఠిక్, పండిట్, దామోదర్ మిశ్రా, శ్రీ కమలేశ్వర్ జీ,శ్రీ కమత ప్రసాద్ సింగ్, క్వాం, శ్రీ రాం గులాంరాం, శంకర్ దయాళ్ సింగ్, శ్రీ కంత ప్రసాద్ సింగ్ కుమారుడు మొదలైనవారు ముఖ్యులు. జిల్లాలో ఝుజ్ఝునవా కొండలు ప్రత్యేకమైన సహజ సౌందత్యంతో అలరాతుతుంటాయి . బెంగాలి, ఉర్దూ, పర్షియన్, సాంస్కృతం, హిందీ, ఆంగ్లం భాషాసంబంధిత పురాతన గ్రంథాలు రాజనారాయణ సింఘ్ (బీహార్) కుటుంబసభ్యుల వద్ద బధ్రపరచబడి ఉన్నాయి. ప్రముఖ గాయకుడు పేరుపొందిన కళాకారుడు ఇసరాజ్ ఈ జిల్లకు చెందినవాడే.

భైరవేంద్ర[మార్చు]

6వశతాబ్ధానికి చెందిన ఉమాగా రాజైన రాజా భరవేంద్రా త్రవ్వించిన చెరువు రాణిగంజ్ పర్వతం మీద ఉంది. ఇక్కడ ఉన్న భవన్ ఆలయం భారతీయుల పరాక్రమం, ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉంది. జిల్లాలో మా సత్యచంఢీ, సత్యవాహినీ, సీత, తప, నదిమీద నిర్మించబడిన హరియాహి ఆనకట్ట, బతానే, దేవ్ కోట, కర నవాబు, వివిధ భవనాలు శిథిలాలు ఇప్పటికీ నగరంలో కనిపిస్తుంటాయి.

దేవ్ కుండ్[మార్చు]

దేవ్ కుండ్ ఒక చిన్న గ్రామం. దీనికి ఆసక్తికరమైన పురాణకథతో సంబంధం ఉంది. హిందూ పురాణ కథనాలు అనుసరించి విశ్వకర్మను ఒకే రాత్రిలో మూడు ఆలయాలను నిర్మించమని కోరగా అందుకు అంగీకారం తెలిపిన విశ్వకర్మ ఒకే రాత్రిలో మూడు ఆలయాలను నిర్మించి పూర్తి చేసాడు. మూడు ఆలయాలు ఒకే శైలిలో పుష్కరిణి సహితంగా నిర్మించబడి ఉన్నాయి.

విద్యా సంస్థలు[మార్చు]

Without education, there remains to be no difference between man and animal, though animals and other creatures have anticipation of future events. From time immemorial, the art and education of Aurangabad has achieved the glory of being the centre of culture.

కాదంబరి[మార్చు]

ఔరంగాబాదు జిల్లాలోని ప్రతికూట్ధేయానం నగరంలో బాణభట్టు విరచిత ప్రపంచ ప్రఖ్యాత గ్రంథం కాదంబరి రూపుదిద్దుకుంది. ఇది గురుకుల వ్యవస్థ కానీ ముగల్ కాలంనాటి విద్యాసంస్థ లేక బ్రిటిష్ కాలం నాటి విద్యాసంస్థ అయినా అది ఔరంగాబాదులో తన ప్రభావం చూపింది. ప్రస్తుతకాలంలో కూడా జిల్లాలో సంస్కృత పాఠశాల, మదరసా (1914-1915) స్థాపించబడి ఉంది. జిల్లాలో హిందూ ముస్లిం సమఒఖ్యతకు ఇది చక్కని నిదర్శనంగా ఉంది.

గైట్ ఉన్నత పాఠశాల[మార్చు]

ఔఅతంగాబాదులో1917లో ది గైట్ ఉన్నత పాఠశాల (ప్రస్తుత అనురాగ్ ఇంటర్ స్కూల్) స్థాపించబడింది. ఆసమయంలో ఔరంగాబాదు సబ్డివిజన్‌లో ఒకే ఒక హైస్కూలుగా ఉండేది. 1930లో ఇక్కడ 03-04 పోలీస్ ప్రధానకార్యాలయ పోలీస్ స్టేషన్లు స్థాపించబడ్డాయి. 1944లో సచ్చిదానంద్ సింహా మిడిల్ స్కూల్ స్థాపించబడింది. మగధ్ విశ్వవిద్యాలయ మొదటి కళాశాలగా ఇది ప్రత్యేక గర్తింపును పొందింది. స్వతంత్రం వచ్చిన తరువాత ఇ.ఐ.పి ఆధ్వర్యంలో 1955లో విద్య ముఖ్యత్వం తెలుసుకుని జిల్లాలో పలు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు స్థాపించబడ్డాయి.

ప్రాథమిక, మాధ్యమిక విద్య[మార్చు]

1917 - 1975 మద్య కాలంలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాకలు అన్నీ వైవిధ్యమైన విద్యాసంస్థలకు చెంది ఉన్నాయి. తరువాత ఇవి చాలావరకు జాతీయం చేయబడ్డాయి. 1986 - 1988 లలో విద్యానాణ్యత కొరకు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఏర్పాటైంది. ఈ విధానం కింద విద్యాసంబంధిత సామాగ్రి, ఆదేవ్ - విషయుయల్ వస్తుసామాగ్రి సరఫరా చేయబడ్డాయి. 8 ఆర్థిక ప్రణాళికలలో అంతర్భాగంగా పలు పాఠశాలలలో ఉపాధ్యాయుల నివాసాలు, మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. 1992లో జిల్లాలో యుఇనివత్సనలైజేషన్ ప్రణాళికలో " స్కూల్ చలో అభియాన్ " కార్యక్రమం ద్వారా కొన్ని వందమంది విద్యార్థులను పాఠశాలకు రప్పించాలని ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల గార్డియన్లను స్కూలుతో అనుసంధానం చేసే ఇది సత్ప్ఫలితాలు ఇస్తుందని విశ్వసించారు. 2000 నాటికి ఇది అనుకూల ఫలితాలను ఇచ్చి విద్యానాణ్యతను మెరిగు పరచింది.

విద్యాభివృద్ధి[మార్చు]

ప్రస్తుత జిల్లాలో విద్యాసమస్యలను పరిష్కరించడానికి పబ్లిక్ ఎజ్యుకేషన్ ఆఫీసర్ నియమించబడ్డాడు. స్కూల్ విద్యావిధానంలో హెడ్ మాస్టర్ స్కూలుకు నిర్వహణాబాధ్యతను వహిస్తున్నాడు. జిల్లాలో అక్షరాస్యత అధికం చేయడానికి 1981 - 1982లో వయోజన విద్యను ప్రవేశపెట్టారు. ఇది 1991 - 1992 వరకు కొనసాగింది. ఈ లక్ష్యసాధనను సాధించినందుకు జిల్లాకు 1993లో భారతప్రభుత్వం నుండి గుర్తింపు లభించింది. ఈ కాత్యక్రమం ద్వారా జిల్లాలో అక్షరాస్యత అధికం అయింది. 2001 నాటికి జిల్లాలో 11,52,852కు (57.50%) చేరుకుంది. వీరిలో 7,45,641 (71.00 %) మంది పురుషులు, స్త్రీలు 4,07,453 (42.09%).

అక్షరాశ్యత[మార్చు]

1981 గణాంకాల తరువాత ఏడు సంవత్సరాలు పైబడిన వారిలో అక్షరాశ్యులు, నిరక్ష్యరాశ్యులు గణాంకాలు ప్రారంభం అయ్యాయి. 2001 గణాంకాల తరువాత జిల్లా అక్షరాస్యతలో రాష్ట్రంలో 5 వ స్థానంలో ఉంది. గణాంకాల వివరాలు పురుషుల అక్షరాస్యతా శాతంలో స్త్రీల అక్షరాస్యతా శాతం సగం ఉందని భావిస్తున్నారు. 1991లో అక్షరాస్యత 10% అభివృద్ధి చెందింది. అయినప్పటికీ జిల్లా అక్షరాస్యత దేశీయ అక్షరాస్యతకంటే (65.38%) తక్కువగానే ఉంది. రాష్ట్రీయ అక్షరాస్యత 47.53% ఉండగా దేశీయ అక్షరాస్యత అంతకంటే అధికంగా ఉంది.

మండలాల వారీగా అక్షరాశ్యత[మార్చు]

జిల్లా అక్షరాస్యత 57.50%. ఔరంగాబాదు బ్లాకు అక్షరాస్యత 68.23%. స్త్రీ అక్షరాస్యత మీద దృష్టిసారించవలసిన అవసరం ఉంది.

కోచింగ్ సెంటర్[మార్చు]

నగరంలో పారడైజ్ కోచింగ్ సెంటర్ పురాతనమైనదిగా గుర్తించబడుతుంది. ఈ సంస్థను 1994లో ఎర్. కృష్ణ శర్మ స్థాపించాడు. ఈ సంస్థను స్థాపించినప్పటి నుండి ఇంజనీరింగ్, మెడుకల్, పబ్లిక్ సర్వీసులలో నిపుణులను అందించింది. ఈ సంస్థ విద్యార్థి అనిమేష్ కుమార్ సివిల్ సర్వీసులో విజయం సాధించి ప్రస్తుతం దేశానికి సేవలు అందిస్తున్నాడు. పారడైజ్ కోచింగ్ సెంటర్ నాణ్యమైన విద్యను అంధించాలని 2011లో పారడైజ్ పబ్లిక్ స్కూలును స్థాపించింది.

పాఠశాలల జాబితా[మార్చు]

ఔరంగాబాద్ లో ఉన్న పాఠశాలలు: -

  • గైట్ హై స్కూల్
  • చాణక్యుడు గర్ల్స్ హై స్కూల్
  • చాణక్యుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్
  • పారడైజ్ కోచింగ్ సెంటర్
  • పారడైజ్ పబ్లిక్ స్కూల్
  • సంస్కృత పాఠశాల
  • మదర్సాను ఇస్లామియా
  • సరస్వతి శిశు మందిర్
  • డిఎ.వి. పబ్లిక్ స్కూల్
  • బి.ఎల్. ఇండో ఆంగ్లియన్ పబ్లిక్ స్కూల్
  • మహేష్ అకాడమీ
  • బుద్ధుని ఎడ్యుకేషనల్ సొసైటీ

కాలేజీల జాబితా[మార్చు]

ఔరంగాబాద్ (అనుబంధం తో) లో ఉన్న కళాశాలలు: -

  • సచ్చిదానంద్ సిన్హా కాలేజ్ (మగధ విశ్వవిద్యాలయం)
  • ఆర్.ఎల్.ఎస్.వై కాలేజ్ (మగధ విశ్వవిద్యాలయం)
  • కిషోరి సిన్హా మహిల్ల కళాశాల (మగధ విశ్వవిద్యాలయం)
  • అనురాగ్ నారాయణ్ మెమోరియల్ కాలేజీ (మగధ విశ్వవిద్యాలయం)
  • మహిళా కళాశాల (ఉమెన్స్ కాలేజీ), దౌద్నగర్ (మగధ విశ్వవిద్యాలయం)

సైన్స్, టెక్నాలజీ, నియర్ డానీ బిగా బస్సు స్టాండ్ # ఔరంగాబాద్ ఇన్స్టిట్యూట్, ఔరంగాబాద్, బీహార్ (కర్ణాటక స్టేట్ ఓపెన్ విశ్వవిద్యాలయం)

ఔరంగాబాద్ లో ఇంజినీరింగ్ కళాశాలలు: -

  • సిత్యోగ్ కాలేజ్ ఇంజనీరింగ్

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

ఔరంగాబాదు జిల్లా పలు పర్యాటక ఆకర్షణలకు పుట్టిల్లు. జిల్లాలో బ్రహ్మాండమైన ఆలయాలు, చారిత్రకప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు, యాత్రాస్థలాలు ఉన్నాయి. జిల్లా రహదారోతో చాలాచక్కగా అనుసంధానించి ఉండడం, ప్రమ్ంతీయ రవాణావసతి సౌకర్యంగా ఉండడం పర్యాటకాభివృద్ధికి సహకారం అందిస్తున్నాయి. ఫలితంగా యాత్రీకుల సంఖ్య రోజురోజుకు అధికరిస్తూనే ఉంది. జిల్లాలో సంచరించడానికి అక్టోబరు - మార్చి మద్యకాలం ఆహ్లాదకరమైంది.

దేవ్[మార్చు]

ఔరంగాబాదుకు ఆగ్నేయంగా 10కి.మీ దూరంలో ఉన్న దేవ్ వద్ద ప్రఖ్యాత సూర్యదేవాలయం ఉంది. 15వ శతాబ్ధానికి చెందిన పురాతన సూర్యదేవాలయాన్ని భైరవేంద్ర సింగ్ నిర్మించాడని భావిస్తున్నారు. ఇది 100 అడుగుల ఎత్తైన గొడుగువంటి పైకప్పు కలిగిన నిర్మాణం. ఆలయ ప్రధానదైవం సూర్యుడు. ఆలయసమీపంలోని పుష్కరిణిని రాజా అయేల్ నిర్మించాడని భావిస్తున్నారు. ప్రతిసంవత్సరం ఆలయంలో నిర్వహించే చాత్ ఉత్సవానికి లక్షలాది ప్రజలు వస్తుంటారు.

దేవ్ కుండం[మార్చు]

జిల్లాలోని చారిత్రకప్రధాన్యత కలిగిన ప్రదేశాలలో దేవ్ కుండం ఒకటి. ఔరంగాబాదుకు ఆగ్నేయంలో 10కి.మీ దూరంలో ఔరంగాబాదు, జహ్నాబాదు సరిహద్దులో ఉంది. దేవ్ కుండ్‌లో పురాతనమైన శివాలయం ఉంది.శివరాత్రి పర్వదొనంలో ఆలయానికి వేలాది ప్రజలు వస్తుంటారు. చ్యవన మహర్షి ఈ ఆలయాన్ని ఆశ్రయించి కొంతకాలం నివసించాడాని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.

ఉంగ[మార్చు]

ఉంగ ఔరంగాబాదు పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది నగరానికి తూర్పున 24 కి.మీ దూరంలో ఉంది. ఈ యాత్రా ప్రదేశంలో వైష్ణవాలయం ఉంది. ఆలయనిర్మాణం దేవ్‌లోని సూర్యదేవాలయాన్ని పోలి ఉంటుంది. వైష్ణవాలయ నిర్మాణానికి నలుచదరమైన గ్రానైట్ రాళ్ళను వాడారు. ఆలయంలో గణేశుడు, సూర్యుడు, శివుడు ఉన్నారు. పురాతత్వశాస్త్రఙలు, చరిత్రకాలు ఈ ఆలయం ప్రత్యేకమైనదని భావిస్తున్నారు.

అంఝర్[మార్చు]

అంఝర్ షరీఫ్ ప్రముఖ ముస్లిం మతసంబంధిత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది దావూద్ - గయా రహదారి మార్గంలో పంచ్రుఖియా నుండి 10 కి.మీ దూరంలో ఉంది. అంఝర్ షరీఫ్‌లో ప్రముఖ ముస్లిం సన్యాసి " హజారత్ సైయదానా మొహమ్మద్ జిలాని అంఝరి క్వాద్రి " సమాధి ఉంది. జూన్ మాసం మొదటివారంలో నిర్వహించబడే మహమాంవితమైన సన్యాసి వార్షిక ఉత్సవానికి ఈ యాత్రాప్రదేశానికి వేలాది ప్రజలు వస్తుంటారు. ఈ ఉత్సవానికి సన్యాసి వారసుడు నాయకత్వం వహిస్తాడు.

పావై మాలి, చంద్నగర్[మార్చు]

రాజస్థాన్ నుండి వలస వచ్చిన ప్రజలు ఔరంగాబాదు చరిత్రలో మద్యయుగం, ఆధునిక యుగంలో ప్రధాన్యత కలిగి ఉన్నారు. పావర్, మాలి, చందంగడ్ వద్ద పురాత్నమైన కోటలు అందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఆకోటలు రాజస్థాన్‌కు చెందిన రాజపుత్ర రాజకుమారులు నిర్మించినవని భావిస్తున్నారు. ఉత్సాహవంతులైన పురాతత్వ శాత్రఙలకు ఈ కోటలను దర్శించడం ఒక సాహసపూర్వకమైన అనుభవం అని భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న రాతి కొండను " ఝుంఝుంవా పహాడ్ అంటారు.

పీరు[మార్చు]

జిల్లాలోని మరొక పర్యాటకప్రాంతం చారిత్రక ప్రాధన్యతకలిగిన పీరు. పురాతన కాలంలో దీనిని ప్రీతికోట అనేవారు. ఇది హర్షవర్ధనుని ఆస్థానంలోని కవి బాణభట్టుని జన్మస్థలం.

సిరిస్[మార్చు]

ఔరంగాబాదులోని ఆసక్తికరమైన ఆకర్షణీయ ప్రదేశాలలో సిరీస్ ఒకటి. ఇది ముగల్ సామ్రాజ్యం, షేర్ షా కాలంలో పరగణాగా ఉండేది. కాలక్రమేణ ఇది రాజా నారాయణ సింగుకు ఆటస్థలంగానూ, 1857లో తిరుగుబాటులో పాల్గొనావారికి రహద్యస్థావరంగా మారింది. సిరీస్‌లో ఔరంగజేబు కాలంలో నిర్మించిన ఒక మసీద్ ఉంది.

రఫిగంజ్[మార్చు]

′′′Rafiganj′′′ In Rafiganj,a mountain named Pachar where a fair is done on every raksha bandhan festival every year, where jains god temple is situated and a 30 feet painting of god Mahaveer is made here.

మూలాలు[మార్చు]

  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 11 December 2009. Archived from the original on 27 అక్టోబరు 2011. Retrieved 17 September 2011.
  2. Indian Post. "First బీహార్ Deputy CM cum Finance Minister;Dr. A N Sinha". official Website. Retrieved 20 May 2008.
  3. Kamat. "Great freedom Fighters". Kamat's archive. Archived from the original on 20 ఫిబ్రవరి 2006. Retrieved 25 February 2006.
  4. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 11 October 2011.
  5. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 11 October 2011.
  6. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1997. Archived from the original on 20 ఫిబ్రవరి 2018. Retrieved 11 October 2011. Vaygach Island 3,329km2
  7. 7.0 7.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  9. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Kuwait 2,595,62
  10. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. Nevada 2,700,551

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలిలింకులు[మార్చు]