మాధేపురా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాధేపురా జిల్లా
मधेपुरा जिला,ضلع مدھے پورا
బీహార్ పటంలో మాధేపురా జిల్లా స్థానం
బీహార్ పటంలో మాధేపురా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుకోసి
ముఖ్య పట్టణంమాధేపురా
Government
 • లోకసభ నియోజకవర్గాలుమాధేపురా
Area
 • మొత్తం1,787 km2 (690 sq mi)
Population
 (2011)
 • మొత్తం19,94,618
 • Density1,100/km2 (2,900/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత53.78 %
 • లింగ నిష్పత్తి914
ప్రధాన రహదార్లుNH 107
Websiteఅధికారిక జాలస్థలి
సింగేశ్వర శివాలయం

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో మాధేపురా జిల్లా ఒకటి. మాధేపురా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.మాధేపురా జిల్లా కోసి డివిజన్‌లో భాగం.

చరిత్ర[మార్చు]

1981 మే 9న సహర్సా జిల్లా నుండి కొంత భూభాగం వేరు చేసి మాధేపురా జిల్లాను రూపొందించారు. గతంలో మాధేపురా భాగల్‌పూర్ జిల్లాలో (1845 సెప్టెంబరు 3) ఉపవిభాగంగా ఉండేది. 1954 ఏప్రిల్ 1 న భాగల్‌పూర్ జిల్లా నుండి సహర్సా జిల్లాను రూపొందించారు.

మాధేపురా జిల్లాలో ప్రవహిస్తున్న కోసీ నది కారణంగా జిల్లాలో పలుమార్లు వరదలు సంభవిస్తుంటాయి. జిల్లా ప్రజలు ఇందువలన పలు విషాదాలు, బాధలు అనుభవిస్తున్నారు. ఈ ప్రాంతం పలు అభివృద్ధి, పతనావస్థలను ఎదుర్కొన్నది. కోసీ నది సృష్టిస్తున్న వరదలు, కరువు కాటకాలను జిల్లా ప్రజలు తరచుగా అనుభవిస్తుంటారు. అందువలన ప్రభుత్వం హైకోర్ట్ ఉపశాఖను (1935-1938) మద్యకాకంలో మాధేపురా నుండి సుపౌల్‌కు మార్చింది.

మాధేపురా గురించి కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మాధేపురా గంగాపూర్ గ్రామం నుండి విస్తరించించిందని భావిస్తున్నారు. రాజా మాధి కుమారుడు గంగాదేవ్ ఙాపకార్ధం గంగాపూర్ పేరు వచ్చిందని భావిస్తున్నారు. గంగాదేవ్ మాధేపూర్‌ను స్థాపించాడని విశ్వసిస్తున్నారు. గంగాపూర్ గ్రామం సేనా రజవంశానికి చెందిన గంగేశన్ స్వస్థలమని ఆయన ఙాపకార్ధం ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని మరొక కథనం వివరిస్తుంది.

సా.శ. 1704 ఎ.డి నుండి 1892 వరకు కోసీ నది ఫోర్బెస్గంజ్ నుండి చండేలి, రఘువంశానగర్ మీదుగా ప్రవహించి కుర్సెలా సమీపంలో గంగానదిలో సంగమిస్తుంది. కోసీ నదీలోయ మధ్యభాగంలో మాధేపురా ప్రాంతం ఉంది. అందుకని దీనిని మద్యపురా అని పిలిచేవారు. కాలక్రమంలో ఇది మాధేపురాగా మారింది. మరొక కథనం అనుసరించి ఇక్కడ అనేక మంది మాధవాలు (శ్రీకృష్ణుని వంశస్థులు) నివాసం ఏర్పరచుకున్నారని అందుకని ఇది మాధవ్పూర్, మాధేపూరా, మాధేపూర్ అయిందని భావిస్తున్నారు. [1]

పురాతన కాలం[మార్చు]

పురాతన కాలంలో మాధేపూర్ ప్రాంతం అంగదేశంలో భాగంగా ఉండేది.దీనిని మౌర్యులు, సుంగ, కంవ, కుషాణులు పాలించారు. గుప్తుల కాలంలో ఇది మిధిలా భూభాగంలో భాగంగా ఉండేది. అందుకు గుర్తుగా కిషంగంజ్ వద్ద మౌర్య స్థూపం ఉంది. బిహార్ రాజపుత్రులు ఈ ప్రాంతాన్ని కొంతకాలం పాలించారు. ప్రస్తుతం సింఘేశ్వర్ మండలంలోని రాయ్భీర్ గ్రామంలో భార్లు అధికంగా ఉన్నారు. మొగలుల కాలంలో మాధేపురా తిర్హత్ సర్కార్‌లో భాగంగా ఉండేది.

పురాణ కథనం[మార్చు]

మాధేపురా ప్రాంతం పరమశువునికి, ఇతర దేవతలకు తపోభూమిగా ఉండేది. ప్రఖ్యాత చరిత్రకారుడు శ్రీహరిశంకర్, శ్రీవాత్సవ్ " సలవ్ " మాధేపురా ప్రాంతంలో విభాండక మహర్షి తన కుమారుడైన ౠష్యశృంగునితో ఇక్కడ నివసించాడని కనుగొన్నాడు. కోశి నది ఉపనదుల తీరంలో ఉన్న సతోఖర్ గ్రామం పేరుకు సప్త పోఖర్ అనే సంస్కృత పదం మూలంగా ఉంది.ఇక్కడ ౠష్యశృంగుడు 7 అగ్నిగుండాలు నిర్మించి పుత్రకాష్ఠి యాగం చేసాడని విశ్వసిస్తున్నాడు.

ౠష్యశృంగుడు తన భార్య శాంత (రోమపాదుని దత్త పుత్రిక) ప్రేరణ చేత దశరథచక్రవర్తికి పుత్రులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ దశరథునిచేత పుత్రకామేష్ఠి యాగం చేయించాడు. తరువాత యఙం నుండి ఉద్భవించిన ధన్వంతరి ఇచ్చిన పాయసం భుజించిన దశరథుని పత్నులు గర్భం ధరించి వారికి రామ,లక్ష్మణ, భరత, శత్రుగ్నులు పుత్రులుగా జన్మించారు. రామాయణంలో పేర్కొన్న ఋష్యశృంగ ఆశ్రమం ఇక్కడ ఉందని విశ్వసిస్తున్నారు. బ్రహ్మపురాణంలో సింగేశ్వరుని శృంగేశ్వరుడు అని పేర్కొనబడింది. ఇక్కడ జింకలు, చిరుతలు, ఎలుగుబంట్లు మొదలైన జంతువులు కనిపిస్తుంటాయి.మహాభారతం సమయంలో యుధిష్టరుడు రోమహర్ష ౠషితో ఇక్కడ సంచరించాడని విశ్వసిస్తున్నారు.కుషానుల కాలంలో షీత్- బసంత్ ఇక్కడ నివసించారని భావిస్తున్నారు. ప్రస్తుత కడమ్మ వద్ద శీత్ కోట, సింగేశ్వర్ మండలంలోని బసంతపూర్ గ్రామంలో బసంత్ కోట ఉన్నాయి. శిథిలమైన కోట అవశేషాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి.ఘైలార్ మండలంలో ఉన్న శ్రీనగర్ రాజా శ్రీ దేవా నిర్మించిన రెండు కోటలు ఉన్నాయి.[2][3][4][5]

భౌగోళికం[మార్చు]

మాథెపురా జిల్లా వైశాల్యం 1788 చ.కి.మీ.[6] ఇది రష్యాలోని " బొల్షాయ్ షంతర్ ద్వీపం " వైశాల్యానికి సమానం.[7]

వాతావరణం[మార్చు]

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు అరారియా, సుపౌల్
దక్షిణ సరిహద్దు ఖగరియా, భాగల్‌పూర్
తూర్పు సరిహద్దు పూర్ణియా
పశ్చిమ సరిహద్దు సహర్సా
అక్షాంశం 25°. 34 నుండి 26°.07 డిగ్రీలు
రేఖాంశం 86° .19' నుండి 87°.07'.డిగ్రీలు

విభాగాల వివరణ[మార్చు]

విషయాలు వివరణలు
ఉపవిభాగాలు మాధేపురా, ఉదా కిషంగంజ్
మండలాలు 13
పోలీస్ స్టేషన్లు 13
పంచాయితీలు 170
రెవెన్యూ గ్రామాలు 434
జనసంఖ్య (2001 గణాంకాలు) 15,24,596
పురుషులు 7,96,272
స్త్రీలు 7,29,324
జనసాంధ్రత 859
అక్షరాస్యత 36.9% (రాష్ట్రీయ అక్షరాస్యత 47%)

వాతావరణం[మార్చు]

విషయ వివరణ వాతావరణ వివరణ
గరిష్ఠ ఉష్ణోగ్రత 35-40 ° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 7-9 ° సెల్షియస్
వర్షపాతం 1300 మి.మీ

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మాధేపురా జిల్లా ఒకటి అని గుర్తించింది.[8] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[8]

ఉపవిభాగాలు[మార్చు]

మాధేపురా జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి: మాధేపురా, ఉదా కిషన్‌గంజ్

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,994,618,[9]
ఇది దాదాపు. స్లోవేనియా దేశ జనసంఖ్యకు సమానం.[10]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 232వ స్థానంలో ఉంది.[9]
1చ.కి.మీ జనసాంద్రత. 1116 [9]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 30.65%.[9]
స్త్రీ పురుష నిష్పత్తి. 914:1000 [9]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 53.78%.[9]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ప్రార్ధనా మందిరాలు[మార్చు]

shiv temple

మాధేపురాలో ప్రముఖ సింగేశ్వ ఆలయం ఉంది. ఆలయంలో " ఇష్ట లింగేశ్వరుడు " ప్రధానదైవంగా ఉంది. బ్రహ్మ పురాణంలో ఈ ఆలయం శ్రింగేశ్వరుడుగా ప్రస్తావించబడింది. మహాకవి విద్యాపతి 14వ శతాబ్దంలో తాను రచించిన సాహిత్యంలో ఈ ఆలయం గురించి ప్రస్తావించాడు. వాల్మికి రామాయణంలో ఋష్యశృంగుడి ఆశ్రమం గురించిన ప్రస్తావన ఉంది. మహాకవి కాళిదాసు రచించిన కుమారసంభవం కావ్యంలో మహాశివుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన కోశినదీ తీరంలోని ఈ ప్రాంతంలో స్చయంగా నివసించాడని లిఖించాడు. విష్ణుమూర్తి స్వయంగా ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. ప్రస్తుత ఆలయాన్ని కుషన్ రాజవంశీయులు నిర్మించారు. ఆరంభాకాల సర్వేలో భానుదాస్ ఈ ఆలయం గురించి నమోదు చేసాడు. సింగేశ్వర్ ఆలయంలో ఒకరాత్రి నిద్రిస్తే అపారమైన పశుసంపద లభిస్తుందని అందులో ప్రస్తావించబడింది.

ప్రభుత్వ సంస్థలు, న్యాయస్థానాలు[మార్చు]

మాధేపురాలో ప్రభుత్వ సంస్థలను చేర్చేందుకు:

  • మున్సిపల్ కార్పొరేషన్
  • కలెక్టరేట్
  • ఆఫీసు డివిజనల్ కమిషనర్
  • జిల్లా కోర్టు, మాధేపుర
  • అర్బన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ (వెదుక్కోవచ్చు)

ఆరోగ్యసేవలు[మార్చు]

జిల్లాలో ప్రజల ఆరోగ్యరక్షణకు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యసేవలు అందజేస్తున్నాయి.

  • సాదర్ హాస్పిటల్ (మాధేపురా)
  • మాధేపురా క్రిస్టియన్ హాస్పిటల్

విద్య[మార్చు]

జిల్లాలో 834 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లాకేంద్రం మాధేపురాలో " భూపేంద్ర నారాయణన్ మండల్ యూనివర్శిటీ " ఉంది. ఇది జిల్లాకు మరింత ప్రాముఖ్యత ఇస్తూ ఉంది.

విద్యాసంస్థల జాబితా[మార్చు]

  • బి.ఎన్.మండల్ విశ్వవిద్యాలయం మాహేపురా
  • హెచ్.టి.ఎం.ఎల్ టి.పి కాలేజ్
  • పి.ఎస్.సి కాలేజ్
  • కామర్స్ కళాశాల,
  • మాధేపుర కాలేజ్,
  • సి.ఎం.ఎస్.సి కాలేజ్,
  • ఆర్.పి.ఎం కాలేజ్
  • జవహర్ నవోదయ విద్యాలయ
  • శివ్ నందన్ ప్రసాద్ మండలం హై స్కూల్,
  • రాష్ బిహారీ హై స్కూల్
  • కిరణ్ పబ్లిక్ స్కూల్, హోలీ క్రాస్, పవిత్ర దేవదూతలు, (వెబ్సైట్)
  • బిఆర్ ఆక్స్ఫర్డ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్,మురళిగంగ్ మాధేపుర
  • సమిధ గ్రూప్
  • మాధేపుర పబ్లిక్ స్కూల్
  • వేదవ్యాసుని డిగ్రీ కళాశాల అంలెష్వర్ నగర్ మాధేపుర
  • ఖె.ఫి.కల్లేగ్ ముర్లిగంగ్
  • భి.ఎల్.హై స్కూల్ ముర్లిగంగ్
  • పరస్మని హై స్కూల్ బాబు బభ్ని
  • గవర్నమెంట్. హై స్కూల్ అమరి ముర్లిగంజ్ మాధేపుర
  • ఎం.ఎం. హై స్కూల్ కుమర్ఖంద్
  • ప్రాజెక్ట్ కన్యా హై స్కూల్ కుమర్ఖంద్
  • దుర్గాపూర్, భ్ద్ధి, మంగువర్
  • వేదవ్యాసుని ఇంటర్ కాలేజ్ అంలెష్వర్ నగర్ మాధేపుర

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

మాధేపురా రహదారులు, రైలు మార్గాలతో అనుసంధానించబడి ఉంది.

  • బ్లాక్ వైజ్ ట్రాంస్ పోర్ట్ మ్యాప్.[1]

రహదారులు[మార్చు]

జాతీయరహదారులు 107-106 జిల్లాను ప్రధాన నగరాలు, రాష్ట్రాలతో అనుసంధానిస్తూ ఉన్నాయి. రాష్ట్రం లోపల, నగరం లోపల ప్రజల ప్రయాణం చేయడానికి దినసరి బసులు అందుబాటులో ఉన్నాయి.

రైలుమార్గాలు[మార్చు]

  • జిల్లా మీటర్ గేజ్ రైలుమార్గంతో " నార్త్ ఈస్టర్న్ రైల్వే "తో అనుసంధానించబడి ఉంది.
  • ఇది జిల్లాను పాట్నా, బీహార్లతో అనుసంధానిస్తుంది.
  • నగరంలో 4 రైళ్ళు నిలుస్తున్నాయి.

వాయుమార్గాలు[మార్చు]

సమీపంలోని విమానాశ్రయం 247 కి.మీ దూరంలో పాట్నాలో ఉంది.

మాధ్యమం[మార్చు]

జిల్లాలో రేడియో స్టేషన్లు:

వార్తాపత్రికలు[మార్చు]

  • దైనిక్ జాగరణ్
  • హిందూస్తాన్
  • మాధేపురాటైంస్
  • ప్రభాత్ ఖబర్

పండుగలు[మార్చు]

జిల్లాలో హోలి, దివాలి,దుర్గా పూజ, విజయదశమి, సరస్వతి పూజ అత్యంత ఉత్సాహంతో జిల్లావాసులు జరుపుకుంటారు.

మూలాలు[మార్చు]

  1. Extracted from Brihad Hindi Kosh, 5th Edition, Page- 887
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-03. Retrieved 2014-12-08.
  3. http://www.jagran.com/local/bihar_madhepura-news-hindi.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-05. Retrieved 2014-12-08.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-11-06. Retrieved 2014-12-08.
  6. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  7. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Bolshoy Shantar Island 1,766km2
  8. 8.0 8.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural No 1 district in education No 1 wheat and rice production in బీహార్ Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  10. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Slovenia 2,000,092 July 2011 est.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]