సివాన్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సివాన్ జిల్లా
सीवान ज़िला ضلع سیوان
బీహార్ పటంలో సివాన్ జిల్లా స్థానం
బీహార్ పటంలో సివాన్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుసారణ్
ముఖ్య పట్టణంసివాన్
Government
 • లోకసభ నియోజకవర్గాలుసివాన్
Area
 • మొత్తం2,219 km2 (857 sq mi)
Population
 (2011)
 • మొత్తం33,18,176
 • Density1,500/km2 (3,900/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత71.59 %
 • లింగ నిష్పత్తి984
ప్రధాన రహదార్లుNH 85
Websiteఅధికారిక జాలస్థలి
సివాన్ జిల్లా
బాబా మహేంద్ర నాథ్ మందిర్, మెహదర్

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో సివాన్ జిల్లా (హిందీ:) ఒకటి. సివాన్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 1972 నుండి సివాన్ జిల్లా సారణ్ డివిజన్‌లో భాగం. జిల్లాలోని జిరాడెయికి చెందిన ... మొదటి భారత అధ్యక్షుడుగా ఎన్నిక కావడం ఈ జిల్లా ప్రత్యేకత.[1] జిల్లాలోని అలిగంజ్ గ్రామానికి అలి సావన్ ఙాపకర్ధం పేరు నిర్ణయించబడింది. సివాన్ జిల్లాకు పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యత ఉంది. సివాన్ పార్లమెంటు నుండి " ఓం ప్రకాష్ యాదవ్ " పార్లమెంటుకు ఎన్నిక చేయబడ్డాడు.[2]

చరిత్ర[మార్చు]

సివాన్ బీహార్ రాష్ట్ర పశ్చిమ భూభాగంలో ఉంది. ఇది సారణ్ డివిజన్‌లో భాగం. పురాతన కాలంలో ఇది కోసల రాజ్యంలో భాగం.[3] 1976లో సారణ్ జిల్లా నుండి వేరుచేసి సివాన్ ఉపవిభాగాన్ని పూర్తిస్థాయి జిల్లాగా మార్చారు..[4]

పేరువెనుక చరిత్ర[మార్చు]

ఈ ప్రాంతాన్ని పాలించిన బంధ్ రాజు శివమాన్ కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. శివమాన్ వారసులు ఈ ప్రాంతాన్ని బాబర్ ప్రవేశించే కాలం వరకు పాలించారు. సివాన్ అంటే సరిహద్దు. ఇది బీహార్ సరిహద్దు వరకు ఉంది కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. సివాన్ జిల్లాలోని ఉపవిభాగం మహరాజ్‌గంజ్ వద్ద మహారజ నివాసం ఉంది కనుక మహరాజ్‌గజ్ అయిందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని భెర్‌బనియా గ్రామం వద్ద జరిపిన త్రవ్వకాలలోఒక చెట్టు కింద సమీప కాలంలో విష్ణుమూర్తి విగ్రహం లభించింది. అందువలన ఇక్కడ ఒకప్పుడు వైష్ణవులు పెద్ద సంఖ్యలో నివసించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది బీహార్ రాష్ట్రానికి సరిహద్దుగా లేదు. 1790లో గొరఖా రాజు కొంతకాలం తనసామ్రాజ్యాన్ని శివన్ వరకు విస్తరించాడు. తరువాత బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఘోరకరాజును తిప్పి కొట్టాడు. ఇప్పుడీ ప్రాంతంలో యాదవులు, రాజపుత్రులు అధికంగా నివసిస్తున్నాడు.[5]

బనారస్[మార్చు]

8వ శతాబ్దంలో సివాన్ బనారస్ రాజ్యంలో భాగం అయింది. 13వ శతాబ్దంలో సివాన్ ప్రాంతంలో ముస్లిములు ప్రవేశించారు. 15వ శతాబ్దంలో సికందర్ లోడీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. బాబర్ సివాన్ ప్రాంతంలోని ఘాఘ్రా నదిని దాటి ఈ ప్రాంతంలో ప్రవేశించాడు. 17వ శతాబ్దంలో మొదట డచ్ వారు వారి వెంట ఇంగ్లీష్ వారు ఈ ప్రాంతంలో ప్రవేశించారు. 1765లో జరిగిన బక్సర్ యుద్ధం తరువాత ఈ ప్రాంతం బెంగాల్ రాష్ట్రంలో భాగంగా మారింది. 1875లో స్వాతంత్ర్యసమరంలో సివాన్ ప్రజలు ప్రధాన పాత్రవహించారు. ఈ జిల్లా స్టాల్‌వర్ట్, భోజ్‌పురీలకు ప్రసిద్ధం. వారు శారీరక సహనానికి, వీరత్వానికి పేరుపొందారు. వీరు అధికంగా పోలీస్, మిలటరీ ఉద్యోగాలకు నియమించబడుతుంటారు. [3]

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

జిల్లాలో పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

మెహందర్ ధాం[మార్చు]

సివాన్ బ్లాకులోని మెహందర్ ధాంలో శివునికి, విశ్వకర్మకు ఒక ఆలయం ఉంది. శిరాత్రి నాడు ఈ భవనానికి భక్తులు అధికంగా వస్తారు. సెప్టెంబరు 17న ఇక్కడ విశ్వకర్మపూజ నిర్వహించబడుతుంది. ఇక్కడ 748800 చ.అడుగుల వైశాల్యంలో ఒక కోనేరు నిర్మించబడింది. పూర్వం ఇక్కడ ఉన్న చిన్న కోనేరులో నేపాల్ రాజు తన యాత్రసమయంలో స్నానం చేసాడని. తరువాత ఆయనకు కుష్టు వ్యాధి నయం అయిందని అందువలన ఆయన ఈ కోనేరుని విశాలంగా పునర్నిర్మించాడని విశ్వసిస్తున్నారు.

కొరర[మార్చు]

కొరర గ్రామం మైర్వ బ్లాకులో ఉంది. మైర్వా ఆనకట్టకు 2కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ శివాలయం, దుర్గా ఆలయాలతో జిల్లాలో మొదట నిర్మించిన సాయిబాబా ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో రాజీవ్ కుమార్ సింగ్ (బిట్టు సింగ్) ఆధ్వర్యంలో ఉత్సవం నిర్వహించబడుతుంది.

డాన్[మార్చు]

దరౌ బ్లాకులోని డాన్ గ్రామంలో ఉన్న శిథిలమైన కోటకు మహాభారతంలోని ద్రోణాచార్యునకు సంబంధం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న దోన అందరికీ తెలియనప్పటికీ ఇది బౌద్ధుల యాత్రీక ప్రదేశాలలో ఒకటిగా భావించబడుతుంది. చైనా యాత్రీకుడు హూయంత్సాంగ్ తన భారతదేశ యాత్రలో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు. బుద్ధుని అస్థులు భద్రపరచిన ప్రాంతం అని విశ్వసిస్తున్నారు. హ్యూయంత్సాంగ్ సందర్శించిన సమయంలో ఈ స్థూపం శిథిలావస్థలో ఉందని వర్ణించాడు. ప్రస్తుతం దోన గడ్డి నిండిన కొండగా ఉంది. దాని మీద ప్రస్తుతం తరా దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం సా.శ. 9వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. బౌద్ధ యాత్రీకులు ఇప్పుడు కూడా ఈ చారిత్రాత్మక ప్రాంతాన్ని దర్శిస్తూనే ఉన్నారు.

మహరాజ్‌గంజ్[మార్చు]

ఇది ఒక మండల కేంద్రంగా ఉండేది. దీనిని బస్నౌలి గంగార్ అని కూడా పిలిచేవారు. ఇది స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ ఫులేనా ప్రసాద్ తన ఉద్యమ కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నడు.

భికబంధ్[మార్చు]

భికబంధ్ సివాన్ జిల్లాలోని మహరాజ్‌గంజ్ మండలం లోని గ్రామం. ఇక్కడ ఉన్న పెద్ద చెట్టు కింద భైయ - బహిని ఆలయం ఉంది. 14వ శతాబ్దంలో ఇక్కడ అన్నా - చెల్లెలు మొగల్ సైన్యాలతో పోరాటం చేసి మరణించారని అందువలన ఇక్కడ అన్నా చెల్లెలి కొరకు ఆలయం నిర్మించబడిందని విశ్వసిస్తున్నారు. .[6]

సోహంగర[మార్చు]

సోహంగర గుతాని మండలంలోని ప్రాంతం. ఇక్కడ ప్రముఖ శివాలయం ఉంది. ఇది జిల్లా కేంద్రం సివాన్ పట్టణానికి 40కి.మీ దూరంలోనూ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని దియోరియా జిల్లా సరిహద్దుకు సమీప ంలో ఉంది.[7]

భౌగోళికం[మార్చు]

సివాన్ జిల్లా వైశాల్యం 2219 చ.కి.మీ.,[8] ఇది రష్యాలోని విల్సెక్ ద్వీపం వైశాల్యానికి సమానం.[9]

విభాగాలు[మార్చు]

సివాన్ జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి : సివాన్, మహరాజ్‌గంజ్.

విభాగాలు[మార్చు]

  • ఉప విభాగాలు :- సివాన్, మహరాజ్‌గంజ్
  • మహరాజ్‌గంజ్ ఉపవిభాగం లోని మండలాలు :- మహరాజ్‌గంజ్, డురవంధ, గొరేకొథి, బసంత్పుర్, భగ్వంపుర్, లక్రి నబిగంజ్
  • సివాన్ ఉపవిభాగం లోని మండలాలు :- సివాన్, మైర్వ, దరౌలి, గుథని, హుస్సైంగంజ్, అందర్, రఘునాథ్పూర్, సిస్వన్, బర్హరీ, పంచ్‌రుఖి,హసంపుర, నౌతన్, జిరదై ఉందెర్ సివాన్
  • బ్లాకులు :- మైర్వ, పంచ్‌రుఖి, రఘునాథ్పుర్, అందర్, గుతని, మహారజ్గంజ్, డరౌలి, సిస్వన్, డరౌంద, హుసైనగంజ్, భగ్వంపుర్ హత్త్, గొరియకొథి, బరహరీ, సివాన్ సదర్, బసంత్పుర్, లకరి నబిగంజ్, జిరదై, నౌతన్, హసంపుర.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,318,176,[10]
ఇది దాదాపు. ఉరుగుయే దేశ జనసంఖ్యకు సమానం.[11]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[12]
640 భారతదేశ జిల్లాలలో. 101వ స్థానంలో ఉంది..[10]
1చ.కి.మీ జనసాంద్రత. 1495 [10]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.25%.[10]
స్త్రీ పురుష నిష్పత్తి. 984:1000 [10]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 71.59%.[10]
జాతియ సరాసరి (72%) కంటే. స్వల్పంగా తక్కువ

గ్రామాలు[మార్చు]

శివన్ జిల్లాలో గ్రామాలు :- బర్హన్ గోపాల్,పిహులి,తర్వర,కర్మసి,గరర్, బిషంభెర్పుర్, అఘైల,పిథౌరి,పచౌర,పచలఖి, భర్థుఇ, సలెంపుర్, ఢనవతి మఠం హసూ, షరీఫ్ జలాల్పూర్,హథౌర,హరిహన్స్, మద్కన్, ఖలిస్పుర్, పెర్తప్పుర్, తివారీ కే బధయ, కొహర్వలియ, ఆత్తెర్సువ, బగౌర, సమర్దహ్, బెలఒన్, కణౌలి, మైర్వహ్, జిరదై, భిత్తి, షెఖ్పుర, షహర్కొల, హరియమ, ఖెద్వ, బస్వన్, నగరిలో ముర్వర్, ఆఅందర్, జతౌర్, షివ్పుర్, కాలా దుమ్ర, సక్ర, సొనహుల, చిత్బిస్రన్వ్, లౌవన్, మహ్పుర్, ముసెహ్రి (వ్యక్తి) సవన (రాజ్పుట్), సర్సర్ (భూమిహార్), ఆంలోరి, చైంచప్ర (షెఖ్) .మధొపుర్, జగర్నథ్పుర్ లక్ష్మిపూర్, ష్యంపుర్, కల్యాణ్పూర్ జమొబజర్, రచొపలి, ఆసఒన్, బభ్నౌలి, రాంపూర్ ఉధొ, పతర్, కుతుబ్ చాప్రా, మొహమ్మద్పూర్ లో, హర్పుర్ కొత్వ, చకరి బజార్.

సుప్రసిద్ధ వ్యక్తులు[మార్చు]

  • రాజేంద్ర ప్రసాద్ :- భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, మొదటి అధ్యక్షుడు.
  • మౌలానా మఝరుల్ హక్ - ఒక ప్రముఖ రాజకీయవేత్త, 1916లో బీహార్ లో హోమ్ రూల్ ఉద్యమం అధ్యక్షుడిగా పనిచేసాడు.
  • సత్యేంద్ర దూబే - ఐ.ఇ.ఎస్ అధికారి, అవినీతి వ్యతిరేకంగా బంగారు రహదారి ప్రాజెక్ట్ లో విజిల్ బ్లోయర్
  • మహామాయ ప్రసాద్ సిన్హా - అతను జవవరి - మార్చి 1967 నుండి రి 1968 బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బీహార్ లోని సివాన్ జిల్లా, మహారాజగంజ్ లోని పటేధి వాసి.
  • నట్వర్లాల్ - ప్రముఖ భారతీయ కాన్ మాన్
  • అమీర్ సుభాని:- అమీర్ సుభానీ, 1987 బ్యాచ్ ఐఎఎస్,
  • మేజర్ మొహమ్మద్ సహీద్ - సైన్యం అధికారి. " పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్ంస్ " ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ప్రధాన హోం సెక్రటరీ.

మూలాలు[మార్చు]

  1. [1]
  2. http://www.educationforallinindia.com/page157.html
  3. 3.0 3.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-07-17. Retrieved 2014-12-09.
  4. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  5. http://www.indianexpress.com/news/this-week-bihar/1118304/
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-02. Retrieved 2014-12-09.
  7. http://www.youtube.com/watch?v=t5aCmnNg_WE
  8. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  9. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Wilczek Land2,203km2
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  11. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Uruguay 3,308,535 July 2011 est.
  12. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Connecticut 3,574,097

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]