భోజ్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భోజ్‌పూర్ జిల్లా
भोजपुर ज़िला,ضلع بھوج پور
బీహార్ పటంలో భోజ్‌పూర్ జిల్లా స్థానం
బీహార్ పటంలో భోజ్‌పూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుపాట్నా
ముఖ్య పట్టణంఆరా
Government
 • లోకసభ నియోజకవర్గాలుఆరా
విస్తీర్ణం
 • మొత్తం2,474 కి.మీ2 (955 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం27,20,155
 • జనసాంద్రత1,100/కి.మీ2 (2,800/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత72.79 %
 • లింగ నిష్పత్తి900
ప్రధాన రహదార్లుNH 30, NH 84
సగటు వార్షిక వర్షపాతం913 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో భోజ్‌పూర్ జిల్లా (హిందీ:भोजपुर ज़िला) ఒకటి. ఆరా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

స్వాతంత్రం తరువాత

[మార్చు]

జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం[1]

భౌగోళికం

[మార్చు]

భోజ్‌పూర్ జిల్లా వైశాల్యం 2395 చ.కి.మీ.,[2] ఇది కెనడా దేశంలోని కార్ంవాల్ ద్వీపం వైశాల్యానికి సమానం.[3] జిల్లా 25° 10' to 25° 40' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83° 45' నుండి 84° 45' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.

వాతావరణం

[మార్చు]

జిల్లాలోని వాతావరణంలో మార్చి మద్యభాగం నుండి వేడి ఆరంభం ఔతుంది. ఏప్రిల్, మే మాసాలు వేసవి కాలం, జూన్ - సెప్టెంబరు వర్షాకాలం, అక్టోబరు- నవంబరు శీతాకాలం. జనవరి మాసం అతిశీతలంగా ఉంటుంది. శీకాల ఉష్ణోగ్రత 10;° సెల్షియస్ ఉంటుంది. జూన్ మాసంలో వర్షాలు ప్రారంభం అయిన తరువాత ఉష్ణోగ్రత తగ్గు ముఖం పడుతూఉంది. జూలై ఆగస్టు మాసాలలో వర్షాలు అధికంగా ఉంటాయి. జిల్లా సరాసరి వర్షపాతం 300 మి.మీ. అక్టోబరు మాసంలో స్వల్పంగా వర్షాలు ఉన్నప్పటికీ నవంబరు, డిసెంబరు మాసాలు కొంత పొడి వాతావణం ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి మాసాలలో శీతాకాలపు వర్షాలు ఉంటాయి. ప్రస్తుతం జిల్లా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందుతూ ఉంది. జిల్లాలోని గ్రామాల నుండి వ్యవసాదారులు కూరగాయలు పండించి పరిసర ప్రాంతాలలో విక్రయిస్తుంటారు.

ఉపవిభాగాలు

[మార్చు]

భోజ్‌పూర్ జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి.

  • ఆరా సాదర్
  • జగ్దిష్‌ పూర్
  • పిరొ

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో భోజ్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర భోజ్‌పూర్ జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

నీటిపారుదల

[మార్చు]

గంగానది, సోనేనది నిరంతరంగా జిల్లాలోని అధికభాగం వ్యవసాయభూములకు నీటిని అందిస్తున్నాయి. జమీందారీ రద్దుకు ముందు జమీందారులు భూమిని అహ్రాలు, పైనెలుగా విభజించి వ్యవసాయ భూములకు నీటిపారుదల సౌకర్యం కలిగించారు. అంతేకాక బావినీటి నుండి కూడా వ్యవసాయ భూములకు నీరు అందించబడింది.

2001 గణాంకాల ప్రకారం వ్యవసాయ భూముల వివరణ

[మార్చు]
విషయం వివరణ
వ్యవసాయ భూముల వైశాల్యం 2,37,526 హెక్టారులు
నీటిపారుదల సౌకర్యమున్న వూవసాయ భూములు 177,341 హెక్టారులు
నీటిపారుదల 74.66%
సోనే పెద్ద కాలువలు 15,493 హెక్టారులు
సోనే మద్య కాలవలు 14,940 హెక్టారులు
చిన్న కాలువలు 18,379 హెక్టారులు
బోరు బావులు 2,582 హెక్టారులు
ప్రైవేట్ బోరు బావులు 58,586 హెక్టారులు
సాధారణ బావులు, ప్రభుత్వ డీసిల్ పంపులు 2,099 హెక్టారులు
విద్యుత్తు బోరుబావులు 8,263 హెక్టారులు
ప్రైవేట్ డీసిల్ పంపులు 16,999 హెక్టారులు

వ్యవసాయం

[మార్చు]

జిల్లాలో నీటిపారుదల కలిగిన వ్యవసాయ భూములు, నీటిపారుదల రహిత వ్యవసాయ భూములు ఉన్నాయి. పెద్ద నీటి మడుగులు, సరసులు వంటి ప్రాంతాలను చదును చేసి వ్యవసాయ భూములుగా మార్చారు. ప్యాకేజ్ పేరుతో వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. బ్లాక్ డెవెలప్మెంటు శాఖ వ్యవసాయ అభివృద్ధికి ప్రయత్నిస్తుంది. హార్టి కల్చర్, తోటల పెంపకం క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంది.

పంట విస్తీర్ణం ; హె
వరి 1,05,155
గోధుమలు 67,259
మొక్కజొన్నలు 2,779
బార్లి 1,154
బార్లి 5,017
కందులు 2,016
అర్హర్ 919
మసూర్ 8,115
కేసరి 8,989
నూనె గింజలు 2,866
సుగంధ ధ్రవ్యాలు 31
కూరగాయలు 5,119
కూరగాయలు 2,651
చెరకు 209

ఖనిజాలు

[మార్చు]

భోజ్‌పూర్ జిల్లాలో ఖనిజ వనరులు స్వల్పంగా ఉన్నాయి. జిల్లాలో లభిస్తున్న ఒకేఒక ఖనిజం సోనె నదీతీరంలో లభిస్తున్న ఇసుక మాత్రమే. జిల్లాలో సోనె నది 40కి.మీ పొడవున ప్రవహిస్తుంది. కోయిల్వార్ వద్ద ఉన్న 5 కి.మీ పొడవున ఉన్న నదీతీరంలో మాత్రమే ఇసుక లభిస్తుంది. మిగిలిన 35 కి.మీ ఇసుక తీయడానికి అనువైనది కాదు.

పారిశ్రామీకరణ

[మార్చు]

పాత షహాబాద్ జిల్లా పునర్విభజన తరువాత భోజ్‌పూర్, రోహ్‌తాస్ లలో బృహాత్తర పరిశ్రమలు తగ్గాయి. అయినప్పటికీ భోజ్‌పూర్ జిల్లాలో వివిధ రకాల చిన్నతరహా పరిశ్రమలు, కుటీరపరిశ్రమలు అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి.

జిల్లా గణాంకాల నివేదిక జిల్లాలో 1992, 2000 ల మధ్య 1085 చిన్నతరహ పరిశ్రమలు, కుటీరపరిశ్రమలు ఉన్నాయని నమోదయ్యాయని తెలియజేస్తున్నాయి. ఈ పరిశ్రమల కొరకు 869.19 లక్షల పెట్టుబడి ఉందని తెలుస్తుంది. ఇవి 1858 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. జిల్లాలోని గిధా గ్రామంలో " ఇండస్ట్రియల్ డెవెలెప్మెంటు అథారిటీ " ఆధ్వర్యంలో 30-40 ఎకరాల వైశాల్యంలో పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటు చేయబడి ఉంది. ఇది ప్రాంతీయ వాసులకు తగినంత ఉపాధి కలిగిస్తుంది. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి ఇండేన్ గ్యాస్ బోల్టింగ్ ప్లాంట్ ఉంది. జిల్లాలో అవసరాలకు తగినంత విద్యుత్తు అందనందు వలన జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,720,155,[5]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నెవాడా నగర జనసంఖ్యకు సమం..[7]
640 భారతదేశ జిల్లాలలో. 145 వ స్థానంలో ఉంది..[5]
1చ.కి.మీ జనసాంద్రత. 1136 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.27%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 900:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 72.79%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. దాదాపు సమానం
ప్రజలు కుష్వా క్షత్రియ (30%)

భాషలు

[మార్చు]

జిల్లాలో భోజ్పురి భాష, బీహారీ భాష వాడుకలో ఉన్నాయి. " టైంస్ ఆఫ్ ఇండియా " కథనాలను అనుసరించి బిహారీ భాష 20,00,00, 000 మంది ప్రజలలో వాడుకలో ఉందని తెలుస్తుంది. ఈ రెండు భాషలను దేవనాగరి, కైతి లిపులలో వ్రాస్తుంటారు.[8] జిల్లాలో హిందీ, ఉర్దూ భాషలు కూడా వాడుకలో ఉన్నాయి.

ప్రముఖులు

[మార్చు]
  • వీర్ కుంవర్ సింఘ్ :- స్వాతంత్ర్య సమర యోధుడు.
  • ఆచార్య పి.టి అంబికా దత్తా శర్మ. ఉద్యమకారుడు, సంస్కృత పండితుడు, 1917 ఏప్రిల్ 9 న మహాత్మా గాంధీకి ఆతిథ్యం ఇచ్చాడు. తరువాత ఆయన శ్వేతజాతి ఇండిగో రైతులకు వ్యతిరేకంకా జరిగిన పోరాటంలో పాల్గొనడానికి ఆచార్య జె.బి. కృపలాని, ముజాఫర్ మొదటిసారిగా బీహార్‌ లోని చంపారణ్‌కు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చాడు.
  • బాబు జగజీవన్‌రాం :- మునుపటి స్వతంత్ర సమరయోధుడు, అతి పిన్నవయసులో మంత్రిగా గుర్తింపు పొందాడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో మొదటి లేబర్ మంత్రిగా పనిచేసాడు. జగజీవన్‌రాం ఆరా సమీపంలోని చంద్వా వద్ద జన్మించాడు.
  • జస్టిస్ భువనేశ్వర్ ప్రసాద్ సింహా :- భారతదేశ 6 వ చీఫ్ జడ్జిగా పనిచేసాడు. ఆయన భోజ్‌పూర్‌కు చెందినవాడు. ఆయన స్వస్థలం గజియాపూర్.
  • పి.ఒ. సింహా :- భోజ్‌పూర్ వాసి. ఆయన తన ప్రాథమిక విద్య ఆరా జిల్లా స్కూల్‌లో పూర్తిచేసాడు.
  • డాక్టర్ రాం సింగ్ :- ఇందిరాగాంధి క్యాబినెట్‌లో యూనియన్ రైల్వే మంత్రిగా పనిచేసాడు. ఆయన 1969లో పార్లమెంట్ మొదటి ప్రతిపక్షనాయకుడుగా పనిచేసాడు.
  • బలిరాం భగత్ :- ఆరా పార్లమెంటు సభ్యుడు. యూనియన్ క్యాబినెట్ మంత్రి, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసాడు.
  • బిందేశ్వరి దుబే :- బీహార్ ముఖ్యమంత్రిగా తరువాత లా, జస్టిస్ యూనియన్ మంత్రి, రాజీవ్ గాంధి క్యాబినెట్‌లో లేబర్ మంత్రిగా పనిచేసాడు.ఆయన స్వస్థలం ఆరా సమీపంలో ఉన్న మహుయాన్.
  • మెయిరా కుమార్:- బాబు జగ్జీవంరాం కుమార్తె, పార్లమెంటు స్పీకర్‌గా పనిచేసింది.

సంస్కృతి

[మార్చు]

చలనచిత్రాలు

[మార్చు]

భోజపురి చిత్రాలకు పలువురు ప్రేక్షకులు ఉన్నారు. ఈ జిల్లా నుండి పలువురు చలనచిత్ర రంగంలో ప్రత్యేకస్థానం సంపాదించారు.

  • విశ్వనాథ్ షహబాది :- గంగా మాయా తొగెన్ పియాల్ చధైబొ (1960) ఇది ఇప్పటికీ గుర్తించబడుతుంది.
  • జనార్ధన్ సింగ్ :- ఆయన స్వస్థలం ఆరా. పియా నిర్మొహలో హీరో జయతిలక్‌తో నటించాడు.
  • అశోక్ చందన్ జైన్, లక్ష్మణన్ షహబాడి :- గంగా కినారె మొరా గావ్ నిర్మించాడు. ఈ చిత్రంలోని పాటలు ప్రశంశించబడ్డాయి.
  • జై మోహన్ :- ఆయన స్వస్థలం ఆరా. చనలచిత్ర ప్రతినాయకుడు. కబ్ ఆయాతే దుల్హా హమ్మర్. ఇది భోజపురి చలనచిత్రసీమలో మైలురాయిగా గుర్తించబడింది.
  • ఉదయ్ శంకర్ :- ఆయన స్వస్థలం ఆరా. విజయవంతమైన జాకీ షరాజ్ భోజ్పురి చిత్రం " హం హయీ కల్‌నాయక్ " చిత్రం తీసాడు.
  • జిల్లాకు చెందిన పలువురు భోజపురి చలనచిత్రాలలో నటించారు. భోజపురి చలనచిత్ర రంగానికి ఆరా హాలీవుడ్ వంటింది.

ఫ్యాషన్

[మార్చు]

ఆరాలో జాతీయ అంతర్జాతీయ బ్రాండులకు చెందిన పలు షోరూములు ప్రారంభించబడ్డాయి. ప్రజలు క్రమంగా సంప్రదాయ దుస్తుల నుండి ఆధునిక వస్త్రాలంకరణకు మారుతున్నారు. ప్రజలు అధికంగా రెడీమేడ్ దుస్తులకు అలవాటు పడుతున్నారు.

సాహిత్యం

[మార్చు]

భోజ్‌పూర్‌ సాహిత్యానికి చక్కని చరిత్ర ఉంది. మున్షి సదసుఖ్ లాల్, సయ్యద్ ఇషౌతుల్లహ్, లల్లు లాల్, సదల్ మిశ్రా వంటి వారు సాహిత్యంలో ప్రత్యేక ముద్రవేసారు. భర్తేందు శకంలో అఖౌరి యషొదనాద్ సంపాదకుడుగా ఖ్యాతి గడించాడు. శివనాథన్ షాహే జీవితకథల రచనకు పేరు గడించాడు. జితేంద్ర కిషోర్ జైన్ ప్రముఖ నవలారచయితగా ప్రసిద్ధి చెందాడు. ద్వివేది శకంలో మహామహోపాద్యాయ్ పండిత్ సకల్ నారాయణ్ శర్మా, పండిత్ రాందహిన్ మిశ్రా మొదలైన వారు పద్యరచనకు ప్రసిద్ధి చెందారు. ఆచార్య శివపూజన్ సహాయ్ గొప్ప కథారచయిత, నవలా రచయిత, వ్యాసరచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఈ ప్రాంతానికి చెందిన వాడే. చాయావాడి శకంలో కేదార్నాథ్ మిశ్రా ప్రభాత్, రాందయాళ్ పాండే, కలెక్టర్ సింగ్ కేసరి, నంద్‌కిషోర్, తివారి, రామనాథ్ పాఠక్ ప్రణయె, ప్రొఫెసర్ . సర్వదేవ్ తివారి రాకేష్ (రాజేష్) కవితలకు ఖ్యాతి చెందారు. మొదటి భోజపురి మహాకావ్యంగా పేరు పొందిన " కల్జయి కుంవర్ సింగ్ "ను ప్రొఫెసర్ సర్వదేవ్ తివారి రాకేష్ రచించాడు. సాహిత్య ప్రపంచంలో ప్రొఫెసర్ మిథిలేశ్వర్ జాతీయ, పలు అంతర్జాతీయ అవార్డులను పొందాడు.

పర్యాటకం

[మార్చు]

సూర్యదేవాలయం

[మార్చు]

బేపూర్ వద్ద ప్రముఖ సూర్యదేవాలయం ఉంది. దీనిని మునిరాజా సూర్య మందిర్ అని కూడా అంటారు. దీపావళికి 5వ రోజున జరిగే చాత్ పూజ సమయంలో జిల్లా పరిసరాల నుండి పలువురు సూర్యదేవుని ఆరాధించడానికి వస్తుంటారు.

బుధియామాయి

[మార్చు]

బుధియా మాయి ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం ఎక్వారి గ్రామంలో ఉంది. ఈ ఆలయదర్శనానికి ప్రతిరోజూ వేలాది భక్తులు వస్తుంటారు. ఆలయ సమీపంలో మసీదు ఉంది. మతసమైక్యతకు ఇది చిహ్నంగా ఉంది.

గుండి గ్రామం

[మార్చు]

ప్రపంచ ప్రసిద్ధ " అవధూత్ భగవాన్ రాం " (సర్కార్ బాబా లేక భగవాన్ రాం ) స్వస్థలం గుండి గ్రామం.భగవాన్ రాం 1937లో గుండి గ్రామంలో జన్మించాడు. తరువాత ఆయన 7 సంవత్సరాల వయసులో బాబా కీనారాం స్థల్ (వేయిసంవత్సరాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక కేంద్రం, అఘార్ సెక్ట్ ప్రధానకార్యాలం) కు మారాడు.

దేవ్

[మార్చు]

తరారి మండలంలోని దేవ్ గ్రామంలో ఉన్న వద్ద ఉన్న సూర్యదేవాలయంలో పలు ఇతర దేవతా విగ్రహాలతో సూర్యభగవానుని విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. ఈ విగ్రహాలు 14వ శతాబ్దం దానికంటే ముందు కాలానికి చెందినవని భావిస్తున్నారు. వాస్థవానికి పురాతన దేవ్ ఆలయం భోజ్‌పూర్ జిల్లాలో ఉండేది కాదు. దేవ్ గ్రామం, ఆలయం ఔరంగాబాద్ జిల్లాలో ఉండేవి.

వీర్ కుంవర్ సింగ్ కిలా

[మార్చు]

వీర్ కుంవర్ సింగ్ కిలా జగదీష్‌పూర్‌లో ఉంది. గొప్ప వీరుడు వీర్ కుంవర్ సింగ్ (1857) కోట ఇప్పటికీ జహదీష్ పూర్‌లో ఉంది. కుంవర్ సింగ్ కిలా తన మరణాంతం వరకు స్వాతంత్ర్యం కొరకు పోరాడాడు.

ప్రాచీన సోమనాథ్ ఆలయం

[మార్చు]

ప్రాచీన సోమనాథ్ ఆలయం హెతంపూర్ వద్ద ఉంది. దీని ప్రస్తావన శివపురాణంలో ఉంది. ఆలయప్రంగణంలో పవిత్రమైన కొలను ఉంది. ఈ ఆలయంలో వార్షికంగా మేళా నిర్వహించబడుతుంది. ఇది అత్యంత అధికంగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.

మహారాజ కాలేజ్

[మార్చు]

మహారాజ కాలేజ్ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఇక్కడ ఉన్న టన్నెల్ జగదీష్‌పూర్‌లో ఉన్న కుంవర్ కోటకు దారితీస్తుందని విశ్వసిస్తున్నారు.

అరణ్యదేవి

[మార్చు]

అరణ్యదేవి ఆలయం (వనదేవత ఆలయం) ఆరా నగర గ్రామదేవత. ఇక్కడ ఆదిశక్తి శిల్పం ఉంది. ఆదిశక్తి శిల్పాన్ని పాండవులు ప్రతిష్ఠించారని భావిస్తున్నారు. ఆలయం చాలా పురాతనమైనది. ఆలయానికి అనేక మంది భక్తులు వస్తుంటారు.

  • షహ్పూర్‌లో ఉన్న నితేష్ పాండే బగీచాలో ఉన్న ఘర్భర్ని మా మందిరం కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.

మా కాళి మందిరం

[మార్చు]

మా కాళి మందిరం ఆరా నగరానికి 15 కి.మీ దూరంలో బఖొరాపూర్ వద్ద ఉంది. భరతదేశంలోని పురాతన మందిరాలలో ఒకటైన ఈ ఆలయం చాలా విశాలంగా ఉంది. ఆలయ సమీపంలో ఎత్తైన కాళీమాత శిల్పం ఉంది. ఈ ఆలయం గంగాతీరంలో ఉంది. ప్రధాన ఆలయం గ్రానైట్ రాళ్ళతో నిర్మించనడి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం చలనచిత్ర షూటింగులు అధికంగా జరుగుతున్నాయి.

చతుర్విజ్ నారాయణ్ మందిరం

[మార్చు]

చతుర్విజ్ నారాయణ్ మందిరం :- అతిపురాతనమైన ఈ ఆలయ ప్రధాన దైవాలు లక్ష్మీ - నారాయణులు. ఇది పిరో మండలంలోని చతుర్విజ్ గ్రామంలో ఉంది.

భవాని మందిరం

[మార్చు]

భవానీ మందిర్ ఛతుర్వుజ్ భరవొన్ - 13 వ శతాబ్దం విగ్రహం. ఈ ఆలయ ఉత్తమ వాస్తు నిర్మాణం కలిగి ఉంది.

మా కాళీ మందిర్

[మార్చు]

మా కాళీ మందిర్ భోజ్‌పూర్‌లో బబుబంధ్ చర్పొఖరి వద్ద ఉన్న విభిన్నమైన ఈ ఆలయం చాలా ప్రసిద్ధ చెందింది.

గధ్ కాళి మందిరం

[మార్చు]

గద్ కాళి మందిరం గర్హని తాలూకాలో ఉంది. గర్హని ఆరా రైల్వేస్టేషను‌కు 20 కి.మీ. దూరంలో ఉంది. చెరో కాలంలో నిర్మించబడిన ఈ ఆలయానికి 2009-10 లలో పునరుద్ధరణ పనులు చేపట్టబడ్డాయి.

జగదాంబ మందిరం

[మార్చు]

జగదాంబ మందిరంలో పురాతనమైన జగదాంబ శిల్పం ఉంది. ఇది చార్పొఖరి మండలంలోని ముకుందపూర్ గ్రామంలో ఉంది.

పర్స్వనాథ్ మందిరం

[మార్చు]

పర్స్వనాథ్ మందిరం జైన మందిరం మాసద్ గ్రామంలో ఉంది.

మహామాయా మందిరం

[మార్చు]

మహామాయా మందిరం ఏక్వారి గ్రామంలో ఉంది. ఈ ఆలయం మొగల్ కాలంలో నిర్మించబడింది.

మహాతిన్ మాయి మందిరం

[మార్చు]

మహాతిన్ మాయి మందిరం భిహియా వద్ద ఉంది. ఈ ఆలయానికి మహిళలు అధికంగా వస్తుంటారు.

జైన్ సిధంత్ భవన్

[మార్చు]

జైన్ సిధంత్ భవన్ గ్రంథాలయంలో జైనిజం సంబంధిత గ్రంథాలు అనేకం ఉన్నాయి. ఇది ఇటువంటి గ్రంథాలయం ఆసియాలో ఇది ఒక్కటేనని ప్రత్యేకత సంతరించుకుంది.

పైహరి జీ కా ఆశ్రమం

[మార్చు]

పైహరి జీ కా ఆశ్రమం సహర్ మండలంలోని ధర్మపూర్ గ్రామంలో ఉంది.

బాబా దెనేశ్వర్నాథ్ ధాం

[మార్చు]

బాబా దెనేశ్వర్నాథ్ ధాం ఆరా రైల్వే స్టేషను‌కు 14 కి.మీ దూరంలో కోయిల్వార్ రైల్వే స్టేషను‌కు 0.5 కి.మీ దూరంలో ఉంది.

మాతా కొయిలేశ్వరి మా

[మార్చు]

మాతా కొయిలేశ్వరి మా కోయిల్వార్ కు 0.6 కి.మీ దూరంలో ఉంది.

హనుమాన్ మందిరం

[మార్చు]

హనుమాన్ మందిరం మతియారా, కయమ్నగర్ సమీపంలో ఆరా రైల్వే స్టేషను‌కు 9 కి.మీ దూరంలో ఉంది.

లాకర్ సాహ్ కి మజార్

[మార్చు]

లాకర్ సాహ్ కి మజార్ :- ఇది ప్రాంతీయ ముస్లిం సన్యాసి మజార్ (మౌసోలియం).

కుర్వా శివ్

[మార్చు]

కుర్వా శివ్ షహపుర్ - బిలోటి రోడ్డులో ఉంది. ఇక్కడ బంసర్‌కు చెందిన పలు శిల్పాలు ఉన్నాయి.

వెంకటేష్ మందిరం

[మార్చు]

వెంకటేష్ మందిరం పర్హాప్ గ్రామంలో ఉంది. ఇకాడ దక్షిణ భారతసైలికి చెందిన శిల్పం ఉంది.

బబా యోగేశ్వర ధాం

[మార్చు]

బబా యోగేశ్వర ధాం శివాలయం జగదీష్‌పూర్ వద్ద ఉంది. ఈ ఆలయాన్ని మహర్షి యాగ్యవల్ఖ్య పర్యవేక్షణలో శ్రికృష్ణుడు నిర్మించాడని భావిస్తున్నారు. జగదీష్‌పూర్‌లో ప్రఖ్యాతి చెందిన హనుమాన్ మందిరం కుడా ఉంది.

జదీశ్వర్ శివ మందిరం

[మార్చు]

జదీశ్వర్ శివ మందిరం పరమేశ్వరుని మదిరం. ఇది పిరో ఉపవిభాగంలోని మిల్కి (ఖుతహన్ ) వద్ద ఉంది . ఢిల్లీ బిర్లా ఆలయం సమూహానికి చెందిన జగదీశ్ గిరి ఈ ఆలయాన్ని నిర్మించాడు.

సాహి జమా మసీదు

[మార్చు]
  • సాహి జమా మసీదు గర్హానీ బజార్ వద్ద ఉంది. 2013 లో ఇక్కడ పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి.
  • ది గ్రేట్ జమా మసీదు భౌలానా గ్రామంలో ఉంది. 2013 లో ఇక్కడ పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి..

కొన్ని వివరణలు

[మార్చు]
  • 'జనాభా: మొత్తం' : 1.792.771 'గ్రామీణ' : 1.557.287 'అర్బన్' : 235.484
  • 'ఉపవిభాగాలు' : అరా సదర్, జంషెడ్పూర్, పిరో ( భోజ్) కోయిల్వార్
  • 'మండలాలు' : అరా సదర్, ఉద్వంత్నగర్, జంషెడ్పూర్, కోయిల్వార్, సహార్, బర్హర, సందేశ్, షాపూర్, చార్పొఖరి, పిరొ, తరారి, బిహియ, అగియావన్, గర్హని
  • 'వ్యవసాయం' : రిచ్ వరి పొలాలు, గోధుమ, మొక్కజొన్న, బెంగాల్ గ్రామ్, గ్రెయిన్
  • 'ఇండస్ట్రీ' : రైస్, ఆటోమొబైల్స్, బట్టలు, ఆయిల్ మిల్స్.
  • 'నదులు' : గంగ, సోన్.
  • 'హోటల్' : పార్క్ వ్యూ హోటల్, హోటల్ ది రీగల్.
  • 'వీర్ కున్వర్ సింగ్ విశ్వవిద్యాలయం.

కాలేజీలు

[మార్చు]

మహారాజా కళాశాల, జగ్జీవన్ కాలేజ్, జైన్ కళాశాల, సహ్జనంద్ బ్రహమర్షి కాలేజ్, బి.ఎస్.ఎస్.కాలేజ్, బచ్రి పిరొ సంజయ్ మహాత్మా గాంధీ మహావిద్యాలయ, అరా, మా మైత్ర్యైనీ యోగిని సీనియర్ సెకండరీ స్కూల్-గుండి, మహంత్ మహాదెవనంద్ మహిళా మహావిద్యాలయ, అరా, డాక్టర్ కె.కె మండల (జంషెడ్పూర్), సెయింట్ బరహ్న మహిళా కళాశాల (జంషెడ్పూర్) ఎస్.ట్.ఎస్.ఎం కాలేజ్, పన్వరి టిసిం కాలేజ్, అరా

పాఠశాలలు

[మార్చు]
  • 'స్కూల్' : కాథలిక్ స్కూల్, హెచ్.ఎన్.కె హై స్కూల్, హెచ్.పి.డి జైన్ పాఠశాల, డి.ఏ.వి పబ్లిక్ స్కూల్, డి.కె. కార్మెల్ రెసిదెంచీల్ హై హై స్కూల్, జీన్ పాల్ హై స్కూల్, హెచ్.కె. జైన్ గ్యాన్ అస్తలి, బలరాం భగత్ హై స్కూల్, స్కూల్ కృష్ణ బాగ్ బాభ్నౌలి (కొయిల్వర్ పోలీసు స్టేషను) "శాంతి స్మృతి" సంభావన రెసిడెన్సియల్ ఉన్నత పాఠశాల, మఝయుయా, ఆరా, శ్రీ సాయి ఇంటర్నేషనల్ స్కూల్ ఆనంద్ నగర్ ఆరా, మౌని బాబా హై స్కూల్, బాఘి, శ్రీ సాయి ఇంటర్నేషనల్ హై స్కూల్, మహావీర్ తోలా ఆరా, హై స్కూల్ గజియాపూర్ 1949

మసీదు

[మార్చు]

బాది మసీదు (ఆరా)

ఇమాంబద

[మార్చు]

ఆరా నుండి 35 కి.మీ దూరంలో ఉన్న తిక్తి గ్రామంలో ఇమాంబద, కర్బల ఉన్నాయి.

ఆలయాలు

[మార్చు]

మా మహ్తిన్ మాయి మందిరం, బిహియా, అరన్య దేవి ఆలయం, సూర్యమందిరం, బేలూర్, కుంద్వా శివ్ మందిరం, గోశైనపూర్, సోమనాథ్ ఆలయం (హెతంపూర్)

చరిత్రాత్మక ప్రాంతాలు

[మార్చు]
  • ఆరా గంగా తీరంలో కిషన్ గర్ :- ఇక్కడ 500 సంవత్సరాల శివాలయం ఉంది.
  • మా కాళీ ఆలయం :- ఆరాకు 15 కి.మీ దూరంలో ఉన్న బఖొరాపూర్ వద్ద ఉంది. బృహత్తరమైన ఈ అలయం భారతదేశంలో ఉన్న పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయ సమీపంలో ఎత్తైన కాళీ విగ్రహం ఉంది. ఈ ఆలయం గంగాతీరంలో ఉంది. ఈ ఆలయం గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడింది.
  • బాబా దినేశ్వర్ నాథ్ ధాం :- ఇది ఆరాకు 16 కి.మీ దూరంలో కోయిల్వార్ సమీపంలో ఉంది. ఆలయప్రధాన దైవం శివుడు. ఈ ఆలయం సోనే నదీతీరంలో ఉంది.
  • జగదీశ్వర్ మందిర్ :- ఆరాకు 40 కి.మీ దూరంలో మిల్కి వద్ద ఉంది.
  • జిల్లాకేంద్రానికి 20 కి.మీ దూరంలో భర్తియార్ వద్ద సందేష్ పోలీస్ స్టేషను వద్ద పురాతన శివాలయం ఉంది.
  • ఆరాకు 60 కి.మీ దూరంలో ధర్మపురా వద్ద శివాలయం ఉంది.

మా కాళి ఆలయం

[మార్చు]

మా కాళి ఆలయం ప్రాంతీయ, అంతర్జాతీయ కళలకు నిలయంగా ఉంది. ఇది ఆరా నగరానికి 10 కి.మీ దూరంలో గంగా తీరంలో ఉంది.

హరిగావ్ గ్రామం

[మార్చు]

హరిగావ్ గ్రామం స్వతత్రానుకి ముందు మొరీషియస్ ప్రధానమంత్రికి స్వగ్రామంగా గుర్తించబడుతుంది. ఇది ఆరా నగరానికి 14 కి.మీ దూరంలో ఉంది.

గ్రామాలు

[మార్చు]

భోజ్పూర్ జిల్లా గ్రామాలు, పట్టణాల

  • రాంనగర్ (కుంజంతొల)
  • బెలౌర్
  • అగీవన్ బజార్
  • ఆహిలె
  • బంధవన్
  • బన్షిపుర్, అర్రఅ
  • హెతంపుర్ బీహార్, భారతదేశం
  • బర్గఒన్
  • చసి-భనౌలి
  • ధంచ్హుహన్
  • ఏక్వరి
  • సితుహరి
  • కొఇల్వర్
  • కుర్మిచక్
  • ఖైర్హన్
  • ఖెది
  • లక్షంపుర్
  • నిర్భయ డిహ్ర
  • పీనీ
  • జొబ్రదిహ్
  • ఇమద్పుర్
  • చౌరి
  • అంధారి
  • బిరంపూర

మూలాలు

[మార్చు]
  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 11 December 2009. Archived from the original on 27 అక్టోబరు 2011. Retrieved 17 September 2011.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 11 October 2011.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 1 డిసెంబరు 2015. Retrieved 11 October 2011. Cornwall Island2,358km2
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Kuwait 2,595,62
  7. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. Nevada 2,700,551
  8. M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 30 September 2011.

బయటి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]