సీతామఢీ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతామఢీ జిల్లా
బీహార్ పటంలో సీతామఢీ జిల్లా స్థానం
బీహార్ పటంలో సీతామఢీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుTirhut
ముఖ్య పట్టణంSitamarhi
Government
 • లోకసభ నియోజకవర్గాలుసీతామఢీ
 • శాసనసభ నియోజకవర్గాలుRiga, Bathnala, Parihar, Sursand, Bajpatti, Sitamarhi, Runnisaidpur, Belsand
విస్తీర్ణం
 • మొత్తం2,294 కి.మీ2 (886 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం34,19,622
 • జనసాంద్రత1,500/కి.మీ2 (3,900/చ. మై.)
 • Urban
5.71 %
జనాభా వివరాలు
 • అక్షరాస్యత53.53 %
 • లింగ నిష్పత్తి899
ప్రధాన రహదార్లుNH 104
సగటు వార్షిక వర్షపాతం1200 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
జానకి కుండ్, సీతామర్హి

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో సీతామఢీ జిల్లా ఒకటి. సీతామఢీ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. సీతామఢీ జిల్లా తిరుహట్ డివిజన్‌లో భాగం.ఇది నేపాల్ సరిహద్దులో ఉంది..

చరిత్ర

[మార్చు]

సీతామర్షి జీతాదేవి జన్మించిన ప్రదేశమని విశ్వసిస్తున్నారు. జితామర్హి పట్టణంలో సీతాదేవి ఆలయం ఉంది. . [1] సీతామర్షి వద్ద మౌర్యుల కాలం నాటి శిలాలయం ఒకటి ఉంది.[2]

1875లో ముజాఫర్ జిల్లాలో సీతామఢీని ఉప జిల్లాగా చేసారు.[3] 1972లో సీతామఢీకి పూర్తి స్థాయి జిల్లా అంతస్తు ఇవ్వబడింది.[4] ఈ జిల్లా బిహార్ రాష్ట్ర ఉత్తర భాగంలో ఉంది. ధుంరా పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ఇది సీతామఢీకి 5 కి.మీ దూరంలో ఉంది. 1972]] లో ముజాఫర్ జిల్లా నుండి వేరుచేసి సీతామఢీకి పూర్తి స్థాయి జిల్లా అంతస్తు ఇవ్వబడింది..[5] 1994లో సీతామహి జిల్లా నుండి షెయోహర్ జిల్లాను రూపొందించారు..[5] ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్లో భాగం.[6] సీతామఢీలో హర్పురా గ్రామంలో " హజరత్ దత్తా షాహ్ రహముతుల్లా అలైహి " సమాధి ఉంది.

పురాణ కథనం

[మార్చు]

ఈ ప్రాంతంలో జనకుడు ఇంద్రుని ప్రీత్యర్ధం భూమిని త్రవ్వుతున్న సమయంలో సీదేవి భూమిలో నుండి ప్రత్యక్షమైందని పురాణకథనాలు వివరిస్తున్నాయి.

యాత్ర

[మార్చు]

ప్రస్తుతం సీతామఢీ ప్రముఖయాత్రా స్థలంగా మారింది. సప్రదాయం, మిథాలజీ సమ్మిళితమైన సుందర ప్రాంతం ఇది. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ ప్రదేశం హిందువులకు ప్రధాన యాత్రాగమ్యంగా ఉంది. ఇది అత్యంత సుందరంగా సంప్రదాయం, వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచింది. ఇక్కడ ఉన్న అద్భుతమైన ఆకర్షణ యాత్రీకులను మంత్రముగ్ధులను చేస్తుంది. సీతామఢీలో పురాతన సంప్రదాయం సమకాలీన ఆధునిక జీవనదరళి కలిసి అడుగులు వేస్తున్నాయి.

ఆలయాలు

[మార్చు]

జిల్లా అంతటా ఉన్న అందమైన ఆలయాలతో కాంతి ధర్మల్ పవర్ స్టేషను, దర్భంగా, రాక్సుయల్, అరెరాజ్, మోతీహరి వంటి ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి. జిల్లా ప్రకృతి సౌందర్యం, అనమైన నిర్మాణాలు పవిత్రమైన ఆలయాలు వైవిధ్యమైన ఆకర్షణలతో యాత్రీకులకు విహారయాత్రానుభవన్ని కలిగిస్తూ తిరిగి తిరిగి సందర్శించేలా చేస్తుంది.

భౌగోళికం

[మార్చు]

సీతామఢీ జిల్లా 2294 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది.[7] ఇది ఆస్ట్రేలియా లోని గ్రూట్ ఐలాండ్ వైశాల్యానికి సమానం.[8] సీతామఢీ అక్షాంశ స్థానం: 26.6° ఉత్తరం 85.48.° తూర్పు ఇది సరాసరిన 56 మీటర్ల ఎత్తున అనగా 183 అడుగుల ఎత్తు కలిగివున్నది. ఈ జిల్లాలో బాగ్మతి, అఘ్ వారా, లఖండై, (లక్ష్మణ రేఖ) మనుస్మర, అనే నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి గాక చిన్న వాగులు కూడా ఉన్నాయి. ఈ జిల్లా ఉత్తర సరిహద్దు ప్రాంతము హిమాలయాపర్వతాల చెంత వరకు వ్యాపించియున్నది. ఉత్తరం నుండి దక్షిణాదికి పోను పోను ఎత్తు కలిగి మైదాన ప్రదేశము కలిగి ఉంది. ఈ భూమి పంటలకు అనువైనది. ఇక్కడ భూగర్భ జలము ఎక్కువగా నున్నందున నీటికి కొదువ లేదు.

నదులు

[మార్చు]

జిల్లాలో బగ్మతి, లఖందేవి నదులు ప్రవహిస్తున్నాయి.

ఉపవిభాగాలు

[మార్చు]

సీతామఢీ జిల్లా మూడు సబ్ డివిజన్లుగా విభజింప బడివున్నది :- అవి. సీతామఢీ సాదర్, బెల్ సాండ్, పుప్రి.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సీతామఢీ జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[9]

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

సీతామఢీ రాష్ట్రం, వెలుపల ప్రాంతాలు అన్నింటితో రహదారి, రైలు మార్గాలతో చక్కగా అనుసంధానమై ఉంది.

రహదారి మార్గం

[మార్చు]
  • జాతీయరహదారి 77 - జిల్లాను ముజాఫర్పూర్ జిల్లా, పాట్నా లతో కలుపుతుంది.
  • జాతీయరహదారి 104 :- దర్భంగా వద్ద ఉంది.
  • రాష్ట్రీయ రహదారి :- జిల్లాను మధుబని (తూర్పు) నుండి షెయోహర్ (పశ్చిమ) కలుపుతుంది.

రైలుమార్గం

[మార్చు]
  • నర్కతిగంజ్ రైలుమార్గం :- ఇది జిల్లాలో అతిపెద్ద రైల్వేస్టేషను.
  • బ్రాడ్ గేజ్ రైల్వే :- ముజాఫర్పూర్, సీతామఢీ మద్య నడుస్తుంది. ఇక్కడ నుండి కొలకత్తా, ఢిల్లీ, వారణాసి, హైదరాబాదు]], కాంపూర్ లకు నేరు రైళ్ళు లభ్యం ఔతాయి.
  • రైలు మార్గం :- జిల్లాను తూర్పున దర్భంగా, పశ్చిమమున రాక్సుల్ లను కలుపుతుంది. దక్షిణమున ముజాఫర్పూర్ లను కలుపుతుంది.
  • రాక్సుల్ దర్భంగా రైలు మార్గంలో సీతామఢీ స్టేషను ఉంది.
  • సీతామఢీ రైలు మార్గాలతో పలు భారతీయ ప్రధానపట్టణాలతో అనుసంధానమై ఉంది.
  • జిల్లాలో రైలు మార్గాల నిర్మాణం, అదనపు రైళ్ళు నడపడానికి శీఘ్రగతిలో పనులు జరుగుతున్నాయి.
  • పవిత్రమైన సీతామఢీ పట్టణాన్ని దేశంలోని ఏమూల నుండైనా చేరుకోవడానికి అవసరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

వాయుమార్గం

[మార్చు]
  • జిల్లాకు సమీపంలో ఉన్న విమానాశ్రయం :- " జైప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం " . ఇది సితామర్హి పట్టణానికి 120 కి.మీ దూరంలో ఉంది.
  • ఇది ఢిల్లీ అంతర్జాతీయ విమాశ్రయం మంటి వాటితో చక్కగా అనుసంధానమై ఉంది. విమానాశ్రయం నుండి సీతామఢీకి టాక్సీలు సులువుగా లభ్యం ఔతుంటాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,419,622,[10]
ఇది దాదాపు. పనామా దేశ జనసంఖ్యకు సమానం.[11]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[12]
640 భారతదేశ జిల్లాలలో. 96 వ స్థానంలో ఉంది.[10]
1చ.కి.మీ జనసాంద్రత. 1491[10]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 27.47%.[10]
స్త్రీ పురుష నిష్పత్తి. 899:1000 [10]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 53.53%.[10]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ప్రముఖులు

[మార్చు]
  • ఠాకూర్ జుగల్ కిషోర్ సిన్హా {మాజి ఎం.పి., స్వాతంత్ర్య సమర యోథుడు.
  • రాందులారి సిన్హా :-మాజీ కేంద్ర మంత్రి., మాజీ గవర్నర్, స్వాతంత్ర్య సమర యోధుడు

మూలాలు

[మార్చు]
  1. Chakrabarti, Dilip K (2001). Archaeological Geography of the Ganga Plain: The Lower and the Middle Ganga. New Delhi: Orient Blacksawn. p. 207. ISBN 9788178240169. Retrieved 20 March 2013.
  2. Sen, S N (1999). Ancient Indian History And Civilization. New Age International. p. 166. ISBN 9788122411980. Retrieved 20 March 2013.
  3. Official Website of the District and Civil Court of Sitmahri Archived 2010-05-25 at the Wayback Machine, Retrieved May 26, 2010
  4. District Health Action Plan Archived 2011-11-25 at the Wayback Machine, National Rural Health Mission, Government of బీహార్, Retrieved May 25, 2010
  5. 5.0 5.1 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  6. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  7. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  8. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Groote Eylandt 2,285km2
  9. Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  11. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Panama 3,460,462 July 2011 est.
  12. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Connecticut 3,574,097

బయటి లింకులు

[మార్చు]