Jump to content

పనామా

వికీపీడియా నుండి
పనామా గణతంత్రం

República de Panamá  (Spanish)
Flag of పనామా
జండా
Coat of arms of పనామా
Coat of arms
నినాదం: "Pro Mundi Beneficio"  మూస:La icon
"For the Benefit of the World"
గీతం: 
Location of పనామా
రాజధానిPanama City
అధికార భాషలుSpanish
జాతులు
Amerindian and mestizo 70%
Indian 14%
White 10%
Amerindian 6%
పిలుచువిధంPanamanian
ప్రభుత్వంUnitary presidential constitutional republic
• President
Ricardo Martinelli
Juan Carlos Varela
శాసనవ్యవస్థNational Assembly
Independence
• from Spain
November 28, 1821
• from Colombia
November 3, 1903
విస్తీర్ణం
• మొత్తం
75,517 కి.మీ2 (29,157 చ. మై.) (118th)
• నీరు (%)
2.9
జనాభా
• May 2010 census
3,405,813
• జనసాంద్రత
44.5/చ.కి. (115.3/చ.మై.) (156th)
GDP (PPP)2012 estimate
• Total
$55.124 billion[1]
• Per capita
$15,082.00[1]
GDP (nominal)2011 estimate
• Total
$30.569 billion[1]
• Per capita
$8,514[1]
జినీ (2009)52[2]
Error: Invalid Gini value
హెచ్‌డిఐ (2011)Increase 0.768[3]
Error: Invalid HDI value · 58th
ద్రవ్యంBalboa, U.S. dollar (PAB, USD)
కాల విభాగంUTC−5 (EST)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+507
Internet TLD.pa

పనామా (/ˈpænəmɑː/ PAN-ə-mah; స్పానిష్: [Panamá] Error: {{Lang}}: text has italic markup (help)), అధికారికంగా పనామా గణతంత్రం (స్పానిష్: [República de Panamá] Error: {{Lang}}: text has italic markup (help) [reˈpuβlika ðe panaˈma]), మధ్య అమెరికాలోని దేశం. ఇది దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాలను కలుపుతున్న సన్నని భూభాగం. దీనికి కోస్టారికా, కొలంబియా సరిహద్దు దేశాలు. ఈ దేశపు రాజధాని పనామా నగరం. ఈ ప్రాంతంలో స్పానిష్ 16వ శతాబ్దం నుండి నివసించగా, 1821 సంవత్సరంలో స్పెయిన్ దేశంతో సంబంధాలు త్రెంచుకొని గ్రాన్ కొలంబియా గణతంత్రం సమాజంలో చేరింది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఆర్మీ ఇంజనీర్లు 1904, 1914 మధ్య కాలంలో పనామా కాలువను నిర్మించారు. 1977 లో కీలకమైన ఈ కాలువను పూర్తిగా పనామా దేశానికి అందజేశారు.[4] పనామా కాలువ ద్వారా లభిస్తున్న పన్ను పనామా జి.డి.పి.లో ప్రధానపాత్ర వహిస్తుంది. మద్య అమెరికాదేశాలలో పనామా 4వ ఆర్థికశక్తిగా,[5] అభివృద్ధి చెందుతున్న ఆర్థికరంగాలలో పనామా ఆర్థికరంగం ఒకటి. మద్య అమెరికాలో అతిపెద్ద కొనొగోలు శక్తిగా పనామా గుర్తించబడుతుంది.[6][7]2010 మానవాభివృద్ధి జాబితాలో పనామా మద్య అమెరికాలో 4వ స్థానంలో, ప్రపంచంలో 54వ స్థానంలో ఉంది.[8] 2010 గణాంకాల ఆధారంగా లాటిన్ అమెరికన్ దేశాలలో పనామా ఆర్థికరంగం ద్వీతీయస్థానంలో ఉందని గ్లోబల్ కాల్పిటీటివ్ ఇండెక్స్‌ తెలియజేస్తుంది. పనామా అరణ్యాలు పలు ఉష్ణమండల మొక్కలకు, జంతువులకు, పక్షులకు నిలయంగా ఉంది. వీటిలో కొన్ని ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. [9]

చరిత్ర

[మార్చు]

16వ శతాబ్దంలో స్పానిష్‌లు ఇక్కడకు చేరిన సమయంలో పనామా ప్రాంతంలో క్యూవాప్రజలు, గ్రాన్ కొక్లే గిరిజనులు నివసిస్తుండేవారు. యురేపియన్లతో ప్రవేశించిన అంటువ్యాధులను ఎదుకొనడానికి తగినంత రోగనిరోధక శక్తి లేనందున అంటువ్యాధుల బారినపడి వారు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయారు. [10]

కొలంబియన్ - పూర్వం కాలం

[మార్చు]
Amphibian Pendant, Walters Art Museum
Embera girl dressed for a dance

ఇస్త్మస్ ఆఫ్ పనామా 3 మిలియన్ సంవత్సరాలకు ముందుగా రూపొందింది. దక్షిణ, ఉత్తర అనెరికాల మద్య భూమార్గంలో వంతెన ఏర్పడిన తరువాత రెండు వైపులా నుండి మొక్కలు, జంతువులు క్రమంగా ఒకప్రాంతం నుండి మరొకప్రాంతానికి కదిలివెళ్ళాయి.ఇస్త్మస్ ఉనికి ప్రజలను, వ్యవసాయం, సాంకేతికతలను అమెరికన్ ఖండం అంతటా విస్తరింపజేసింది. ఆరంభకాలంలో వేట, వస్తుసేకరణ ఉపాధిగా కలిగిన ప్రజలచేత గ్రామాలు, నగరాలు రూపుదిద్దుకున్నాయి. [11][12] పనామాలో లభించిన కళావస్తువుల ఆధారంగా ఈప్రాంతంలో ఆరంభకాలంలో నివసించిన పాలియో - ఇండియన్లు నివసించారని భావిస్తున్నారు.తరువాత అమెరికాలో మట్టిపాత్రలు ఉపయోగించిన మొదటి మానవజాతులలో ఒకటి మద్య పనామాలో నివసించింది.ఉదాహరణగా మొనాగ్రిల్లో ప్రాంతంలో వికసించిన నాగరికత క్రీ.పూ 2,500 - 1700 మద్య కాలం నాటిదని భావిస్తున్నారు. ఇక్కడ వికసించిన నాగరికతలు గుర్తించతగినంతగా ప్రజాలసంఖ్య అధికరించడానికి కారణమయ్యాయి.మొనాగ్రిల్లో ప్రాంతంలో లభించిన అందమైన సమాధులు, అందమైన గ్రాంకోక్లే శైలి పాలీక్రోం కుండలు సా.శ. 500 - 900 కాలానికి చెందినవని భావిస్తున్నారు. బరిలెస్ ప్రాంతంలో (చిరిక్వి) లభించిన మొనోలితిక్ స్మారక శిల్పాలు ఇక్కడ వికసించిన పురాతన ఇస్తామియన్ నాగరికతకు చిహ్నాలుగా ఉన్నాయి.

యురేపియన్లు పనామాను చేరడానికి ముందు ఈప్రాంతంలో చిబ్చన్, చొకొయాన్, క్యూవా ప్రజలు నివసించారని భావిస్తున్నారు. వీరిలో క్యూవాప్రజలు అతిపెద్ద సంఖ్యాబలం కలిగి ఉన్నారు.యురేపియన్ కాలానీ సమయంలో అమెరికన్ స్థానికజాతి ప్రజల సంఖ్యాబలం అస్పష్టంగా ఉంది.2 మిలియన్ల అమెరికన్ స్థానికజాతి ప్రజలున్నారని భావించారు అయినప్పటికీ సమీపకాల అంచనాలు వీరి సంఖ్య దాదాపు 2 లక్షలని వివరిస్తున్నాయి.పురాతత్వ పరిశోధనలు, ఆరంభకాల యురేపియన్ అణ్వేషకుల సాక్ష్యాలు ఇక్కడ వివిధ ఇస్త్మానియన్ స్థానిక ప్రజలు నివసించారని వారు వైవిధ్యమైన సంస్కృతిని ప్రదర్శించారని ప్రాంతీయ, వాణిజ్య మార్గాలు [విడమరచి రాయాలి] నిర్మించుకుని అభివృద్ధి చెంది ఉన్నారని వివరిస్తున్నాయి.

పనామా కాలనీపాలనలోకి మారిన తరువాత స్థానికజాతి ప్రజలు అడవులకు, సమీపంలోని దీవులకు పారిపోయారు. అయినప్పటికీ అమెరికన్ స్థానికప్రజలు ఈప్రాంతంలో క్షీణించడానికి అంటువ్యాధులు ప్రధానకారణమని పరిశోధకులు భావిస్తున్నారు. యురేషియన్లలో జన్యుపరంగా ఉన్న రోగనిరోధక శక్తి అమెరికన్ స్థానికప్రజలలో లేదని పరిశోధకుల అభిప్రాయం.[13]

విజయం 1799

[మార్చు]
Vasco Núñez de Balboa, a recognized and popular figure of Panamanian history
"New Caledonia", the ill-fated Scottish Darien scheme colony in the Bay of Caledonia, west of the Gulf of Darien

1501లో బంగారం కొరకు అణ్వేసిస్తూ " రొడ్రిగొ డీ బాస్టిడాస్ " వెనుజులా నుండి పశ్చిమంగా పయనించి పనామాలోని ఇస్త్మస్ చేరుకుని మొదటి యురేపియన్‌గా గుర్తించబడ్డాడు. ఒక సంవత్సరం తరువాత " క్రిస్టోఫర్ కొలంబస్ " ఇస్త్మస్‌ను సందర్శించి డరియన్ ప్రొవింస్‌లో స్వల్పకాలం మాత్రమే నిలబడిన సెటిల్మెంటు స్థాపించాడు.అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల మద్య పయనించడానికి ఇస్త్మస్ చక్కని మార్గమని వివరించడానికి " వాస్కొ ననెజ్ డీ బాల్బొయా " ఎద్దులబండిలో కష్టతరమైన యాత్రచేసాడు.తరువాత శిఘ్రగతిలో న్యూ వరల్డ్‌లో పనామా ప్రధానవ్యాపార మార్గంగా మారి స్పెయిన్ సామ్రాజ్యానికి ప్రధాన మార్కెట్‌గా మారింది. దక్షిణ అమెరికా నుండి బంగారం, వెండి ఇస్త్మస్ ద్వారా రవాణా చేయబడి నౌకలద్వారా తీసుకురాబడింది. ఇక్కడి నుండి స్పెయిన్ తరఫున విదేశాలకు నౌకలద్వారా పంపబడింది. ఈ మార్గాన్ని కామినో రియల్ లేక రాయల్ రోడ్ గా పిలువబడింది. అయినప్పటికీ దీనిని అతిసాధారణంగా కామినో డీ క్రూసెస్ అని పిలిచేవారు.మార్గమద్యంలో పలు శ్మశాననగరాలు ఉండడమే ఇందుకు కారణం.

స్పానిష్ పాలన

[మార్చు]

పనామా స్పానిష్ పాలనలో 300 సంవత్సరాలు (1538 - 1821) ఉంది.దక్షిణ అమెరికాలోని ఇతర స్పానిష్ ప్రాంతాలతో పనామా కూడా " వైశ్రాయిటీ ఆఫ్ పెరూ "లో భాగంగా ఉంది.పనామియన్ గుర్తింపు " గియోగ్రాఫిక్ డిస్టినీ " (భైగోళిక గమ్యం) మీద ఆధారపడి ఉంటుంది. పనామా అదృష్టం భౌగోళికంగా మారుతున్న ఇస్త్మస్ ప్రాధాన్యత మీద ఆధారపడి ఉంటుంది.కాలనీ పాలన అత్యధికంగా అంతస్తుల తారతమ్యాలున్న పనామా వాసులను వర్గబేధాలకు అతీతంగా జాతీయభావాలతో సమైక్యం చేసింది.జాతీయవాదం అంతర్గత వైషమ్యాలను సమసిపోయేలా చేసింది.[ఆధారం చూపాలి]1538లో పెరూను జయించడానికి ముందు నికరాగ్వా నుండి కేప్ హార్న్ జ్యూరిడిక్షన్‌లో రియల్ ఆడియంసియా డీ పనామా స్థాపించబడింది. రియల్ ఆడియంసియా డీ (రాయల్ ఆడియంసియా) అనేది అప్పిల్ కోర్టుగా పనిచేసే జ్యుడీషియల్ డిస్ట్రిక్. ఒక్కొక ఆడియంసియా ఒక ఒయిడర్ (స్పానిష్ న్యాయమూర్తి) ఉంటాడు.

పనామాలోని అధికభాగం స్వల్పమైన స్పానిష్ ఆధీనంలో ఉండేది. చాలాభూభాగం కాలానీశకం చివరి వరకు విజయాన్ని, మిషనైజేషన్‌ను అడ్డుకుంది.స్థానిక ప్రజలు అధికంగా ఉన్నందున ఈప్రాంతం " ఇండియోస్ డీ గుయేరా " (వార్ ఇండియోస్) అని పేర్కొనబడింది. అయినప్పటికీ స్పెయిన్‌కు పానామా అత్యంత ప్రధానప్రాంతం అయింది.పెరూ నుండి త్రవ్వి తీయబడుతున్న వెండిని తరలించడానికి పనామా అనుకూలమైన మార్గంగా ఉండడమే ప్రాధాన్యతకు ముఖ్యకారణం.సిల్వర్ కార్గోలు పనామాలో నిలిచి అక్కడి నుండి పోర్టోబెల్లో, నొంబ్రే నౌకాశ్రయాల ద్వారా ఇతరప్రాంతాలకు తరలించబడుతూ ఉండేది.

పూర్తిగా స్పానిష్ నియంత్రణలో లేని పనామా మార్గం సముద్రపు దొంగల (అధికంగా డచ్, ఇంగ్లీష్), న్యూ వరల్డ్ ఆఫ్రికన్లు (సింరాన్ ప్రజలు) దాడికి గురైయ్యే అవకాశాలు మెండుగా ఉండేవి. న్యూ వరల్డ్ ఆఫ్రికన్లు తమకు తాము బానిసత్వం నుండి విముక్తులై పనామా లోతట్టు ప్రాంతమైన " కామినో రియల్ " ప్రాంతం, పసిఫిక్ సముద్రంలోని కొన్ని ద్వీపాలలో సమూహాలుగా జీవించసాగారు. వీరిలో ప్రాముఖ్యత కలిగిన సమూహం చిన్న బెయానో రాజ్యంగా (1552 - 1558) రూపొందింది.పనామా మీద దాడులు చేసిన " ఫ్రాంసిస్ డ్రేక్ " (1572-1573), " జాన్ ఆక్సెంహాం" లకు పసిఫిక్ మహాసముద్రం దాటుతున్న సమయంలో సింరాన్ ప్రజలు సహాయం అందించారు. స్పానిష్ అధికారులు వారితో సంకీర్ణం చేసుకుని వారి స్వత్రాన్ని పరిరక్షిస్తామని హామీ ఇచ్చి ప్రతిగా వారి నుండి 1582లో సైనిక సహాయం అందుకున్నారు. [14] కాలానీ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈప్రాంతంలో రెండు దశాబ్ధాల కాలం (1540-1740) సుసంపన్నత నెలకొన్నది.జ్యూరిడిక్షన్‌లో భాగంగా విస్తారమైన జ్యూడిషియల్ అధారిటీ నియమితమైంది.స్పానిష్ సామ్రాజ్యం ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో పనామా కీలకమైన పాత్ర వహించింది.మొదటి శ్రేష్టమైన గ్లోబల్ సామ్రాజ్యం పానామాకు స్వయం ప్రతిపత్తి కలిగించి ప్రాంతీయ జాతీయ గుర్తింపును కలిగించింది.

వెరాగ్వా

[మార్చు]

అజుయెరా ప్రాంతంలో " ఎంకమిన్యెండా " (కప్పం తీసుకోవడం, వెట్టిచాకిరికి అనుమతి) ముగింపుకు వచ్చిన సమయంలో వెరాగ్వా విజయం ప్రకంపనలు సృష్టించింది. 1558లో " ఫ్రాంసిస్కో వజ్క్యుయెజ్ " నాయకత్వంలో వరాగ్వా కాశ్తిలియన్ పాలనలోకి మారింది. కొత్తగా జయించిన ప్రాతంలో పాత ఎంకమిన్యెండా విధానం ప్రవేశపెట్టబడింది. మరొక వైపు 1558లో స్థానికప్రజలపట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా తరచుగా నిరసనలు ఎదుర్కొంటున్న కారణంగా, పనామా స్వాతంత్ర్యోద్యమం తీవ్రం అయిన కారణంగా అజుయెరా ద్వీపకల్పంలో ఎంకమిన్యెండా రద్దు చేయబడింది.పనామా [15]

హెంరీ మొర్గాన్

[మార్చు]

1671లో హెంరీ మొర్గాన్ ఇంగ్లీష్ ప్రభుత్వ అనుమతితో నౌకామార్గంలో న్యూ వరల్డ్‌లోని అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరాలలో ద్వితీయస్థానంలో ఉన్న పనామా నగరాన్ని చేరుకుని నగరాన్ని కొల్లగొట్టి నగరానికి నిప్పంటించాడు. 1717లో ఇతర యురేపియన్ దేశాలు కరేబియన్ ప్రాంతంలోని స్పానిష్ భూభాగం స్వాధీనం చేసుకోవడానికి " న్యూ గ్రనడా వైశ్రాయిటీ " (దక్షిణ అమెరికాలోని ఉత్తరభాగం)రూపొందించబడింది. పనామాలోని ఇస్త్మస్ ఈజ్యూరిడిక్షన్లో చేర్చబడింది. న్యూగ్రనడా రాజధాని " శాంటా ఫె డీ బొగొటా "కు (ఆధునిక కొలబియా రాజధాని) సుదూరంలో ఉండడం పనామా ప్రాంతం మీద న్యూ గ్రనడా ఆధిక్యతకు ఆటంకంగా మారింది. గతంలో ఉన్న సత్సంబంధాలు, సామీప్యం, సీనియార్టీ, పనామాకు సహజంగా ఉన్న ఆసక్తి కారణంగా వైశ్రాయిటీ ఆఫ్ లిమా - పనామా కంటే బొగొటా - పనామాల మద్య సంబంధం బలహీనంగా మారింది.అసౌకర్యం కరమైన ఈసంబంధం శతాబ్ధాల కాలం కొనసాగింది.

1744లో బిషప్ " ఫ్రాంసిస్కో జేవియర్ డీ ల్యూనా డికాస్ట్రొ " కాలేజ్ ఆఫ్ ఇగ్నాషియో డీ లోయొడాను స్థాపించాడు. 1749 జూన్ 3న లా రియల్ వై పొంటిఫిసియా " యూనివర్శిడాడ్ డీ శాన్ జేవియర్ " స్థాపించాడు. స్పెయిన్ ఆధికారం ఐరోపా‌లో ఊగిసలాటలో ఉన్న కారణంగా పనామా ప్రధాన్యత, ప్రభావం తగ్గింది.సముద్రయానంలో సాంకేతికత అభివృద్ధి కొనసాగిన కారణంగా పసిఫిక్ సముద్రతీరం చేరే మార్గం సుగమం అయింది. పనామా మార్గం చిన్నదైనా ఇందుకొరకు శ్రామికుల అవసరం, వ్యయం అధికంగా ఉండేది. సరుకు ఎక్కించడం, దించడం, ఒక తీరం నుండి మరొకతీరం చేరడానికి లేడన్ ట్రెక్ అవసరం ఉండేది.అందువలన చుట్టిరావడం దూరమైనా సులువుగా మారింది.18వ శతాబ్దం ద్వితీయార్ధం, 19వ శతాబ్దం ప్రథమార్ధంలో గ్రామాలకు ప్రజలు వలసపోయిన కారణంగా పనామా, ఇస్త్మస్ నగరాల జనసంఖ్య క్షీణించింది. ఆర్థికరగం ప్రైమరీ సెక్టర్‌కు మారింది.[ఆధారం చూపాలి]

1800 స్పానిష్ - అమెరికన్ యుద్ధాలు

[మార్చు]
Santo Domingo Church

స్పానిష్ అమెరికన్ల స్వతంత్ర పోరాటం లాటిన్ అమెరికన్ దేశాలలో ప్రకంపనలు సృష్టించాయి. పనామా నగరం స్వతంత్రం కొరకు తయారౌతూ ఉంది. వారి ప్రణాళికలను " గ్రిటో విల్లా డీ లాస్ శాంటోస్ " వేగవంతం చేసాడు.1821 నవంబరు 10న అజుయెరొ ప్రొవించ్ పనామాను సంప్రదించకుండా స్పానిష్ సామ్రాజ్యం నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది. వెరాగ్వా, రాజధాని నగరాలకు ఇది అసహ్యం కలిగించింది.వెరాగస్ దీనిని తిరుగులేని రాజద్రోహంగా భావించింది. రాజధాని ఇది అసమర్ధత, అక్రమమైనదని భావించింది. అదనంగా వారు ప్రణాళికలను వేగవంతం చేయాలన్న వత్తిడికి గురైయ్యారు.అయినప్పటికి గ్రిటో సంఘటన ఇస్త్మస్ కదిలించింది. అజుయెరొ ప్రజల విరుద్ధమైన స్వంత్రపోరాటానికి ఇది ఒక సంకేతంగా భావించబడింది. అజుయెరొ ఉద్యమాన్ని రాజధాని ద్వేషించింది. పనామా నగరం వారి సహౌద్యమకారులు స్వతంత్రం కొరకు మాత్రమే స్పెయిన్ సామ్రాజ్యంతో పోరాడడమేగాక స్పెయిన్ వారు పోగానే పనామా నగరం నుండి విడివడి ప్రత్యేక దేశంగా ఉండాలని కోరుకుంటున్నారని భావించింది.

కల్నల్ " జోస్ పెడ్రొ అంటానియో డీ ఫెబ్రెగా వై డీ లాస్ క్యువాస్ " (1774 - 1841) గురించిన భయం అజుయెరొ ధైర్యంగా చేసిన ఉద్యమానికి ప్రధానకారణం అయింది. కల్నల్ దృఢమైన విశ్వాసి ఇస్త్మస్ మిలటరీ సప్లైస్ అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. వారు శీఘ్రంగా ప్రతీకారం చేస్తారని ప్రత్యేకవాదులు భయపడ్డారు.1821 అక్టోబరులో గవర్నర్ జనరల్ " జుయాన్ డీ లా క్రజ్ ముర్గియాన్ " క్విటో యుద్ధం కారణంగా ఈప్రాంతం నుండి పోతూ వరాగ్వా కల్నల్‌ను ఇంచార్జిగా నియమించిన తరువాత ప్రత్యేకవాదులు క్రమంగా ఫబ్రెగాను తమ వైపు మరల్చడానికి ప్రయత్నించారు. నవంబరు 10న ఫబ్రెగా స్వతంత్రపోరాటానికి మద్దతు తెలిపింది. లాస్ శాంటోస్ నుండి ప్రత్యేకవాదులు ప్రకటించిన తరువాత ఫబ్రెగా ఆర్గనైజేషన్లన్నింటినీ రాజధానిలో సమావేశపరిచి స్వతంత్ర పోరాటానికి తమ మద్దతు తెలియజేసింది. రాయలిస్టు బృందాలకు తెలివిగా లంచం ఇచ్చిన కారణంగా మిలటరీ చర్యలు ఏవీ చోటుచేసుకోలేదు.

కాలనీ పాలన తరువాత

[మార్చు]
U.S. President Theodore Roosevelt sitting on a steam shovel at the Panama Canal, 1906

స్వతత్రం లభించిన మొదటి 80 సంవత్సరాలు పనామా తనకు తానుగా కొలంబియాతో అనుసంధానమై (1821) కొలంబియా డిపార్టుమెంట్లలో ఒకటిగా ఉంది. ఇస్త్మస్ ప్రజలు పలుమార్లు విడిపోవడానికి ప్రయత్నించి 1831లో విజయానికి దగ్గరగా వెళ్ళారు. తిరిగి " తౌసెండ్ డే వార్స్ " (1899-1902) సమయంలో ప్రయత్నించింది. తౌసెండ్ డే వార్స్‌ను పనామా స్థానిక ప్రజలు " విక్టోరియానొ లోరెంజొ " నాయకత్వంలో జరుగుతున్న భూమిహక్కుల కొరకు చేస్తున్న పోరాటంగా అర్ధం చేసుకున్నారు.[16] యు.ఎస్. పనామా కాలువ నిర్మాణం, నియంత్రణ లక్ష్యంగా ఈప్రాంతంపట్ల ఆసక్తి కనబరిచడం కొలంబియా నుండి (1903) విడిపోయి దేశంగా స్థాపించబడడానికి దారితీసింది. 1903 జవవరి 22న " హే హెర్రన్ ట్రీటీ " కొలంబియా సెనెట్ నిరాకరించింది. తరువాత యునైటెడ్ స్టేట్స్ పనామా ప్రత్యేకవాదానికి ప్రోత్సాహమిచ్చి మద్దతు ఇవ్వాలని నిశ్చయించుకుంది.[17][18] 1903 నవంబరులో పనామా స్వతంత్రం ప్రకటించింది. [19] తరువాత పనామా, యునైటెడ్ స్టేట్స్ మద్య " హే - బునౌ - వరిల్లా ట్రీటీ " జరిగింది. ట్రీటీ యునైటెడ్ స్టేట్స్‌కు పనామా కాలువ 16 కి.మీ. (10 మై.) వెడల్పు, 80 కి.మీ. (50 మై.) పొడవు. భూభాగంలో స్వర్వహక్కులను ఇచ్చింది. యునైటెడ్ స్టేట్స్ ఆభూభాగంలో కాలువ నిర్మించి, నిర్వహించి, రక్షణ ఏర్పాట్లు చేసి శాశ్వతంగా సంరక్షించే అధికారం పొందింది.

Construction work on the Gaillard Cut of the Panama Canal, 1907

1914లో యునైటెడ్ స్టేట్స్ కాలువ నిర్మాణం పూర్తి చేసింది.1903 నుండి 1968 వరకు పనామా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని వాణిజ్యరంగ ప్రముఖుల ఆధిక్యతలో కొనసాగింది. 1950లో మిలటరీ వాణిజ్యప్రముఖుల రాజకీయ ఆధిక్యతను సవాలు చేయడం ఆరంభించింది. 1960లో పనామా " " హే - బునౌ - వరిల్లా ట్రీటీ " గురించి పునరాలోచించవలసిన వత్తిడికి గురైంది.

రోబ్లెస్ - జాంసన్ - ట్రీటీ సంప్రదింపుల మద్య పనామా ఎన్నికలు (1968) నిర్వహించబడ్డాయి. కాండిడియేట్స్:

  • డాక్టర్: అర్నుల్ఫొ అరియాస్ మాడ్రిడ్ : యూనియన్ నాసియోనల్ (నేషనల్ యూనియన్).
  • ఆంటానియో గొంజలెజ్ రెవిల్లా : పీపుల్స్ పార్టీ. (క్రిస్టియన్ డెమొక్రేట్స్)
  • ఇంజనీర్ డేవిడ్ సముడియో: అలినజా డేల్ ప్యూబ్లొ (పీపుల్స్ అలయంస్).

[20] అరియాస్ మాడ్రిడ్ విజేతగా ప్రకటించబడిన తరువాత మోసపూరితంగా ఎన్నికలు నిర్వహించారని విమర్శలు, హింసాత్మకచర్యలు చోటుచేసుకున్నాయి. 1968 అక్టోబరు 1న అరియాస్ మాడ్రిడ్ పనామా అధ్యక్షునిగా పదవీస్వీకారం చేసాడు. నేషనల్ యూనియన్ ప్రభుత్వం లంచగొండితనం ఆరోపణల కారణంగా ముగింపుకు వచ్చింది. ఒకవారం తరువాత 1968 అక్టోబరు 11న నేషనల్ గార్డ్ అరియాస్‌ను పదవీచ్యుతుని చేసింది. ఇది 1989లో యు.ఎస్. దాడికి దారితీసింది.అరియాస్ నేషన్ల్ గార్డ్ అధికారం కొనసాగడానికి హామీ ఇచ్చాడు. నేషనల్ గార్డ్ సైన్యాలను బలపరిచే ఏర్పాట్లు ఆరంభించింది. లెఫ్టినెంటు కల్నల్ " ఒమర్ టార్రిజోస్ హెర్రెరా ", " మేజర్ బొరిస్ మార్టినెజ్ "పనామా సివిల్ ప్రభుత్వం మీద సైనిక తిరుబాటుకు అదేశించడంతో పనామా రిపబ్లికన్ చరిత్రలో మొదటి సైనిక తిరుగుబాటు మొదలైంది.[20]

1970 తరువాత

[మార్చు]
Omar Torrijos (right) with farmers in the Panamanian countryside. The Torrijos government was well known for its policies of land redistribution.

ఒమర్ టారిజోస్ నియంత్రణలో ఉన్న సమయంలో మిలటరీ రాజకీయ , ఆర్ధిక నిర్మాణంలో మార్పులు తీసుకురావడానికి ప్రారంభించింది. సోషల్ సెక్యూరిటీ కొరకు బృహత్తర స్థాయిలో కృషిచేయడం విద్యాభివృద్ధి పధకాలను అమలు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టింది. 1972లో రాజ్యాంగం సవరించబడింది. రాజ్యాంగసవరణ కొరకు మిలటరీ కొత్త ఆర్గనైజేషన్ రూపొందించింది.చొర్రెగిమియెంటో అసెంబ్లీ ఆఫ్ రెప్రెజెంటేటివ్ స్థానంలో నేషనల్ అసెంబ్లీ ఏర్పాటైంది.ప్రజాశక్తిగా పేర్కొనబడిన కొత్త అసెంబ్లీలో మిలటరీ 505 సభ్యులను నియమించింది. రాజకీయ పార్టీ సభ్యులకు అసెంబ్లీలో స్థానం లభించలేదు.కొత్త రాజ్యాంగం ఒమర్ టొర్రిజోస్‌ను " మాక్సిమం లీడర్ ఆఫ్ ది పనామియన్ రివల్యూషన్ " గా ప్రకటించింది. ఒమర్ 6 సంవత్సరాలు పాలన సాగించాడు.[ఆధారం చూపాలి]అదే సమయం డెమెట్రియో బి.లేక్స్ అద్యక్షుడుగా నియమించబడ్డాడు.[20]1981 లో టొర్రిజోస్ మరణించాడు. mysterious plane crash. టొర్రిజోస్ మరణం పానామా రాజకీయ పరిణామాలను మార్చింది.1983 రాజ్యాంగసవరణల కారణంగా మిలటరీ రాజకీయపాత్ర పోషించింది.పనామా డిఫైన్ ఫోర్సెస్ పనామా రాజకీయాలలో ఆధిఖ్యత కొనసాగించారు..[ఎప్పుడు?] అదేసమయంలో జనరల్ " మాన్యుయల్ నొరియెగా " స్థిరంగా పి.డి.ఎఫ్., సివిలియన్ ప్రభుత్వం మీద ఆధిక్యత సాధించాడు..[ఎప్పుడు?]

U.S. President Jimmy Carter shakes hands with General Omar Torrijos after signing the Panama Canal Treaties.

1984లో ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థులు.

  • నికోలస్ ఆర్డియో బార్లెట్టా వల్లారినో : మిలటరీ యూనియన్ మద్దతు ఇచ్చింది.
  • డాక్టర్. అర్నుల్ఫొ అరియాస్ మాడ్రిడ్, యూనియన్‌కు వ్యతిరేకంగా.
  • ఎక్స్- జనరల్ రూబెన్ డారియో పారెడెస్: పాపులర్ నేషనల్ పార్టీ.
  • కార్లోస్ ఇవాన్ జునిగా: పాపులర్ యాక్షన్ పార్టీ.

ఎన్నికలలో బార్లెట్టా విజేతగా ప్రకటించబడ్డాడు. ఆర్డియో అధికారం చేపట్టిన సమయంలో దేశం ఆర్థికసంక్షోభంలో ఉంది. ఇంటర్నేషన మనీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ నుండి పెద్ద ఎత్తున ఋణం తీసుకొనబడింది. ఆర్థిక సంక్షోభం మద్య బార్లెట్టా దేశఋణదాతలను ప్రశాంతపరచడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు.వీధి నిరసనలు అధికమయ్యాయి.

అదేసమయం నొరియేగా అధికారంలో రహస్యంగా నేరసంబంధిత ఆదాయం పోషించబడింది. మిలటరీ, వారి సహాయకులకు అవసరమైన ఆదాయం కొరకు సమాంతరంగా వనరులు ఏర్పాటు చేయబడ్డాయి. మాదకద్రవ్యాలు, మనీలాండరింగ్ ద్వారా ఆదాయం అధికరించబడింది. మిలటరీ నియంతపాలన ముగింపుకు వచ్చే సమయానికి యునైటెడ్ స్టేట్స్‌కు వలసపోవడానికి చైనీయవలసప్రజలు పానామాకు రావడం ఆరంభించారు. చైనా అక్రమరవాణా పెద్ద వ్యాపారంగా మారి నొరియేగా పాలనకు 200 మిలియన్ల డాలర్ల ఆదాయం అందించింది.[21] ఆసమయంలో మిలటరీ నియంత పాలనకు [ఎప్పుడు?] యునైటెడ్ స్టేట్స్ నుండి సహాయం లభించింది. వంద మంది పనామియన్లు హత్య, హింసకు గురై మరొక వంద మంది పనామియన్లు బలవంతంగా దేశం నుండి వెలుపలికి పంపబడ్డారు.[22] సి.ఐ.ఎ. పర్యవేక్షణలో నొరియేగా డబుల్ రోల్ పోషించాడు. .[ఆధారం చూపాలి] మరొకవైపు కాంటడొరా బృందం [ఎవరు?] ఈ ప్రాంతంలో శాంతినెలకొల్పడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ఆరంభించాడు. నొరియేగా ఈప్రాంతంలోని నికరాగ్వా కాంట్రాస్, గొరిల్లాలకు ఆయుధాలు సరఫరా చేసాడు.[20]

1987 జూన్ 9 రాత్రి క్రుజాడా సివిలిస్టా (సివిక్ క్రుసేడ్) రూపొందించి [ఎక్కడ?] పౌరుల అవిధేయతను క్రమబద్ధీకరణ చర్యలు చేబట్టింది.క్రుసేడే జనరల్ స్ట్రైక్ కొరకు పిలుపిచ్చారు.ప్రతిస్పందనగా మిలటరీ రాజ్యాంగ హక్కులను రద్దు చేసి దేశంలో అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టింది. జూలై 10న సివిక్ క్రుసేడ్ బృహత్తర ప్రదర్శనకు పిలుపు ఇచ్చింది. మిలటరీ స్పెషల్ రాయిట్ కంట్రోల్ యూనిట్ " డాబర్మన్‌లు " దానిని హింసాత్మకం అణచడానికి ప్రయత్నించారు. ఆరోజును తరువాత " బ్లాక్ ఫ్రైడే "గా వర్ణించబడింది. అల్లర్లలో 600 మంది మరణించారు. అడ్డగించబడిన 600 మంది హింసలకు, మానభంగాలకు గురైయ్యారు.[ఆధారం చూపాలి] యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ సైనిక పాలనకు వ్యతిరేకంగా వరుస సహాయం అందించాడు.1987లో యునైటెడ్ స్టేట్స్ పనామాకు ఆర్థిక, సైనిక సాయం నిలిపి వేసింది.ప్రతిస్పందనగా పనామాలో రాజకీయ సంక్షోభం, యు.ఎస్. దౌత్యకార్యాలయం మీద దాడి జరిగాయి. శాంక్షంస్ నొరియేగాను పడగొట్టడానికి స్వల్పంగా, ఆర్థికరంగం పతనానికి అధికంగా పనిచేసాయి. ఈ కారణంగా 1987-1989 మద్య జి.డి.పి 25% పతనం అయింది.[23] 1988 ఫిబ్రవరి 5న జనరల్ మాన్యుయేల్ అంటానియా నొరియేగా తంపా, మైమీ ఫెడరల్ జ్యూరీలు మాదకద్రవ్యాల రవాణాకు సహకరించారని ఆరోపించాడు.1988 ఏప్రిల్ లో యు.ఎస్ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ " ఇంటర్నేషనల్ ఎమర్జెంసీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్ "ను ప్రేరేపించి అన్ని యు.ఎస్ ఆర్గనైజేషంస్‌లో ఉన్న పనామా ఆస్తులను దిగ్బంధం చేసేలా చేసాడు. 1989 మేలో పనామియన్లు నొరియేగాకు వ్యతిరేకంగా అత్యంత ఉత్సాహంగా ఓటు వేసారు. నొరియేగా ప్రభుత్వం చురుకుగా ఎన్నికలను రద్దు చేసి అణిచివేత కార్యక్రమాలు చేపట్టాడు.

The aftermath of urban warfare during the U.S. invasion of Panama, 1989

యు.ఎస్. దాడి (1989)

[మార్చు]

యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం "ఆపరేషన్ జస్ట్ కాస్ " ఇది 1989 డిసెంబరు 20న జరిగింది.టారిజోస్ - కేటర్ ట్రీటీలో పనామాలో నివసిస్తున్న అమెరికన్ పౌరులకు రక్షణ అవసరం, ప్రజాస్వామ్యం, మానవహక్కుల రక్షణ, మాదకద్రవ్యాల రవాణా మీద పోరాటం, పనామా కాలువ రక్షణ కోరబడ్డాయి.అని న్యూయార్క్ టైంస్ పేర్కొన్నది. [24] 23 మంది సర్వీస్మంస్ మరణించారని, 324 మంది గాయపడ్డారని యు.ఎస్. పేర్కొన్నది. పనామా మాద్యమాలు 450 మంది మరణించారని పేర్కొన్నది. యాక్షన్ పౌరుల మరణాలకు దారి తీసింది.రెండు వారాల సైనిక చర్యలో 400 నుండి 4,000 మంది మరణించారని అంచనా వేయబడింది. .[ఆధారం చూపాలి] వియత్నాం యుద్ధం తరువాత ది సర్జికల్ మాన్యూర్ అతిపెద్ద యునైటెడ్ స్టేట్స్ మిలటరీ ఆపరేషన్ అని భావించబడింది.[25] ఇతర వనరులు పెద్ద సంఖ్యలో పౌరుల మరణాలు సంభవించినట్లు పేర్కొన్నప్పటికీ యునైటెడ్ స్టేట్స్ 500 పౌరుల మరణాలు సంభవించినట్లు పేర్కొన్నది.[26] పనామా కెనాల్‌లో పనిచేసిన అనేక అమెరికన్ పౌరులు వారి కుటుంబ సభ్యులు, యు.ఎస్. సైన్యం పనామియన్ డిఫెంస్ ఫోర్స్ చేతిలో మరణించారు. డిసెంబరు 29న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పనామా దాడిలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, స్వతత్రం, సార్వభౌమత్వం హాని, దేశాల భౌగోళిక అనుగుణ్యతకు లోపం జరిగిందని నిర్ణయించింది.[27] సెక్యూరిటీ కౌంసిల్ బై ది యునైటెడ్ స్టేట్స్, ది యునైటెడ్ కింగ్డం, ఫ్రాన్స్ కూడా ఇలాంటి తీర్మానానికి ఓటు వేసింది. [28] 1989లో యునైటెడ్ స్టేట్స్ జోక్యం కారణంగా నరప్రాంత ప్రజలు, అనేక మంది దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్న ప్రజలు అధికంగా బాఢపడ్డారు. 1995లో యు.ఎన్. అసిస్టెంస్ మిషన్ టు పనామా దాడి సమయంలో చేసిన బాంబుదాడి కారణంగా 20,000 మంది నివాసాల నుండి తరలించబడ్డారని సూచించింది. ఎల్.చొల్లిరొ డిస్ట్రిక్ తీవ్రంగా ధ్వంసం అయింది. పలు అపాటుమెంటు బ్లాకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ దాడిలో పనామా కాలువ నిర్మించబడిన రోజులలో నిర్మించబడిన ఎల్.చొరిల్లో డిస్ట్రిక్ లోని కొయ్య ప్రహరీలు అంటుకుని పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది.[29][30][31] దాడి కారణంగా 1.5 - 2 బిలియన్ల ఆర్థిక నష్టం సంభవించింది.[23] చాలా మంది పనామియన్లు దాడికి మద్దతిచ్చారు.[32][33]

Post-intervention era

[మార్చు]
The skyline of Panama City near Cinta Costera

పనామా ఎలెక్టోరల్ ట్రిబ్యూనల్ త్వరగా స్పందించి సివిలియన్ కాంస్టిట్యూషనల్ గవర్నమెంటు స్థాపనచేయడానికి ప్రయత్నించింది.1918 ఎన్నికలలో గుయిలెర్మొ ఎండ్రా అధ్యక్షుడయ్యాడు. గుయిలెర్మొ ఫోర్డ్ ఉపాధ్యక్షుడు అయ్యాడు.ఐదు సంవత్సరాల పాలనలో తరచుగా సంభవించిన వర్గవైషమ్యాల కరణంగా ప్రజల అంచనాలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం అయింది.పోలీస్ విభాగం అభివృద్ధి చెందినప్పటికీ పూర్తిస్థాయిలో నేరాలను ఆపలేకపోయింది. మూడు పార్టల సంకీర్ణం తరఫున పోటీ చేసిన పెరెజ్ బల్లడరెస్ 33% ఓట్లతో అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.ఆయన అడ్మినిస్ట్రేషన్‌లో ఆర్థిక సంస్కరణలు చేపట్టబడ్డాయి. ఆయన తరచుగా యు.ఎస్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కెనాల్ ఒప్పందాలకు అనుకూలంగా పనిచేసాడు.[ఆధారం చూపాలి] 1999 సెప్టెంబరు 1న గతించిన అధ్యక్షుడు అముల్ఫొ అరియాస్ మాడ్రిడ్ భార్య " అర్నుల్ఫి అరియాస్ మాడ్రిడ్ " పి.ఆర్.డి అభ్యర్థి " మార్టిన్ టర్రిజోస్ " (ఒమర్ టర్రిజోస్ కుమారుడు) ఓడించి అధక్షపదవిని చేపట్టింది.[34][ఆధారం చూపాలి] ఆమె పానలలో " మొసొకొ " బాలల, యువత అభివృద్ధి, రక్షణ, సాధరణ ప్రజల సంక్షేమం వంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను బలపరచడానికి ప్రయత్నించాడు. మొసొకొ పాలన విజయవంతంగా పానమాకాలువ మార్పిడి, నిర్నహణ చేయబడింది.[34][ఆధారం చూపాలి]

2004లో పి.ఆర్.డి. టర్రిజొస్ ఎన్నికలలో విజయం సాధించి అధ్యక్షపీఠం, లెజిస్లేటివ్ మెజారిటీ సాధించాడు. [ఆధారం చూపాలి] టర్రిజొస్ పదవిని చేపట్టిన తరువాత టర్రిజోస్ అమలు చేసిన పలు చట్టాలు ప్రభుత్వపాలనను పారదర్శకం చేసాయి. ఆయన రూపొందించిన " యాంటీ కరెప్షన్ కౌంసిల్ "లో పైపదవులలో (సివిల్ సొసైటీ, లేబర్ ఆర్గనైజేషన్లు, మతాధికారులు) పనిచేస్తున్న ప్రభుత్వాధికారులను సభ్యులుగా చేసాడు. ఆయన మంత్రిమండలిలో చాలామంది రాజకీలతో సంబంధం లేని సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరు యాంటీ కరెప్షన్‌కు మద్దతుగా నిలిచారు. 2009 అధ్యక్ష ఎన్నికలలో టర్రిజొస్ తరువాత సూపర్ మార్కెట్ మాగ్నేట్ " రికార్డో మార్టినెల్లి " ఘనవిజయం సాధించాడు.[35] నాలుగు పార్టీల అయంస్ తరఫున పోటీచేసిన మార్టినెల్లి 60% ఓట్లతో విజయం సాధించాడు.

2014 మే అధ్యక్ష ఎన్నికలలో " జుయాన్ కార్లోస్ వరెలా " 39% ఓట్లతో విజయం సాధించాడు. 2014 జూలై 1న ఆయన పదవీ స్వీకారం చేసాడు.

భౌగోళికం

[మార్చు]
A map of Panama
La Palma, Darién.

పనామా మద్య అమెరికాలో ఉంది. ఇది పసిఫిక్ మాహాసముద్రం, కారీబియన్ సముద్రాల, కొలంబియా, కోస్టారీకా మద్యన ఉంది. ఇది 7 - 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 77-83 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. 2000 నాటికి పనామా " పనామా కెనాల్ "ను తన ఆధీనంలోకి తీసుకుంది. పనామా కాలువ అట్లాంటిక్ సముద్రం, కరీబియన్ సముద్రం, పసిఫిక్ మహాసముద్రాలను అనుసంధానిస్తూ ఉంది. పనామా వైశాల్యం 74,177 చ.కి.మీ.[36] పనామాలో భౌగోళిక ప్రాధాన్యత కలిగిన మద్యప్రాంతపు పర్వతాలు, కొండలు దేశాన్ని భౌగోళిగంగా విభజిస్తూ ఉన్నాయి. ఇవి ఉత్తర అమెరికాలోని పర్వతశ్రేణిలో భాగంగా లేవు. ఇవి కొలంబియా సరిహద్దులో ఉన్న ఆండెస్ పర్వత శ్రేణికి సమీపంలో ఉన్నాయి. దేశాన్ని విభజిస్తున్న పర్వతశ్రేణి మద్యలో జలప్రవాహం కారణంగా ఏర్పడిన ఎత్తైన ఆర్చి ఉంది. కోస్టారికా సమీపంలోని పర్వతశ్రేణిని " కార్డిల్లేరా డీ టాలమంకా " అని పిలువబడుతుంది. మరింత తూర్పుకు విస్తరించిన పర్వతశ్రేణిని " సెర్రానియా డీ టబసరా " అని పిలువబడుతుంది. ఇది ఇస్త్మస్ దిగువభూమికి సమీపంలో ఉంది. ఇక్కడే పనామా కాలువ నిర్మించబడింది. పనామా, కోస్టారీకా మద్య ఉన్న భూభాగాన్ని భౌగోళికులు " సియేరా డీ వెరాగుయాస్ " పిలుస్తుంటారు.దేశంలో అత్యున్నత భూభాగం " వోల్కన్ బరు ", దీని ఎత్తు 3,475 మీ. పానామా, కొలంబియా మద్యలోఉన్న డారియన్ గ్యాప్‌లో దట్టమైన అరణ్యం విస్తరించి ఉంది.ఇక్కడ గొరిల్లాలు, మాదకద్రవ్యాల వ్యాపారులు ఆశ్రయం పొందుతూ ఉంటారు. ఇది, ఆటవీరక్షణ ఉద్యమాలు పాన్- అమెరికన్ హైవేకు అడ్డంగా మారాయి. లేకుంటే అలాస్కా, పాటగోనియా మద్య పూర్తిస్థాయి రహదారి నిర్మించబడి ఉండేది.పనామా ఆటవీజీవనం దక్షిణ అమెరికా దేశాలకంటే అధికమైన (వన్యప్రాణి) వైవిధ్యం కలిగి ఉంటుంది. ఇకిఅడ దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాలో ఉన్న వన్యజంతువులు కనిపిస్తుంటాయి.

The Chagres River

రవాణా

[మార్చు]

నదులు , సరోవరాలు

[మార్చు]

పనామ భూభాగంలో 500 నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి అధికంగా ఏగువభూమిలో జన్మించి ప్రవహిస్తున్న పర్వతప్రాంత సెలయేళ్ళుగా ఉన్నందున ఇవి రావాణాకు సౌకర్యమైనవి కావు.ఇవి పర్వత లోయలలో ప్రవహిస్తూ సముద్రతీర డెల్టాలను ఏర్పరుస్తున్నాయి.మద్య పనామాలో ప్రవహిస్తున్న వెడల్పైన రియో చాగ్రెస్ నది విస్తారమైన జలవిద్యుత్తు ఉత్పత్తికి వనరుగా ఉంది.నది మద్య భాగంలో నిర్మించబడిన గాటన్ ఆనకట్ట గాటన్ సరోవరాన్ని రూపొందించింది. కృత్రిమమైన ఈ సరోవరం పనామా కెనాల్‌లో భాగంగా ఉంది.రియో చాగ్రెస్ నది మీద 1907-1913 మద్య నిర్మించబడిన గాటన్ ఆనకట్ట కారణంగా ఈ సరోవరం ఏర్పడింది. ఇది నిర్మినబడిన సమయంలో గాటన్ సరోవరం ప్రంపంచంలోని మానవనిర్మిత సరోవరాలలో అతిపెద్ద సరోవరంగా, గాటన్ ఆనకట్ట అతిపెద్ద ఆనకట్టగా గుర్తించబడింది.నది వాయవ్యదిశగా ప్రవహించి కరీబియన్ సముద్రంలో సంగమిస్తుంది. కంపియా, మాడెన్ సరోవరాలు (చాగ్రెస్ నది జలాలను అందుకుంటున్నాయి) కూడా జలవిద్యుత్తును తయారుచేయడానికి సహకరిస్తున్నాయి.

పసిఫిక్ సముద్రంలో సంగమిస్తున్న 300 నదులలో రియో చాపొ నది పానామాలోని జలవిద్యుత్తు ఉత్పత్తి వనరులలో ఒకటిగా ఉంది.పసిఫిక్‌లో సంగమ్I'm స్తున్న నదులు కరీయన్‌లో సంగమిస్తున్న నదులకంటే పొడవైనవిగా ఉండి, నిదానమైన ప్రవాహజలాలు కలిగి ఉన్నాయి. వీటి ముఖద్వారాలు కూడా అత్యంత విస్తారంగా ఉన్నాయి. పొడవైన నదులలో రియో తురియా ఒకటి. ఇది గొల్ఫొ డీ మిగ్యూ నదిలో సంగమిస్తుంది. ఈ ఒక్క నది మాత్రమే దేశంలో పెద్ద వెసెల్స్ రావాణాకు అనుకూలంగా ఉంది.

నౌకాశ్రయాలు

[మార్చు]

కరీబియన్ సముద్రతీరంలో పలు సహజ నౌకాశ్రయాలు ఉన్నాయి. అయినప్పటికీ పనామా కాలువ చివరన నిర్మించబడిన క్రిస్టోబల్ నౌకాశ్రయం 1980లో ప్రధాన నౌకాశ్రయసౌకర్యాలను కలిగి ఉంది. కోస్టారీకా సమీపంలో ఉన్న " ఆర్చిపిలాగో డీ బొకాస్ టొరొ "కు చెందిన అనేక ద్వీపాలు నౌకాశ్రయానికి మరింత బలం చేకూర్చాయి. ఈద్వీపాలు " అల్మిరాంటే "లో ఉన్న బనానా నౌకాశ్రయానికి సహజ రక్షణగా ఉన్నాయి. కొలంబియా సమీపంలోని కరీబియన్ సముద్రతీరంలో 350 " శాన్ బ్లాస్ ద్వీపాలు " ఉన్నాయి.

Colón Harbor, 2000

ప్రస్తుతం పనామా కెనాల్‌కు ఇరువైపులా క్రిస్టోబల్, బాల్బొయా నౌకాశయాలు ఉన్నాయి. కంటైనర్ యూనిట్ (20 అడుగుల సమానం)ల సంఖ్య అనుసరించి ఇవి లాటిన్ అమెరికా దేశాలలో ఇవి ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నాయి. [37] బల్బొయా నౌకాశ్రయం వైశాల్యం 182 చ.హె.ఉంటుంది. ఇందులో 4 బెర్తుల కంటైనర్లు, రెండు బహుళ ప్రయోజన కంటైనర్లు ఉన్నాయి. మొత్తం బెర్తులు 2,400 మీ పొడవు 15 మీ లోతూ ఉన్నాయి. బల్బొయా నౌకాశ్రయంలో 18 సూపర్ పోస్ట్- పనామాక్స్, పనామాక్స్ క్వే క్రేనులు, 44 గాంట్రీ క్రేనులు ఉన్నాయి.బల్బొయా నౌకాశ్రయంలో 2,100 గోడౌన్లు ఉన్నాయి.[38]2009లో క్రిస్టోబల్ నౌకాశ్రయం నుండి 22,10,720 టి.ఇ.యు. సరకు రవాణా చేయబడింది.లాటిన్ అమెరికా దేశాలలో సరకు రవాణాలో ఇది రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బ్రెజిల్ ఉంది.

బృహత్తర డీప్ వాటర్ నౌకాశ్రయాలు అతిపెద్ద క్రూడాయిల్ కారియర్లను నిలపడానికి వసతి కల్పిస్తున్నాయి. ఇవి చార్కొ అజుల్, చిరిక్వి ప్రొవింస్ (పసిఫిక్),, చిరిక్వి గ్రాండే, బొకాస్ డెల్ టొరొ (అట్లాంటిక్) ప్రాంతాలలో ఉన్నాయి. 131 కి.మీ పొడవైన " ది ట్రాంస్ పైప్ లైన్ " 1979లోచార్కో అజుల్, చిరిక్విల గ్రాండే మద్య ఇస్త్మస్ ద్వారా నిర్మించబడింది. [39]

వాతావరణం

[మార్చు]
Panama map of Köppen climate classification.
A cooler climate is common in the Panamanian highlands.

పనామా ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంది. స్వల్పమైన సీజనల్ వాతావరణ భేదాలతో ఉష్ణోగ్రత దాదాపు ఒకే విధంగా ఉంటుంది. రాజధాని నగరంలో ఉదయం ఉష్ణోగ్రత 24 డిగ్రీలు సెంటిగ్రేడ్, మధ్యహ్నపు ఉష్ణోగ్రత 30 డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుంది.ఇస్త్మస్ పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రత కరీబియన్ వైపు కంటే తక్కువగా ఉంటుంది. దేశంలో చాలా ప్రాంతాలలో గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎగువ భూములలో వాతావరణం చల్లగా ఉంటుంది. పశ్చిమ పనామాలో ఉన్న కార్డిలెరా డీ టలమంకా ప్రాంతంలో హిమపాతం సంభవిస్తూ ఉంటుంది.

వర్షపాతం

[మార్చు]

వాతావరణ ప్రాంతాలను ఉష్ణోగ్రత ఆధారంగా కాక వర్షపాతం ఆధారంగా నిర్ణయించబడుతుంటాయి.వర్షపాతం ప్రాంతాలవారీగా వార్షికంగా 1300 మి.మీ నుండి 3000 మి.మీ ఉంటుంది.వర్షాలు అధికంగా వర్షాకాలంలో కురుస్తూ ఉంటాయి. వర్షపాతం సాధారణంగా ఏప్రిల్, డిసెంబరు మాసాల మద్య ఉంటుంది. అయినప్పటికీ వర్షపాత కాలం 7-9 మాసాల మద్య మారుతూ ఉంటుంది. సాధారణంగా పసిఫిక్ వైపు కంటే కరీబియన్ వైపు వర్షపాతం అధికంగా ఉంటుంది. పనామా నగరం సరాసరి వార్షిక వర్షపాతం కొలన్ కంటే అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో ఉరుములు అధికంగా ఉంటాయి. పనామా హరికెన్ బెల్టుకు వెలుపల ఉంది.

పనామా ఉష్ణమండల వాతావరణం విస్తారమైన వృక్షజాతికి మద్దతుగా ఉంటుంది. అరణ్యాల విస్తరణను కొన్ని ప్రాంతాలలో పచ్చికమైదానాలు, పొదలు, పంటభూములు అడ్డగిస్తుంటాయి. పనామా భూభాగంలో 40% అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. రెయిన్ - డ్రెంచ్డ్ వుడ్ లాండ్స్‌కు అరణ్యాల నరికివేత బెదిరింపుగా మారింది. 1940 నుండి వృక్షాల సాంధ్రత 50% క్షీణించింది. నైరుతీలోని పశ్చికమైదానాలకు ఈశాన్య ప్రాంతంలో తోటల పెంపకం గణనీయంగా అభివృద్ధి చెందింది.మొక్కజొన్న, బీంస్, దుంపలు అధికంగా పండించబడుతున్నాయి.రెండు సముద్రతీరాల వెంట వర్షారణ్యాలు విస్తరించి ఉన్నాయి. కోస్టారీకా సమీపంలోని డెల్టాలలో అరటి తోటలు అధికంగా ఉన్నాయి. పలు ప్రాంతాలలో మల్టీ - కానోపియడ్ వర్షారణ్యం విస్తరించి ఉంది.

ఆర్ధికం

[మార్చు]
A Panamax ship in transit through the Miraflores locks, Panama Canal.

సి.ఐ.ఎ. వరల్డ్ ఫేస్ బుక్ ఆధారంగా పనామాలో 2.7% నిరుద్యోగులు ఉన్నారు.[4] 2008 లో పనామాలో ఆహారమిగులు నమోదుచేయబడింది. 2015 హ్యూమన్ డెవెలెప్మెంటు ఇండెక్స్ ఆధారంగా పనామా 60వ స్థానంలో ఉంది.సమీపకాలంలో పనామా ఆర్థికరంగం వేగవంతమైన అభివృద్ధి జరిగింది. 2006-2008 మద్య దేశ జి.డి.పి 10.4% అధికరించింది.లాటిన్ అమెరికాదేశాలలో వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, చక్కగా నిర్వహించబడుతున్న ఆర్థికరంగం కలిగిన దేశంగా పనామా గుర్తించబడుతుంది.[ఆధారం చూపాలి] " ది లాటిన్ అమెరికన్ క్రోనికల్ " 2010-2014 నాటికి పనామా ఆర్థికరంగం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది అని ముందుగానే చెప్పింది. [40] పనామా కాలువ విస్తరణ, యునైటెడ్ స్టేట్స్‌తో చేసుకున్న స్వేచ్ఛావిఫణి ఒప్పందం. [ఎవరు?] కారణంగా కొంతకాలం ఆర్థికరంగంలో అభివృద్ధి కొనసాగింది.[41] ప్రపంచ బ్యాంక్ సమీపకాల గణాంకాల ఆధారంగా 2013లో పానామాప్రజలలో 25% దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని భావిస్తున్నారు.[42][43]

The Marine bridge viaduct

ఆర్ధికరంగం

[మార్చు]

పనామా ఆర్థికరంగంలో భౌగోళికస్థితి, చాక్కగా అభివృద్ధిచెందిన (కామర్స్, పర్యాటకం, వ్యాపారం) సేవారంగం ప్రధానపాత్ర వహిస్తున్నాయి. కాలువ అప్పగింత, యునైటెడ్ స్టేట్స్ మిలటరీ ఇంస్టాలేషన్ నిర్మాణరంగానికి ప్రోత్సాహం అందించింది.

2006 అక్టోబరు 22న పనామాకాలువకు మూడవ సెట్ లాకులు నిర్మించడానికి జరిపిన ప్రజాభిప్రాయసేకరణకు ప్రజలు అత్యుత్సాహంగా ఆదరించారు.అంచనావేయబడిన ప్రణాళిక వ్యయం $25 బిలియన్ల యు.ఎస్.డి. కాలువ ద్వారా లభించే టోల్ ఫీజ్ పనామా ఆర్థికరంగంలో ప్రాధానాంశంగా భావించబడుతుంది. కాలువ విస్తారమైన ఉపాధి కల్పన చేస్తుంది. 85 సంవత్సరాలు యునైటెడ్ స్టేట్స్ నిర్వహణలో ఉన్న కాలువ 1999 లో పనామాకు అప్పగించబడింది. రాగి, బంగారం నిలువలు విదేశీపెట్టుబడిదారులచేత అభివృద్ధి చేయబడ్డాయి.[44]

పనామా

[మార్చు]

20వ శతాబ్దంలో కాలువ నిర్మాణం తరువాత పనామా " ఇంటర్నేషనల్ ఫైనాంషియల్ సెంటర్ " అయింది.[45] బ్యాంకింగ్ రంగం నుండి 24,000 మందికి నేరుగా ఉపాధి లభించింది. ఫైనాంస్ రంగం జి.డి.పి.లో 9.3 %కి భాగస్వామ్యం వహిస్తుంది.[46] స్థిరత్వం పనామా ఫైనాంషియల్ రంగానికి బలంచేకూరుస్తూ ఉంది. అనుకూలమైన ఆర్థిక, వాణిజ్య వాతావరణం ఫైనాంస్ రంగం అభివృద్ధికి సహకారం అందిస్తుంది.బ్యాంకులు చక్కని అభివృద్ధి, స్థిరమైన ఆదాయం పొందుతూ ఉంది.[47] అంతర్జాతీయ ఫైనాంషియల్ కేంద్రంగా పనామా మద్య అమెరికా, లాటిన్ అమెరికా దేశాలకు సర్వీసులను ఎగుమతి చేస్తుంది. ప్రపంచం మొత్తం పానామాను " టక్స్ హెవెన్ "గా భావిస్తుంది.[46]

రవాణా

[మార్చు]
Tocumen International Airport, Central America's largest airport

పనామాలో " టోక్యుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " (మద్య అమెరికా అతి పెద్ద విమానాశ్రయం) ఉంది. అదనంగా దేశంలో 20 చిన్న ఎయిర్ ఫీల్డులు ఉన్నాయి. పనామా రహదారులు వాహనాల రద్దీ, రవాణావిధానం సాధారణంగా సురక్షితంగా ఉంటాయి. రాత్రి ప్రయాణం కష్టంగా ఉంటుంది. అనధికార సెటిల్మెంట్లు అపాయకరమైనవిగా భావించబడుతున్నాయి. ప్రాంతీయ అభికారులు రాత్రిప్రయాణాల నిబంధనలను కఠినతరం చేస్తుంటారు.[48] పనామాలో వాహనాల రాకపోకలు సరిగా ఉంటాయి. పనామా చట్టం అనుసరించి ప్రయాణీకులు, డ్రైవర్ కూడా సీటుబెల్టు ధరించాలి.[48] రహదార్లు చక్కగా లాటిన్ అమెరికా దేశాల ప్రయాణాలకు అనుకూలంగా అభివృద్ధి చేయబడ్డాయి.ప్రస్తుతం పనామాలో మెట్రోబసుల పేరుతో అత్యాధునిక బసులు నడుపబడుతున్నాయి.

[49] మెట్రోలైన్.[50] సాధారణంగా ఈవిధానాన్ని వర్ణరంజితంగా రూపుదిద్దబడిన " డియాబ్లాస్ రొజొస్ " అధిగమించింది.సాధారంంగా diablo rojo బసులు ప్రకాశవంతమైన రంగులతో అలంకరించబడి ఉంటాయి.వీటిమీద రాజకీయనాయకులు, గాయకుల చిత్రాలు చిత్రించబడి ఉంటాయి. పనామా వీధులలో తరచుగా వాహనాలరద్దీ ఏర్పడుతూ ఉంటుంది. అధికరించిన ప్రైవేట్ వాహనాలకు అనువైన ప్లానింగ్ లేఇఅపోవడమే ఇందుకు కారణం.

పర్యాటకం

[మార్చు]
Panama City as seen from the Corredor Sur highway.

పనామాలో పర్యాటకం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందింది. [ఆధారం చూపాలి] విదేశీ అతిథులకు, విశ్రాంతౌద్యోగులకు పనామా ప్రభుత్వం పర్యాటకరాయితీలు ప్రకటిస్తూ గత 5సంవత్సరాలుగా పర్యాటకరకం అభివృద్ధికి కృషిచేస్తుంది.ఆర్ధికవిధానాల తీవ్రమైన అమలు కారణంగా అంర్జాతీయంగా విశ్రాంత ఉద్యోగులు నివసించడానికి మంచిప్రాంతంగా పనామా గౌరవించబడుతుంది. [ఆధారం చూపాలి] పర్యాటకుల ఆసక్తి కారణంగా గత 5 సంవత్సరాలుగా నిర్మాణపరిశ్రమ పర్యాటకగమ్యాల అభివృద్ధికి కృషిచేస్తుంది.[51] 2012లో 22,00,000 మంది పర్యాటకులు పనామా చేరుకున్నారు.[ఆధారం చూపాలి]2008 ఆరంభంలో 9 మాసాలలో పర్యాటకుల సంఖ్య 23.1% అభివృద్ధిచెందింది. " పర్యాటకం అథారిటీ ఆఫ్ పనామా " (ఎ.టి.పి.)ఆధారంగా జనవరి, సెప్టెంబరు మద్యకాలంలో ఐరోపా నుండి 71,154 మంది పనామాలో ప్రవేశించగా ఈ సంఖ్య గతసంవత్సరంలో 13,373 ఉంది. యురేపియన్ పర్యాటకులలో అధికం స్పెయిన్ ప్రజలు (14,820), తరువాత ఇటాలియన్లు (13,216), తరువాత ఫ్రెంచి (10,174), బ్రిటిష్ (8,833) ఉన్నారు.యురేపియన్ యూనియన్‌లో అత్యంత జనసాంధ్రత కలిగిన దేశం అయిన జర్మనీ నుండి 6,997 మంది పర్యాటకులు పనామను సందర్శిస్తున్నారు. ఐరోపా పనామాకు ప్రధాన పర్యాటకగమ్యాలలో ఒకటిగా ప్రాధాన్యత ఇస్తుంది. 2012లో 4,345.5 మిలియన్లు [విడమరచి రాయాలి] పర్యాటకరంగం నుండి పనామా ఆర్థికరంగానికి ఆదాయంగా లభించింది.ఇది పనామా జి.డి.పి.లో 9.5%కి భాగస్వామ్యం వహిస్తుంది.పనామాలో పర్యాటకరంగం ఆదాయం ఇతర ఉత్పాతక రంగాలను అధిగమిస్తుంది.[ఆధారం చూపాలి]

Fortifications on the Caribbean Side of Panama: Portobelo-San Lorenzo were declared World Heritage Site by UNESCO in 1980.

2012లో పనామా అమలుచేసిన లా 80 చట్టం (1994 లో రూపొందించిన లా 80 చట్టం స్థానంలో రూపొందించబడింది) అనుసరించి ఆదాయం పన్నుకు 100% (15 సంవత్సరాల) మినహాయింపు, రియల్ ఎస్టేట్స్ రగం దిగుమతి చేసుకునే నిర్మాణసంబంధిత సామాను, ఉపకరణాలకు (5 సంవత్సరాల ) పన్ను మినయింపు, కేపిటల్ గెయింస్‌కు (5 సంవత్సరాల) పన్ను మినహాయింపు లభిస్తుంది.[52]

కరెంసీ

[మార్చు]

1903లో పనామాకు స్వతంత్రం లభించినప్పటి నుండి పనామియన్ కరెంసీ బాల్బొయా మారకం విలువ యు.ఎస్.డితో 1:1 మారక విలువ కొనదాగుతుంది.పనామాలో యు.ఎస్.డి.కు చట్టబద్ధమైన అనుమతి ఉంది, పేపర్ కరెంసీ అమలులో ఉంది, పనామాకు స్వంత నాణ్యాలు వాడుకలో ఉన్నాయి. యు.ఎస్.డితో సంబంధితమై ఉన్న కారణంగా పనామాలో ద్రవ్యోల్భణం తక్కువగా ఉంది.ఎకనమిక్ కమిషన్ ఫర్ లాటిన్ అమెరికన్ అండ్ ది కరేబియన్ ఆధారంగా 2006 పనామా ద్రవ్యోల్భణం 2.0% అని అంచనా. [53] పనామాకు స్వతంత్రం లభించిన తరువాత 1904లో బాల్బొయా స్థానంలో కొల,బియన్ పెసొ ప్రవేశపెట్టబడింది. 1941లో అధ్యక్షుడు అముల్టో అరియాస్ చేత బాల్బొయా బ్యాంక్ నోట్లు ముద్రించబడ్డాయి. కొన్ని రోజుల తరువాత అవి వెనుకకు తీసుకొనబడ్డాయి. వీటిని " ఏడు రోజుల డాలర్ " అని పిలిచారు. కొత్త ప్రభుత్వం కాల్చివేసింది. అయినప్పటికీ అప్పుడప్పుడు చలామణిలో కనబడుతుంటాయి.పనామా ముద్రించిన కరెంసీ నోట్లు ఇవి మాత్రమే. అంతకు ముందు తరువాత పనామాలో యు.ఎస్.డి. మాత్రమే చలామణిలో ఉన్నాయి.[ఆధారం చూపాలి]

అంతర్జాతీయ వాణిజ్యం

[మార్చు]

పనామా వాణిజ్యం అధికంగా " కోలన్ ఫ్రీ ట్రేడ్ జోన్ "లో (పశ్చిమార్ధగోళంలో అతి పెద్ద స్వేచ్ఛావిఫణి భూభాగం) జరుగుతూ ఉంది. గతసంవత్సరం ఈభూభాగంలో పనామా ఎగుమతులలో 92%, దిగుమతులలో 64% నిర్వహించబడ్డాయని విశ్లేషణకారులు తెలియచేస్తున్నారు.కాఫీ, ఇతర వ్యవసాయ ఎగుమతులు పనామా ఆర్థికరంగానికి చేయూతనిస్తున్నాయి.[ఆధారం చూపాలి] 1982 అకోబర్ 27న యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం, పనామాల మద్య " ది బైలేటరల్ ఇంవెస్టిమెంటు ట్రీటీ " ఒప్పందం జరిగింది. పశ్చిమార్ధగోళంలో యునైటెడ్ స్టేట్స్ ఇలాంటి ఒప్పందం చేసుకున్న మొదటి దేశం పనామా.[54] 2007 జూలై 11న పనామా - యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ అగ్రిమెంటు " ఒప్పందానికి పనామా, యు.ఎస్. అధ్యక్షుడు బరక్ ఒబామా (2011 అక్టోబరు 21) అంగీకారం తెలిపారు. 2012 అక్టోబరు 31లో ఒప్పందం అమలులోకి వచ్చింది.[55]

గణాంకాలు

[మార్చు]
Panama's population, (1961–2003).

2016 గణాంకాలను అనుసరించి పానామా జనసంఖ్య 40,58,374.[56] 2010 గణాంకాల ఆధారంగా 15 సంవత్సరాల లోపు వయస్కులు 29%, 15-65 సంవత్సరాల మద్య వయస్కులు 64.5%, 65 వయసుకు పైబడిన వ్యక్తులు 6.6% ఉన్నారు.[57] మొత్తం ప్రజలలో సగం కంటే అధికంగా కొలాన్ మెట్రోపాలిటన్ కారిడార్‌లో ఉన్న నగరాలలో నివసుస్తున్నారు. పనామాలో నగప్రాంతవాసులు 75% ఉన్నారు. అందువలన పనామా అత్యంత నగరీకరణ దేశంగా భావిస్తున్నారు.[58]

సంప్రదాయ ప్రజలు

[మార్చు]

2010 గణాంకాల ఆధారంగా పనామాలో 65% మెస్టిజోలు (స్థానిక అమెరికన్లు, మిశ్రిత శ్వేతజాతీయులు), 12.3% స్థానిక అమెరికన్లు,బ్లాక్ ఆఫ్రికన్లు 9.2%, ములాట్టో 6.8%, శ్వేతజాతీయులు 6.7% ఉన్నారు.[4][59] సంప్రదాయ ప్రజలలో మెస్టిజోలు (యురేపియన్లు, స్థానిక ప్రజలు) ఉన్నారు.నల్లజాతీయులు లేక ఆఫ్రో పనామియన్లు 15-20% ఉన్నారు. ఆఫ్రో - పనామియన్లు పనామా కొలాన్ మహానగర ప్రాంతం, డారియన్ ప్రొవింస్, లా పాల్మా, టొరొ ప్రాంతాలలో ఉన్నారు. నైబర్ హుడ్స్‌లోని కురుండు, ఎల్ చొరిల్లొ, రియో అబాజో, శాన్ ముక్విలిటొ, శాంటా అనా ప్రాంతాలలో నివసిస్తున్నారు. [ఆధారం చూపాలి] బ్లాక్ పనామియన్లు బానిసలుగా తీసుకురాబడిన ఆఫ్రికన్ సంతతికి చెందినవారుగా భావిస్తున్నారు. వీరిని అట్లాంటిక్ బానిస వ్యాపారంద్వారా తీసుకువచ్చారు. రెండమారు బ్లాక్ ఆఫ్రికన్లు పనామా కాలువ నిర్మాణం కొరకు కరీయన్ నుండి తీసుకుని వచ్చారు. పనామాలో గణనీయమైన చైనీయులు, ఇండియన్ ప్రజలు ఉన్నారు.వీరిని పనామా నిర్మాణం కొరకు పనామాకు తీసుకుని వచ్చారు. చైనీయులు అధికంగా చిరిక్వి ప్రొవింస్‌లో ఉన్నారు. [ఆధారం చూపాలి] పనామాలో యురేపియన్లు, వైట్ - పనామియన్లు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. పనామాలో స్వల్పంగా అరబ్బులు ఉన్నారు. వీరు ఆరాధించడానికి మసీదు ఉంది. అమెరిండియన్ ప్రజలలో 7 సమూహాలు ఉన్నాయి: న్గాబే ప్రజలు, కునా ప్రజలు, ఎంబెరా ప్రజలు, బొకొటా ప్రజలు, వౌనాన్, నాసో ట్జెర్డి (టెరిబె), బ్రిబ్రి ప్రజలు.[60]

భాషలు

[మార్చు]

పనామాలో స్పానిష్ అధికారభాషగా ఆధిక్యత కలిగిన భాషగా ఉంది. పనామాలో మాట్లాడే స్పానిష్ భాషను పనామియన్ స్పానిష్ అంటారు. పనామాలో స్పానిష్ భాష 93% ప్రజలకు వాడుక భాషగా, ప్రథమ భాషగా ఉంది. అంతర్జాతీయస్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారు, వాణిజ్యసంస్థల భాగస్వాములు స్పానిష్, ఆగ్లభాషలను మాట్లాడుతుంటారు. స్థానిక ప్రజలు గుయామి భాష దేశవ్యాప్తంగా వారివారి స్వప్రదేశాలలో వాడుకలో ఉంది. 4,00,000 మంది పనామియన్లు స్థానిక భాషలు, స్థానిక ఆచారాలను అనుసరిస్తున్నారు.[61] Some new statistics show that as second language, English is spoken by 8%, French by 4% and Arabic by 1%.[ఆధారం చూపాలి]

Plaza de la independencia, Panama City.

పనామా ప్రభుత్వం మతపరమైన గణాంకాలను సేకరించలేదు. ఇతర వనరుల ఆధారంగా పనామాలో 75%-85% ప్రజలు రోమన్ కాథలిక్ మతస్థులు ఉన్నారు, 15%-25% ప్రొటెస్టెట్లు ఉన్నారు.[62][63] బహై విశ్వాసం 2% (60,000)[64] గుయామీ మతస్థులు 10% ఉంది.[65]" ది చర్చి ఆఫ్ జీసస్ క్రైస్ట్ - డే సెయింట్స్ "లో 40,000 సభ్యులు ఉన్నారు.[66] స్వల్పసంఖ్యలో సెవెంట్ - డే - అడ్వెంటిస్టులు, జెహోవా విట్‌నెసెస్, ఆంగ్లికనిజం 7-10 వేల మంది. యూదులు, ముస్లిములు ఒక్కొక మతానికి 10,000 మంది సభ్యులు ఉన్నారు. అదనంగా హిందువులు, బౌద్ధులు, ఇతర క్రైస్తవులు ఉన్నారు.[63] ఇండిజెనియస్ ప్రజలలో ల్బియోర్గన్ (కునా ప్రజలు), మమతత (న్గొబే ప్రజలు) మతాలు ఉన్నాయి.[63] పానామాలో స్వల్పంగా రాస్టాఫరియన్లు ఉన్నారు.[63]

పెద్ద నగరాలు

[మార్చు]
Panama City, Panama's capital.

పనామాలోని పెద్ద నగరాలు. పనామాలోని పద్దనగరాలలో అధికం పనామా మహానగరప్రాంతంలో ఉన్నాయి.

నగరం జనసంఖ్య ప్రొవింస్
1 పనామా నగరం 880,691 పనామా
2 శాన్ మిక్యూలిటొ 315,019 పనామా
3 టొక్యుమెన్ 103,177 పనామా
4 డేవిడ్ 89,442 చిరిక్వి
5 లాస్ కంబర్స్ 89,000 పనామా
6 కొలాన్ 78,000 కొలాన్
7 లా చొరెరా 68,896 పశ్చిమ పనామా
8 పకోరా 52,494 పనామా
9 శాంటియాగో డీ వెరాగ్వాస్ 50,877 వెరెగ్వా
10 చిత్రా 46,191 హెర్రెరా

సంస్కృతి

[మార్చు]
Pollera.
A couple dancing Panamanian Cumbia.

పనామా సంస్కృతిని యురేపియన్ సంగీతం, కళలు, సంప్రదాయాలు ప్రభావితం చేసాయి. పనామా సంస్కృతిని స్పానిష్ పాలన మరింత ప్రభావితం చేసింది. వలసపాలన పనామాసంస్కృతిని మిశ్రిత సంస్కృతిగా మారేలా వత్తిడి తీసుకువచ్చింది. మిశ్రితమైన ఆఫ్రికన్ సంస్కృతి, ఇండిజెనియస్ సంస్కృతి (స్థానిక అమెరికన్లు) సంస్కృతిలో యురేపియన్ సంస్కృతి విలీనమైంది. ఉదాహరణగా స్పానిష్ నృత్యం " టంబొరిటొ "కు ఆఫ్రికన్ రిథంస్, థీంస్ (కథామ్శాలు), నృత్యభంగిమలు జతచేయబడ్డాయి. [67] పనామా వైవిధ్యమైన సంప్రదాలకు నృత్యం ఒక చిహ్నంగా ఉంది. ప్రాంతీయ జానపదసాహిత్యం పలు పండుగలు, నృత్యాలు, సంప్రదాయాలు ఒకతరం నుండి మరొక తరానికి అందించబడుతూ కొనసాగుతుంది. ప్రాంతీయ నగరాలు రెగ్గీ ఎన్ ఎస్పనొల్, రెగ్గీటన్, హైతియానొ (కంపాస్), జాజ్, బ్లూస్, సల్సా సంగీతం, రెగ్గీ, రాక్ సంగీతం ప్రదర్శనలకు ఆతిథ్యం ఇస్తున్నాయి. [ఆధారం చూపాలి]

హస్థకళలు

[మార్చు]

పనామా నగరానికి వెలుపల సంవత్సరమంతా ప్రాంతీయ పండుగ సందర్భాలలో సంగీతకారులు, నృత్యకారుల ప్రదర్శనలు ప్రధానాంశంగా ఉంటాయి. పనామా మిశ్రమ సంస్కృతి కొయ్య శిల్పాలు, సెరిమోనియల్ మాస్కులు, మట్టిపాత్రలు వంటి సంప్రయాయ ఉత్పత్తులు, ఆహారం, పండుగలు, నిర్మాణకళలో ప్రతిఫలిస్తుంది. ఆరంభకాలంలో గృహోపయోగాల కొరకు బుట్టలు అల్లబడ్డాయి. ప్రస్తుతం గ్రామప్రజలు అల్లిన బుట్టలబ్విక్రయానికి పూర్తిగా టూరిస్టుల మీద ఆధారపడుతున్నారు.

పండుగలు , శలవుదినాలు

[మార్చు]

క్రిస్మస్ సమయంలో డిసెంబరు 25న పనామా నగరంలో " ఎల్ డెస్ఫైల్ డీ నవిడాడ్ " పేరేడ్ ప్రదర్శించబడుతుంది. పేరేడ్‌లో భాగస్వామ్యం వహించే పనామియన్ వర్ణాలతో అలంకరించబడి ఉంటాయి. స్త్రీలు " పొల్లెరా " అనే దుస్తులు ధరిస్తుంటారు, పురుషులు సంప్రదాయ Montuno దుస్తులు ధరిస్తుంటారు. అదనంగా పేరేడుతో అనుసరించి వెళ్ళే బాండులో డ్రమ్ము వాయిద్యాలు ప్రజలకు వినోదం అందిస్తుంటాయి. నగరంలో పెద్ద క్రిస్మస్ ట్రీ నిలిపి దానిని విద్యుద్దీపాలతో అలకరిస్తారు.[68]

సంప్రదాయ ఆహారం

[మార్చు]

పనామియన్ ఆహారం విధానంలో ఆఫ్రికన్, స్పానిష్, అమెరికన్ సాంకేతికతలు, ఆహారాలు, వంటదినుసులు విలీనం చేయబడ్డాయి. రెండు ఖండాల మద్య భూవంతెనగా ఉన్న పనామాలో లభించే ఉష్ణమండల పండ్లు, కూరగాయలు, మూలికలు ప్రాంతీయ వంటలో వీటిని ఉపయోగించబడుతుంటాయి. పనామియన్ ఆహారంలో సాధారణంగా మొక్కజొన్న, బియ్యం, గోధుమలు, పిండి, యుక, గొడ్డు మాంసం, పంది మాంసం, సముద్ర ఆహారాలు ఉపయోగించబడుతుంటాయి.

సంప్రదాయ దుస్తులు

[మార్చు]

పనామియన్ పురుషులు " మాంటునొ " అనే సప్రదాయదుస్తులు ధరిస్తుంటారు. ఇందులో తెల్లని కాటన్ షర్ట్, ట్రౌజర్, అల్లిన స్ట్రా టోపీ ఉంటాయి.పనామా స్త్రీలు పొల్లెరా అనే సంప్రదాయ దుస్తులు ధరిస్తారు.ఇది 16వ శతాబ్దంలో స్పెయిన్‌లో రూపొందించబడింది. 1800లో ఇది పనామా సంప్రదాయ దుస్తులలో ప్రధానమైనదిగా మారింది. దీనిని ఆరంభంలో స్త్రీలు, సేవకులు, వెట్ నర్సులు ధరించే వారు. తరువాత దీనిని పైతరగతి స్త్రీలు ధరించడం మొదలైంది.పొల్లెరా తయారుచేయడానికి కాంబ్రిక్ లేక ఫైన్ లైనెన్ వస్త్రాలతో తయారుచేస్తారు. పనామా సంప్రదాయ దుస్తులను పెరేడ్ సమయాలలో ధరిస్తుంటారు.[69]

సాహిత్యం

[మార్చు]

ప్రొఫెసర్ రోడ్రిగో మిరో వెలువరించిన వివరణల ఆధారంగా పనామా గురించి మొదటి కథను గొంజలో ఫెర్నాండెజ్ డే ఓవియాడో వోల్డేస్ రాశాడని భావిస్తున్నారు. అది హిస్టోరియా జనరల్ య న్యా సహజ డి లాస్ ఇండియస్ లో ప్రచురించబడింది పనామలో జన్మించిన కొంతమంది కవులు, నవలా రచయితలు:

2

క్రీడలు

[మార్చు]
Panamanian baseball catcher Carlos Ruiz during 2007 Spring Training.

పనామాలో యు.ఎస్. ప్రభావం క్రీడలలో చూడవచ్చు. పనామా నేషనల్ క్రీడ బేస్‌బాల్. పనామాలోని " నేషనల్ బేస్ టీం " అంతర్జాతీయ క్రీడలలో పాల్గొంటుంది. దాదాపు 40 పనామియన్ క్రీడాకారులు యునైటెడ్ స్టేట్స్‌లో ప్రొఫెషనల్ బేస్‌బాల్ క్రీడలలో పాల్గొన్నారు. సెంట్రల్ అమెరికన్ దేశాలలో మిగిలిన దేశాలకంటే పనామా క్రీడాకారులు అధికంగా యునైటెడ్ స్టేట్స్ క్రీడలలో పాల్గొంటున్నారు.[70] ప్రముఖ క్రీడాకారులలో బ్రూస్ చెన్, రాడ్ కేర్వ్, మారియానో ​​రివెరా, కార్లోస్ లీ, మానే సాన్గ్గిల్లే, కార్లోస్ రూయిజ్ (బేస్ బాల్) ప్రాధాన్యత కలిగి ఉన్నారు.బాక్సింగ్లో, నాలుగు పనామాయన్లు " ఇంటర్నేషనల్ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేం "లో ఉన్నారు: రాబర్టో దురన్, యుసేబియో పెడ్రోజా, ఇస్మాల్ లగున, పనామా అల్ బ్రౌన్. ఆగస్టు 2016 లో పనామాలో ఇద్దరు క్రీడాకారులు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్స్‌గా వెలుగులోకి వచ్చారు: గుల్లెర్మో జోన్స్, అన్సెల్మో మోరెనో.

20వ శతాబ్దం నుండి పనామియన్లకు ఫుట్ బాల్ అభిమాన క్రీడలలో ఒకటి అయింది. లిగా పనామామెనా డీ ఫుట్‌బాల్, పనామా జాతీయ ఫుట్‌బాల్ జట్టు చక్కని నైపుణ్యం ప్రదర్శిస్తున్నాయి. జట్టులోని క్రీడాకారులలో లూమిస్ ఎర్నెస్టో టాపియా, రోమ్మెల్ ఫెర్నాండెజ్, దిలీ వాల్డెస్ బ్రదర్స్: అర్మండో డెల్ వాల్డెస్ (అర్మాండో), జూలియో సేసార్ డెల్ వాల్డెస్ | (జూలియో), జార్జ్ డెల్ వాల్డెస్, జైమ్ పెండో, ఫెలిపే బలోయ్, లూయిస్ తేజాడా, బ్లాస్ పెరెజ్, రోమన్ టోర్రెస్, హెరాల్డ్ కమ్మింగ్స్ వంటి క్రీడాకారులు తమ ఉన్నత ప్రావిణ్యత నిరూపించు కున్నారు.

పనామాలో బాస్కెట్ బాల్ ప్రాబల్యత సంతరించుకుంది. పనామాలో అంతర్జాతీయస్థాయి బాస్కెట్ బాల్ క్రీడలలో పాల్గొనడానికి రీజనల్ జట్టులు, స్క్వాడులు ఉన్నాయి. రోలండో బ్లాక్మ్యాన్ (నాలుగు-సార్లు ఎన్.బి.ఎ. ఆల్-స్టార్), 10 సంవత్సరాలు కేప్టెనగా పనిచేసిన కెవిన్ డేలే (హార్లెం గ్లొబెట్రోట్లర్స్ షోమన్) పనామియన్ బాస్కెట్ బాల్ క్రీడా కారులలో ప్రాముఖ్యత కలిగి ఉన్నారు.

ఇతర క్రీడలలో వాలీబాల్, టీక్వొండో, గోల్ఫ్, టెన్నిస్ ప్రాబల్యత కలిగి ఉన్నాయి. కొలంబియా, కోస్టారీకా వరకు ట్రాంస్ పనామా పేరుతో లాంగ్ డిస్టెంస్ హైకింగ్ ట్రైల్ నిర్మించబడింది.

పనామాలో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఇతర సంప్రదాయేతర క్రీడలలో " ట్రియాత్లాన్ " క్రీడ దేశవ్యాప్తంగా పలు అథ్లెట్ల దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే పనామా అంతర్జాతీయం ఈక్రీడలకు ఆతిథ్యం ఇస్తుంది. " ఫ్లాగ్ ఫుట్ బాల్ " క్రీడలో పురుషులకు, మహిళలకు క్రమంగా ఆదరణ అధికమౌతూ ఉంది. ఈ క్రీడలను కాలువ నిర్మాణంలో పల్గొంటున్న అమెరికన్లు పనామాలో ప్రవేశపెట్టారు. పనమాక్రీడా కారులు అంతర్జాతీయంగా ఈక్రీడలో పాల్గొంటూ ఉన్నారు. ఈక్రీడలలో పాల్గొంటున్న ఉత్తమ జట్లలో పనామా జట్టు ఒకటిగా గుర్తించబడుతుంది. రిఫరీలు ఈక్రీడను " టర్కీ బాల్ " అని పేర్కొంటున్నారు. పనామాలో ఇతర జనాదరణ కలిగిన క్రీడలలో అమెరికన్ ఫుట్ బాల్, రగ్బీ ఫుట్ బాల్, హాకీ, సాఫ్ట్ బాల్, అమెచ్యూర్ క్రీడలు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. పనామాలో స్కేట్ బోర్డింగ్, బి.ఎం.ఎక్స్., సర్ఫింగ్ మొదలైన క్రీడలకు కూడా జనాదరణ అధికంగా ఉంది. పనామా శాంటా కాటలినా, వెనావ్ బీచులలో ఐ.ఎస్.ఎ. వరల్డ్ సర్ఫింగ్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తుంది.

లాంగ్ జంప్ క్రీడలో " ఇర్వింగ్ సలాడినొ " 2008 ఒలింపిక్ క్రీడలో మొదటి బంగారు పతకం సాధించింది. 2012 లో " లండన్ ఒలింపిక్స్ " క్రీడలలో 8 మంది వైవిధ్యమైన అథ్లెట్ క్రీడాకారులు పనామా తరఫున పాల్గొన్నారు: ఇర్వింగ్ సలాడినొ (లాంగ్ జంప్) అలాంసొ ఎడ్వర్డ్, ఆండ్రియా ఫెర్రిస్ (ట్రాక్, ఫీల్డ్‌), డియాగొ కాస్టిల్లో (స్విమ్మింగ్),కరోలినా కార్స్టెంస్ (టీక్వండొ).

వాతావరణ మార్పులు

[మార్చు]

Panama was one of the few countries that did not enter an INDC at COP21.

[71][72]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Panama". International Monetary Fund. Retrieved April 19, 2012.
  2. "Gini Index". World Bank. Retrieved March 2, 2011.
  3. "Human Development Report 2011" (PDF). United Nations. 2011. Retrieved November 5, 2011.
  4. 4.0 4.1 4.2 "CIA – The World Factbook". Cia.gov. Archived from the original on 2018-12-25. Retrieved December 23, 2010.
  5. "CIA – The World Factbook – Field Listing – GDP (official exchange rate)". CIA. Archived from the original on 2016-03-23. Retrieved January 12, 2010. And: "CIA – The World Factbook – Country Comparison – National product". CIA. Archived from the original on 2011-06-04. Retrieved January 12, 2010. See also: IMF.org
  6. "Annual % Growth – Final Consumption Expenditure, Etc. statistics – countries compared". NationMaster. Archived from the original on 2013-11-05. Retrieved June 26, 2010.
  7. "Final Consumption Expenditure, Etc. constant 2000 us$ (per capita) (most recent) by country". Nationmaster.com. Retrieved June 26, 2010.
  8. UNDP Human Development Report 2010. "Table 1: Human development index 2010 and its components" (PDF). UNDP. Retrieved November 6, 2010.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) p. 144
  9. "Country profile: Panama". BBC News. June 30, 2010.
  10. Austin Alchon, Suzanne (2003). A pest in the land: new world epidemics in a global perspective. University of New Mexico Press. pp. 67–74. ISBN 0-8263-2871-7.
  11. Mayo, J. (2004). La Industria prehispánica de conchas marinas en Gran Coclé, Panamá. Diss. U Complutense de Madrid, pp. 9–10.
  12. Piperno, D. R. (1984). The Application of Phytolith Analysis to the Reconstruction of Plant Subsistence and Environments in Prehistoric Panama. Dissertation, Temple University. Philadelphia, vol. 8 pp. 21–43.
  13. Hays, J. N. (2005). Epidemics and pandemics: their impacts on human history, ABC-CLIO, pp. 82–83, ISBN 1-85109-658-2
  14. Pike, Ruth (2007). "Black Rebels: Cimarrons in Sixteenth Century Panama". The Americas. 64 (2): 243–66. doi:10.1353/tam.2007.0161.
  15. "The Darien Scheme – The Fall of Scotland Archived 2012-02-05 at the Wayback Machine", Historic UK
  16. Müller-Schwarze, Nina K. (2015). The Blood of Victoriano Lorenzo: An Ethnography of the Cholos of Northern Coclé Province. Jefferson, North Carolina: McFarland Press.
  17. "Separación de Panamá: la historia desconocida". banrepcultural.org. Archived from the original on 2018-01-16. Retrieved 2016-04-09.
  18. "The 1903 Treaty and Qualified Independence". U.S. Library of Congress. 2009. Retrieved 2009-05-01.
  19. "Panamá: el último año". banrepcultural.org. Archived from the original on 2017-10-09. Retrieved 2016-04-09.
  20. 20.0 20.1 20.2 20.3 Pizzurno Gelós, Patricia and Celestino Andrés Araúz (1996) Estudios sobre el Panamá Republicano (1903–1989). Colombia: Manfer S.A.
  21. Mon Pinzón, Ramón Arturo (1979). Historia de la Migración China Durante la Construcción del Ferrocarril de Panamá. Masters Thesis. México: El Colegio de México.
  22. Zárate, Abdiel (November 9, 2003). "Muertos y desaparecidos durante la época militar." Extra-centennial issue of La Prensa.
  23. 23.0 23.1 Acosta, Coleen (October 24, 2008). "Iraq: a Lesson from Panama Imperialism and Struggle for Sovereignty". Journals of the Stanford Course on Prejudice and Poverty.
  24. New York Times. A Transcript of President Bush's Address on the Decision to Use Force, December 21, 1989. Web. Jan. 2, 2008.
  25. Cajar Páez, Aristides. "La invasion." Extra-centennial issue of La Prensa,Nov.9 (2003): 22. Print.
  26. John Pike. "Operation Just Cause". Retrieved October 25, 2014.
  27. "Effects of the military intervention by the United States of America in Panama on the situation in Central America".
  28. "Fighting in Panama: United Nations; Security Council Condemnation of Invasion Vetoed".
  29. "Panama" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2017-07-04.
  30. "The Panama Deception. Dir. Barbara Trent. Empowerment Project, 1992 documentary". Archived from the original on 2017-06-30. Retrieved 2017-07-04.
  31. Blum, William. Killing Hope: U.S. Military and C.I.A. Interventions Since World War II -Common Courage Press, 2008.
  32. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Panama అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  33. Pastor, Robert A. (2001) Exiting the Whirlpool: U.S. Foreign Policy Toward Latin America and the Caribbean, p. 96, ISBN 0813338115.
  34. 34.0 34.1 "Panama (11/07)". U.S. Department of State. Retrieved 2017-04-02.
  35. "Panama Country Profile". BBC. June 30, 2010. Retrieved July 25, 2010.
  36. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; area అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  37. CEPAL – Naciones Unidas (March 22, 2010). "Ranking 2009 de Actividad portuaria de contenedores en América Latina y el Caribe". Eclac.cl. Archived from the original on 2011-05-11. Retrieved December 23, 2010.
  38. "Port of Balboa". World Port Source. Archived from the original on 2017-07-12. Retrieved December 23, 2010.
  39. "Our History". Petroterminal.com. February 9, 1997. Archived from the original on 2014-10-28. Retrieved December 23, 2010.
  40. "Latin Business Chronicle". Latin Business Chronicle. October 7, 2009. Archived from the original on 2010-07-17. Retrieved June 26, 2010.
  41. Sullivan M.P. 2011 February 2. Panama: Politics and Economic Conditions and U.S. Relations. Congressional Research Service.
  42. "Panama". World Bank. April 15, 2010. Archived from the original on 2012-10-11. Retrieved July 25, 2010.
  43. "Poverty headcount ratio at $1.25 a day (PPP) (% of population)". World Bank. Retrieved October 25, 2013.
  44. Oancea, Dan (January 2009). Mining in Central America. Magazine.mining.com, pp. 10–12.
  45. Park, Yoon S.; Essayyad, Musa (2012-12-06). International Banking and Financial Centers (in ఇంగ్లీష్). Springer Science & Business Media. ISBN 9789400925045.
  46. 46.0 46.1 "Committee of Independent Experts" (PDF). Presidency of the Republic of Panama. November 18, 2016. Archived from the original (PDF) on 2017-08-18.
  47. "Offshore Financial Centers (OFCs): IMF Staff Assessments (OFCA)". www.imf.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-06-04.
  48. 48.0 48.1 "Panama: Country-specific information" Archived 2013-12-04 at the Wayback Machine. U.S. Department of State (March 18, 2009).  This article incorporates text from this source, which is in the public domain.
  49. "MiBus |". mibus.com.pa. Archived from the original on 2016-02-25. Retrieved 2016-02-26.
  50. "El Metro de Panamá". El Metro de Panamá (in యూరోపియన్ స్పానిష్). Archived from the original on 2016-02-23. Retrieved 2016-02-26.
  51. Redfrogbeach.com Archived 2009-10-13 at the Wayback Machine, Isla Palenque Archived 2011-10-30 at the Wayback Machine, examples
  52. Juan José Espino Sagel. Panama enacts new Tourism Law: Law 80 of 2012. pardinilaw.com
  53. "CEPAL.org" (PDF). Archived from the original (PDF) on 2013-08-24. Retrieved June 26, 2010.
  54. "List of BITs currently in effect". Tcc.export.gov. Archived from the original on 2010-07-09. Retrieved June 26, 2010.
  55. "The United States-Panama Trade Promotion Agreement (TPA)". trade.gov. Archived from the original on 2012-11-13. Retrieved October 31, 2012.
  56. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; census అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  57. "Population Division of the Department of Economic and Social Affairs of the United Nations Secretariat, World Population Prospects: The 2012 Revision". Esa.un.org. Archived from the original on 2011-05-06. Retrieved 2016-04-09.
  58. "Corredor Transístmico Panamá -Colón". Retrieved August 5, 2010.
  59. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-12-25. Retrieved 2012-09-03.
  60. "Update 2011 – Panama". Iwgia.org. Archived from the original on 2013-03-07. Retrieved 2013-06-15.
  61. "Panama". Retrieved August 5, 2010.
  62. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; cia.gov అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  63. 63.0 63.1 63.2 63.3 International Religious Freedom Report 2007: Panama. United States Bureau of Democracy, Human Rights and Labor (September 14, 2007). This article incorporates text from this source, which is in the public domain.
  64. "Panama". World Council of Churches: WCC Member Churches. World Council of Churches. January 1, 2006. Archived from the original on 2017-07-08. Retrieved July 1, 2008.
  65. International Community, Bahá'í (October–December 1994). "In Panama, some Guaymis blaze a new path". One Country. 1994 (October–December). Archived from the original on 2014-08-02. Retrieved 2017-07-15.
  66. Panama. LDS Newsroom. Retrieved December 13, 2008
  67. "The online almanac of Panama culture with travel links". Panama Culture. Retrieved December 23, 2010.
  68. "Panama". Bureau of Western Hemisphere Affairs. June 23, 2010.
  69. Celebremos Panama!. Discovery Theater and Smithonian Latino Center
  70. "Baseball in Panama". The Baseball Cube. Archived from the original on 2010-07-20. Retrieved December 23, 2010.
  71. "Carbon Markets Are Making a Slow, But Steady, Comeback". Bloomberg. Retrieved 2016-04-09.
  72. "INDC – Submissions". .unfccc.int. Retrieved 2016-04-09.
"https://te.wikipedia.org/w/index.php?title=పనామా&oldid=4193546" నుండి వెలికితీశారు