బెలిజ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బెలిజ్
Flag of బెలిజ్ బెలిజ్ యొక్క చిహ్నం
నినాదం
“Sub Umbra Florero”  (Latin)
"Under the Shade I Flourish"
జాతీయగీతం
స్వతంత్రుల భూమి
రాజగీతం
రాణిని దేవుడు రక్షించుగాక
బెలిజ్ యొక్క స్థానం
రాజధాని en:Belmopan
17°15′N, 88°46′W
Largest city en:Belize City
అధికార భాషలు ఆంగ్లము
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు Kriol (the en:lingua franca), Spanish
జాతులు  en:Mestizo, Kriol, Spanish, Maya, en:Garinagu, en:Mennonite, East Indian
ప్రజానామము Belizean (/bəˈliːziən (or bəˈliːʒən)/)
ప్రభుత్వం Parliamentary democracy and Constitutional monarchy
 -  Monarch Elizabeth II
 -  Governor-General Sir Colville Young
 -  Prime Minister Dean Barrow
Independence from the United Kingdom 
 -  Date 21 September 1981 
 -  జలాలు (%) 0.7
జనాభా
 -  2008[1] అంచనా 320,000 (173th²)
జీడీపీ (PPP) (2008 est.) అంచనా
 -  మొత్తం $2.574 billion[1] (163rd)
 -  తలసరి $8,500[1] (74th)
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $1.383 billion[1] 
 -  తలసరి $4,407[1] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase0.777 (medium) (88th)
కరెన్సీ en:Belize dollar (BZD)
కాలాంశం central time (UTC-6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .bz
కాలింగ్ కోడ్ +501
1 These ranks are based on the 2007 figures.

బెలిజ్ (ఆంగ్లం : Belize), దీని పాత పేరు బ్రిటిష్ హోండురాస్, మధ్య అమెరికా లోని ఒక స్వతంత్ర దేశం. ఒకానొకప్పుడు మాయా నాగరికత సామ్రాజ్యం. దీని ఉత్తరాన మెక్సికో, పశ్చిమాన గౌతమాలా, తూర్పు మరియు ఆగ్నేయాన కరీబియన్ సముద్రం గలవు. దేశప్రధాన భూభాగం 290 కి.మీ పొడవు మరియు 110 కి.మీ వెడల్పు ఉంటుంది.

బెలిజె వైశాల్యం 22,800 చ.కి.మీ. జనసంఖ్య 3,68,310.[2] మద్య అమెరికా దేశాలలో అత్యంత తక్కువ జనసాంధ్రత కలిగిన దేశంగా బెలిజ్ ప్రత్యేకత కలిగి ఉంది.[3]2015 గణాంకాల ఆధారంగా దేశ జనసంఖ్యాభివృద్ధి 1.87%. జనసఖ్యాభివృద్ధిలో దేశం ఈప్రాంతంలో ద్వితీయస్థానంలో ఉంది. మొదటి స్థానంలో వెస్టర్న్ హెమీస్ఫెరె ఉంది.[4] బెలిజెలో విస్తారంగా టెర్రెస్ట్రియల్ మరియు సముద్రజీవజాలం ఉంది. అంతేకాక వైవిధ్యమైన పర్యావరణం దేశాన్ని అంతర్జాతీయంగా గుర్తించతగిన మెసోమరికన్ బయోలాజికల్ కారిడార్‌గా గుర్తించబడుతుంది.[5] బెలిజె వైవిధ్యమైన భాషలు మరియు సంప్రదాయాలు కలిగిన దేశం. బెలిజెలో ఆగ్లం అధికారభాషగా ఉంది. బెల్జియన్ క్రియోల్ అనధికార భాషగా వాడుకలో ఉంది. దేశంలో సగంకంటే అధిక ప్రజలు బహుభాషాఙానం కలిగి ఉన్నారు. స్పానిష్ భాష ద్వితీయస్థానంలో ఉంది. బెలిజె మద్య అమెరికా మరియు కరేబియన్ దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. దేశానికి లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి..[6]

బెలిజె కరేబియన్ కమ్యూనిటీ, కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ మరియు కరేబియన్ స్టేట్స్ మరియు సెంట్రల్ అమెరికన్ ఇంటిగ్రేషన్ సిస్టం లలో సభ్యత్వం కలిగి ఉంది.మూడు రీజనల్ ఆర్గనైజేషన్లలో సభ్యత్వం ఉన్న ఒకే దేశంగా బెలిజెకు ప్రత్యేకత ఉంది. రెండవ ఎలిజబెత్ రాణి పాలనలో ఉన్న దేశాలలో బెలిజె ఒకటి. బెలిజె సెప్టెంబర్ ఉత్సవాలు, పగడపు దిబ్బలు మరియు పుంటా సంగీతం దేశానికి ప్రత్యేక గుర్తింపు కలిగిస్తుంది.[7][8]

Etymology[మార్చు]

The origin of the name "Belize" remains unclear.

The earliest known record of the name appears in the journal of the Dominican priest Fray José Delgado, dating to 1677.

[9]

Delgado recorded the names of three major rivers that he crossed while travelling north along the Caribbean coast: Rio Soyte, Rio Xibum, and Rio Balis. The names of these waterways, which correspond to the Sittee River, Sibun River and Belize River, were provided to Delgado by his translator.

[9]

It is likely that Delgado's "Balis" was actually the Mayan word belix (or beliz), meaning "muddy-watered".

[9]

Others have suggested that the name derives from a Spanish pronunciation of the name of the Scottish buccaneer Peter Wallace, who established a settlement at the mouth of the Belize River in 1638.[10] There is no proof that Wallace settled in this area and some scholars have characterized this claim as a myth.[9] Writers and historians have suggested several other possible etymologies, including postulated French and African origins.[9]

చరిత్ర[మార్చు]

ఆరంభకాల చరిత్ర[మార్చు]

Extent of the Maya civilisation

యుకటాన్ ద్వీపకల్పంలో ఉన్న దిగువభూములు మరియు దక్షిణంలో ఉన్న ఎగువభూములలో (ప్రస్తుత మెక్సికో, బెలిజె, గౌతమాలా మరియు పశ్చిమ హండూరాస్ ప్రాంతాలుగా ఉన్నాయి) మయానాగరికత మొదలై దాదాపు మూడువేల సంవత్సరాలు అయ్యాయి. ఈ నాగరికతలోని పలు అంశాలమీద గత 500 సంవత్సరాల నుండి యురేపియన్ నాగరికతలు ఆధిక్యత సాధించాయి. క్రీ.పూ.2,500 కంటే ముందు వేటప్రజల బృందాలు ఇక్కడ ఉన్న చిన్న వ్యవసాయ గ్రామాలలో స్థిరపడ్డారు. తరువాత వారు మొక్కజొన్న, బీంస్, స్క్వాష్ మరియు మిరపకాయలు మొదలైన పంటలు పండించడానికి అలవాటుపడ్డారు.తరువాత మాయానాగరికత నుండి పలు భాషలు మరియు ఉపనాగరికతలు ఆవిర్భవించాయి.క్రీ.పూ. 2,500 నుండి క్రీ.శ. 250 వరకు మయానాగరికత ప్రధానసంస్థలు ఆవిర్భవించాయి. క్రీ.శ. 250 నాటికి మాయానాగరికత ఉచ్ఛస్థితికి చేరింది.[11]

"Caana" at Caracol
"El Castillo" at Xunantunich

మాయా నాగరికత[మార్చు]

మాయానాగరికత ప్రస్తుత బెలిజె ప్రాంతం అంతటా క్రీ.పూ. 1500 ఆరంభమై క్రీ.శ 900 వరకు వర్ధిల్లింది.మద్య మరియు దక్షిణప్రాంత రాజకీయాల మీద 1,40,000 మంది మద్దతుదార్లతో కారకో ఆధిక్యత సాధించిందని నమోదైన వారి చరిత్రకాధారాలు తెలియజేస్తున్నాయి.[12][13] మాయా పర్వతం ఉత్తర భాగంలో లామానై ప్రాంతం ప్రధాన్యత కలిగి ఉంది.[14] మాయానాగరికతలో చివరిదశ మెసొమరికన్ చరిత్రలో (క్రీ.శ. 600 - క్రీ.శ. 1000) బెలిజె ప్రాంతంలో దాదాపు 10,00,000 మంది ప్రజలు నివసించారని భావిస్తున్నారు.[15] 16 వ శతాబ్దంలో ఈప్రాంతానికి స్పెయిన్ అణ్వేషకులు చేరుకున్న ప్రాంతమే ప్రస్తుత బెలిజె. ఇందులో కొరొజెల్ బే సమీపంలో ఉన్న చెటుమల్ ప్రొవింస్, న్యూ రివర్, టిపూ, సిబన్ రివర్ ప్రాంతం మరియు మొంకే రివర్ మరియు సర్స్టూన్ రివర్ సమీపప్రాంతంలో ఉన్న మంచె చోల్ నియంత్రణలో ఉన్న సమీపంలోని డ్జులునికాబ్ ప్ర్రాంతం ఉన్నాయి. [16]

ఆక్రమణ మరియు కాలనీపాలన (1506–1862)[మార్చు]

స్పెయిన్‌కు చెందిన కాంక్విస్టేడర్ ఇక్కడి ప్రాంతాన్ని అణ్వేషించి దానిని ఫ్రెంచి కాలనీగా ప్రకటించాడు. అయినప్పటికీ యుకాటన్ లోని ఇండియన్ గిరిజనుల అతితీవ్రమైన ప్రతీకార స్వభావం మరియు వనరుల కొరత కారణంగా ఇక్కడ నివసించడం మరియు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నివారించాడు. 17-18 శతాబ్ధాలలో బేమాన్ అని పిలువబడే ఇంగ్లీష్ మరియు స్కాటిష్ వలసప్రజలు మరియు సముద్రపు బంధిపోట్లు ఈప్రాంతానికి చేరుకుని ఈప్రాంతంలో లాగ్‌వుడ్ ట్రేడ్ కాలనీ మరియు నౌకాశ్రయం నిర్మించారు.తరువాత కాలంలో అది బెలిజె డిస్ట్రిక్ అయింది.[17]1638లో మొదటగా సముద్రతీరంలో ఉన్న ప్రస్తుత బెలిజె ప్రాంతంలో స్థిరపడ్డారు. తరువాత వారు దాడిచేసిన స్పానిష్ షిప్పుల నుండి ఆశ్రితప్రాంతం కోరారు.18 వ శతాబ్దంలో వలసప్రజలు లాగుల కటింగ్ పని చేపట్టి అట్లాంటిక్ బానిసవ్యాపారుల నుండి బానిసలను కొనుగోలు చేసి బానిస శ్రాంకులచే పనిచేసే విధానం ప్రవేశపెట్టారు. కట్టింగ్ చేసిన కొయ్యను ఉన్ని పరిశ్రమలో ఉపయోగించే అచ్చుల తయారీకి వాడుకున్నారు. స్పానిష్ ప్రభుత్వం ఈప్రాంతంలో సముద్రపు దోపిడీ దారులను నియంత్రించడానికి అనువుగా బ్రిటిష్ వలసప్రజలకు ప్రాంతాన్ని ఆక్రమించి లాగ్‌వుడ్ కాలనీ నెమించడానికి అనుమతించింది.[11]

An excerpt from the 1898 Gazette that declared September 10 an official holiday, part of the efforts of the Centennial Committee

1786లో బ్రిటిష్ వలసప్రజల తరఫున బెలిజె ప్రాంతంలో సూపరింటెండెంటును నియమించబడ్డాడు. అప్పటివరకు స్పెయిన్‌కు ఆగ్రహం కలుగుతున్న కారణంతో బెలిజె ప్రాంతాన్ని బ్రిటిష్ కాలనీగా గుర్తించలేదు. ప్రభుత్వం గుర్తింపు జాప్యం చేసిన సమయంలో వలసప్రజలు తమస్వంత చట్టాలను ఏర్పాటు చేసుకుని స్వంత ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించారు. కొంతమంది వలసప్రజలు విజయవంతంగా భూమి మరియు టింబర్ మీద పట్టుసాధించారు.

1798లో స్పెయిన్ సైన్యం మరియు బేమన్ల మద్య " సెయింట్ జార్జి యుద్ధం " సంభవించింది. యుద్ధంలో చివరికి బేమన్లు విజయం సాధించారు.యుద్ధంలో సాధించిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ బెలిజె జాతీయశలవు దినం ప్రకటించి " ఫస్ట్ బెలిజియంస్ " ఉత్సవంగా జరుపుకుంటుంది.[18]

బ్రిటిష్ సాంరాజ్యంలో భాగంగా (1862–1981)[మార్చు]

19 వ శతాబ్దంలో బ్రిటన్ వలసప్రజల సంస్కరణ చేయాలని భావించింది. 1833లో హెచ్చరిక జారీచేసిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం బానిసత్వం నిర్మూలించింది. [19] ఫలితంగా వలసప్రజలు బానిసలకు వారి మహోగనీ వెలికితీత సామర్ధ్యం ఆధారంగా ఒక్కొకరికి 53.69 యూరోలను నష్టపరిహారం అందజేసింది. [17] బానిసత్వం నిర్మూలించే చివరిదశ నాటికి తమ ఉద్యోగాలలో కొనసాగిన మునుపటి బానిసల పనివిధానాలు మరియు జీవనవిధానాలలో కొంత మార్పు సంభవించింది.కొత్తగా స్వతంత్రత పొందిన ప్రజలకు వ్యక్తిగతమైన భూములకొనుగోలు ౠణసహాయం మొదలైన విషయాలలో పలు సూచనలు మరియు నిబంధనలు ప్రవేశపెట్టబడ్డాయి.కాలనీలో నివసించే ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలకు ఎక్స్ట్రా స్పెషల్ మహోగనీ మరియు లాగ్‌వుడ్ కట్టింగ్ పనుల సామర్ధ్యం అర్హతగా ఉండేది. మునుపటి బానిసలకు టింబర్ కట్టింగ్ పనిచేయడం కాక ఇతర ఉపాధి అవకాశాలు ఉండేవికావు.[17]1836లో స్పెయిన్ అమెరికన్ స్వతంత్రయుద్ధం తరువాత బ్రిటన్ ఈప్రాంత పాలనాధికారం పొందింది. 1862లో గ్రేట్ బ్రిటన్ ఈ ప్రాంతాన్ని " రిటిష్ క్రౌన్ కాలనీ "గా ప్రకటించింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈప్రాంతాన్ని జమైకా సబార్డినేట్ కాలనీగా చేసి దీనికి బ్రిటిష్ హండూరాస్ అని నామకరణం చేసింది. [20] బ్రిటిష్ కాలనీగా బెలిజె ప్రాంతం బ్రిటిష్ పెట్టుబడిదార్లను ఆకర్షించింది.19 వ శతాబ్దంలో బ్రిటిష్ వాణిజ్య సంస్థలలో బెలిజె ఎస్టేట్ మరియు ప్రొడ్యూస్ కంపెనీ ఆధిక్యతసాధించింది. ఆది చివరకు కాలనీలో సగం ప్రైవేట్‌యాజన్య భూమిని కొనుగోలు చేసింది. 19 వ శతాబ్దం అంతటా మరియు 20 వ శతాబ్దం సగం వరకు బెలిజె ఎస్టేట్ మహోగనీ వాణిజ్యంలో తలమానికంగా నిలిచింది.

1930 గ్రేట్ డిప్రెషన్ కాలనీ ఎకానమీ పతనావస్థకు కారణం అయింది. ప్రాంతమంతటా వ్యాపించిన నిరుద్యోగ సమస్య 1931 నాటికి మరింత తీవ్రం అయింది. ప్రభుత్వం అందజేసిన రీలీఫ్ నిధులు సరిపడక చట్టబద్ధం చేసిన లేబర్ యూనియన్లు కనీసవేతనాలు ఇవ్వాలని నిర్భంధించాయి. రెండవ ప్రపంచయుద్ధం కాలంలో బెలిజె ప్రజలలో చాలామంది సైన్యంలో చేరడంతో ఆర్థిక పరిస్థితి కొంత కోలుకుంది.

యుద్ధానికి అధికంగా వ్యయంచేసిన కారణంగా యుద్ధం తరువాత కాలనీ ఆర్థికస్థితి స్తంభించింది. 1949లో బ్రిటన్ తీసుకున్న నిర్ణయం కారణంగా బ్రిటిష్ హండూరాస్ డాలర్ విలువ మరింత పతనమై ఆర్థికస్థితి మరింత దిగజారి పీపుల్స్ కమిటీ రూపకల్పనకు దారితీసింది. పీపుల్స్ కమిటీ బెలిజె స్వంత్రం కొరకు పోరాడింది. పీపుల్స్ కమిటీ తరువాత పీపుల్స్ యునైటెడ్ పార్టీ ఆవిర్భవించింది. పీపుల్స్ యునైటెడ్ పార్టీ రాజ్యాంగ సంస్కరణలు మరియు పెద్దలందరికీ ఓటుహక్కు కావాలని కోరింది. 1954లో యూనివర్సల్ సఫ్రేజ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ హండూరాస్ జనరల్ ఎకెక్షంస్ నిర్వహించబడ్డాయి. స్వతంత్రసమర యోధుడు " జార్జ్ కేడిల్ ప్రైస్ " 1956లో పి.యు.పి. నాయకుడయ్యాడు మరియు 1961లో ప్రభుత్వంలో శక్తివంతమైన నాయకుడు అయ్యాడు. 1984 వరకు వివిధ బిరుదులతో కూడిన పదవిలో కొనసాగాడు.కొత్తరాజ్యాంగ విధానాలతో 1964లో బ్రిటిష్ హండూరాస్‌కు స్వయంప్రతిపత్తి అధికారం ఇవ్వబడింది. 1973 జూన్ 1న బ్రిటిష్ హండూరాస్‌కు బెలిజె అని నామకరణ మార్పిడి చేయబడింది.[21] బెలిజియన్ గౌతమాలన్ టెర్రిటోరియల్ వివాదం స్వతంత్ర పోరాటాన్ని మరింత ముందుకు నడిపించింది.

బెలిజె స్వతంత్ర పోరాటం (1981)[మార్చు]

1981లో బెలిజెకు స్వతంత్రం ఇవ్వబడింది.దీర్ఘకాలంగా కొనసాగుతున్న భూభాగ వివాదాల కారణంగా సరికొత్తగా ఏర్పడిన బెలిజె దేశాన్ని గౌతమాలా గుర్తించడానికి నిరాకరించింది. గౌతమాలా బెలిజె ప్రాంతం తమకు స్వతం అని వాదించింది. ఇరుదేశాలమధ్య సంఘర్షణ తలెత్తకుండా బెలిజెలో 1,500 బ్రిటిష్ సైన్యం నిలిపి ఉంచబడింది. [22] ప్రైస్ నాయకత్వంలో 1984 వరకు అన్ని ఎన్నికలలో పి.యు.పి. విజయం సాధించింది. స్వతంత్ర తరువాత 1984 లో మొదటిసారిగా నిర్వహించబడిన బెలిజె ఎన్నికలలో యునైటెడ్ డెమిరటిక్ పార్టీ పి.యు.పి.ని ఓడించింది. యు.డి.పి. నాయకుడు " మాన్యుయల్ ఎస్క్యువెల్ " ప్రైస్‌ను తొలగించి ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. ప్రైస్ తన స్వంత నియోజకవర్గంలో కూడా ఓటమి (బెలిజె హౌస్ ఆఫ్ రిప్రెజెంటివ్ పదవి కోల్పోయాడు) పొందాడు. ప్రైస్ నాయకత్వంలో పి.యు.పి. పార్టీ 1989లో తిరిగి అధికారం చేపట్టింది. తరువాత సంవత్సరం యునైటెడ్ కింగ్డం బెలిజె లోని సైన్యాన్ని ఉపసహరించుకున్నట్లు ప్రకటించింది. 1994లో బ్రిటిష్ సైన్యం బెలిజెను వదిలివెళుతూ సరికొత్తగా రూపొందించబడిన " బెలిజె డిఫెంస్ ఫోర్స్ "కు సహకరించడానికి సైనికశిక్షణా బృందాన్ని బెలిజెలో వదిలి పోయింది.

1993లో యు.డి.పి. తిరిగి అధికారం చేజిక్కించుకుంది. ఎస్క్యువెల్ తిరిగి ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. తరువాత ఎస్క్యువెల్ చేపట్టిన రాజ్యాంగ విధానాలు గౌతమాలా సరిహద్దు వివాదాలకు తెరతీసింది.

1998లో పి.యు.పి. తిరిగి ఎన్నికలలో విజయం సాధించింది. సైద్ ముసా ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. 2003 ఎన్నికలలో పి.యు.పి. మెజారిటీ నిలబెట్టుకుంది. ముసా ప్రధానమంత్ర పదవిలో కొనసాగాడు. ఆఉఅన అభివృద్ధి రహిత దక్షిణప్రాంతాన్ని అభివృద్ధిపరచడానికి కృషిచేసాడు.

2005లో బెలిజె దేశంలో పి.యి.పి. ప్రభుత్వం అవిశ్వాసతీర్మానం ఎదుర్కొన్నది అలాగే జాతీయ పన్నులు అధికరించబడ్డాయి.బెలిజె జనరల్ ఎన్నికలలో (2008) యునైటెడ్ డెవెలెప్మెంటాఊ పార్టీ విజయం సాధించిన తరువాత 2008 ఫిబ్రవరి 8 న డీన్ బారో ప్రధానమత్రిగా పదవీప్రమాణం చేసాడు. 2012లో బెలిజె జనరల్ లోకల్ ఎన్నికలలో యునైటెడ్ డెవెలెప్మెంటు పార్టీ స్వల్పమెజారిటీతో తిరిగి విజయం సాధించింది.

బెలిజె చరిత్ర మొత్తం బెలిజె మరియు గౌతమాలా మద్య భూవివాదాలు కొనసాగాయి. గౌతమాలా ప్రభుత్వం బెలిజెను తమ మయాపులో 23 వ డిపార్ట్మెంటుగా చిత్రించింది. బెలిజె దేశానికి గౌతమాలాతో ఉన్న సరిహద్దు వివాదాలు అపరిష్కృతంగా నిలిచిపోయాయి[4][23][24] గౌతమాలా 1859 ఆంగ్లో - గౌతమాలా ఒప్పందం ఆధారంగా బెలిజె భూభాగాన్ని కొంత స్వాధీనం చేసుకుంది. ఒప్పందం తరువాత బ్రిటిష్ ప్రభుత్వానికి గౌతమాలా బెలిజె గౌతమాలా నగరాల మద్య రహదారి నిర్మాణానికి అంగీకారం లభించింది.వివిధ సందర్భాలలో బెలిజె మరియు గౌతమాలా మద్య కొనసాగిన భూవివాదాల పరిష్కారానికి యునైటెడ్ కింగ్డం, కరీబియన్ కమ్యూనిటీ, ది ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, మెక్సికో మరియు యునైటెడ్ స్టేట్స్ దేశాలు ప్రయత్నించాయి.[25]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 "Belize". International Monetary Fund. Retrieved 2008-10-09. 
 2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; est2015 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 3. "World Population Prospects: The 2008 Revision Population Database". United Nations. March 11, 2009. Archived from the original on August 19, 2010. Retrieved August 29, 2010. 
 4. 4.0 4.1 "Belize". CIA World Factbook. Central Intelligence Agency. Retrieved January 13, 2016. 
 5. "Ecosystem Mapping.zip". Retrieved July 3, 2012. 
 6. "CARICOM – Member Country Profile – BELIZE". www.caricom.org. CARICOM. Retrieved February 17, 2015. 
 7. "Reid between the lines". Belize Times. January 27, 2012. 
 8. Ryan, Jennifer (1995). "The Garifuna and Creole culture of Belize explosion of punta rock". In Will Straw; Stacey Johnson; Rebecca Sullivan; Paul Friedlander; Gary Kennedy. Popular Music: Style and Identity. pp. 243–248. ISBN 0771704593. 
 9. 9.0 9.1 9.2 9.3 9.4 Twigg, Alan (2006). Understanding Belize: A Historical Guide. Madeira Park, BC: Harbour Publishing. pp. 9–10, 38–45. ISBN 1550173251. 
 10. "British Honduras". Encyclopædia Britannica. 12. New York: The Britannica Publishing Company. 1892. Retrieved October 25, 2010. 
 11. 11.0 11.1 Bolland, Nigel (January 1992). Tim Merrill, ed. "Belize: Historical Setting". A Country Study: Belize. Library of Congress Federal Research Division. 
 12. Houston, Stephen D.; Robertson, J; Stuart, D (2000). "The Language of Classic Maya Inscriptions". Current Anthropology. 41 (3): 321–356. doi:10.1086/300142. ISSN 0011-3204. PMID 10768879. 
 13. "History: Site Overview". Caracol Archaeological Project. Department of Anthropology, University of Central Florida. Retrieved February 19, 2014. 
 14. Scarborough, Vernon L.; Clark, John E. (2007). The Political Economy of Ancient Mesoamerica: Transformations During the Formative and Classic Periods. Albuquerque: University of New Mexico Press. p. 160. ISBN 0826342981. 
 15. Shoman, Assad (1995). Thirteen chapters of a history of Belize. Belize City, Belize: Angelus Press. p. 4. ISBN 9768052198. 
 16. Shoman, Assad (1995). Thirteen chapters of a history of Belize. Belize City, Belize: Angelus Press. pp. 5–6. ISBN 9768052198. 
 17. 17.0 17.1 17.2 Johnson, Melissa A. (October 2003). "The Making of Race and Place in Nineteenth-Century British Honduras". Environmental History. 8 (4): 598–617. doi:10.2307/3985885. JSTOR 3985885. 
 18. Swift, Keith (September 1, 2009). "St. George's Caye Declared a Historic Site". News 7 Belize. 
 19. "3° & 4° Gulielmi IV, cap. LXXIII An Act for the Abolition of Slavery throughout the British Colonies; for promoting the Industry of the manumitted Slaves; and for compensating the Persons hitherto entitled to the Services of such Slaves.". Retrieved August 14, 2015. 
 20. Greenspan, (2007). Frommer's Belize. John Wiley & Sons. pp. 279–. ISBN 978-0-471-92261-2. Retrieved August 15, 2012. 
 21. CARICOM – Member Country Profile – BELIZE, Caribbean Community. (accessed June 23, 2015)
 22. Merrill, Tim, ed. (1992). "Relations with Britain". Belize: A Country Study. GPO for the Library of Congress. 
 23. "Belize-Guatemala border tensions rise over shooting - BBC News". BBC News. 22 April 2016. Retrieved 11 September 2016. 
 24. "ACP-EU summit 2000". Hartford-hwp.com. Retrieved August 29, 2010. 
 25. "Guatemala-Belize Language Exchange Project". Guatemalabelize.com. Retrieved August 29, 2010. 

బయటి లింకులు[మార్చు]

Belize గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo-v2.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

"https://te.wikipedia.org/w/index.php?title=బెలిజ్&oldid=2098888" నుండి వెలికితీశారు