గ్రెనడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Eric Gairy.jpg
ఎరిక్ గారీ , గ్రెనడా మొదటి ప్రధానమంత్రి


ఆగ్నేయకరేబియన్ సముద్రంలో ఉన్న ద్వీపదేశాలలో ఒకటి. ఇందులో గ్రెనడియన్ ద్వీపం, గ్రెనడియన్ ద్వీపమాలిక దక్షిణతీరంలో ఉన్న ఆరు చిన్న చిన్న ద్వీపాలు భాగంగా ఉన్నాయి. ఇది ట్రినిడాడ్ , టొబాగో దేశాలకు వాయవ్యదిశలో వెనుజులా దేశానికి ఈశాన్యదిశలో, సెయింట్ వింసెంట్  దేశానికి నైఋతిదిశలో ఉంది. దేశ వైశాల్యం 344 చ. కి.మీ. 2012 గణాంకాలను అనుసరించి దేశజనసంఖ్య. సెయింట్ జార్జెస్ దీనికి రాజధానిగా ఉంది. గ్రెనడాలో మసాలాదినుసులు విస్తారంగా పండించబడుతున్న కారణంగా ఇది " ఐలాండ్ ఆఫ్ స్పైస్ " గా కూడా గుర్తించబడుతుంది. గ్రెనడాలో పోక, మాక్ పంటలు విస్తారంగా పండించబడి విదేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి.  గ్రెనడా  జాతీయపక్షి  అయిన గ్రెనడా  పావురం తీవ్రంగా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉంది.  

చరిత్ర

[మార్చు]

యురేపియన్లు అమెరిక ఖండాలకు రాకముందు గ్రెనడాప్రాంతంలో అరవాకన్ ప్రజలు, వారి తరువాత ఐలాండ్ కరీబియన్లు నివసిస్తూ ఉండేవారు. 1498 లో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా ఖండాలకు సాగించిన మూడవ సాహసయాత్రలో గ్రెనడాను సందర్శించాడు. ఈద్వీపాన్ని స్పెయిన్ రాజు తన ఆస్తిగా భావించబడినప్పటికీ ఈద్వీపాన్ని స్పెయిన్ స్వాధీనపరచుకుని స్థావరాలు స్థాపించింది అని నిరూపించడానికి అవసరమైన వ్రాతపూర్వకమైన దస్తావేజుల వంటి ఆధారాలు లభించలేదు. తరువాత ఈద్వీపాన్ని కాలనీప్రభుత్వంగా మార్చడానికి ఐరోపియన్ల్లు సాగించిన ప్రయత్నాలను కరీబియన్లు విజయవంతంగా తిప్పి కొట్టారు .1650 తరువాత శతాబ్దంలో ఫ్రెంచి స్థావరాలను బ్రిటిష్ స్వాధీనపరచుకొనడంతో ఇక్కడ బ్రిటిషుప్రభుత్వ వలసపాలన మొదలైంది. 1763 ఫిబ్రవరిలో "ట్రీట్ ఆఫ్ పారిస్ " ఒప్పందం ఆధారంగా గ్రెనడాను బ్రిటిషు వారికి స్వాధీనం చేయబడిన తరువాత ఇక్కడ బ్రిటిషుపాలన కొనసాగింది. 1779 , 1783 మద్య కాలంలో కొంతకాలం ఫ్రెంచి పాలన సాగింది. తరువాత 1974 వరకు బ్రిటిషు పాలన కొనసాగింది. 1958 - 1962 మద్యకాలంలో గ్రెనడా " ఫెడరేషన్ ఆఫ్ వెస్టిండీస్ " లో (స్వల్పకాలం సాగిన ఫెడరేషన్ ఆఫ్ వెస్టిండీస్ కాలనీస్ " లో భాగంగా ఉంది). 1962 మార్చి 3న వెస్టిండీస్ అనుసంధానిత దేశంగా గ్రెనడాకు దేశీయ వ్యవయహారాల స్వయంప్రతిపత్తి కల్పించబడింది. 1967 మార్చి నుండి ఆగస్టు వరకు అసోసియేటెడ్ స్టేట్ ఆఫ్ గ్రెనడాకు "హెర్బత్ బెలిజె " మొదటి ప్రీమియరుగా నియమించబడ్డాడు. 1967 ఆగస్టు నుండి 1974 ఫిబ్రవరి వరకు " ఎరిక్ గైరీ " ప్రీమియరుగా పనిచేసాడు.

స్వాతంత్రం

[మార్చు]

1974 ఫిబ్రవరి 7న ఎరిక్ గ్రెయిరీ నాయకత్వంలో గ్రెనడాకు స్వతంత్రం లభించించిన తరువాత ఎరిక్ గెయిరీ గ్రెనడా మొదటి ప్రధానమంత్రి అయ్యాడు. 1979మార్చిలో " ది మార్కిస్ట్ లెనినిస్ట్ న్యూ జువెల్ మూవ్మెంటు " తిరుగుబాటు  ద్వారా గెయిరీ ప్రభుత్వాన్ని పడగొట్టి " మౌరిస్ బిషప్ ప్రధాన మంత్రిగా " పీపుల్స్ రివల్యూషనరీ గవర్నమెంటు " స్థాపించబడింది. 1983 అక్టోబర్ 19న హార్డ్-లైన్ ఉపప్రధాని బెర్నాండ్ కోయర్డ్ , ఆయన భార్య గ్రెనెడియన్వె సైనికదళానికి వెనుక నుండి పరోక్షంగా మద్దతు అందించి మౌరిస్ బిషప్ ప్రభుత్వాన్ని పడగొట్టి మౌరిస్‌^ను ఖైదుచేసారు. బిషప్ విడిపించబడిన తరువాత అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవ్డానికి ప్రయత్నించి సైకులచేతిలో మరణశిక్షకు గురయ్యాడు.1983 అక్టోబర్ 25న " బార్బోడస్ సెక్యూరిటీ సిస్టం , యునైటెడ్ స్టేట్స్ నుండి బయలుదేరిన సైనికదళాలు " ఆపరేషన్ అర్జెంట్ ఫ్యూరీ " పేరుతో దాడి సాగించారు. బ్రిటన్, ట్రినిడాడ్టుబాగో , కెనడా దేశాలు యునైటెడ్ నేషంస్ జనరల్ అసెంబ్లీతో కలిసి ఈదాడిని తీవ్రంగా ఖండించాయి. 1984 లో " హెర్బత్ బ్లెయిజ్ నాయకత్వంలో నిర్వహించబడిన ఎన్నికలలో విజయంసాధించిన హెర్బత్ బ్లెయిజ్ గ్రెనడా ప్రధానమంత్రి అయ్యాడు. తరువాత ఆయన 1989లో   మరణించే వరకు గ్రెనడా ప్రధానమంత్రిగా కొనసాగాడు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గ్రెనడా&oldid=3675765" నుండి వెలికితీశారు