1498

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1498 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1495 1496 1497 - 1498 - 1499 1500 1501
దశాబ్దాలు: 1470లు 1480లు - 1490లు - 1500లు 1510లు
శతాబ్దాలు: 14 వ శతాబ్దం - 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
ట్రినిడాడ్ మ్యాపు
 • ఫిబ్రవరి: పోర్చుగీసు అన్వేషకుడు వాస్కో డా గామా మాలింది (ఆధునిక కాలపు కెన్యా) చేరుకున్నాడు .
 • మార్చి 2: వాస్కో డా గామా ఆగ్నేయ ఆఫ్రికాలోని క్వెలిమనే, మొజాంబిక్లను సందర్శించారు.
 • మే
  • జాన్ కాబోట్ బ్రిస్టల్‌ను యాత్రకు బయలుదేరాడు. మళ్ళీ కనబడలేడు.
  • ఇంగ్లీష్ మర్చంట్ అడ్వెంచర్లకు నెదర్లాండ్స్‌తో వాణిజ్య గుత్తాధిపత్యం లభిస్తుంది.[1]
 • మే 20: పోర్చుగీస్ నావిగేటర్ వాస్కో డా గామా భారతదేశంలోని కాలికట్ (ఆధునిక కోజికోడ్ ) చేరుకున్నాడు. ఆఫ్రికా చుట్టూ ప్రయాణించి అక్కడికి చేరుకున్న మొదటి యూరోపియన్ అయ్యాడు. తద్వారా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. తనకు అనువాదకుడిగా పనిచెయ్యగల అరబ్ వ్యాపారిని స్థానికంగా కనుగొన్నాడు
 • మే 23: పోప్‌ను విమర్శించినందుకు ఫ్లోరెన్స్ పాలకుడు గిరోలామో సావోనరోలాను ఉరితీశారు.
 • జూన్: రిపబ్లిక్ ఆఫ్ ఫ్లోరెన్స్ యొక్క రెండవ ఛాన్సలర్‌గా నికోలో మాకియవెల్లిని గ్రేట్ కౌన్సిల్ ఎన్నుకుంది.
 • జూలై 31: పశ్చిమ అర్ధగోళానికి తన మూడవ సముద్రయానంలో, క్రిస్టోఫర్ కొలంబస్ ట్రినిడాడ్ ద్వీపాన్ని సందర్శించిన మొదటి యూరోపియన్ అయ్యాడు.
 • ఆగస్టు 1: కొలంబస్ ఒరినోకో నది ముఖద్వారాన్ని కనుగొన్నాడు.
 • ఆగస్టు 412: కొలంబస్‌కు గల్ఫ్ ఆఫ్ పారియా కనబడింది.
 • శాంటా మారియా డెల్లే గ్రాజీ (మిలన్) యొక్క రిఫెక్టరీ గోడపై లియోనార్డో డా విన్సీ ది లాస్ట్ సప్పర్ చిత్రలేఖనాన్ని పూర్తి చేసాడు.
 • పూర్ణానంద సదాశివేంద్ర సరస్వతి తరువాత వ్యాసాచల మహాదేవేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపతి అయ్యాడు
 • శ్రీకృష్ణ దేవరాయలు తిరుమల దేవిని పెళ్ళి చేసుకున్నాడు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
 • పూర్ణానంద సదాశివేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠాధిపతి (జ. 1417)

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. Palmer, Alan; Veronica (1992). The Chronology of British History. London: Century Ltd. pp. 135–138. ISBN 0-7126-5616-2.
"https://te.wikipedia.org/w/index.php?title=1498&oldid=3904627" నుండి వెలికితీశారు