వైశాలి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైశాలి జిల్లా
वैशाली जिला ضلع ویشالی
బీహార్ పటంలో వైశాలి జిల్లా స్థానం
బీహార్ పటంలో వైశాలి జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుతిర్హుత్
ముఖ్య పట్టణంహాజీపూర్
Government
 • లోకసభ నియోజకవర్గాలుహాజీపూర్, వైశాలి
Area
 • మొత్తం2,036 km2 (786 sq mi)
Population
 (2011)
 • మొత్తం34,95,249
 • Density1,700/km2 (4,400/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత68.56 %
 • లింగ నిష్పత్తి892
ప్రధాన రహదార్లుNH 19, NH 77, NH 103
Websiteఅధికారిక జాలస్థలి

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో జిల్లాలలో వైశాలి జిల్లా (హిందీ:) ఒకటి. వైశాలి పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. వైశాలి పురాతకాలానికి చెందిన ప్రాంతం అని భావిస్తున్నారు. వైశాలి జిల్లా తిరుహట్ డివిజన్‌లో భాగం. మాహాభారతంలో ఈ ప్రాంతం ప్రస్తావించబడింది. ఈ ప్రాంతం బౌద్ధులకు, జైనులకు కూడా పవిత్రమైనదిగా ఉంది. జిల్లావైశాల్యం .... చ.కి.మీ.[1]

చరిత్ర[మార్చు]

పురాతన వైశాలి[మార్చు]

Budha Stupa in Vaishali.
వైశాలి నగరంలో బౌద్ద స్థూపం

రామాయణ కాలంలో ఈ ప్రాంతాన్ని రాజా వైశాల్ పాలించాడని అందుకే ఇది వైశాలి అయిందని పురాణకథనాలు వువరిస్తున్నాయి. బుద్ధిజం, జౌనిజం ఆరంభానికి ముందే వైశాలి విబ్రంత్ రిపబ్లిక్ రాజధానిగా ఉండేది. క్రీ.పూ 599 లో మహావీరుడు జన్మించక ముందే రిపబ్లిక్‌గా ఉన్న విబ్రంత్ ప్రపంచంలో మొదటి ప్రజారాజ్యంగా గుర్తించబడుతుంది. తరువాత పురాతన గ్రీసులో ప్రజారాజ్య పాలన ఆదంభం అయింది.[2] ఆరోజులలో విశాలి ఒక మహానగరం, విశాలరాజ్యానికి రాజధానిగా ఉండేది. హిమాలయాలలోని గంగాభూభాగంలో ఉండేది. (ప్రస్తుత బీహార్ రాష్ట్రం) పురాతన వైశాలి గురించి స్వల్పంగా మాత్రమే వివరాలు లభిస్తున్నాయి. విష్ణుపురాణం వైశాలి రాజ్యానికి సంబంధించిన 24 రాజుల గురించి వివరిస్తుంది. వీరిలో మొదటి వాడు నాభాగుడు. ఆయన మానవ హక్కుల రక్షణార్ధం సుంహాసనాన్ని విసర్జించి భూమిని దున్నాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. వీరిలో చివరి రాజు సుమతి. సుమతి దశరథుని సమకాలీనుడని విశ్వసిస్తున్నారు.

పరిశోధనలు[మార్చు]

వైశాలిలోని మహాజనపదాలు పలు బౌద్ధ, జైన గ్రంథాలలో విస్తారంగా ప్రస్తావించబడ్డాయి. లభించిన సమాచారం అనుసరించి క్రీ.పూ 6వ శతాబ్దంలో గౌతమబుద్ధుని పుట్టుకకు మునుపే 563లో ఇక్కడ ప్రజారాజ్యం అవతరించినట్లు తెలుస్తుంది. ఇది ప్రపంచంలోని మొదటి ప్రజారాజ్యంగా గుర్తించబడుతుంది. వైశాలి ప్రజారాజ్యంలో మహావీరుడు జన్మించాడని, గౌతమ బుద్ధుడు తన చివరి ప్రసంగాన్ని వైశాలి నగరంలో చేసాడని ఆ సందర్భంలో తన పరినిర్వాణం గురించి ప్రకటించాడని భావిస్తున్నారు. వైశాలి అమ్రపాలి ప్రాంతమని భావిస్తున్నారు. అమ్రపాలి గొప్ప న్యాయాధికారి, బౌద్ధమత రచయిత, బుద్ధుని శిష్యుడు.

స్థూపాలు[మార్చు]

జిల్లాలో అభిషేక్ పుష్కరిణి ఉంది. తరువాత జపాన్ ఆలయం, జపాన్ దేశస్తుడు నిప్పోంజన్ మియోహోజి నిర్మించిన విశ్వశాంతి స్థూపం ఉంది, బుద్ధుని అవశేషాల మీద నిర్మించిన స్థూపం అని భావిస్తున్నారు. అభిషేక్ పుష్కరిణి సమీపంలో ఉన్న స్థూపానికి సంబంధించిన అవశేషాలు లభించాయి. మహాపరినిర్వాణం తరువాత వారు అందుకున్న బుద్ధుని అషులలో ఒక భాగం ఈ స్థూపంలో ఉందని విశ్వసిస్తున్నారు. ఖుషీ నగర్ వద్ద బుద్ధుడు చేసిన చివరి ప్రసంగానికి ఉత్తేజితుడైన లిచ్చావి ఆయనను అనుసరించి వెళ్ళాడు. లిచ్చావీకి బుద్ధుడు తనభిక్షాపాత్రను కానుకగా ఇచ్చి వెనుతిరిగి వెళ్ళమని ఆదేశొంచాడు. అయినప్పటికీ లిచ్చావి వెనుతిరగడానికి నిరాకరించాడు. అప్పుడు బుద్ధుడు ఒక మాయా సరోవరం సృష్టించి లిచ్చావీని వెనుతిరిగేలా చేసాడు. ఆప్రదేశం ప్రస్తుతం దుయోరా లోని కేసరియా అని భావిస్తున్నారు. తరువాత ఇక్కడ అశోకుడు స్థూపం నిర్మించాడు. విశాలి నగరానికి వెలుపల ఉన్న గంగా నదిలో బుద్ధుని ప్రియశిష్యుడు ఆనందా నిర్యాణం చెందాడని భావిస్తున్నారు.

స్వతంత్రం తరువాత[మార్చు]

1972లో ముజాఫర్‌పూర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి వైశాలి జిల్లాను రూపొందించారు. .[3]

భౌగోళికం[మార్చు]

వైశాలి జిల్లా వైశాల్యం 2036 చ.కి.మీ.[4] ఇది స్పెయిన్ దేశంలోని తెనెరైఫ్ వైశల్యానికి సమానం.[5] వైశాలి జిల్లా తిరుహట్ జిల్లాలో భాగం. హజిపూర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. 1972 అక్టోబరు 12వ తేదీన ముజ్జాఫర్పూర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి వైశాలి జిల్లాను రూపొందించారు.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో వైశాలి జిల్లా ఒకటి అని గుర్తించింది.[6] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[6]

విభాగాలు[మార్చు]

  • వైశాలి జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి:- హాజీపూర్, మహ్నార్, మౌహ
  • మండలాలు:- మహ్నర్, వైశాలి, బిదుపుర్, గొరౌల్, రఘొపుర్,లల్గంజ్, హాజీపూర్, మహువా, జందహ, పతెపుర్, సహ్దైబుజుర్గ్, భగ్వంపుర్, చెహ్రకల, రజపకర్, పతెధి-బెల్షర్, దెస్రి
  • దౌద్నగర్ చక్‌గదొ:- ఇది జిల్లాలో పెద్ద గ్రామ పంచాయితీ, ఆర్థికాభివృద్ధి చెందిన గ్రామంగా గుర్తించబడుతుంది.

గ్రామంలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,495,249,[7]
ఇది దాదాపు. పనామా దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో. 86 వ స్థానంలో ఉంది.[7]
1చ.కి.మీ జనసాంద్రత. 1717 [7]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.58%.[7]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే. 892:1000 [7]
అక్షరాస్యత శాతం. 68.56%.[7]
జాతియ సరాసరి (72%) కంటే.

వృక్షజాలం , జంతుజాలం[మార్చు]

1997లో వైశాలి జిల్లాలో 2 చ.కి.మీ వైశాల్యంలో " బరేలా సలీం అలి జుబ్బ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది. [10]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-03-16. Retrieved 2020-07-30.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-23. Retrieved 2014-12-09.
  3. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  4. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  5. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Tenerife 2,034km2
  6. 6.0 6.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Panama 3,460,462 July 2011 est.
  9. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Connecticut 3,574,097
  10. Indian Ministry of Forests and Environment. "Protected areas: బీహార్". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
మూస:Vaishali district topics

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]