Jump to content

బేగుసరాయ్ జిల్లా

వికీపీడియా నుండి
బేగుసరాయ్ జిల్లా
बेगूसराय जिला ضلع بیگو سراےء
బీహార్ పటంలో బేగుసరాయ్ జిల్లా స్థానం
బీహార్ పటంలో బేగుసరాయ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుదర్భంగా
ముఖ్య పట్టణంబేగుసరాయ్
Government
 • లోకసభ నియోజకవర్గాలుబేగుసరాయ్
విస్తీర్ణం
 • మొత్తం1,918 కి.మీ2 (741 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం29,54,367
 • జనసాంద్రత1,500/కి.మీ2 (4,000/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత66.23 %
 • లింగ నిష్పత్తి894
ప్రధాన రహదార్లుNH 31, NH 28
సగటు వార్షిక వర్షపాతం1384 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో బేగుసరాయ్ జిల్లా ఒకటి. బేగుసరాయ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

బేగుసరాయ్ అనేపేరుకు మూలం బేగంసరాయ్. ఇది కాలక్రమంలో బేగుసరాయ్‌గా మారింది..

చరిత్ర

[మార్చు]

బేగుసరాయ్ 1870లో ముంగర్ జిల్లాలో భాగంగా ఉండేది. 1972లో దీనికి జిల్లా అంతస్తు ఇవ్వబడింది.[1] సిమరియా గ్రామం ప్రముఖ హిందీ కవి రాంధారి సింగ్ దినకర్ జన్మస్థానం. ఆయన జీవితంలో అత్యధిక భాగం ముంగర్‌లో గడిచింది. బేగుసరాయ్ పౌరాణిక మిథిలారాజ్యంలో భాగంగా ఉండేది.

భౌగోళికం

[మార్చు]

బేగుసరాయ్ జిల్లా వైశాల్యం 1918 చ.కి.మీ.[2] ఇది ఇండోనేషియాలోని బియాక్ ద్వీపజనసంఖ్యకు సమానం.[3] జిల్లా గంగానది ఉత్తరతీరంలో ఉంది. బేగుసరాయ్ జిల్లా దర్భంగా డివిజన్‌లో భాగం. జిల్లా 25.15 నుండి 25.45 ఉత్తర అక్షాంశం, 85.45 నుండి 86.36 తూర్పు రేఖాంశంలో ఉంది.

జాతీయ అభయారణ్యం

[మార్చు]
  • జిల్లాలో 1989లో " కన్వర్ లేక్ బర్డ్ శాంక్చ్యురీ స్థాపించబడింది.

విభాగాల వివరణ

[మార్చు]
విషయాలు వివరణలు
ఉపవిభాగాలు 4 బేగుసరాయ్ అండ్,మంజహుల్,బల్లియా,బఖరి,తెఘర
అసెంబ్లీ నియోజక వర్గం
పార్లమెంటు నియోజక వర్గం బేగుసరాయ్

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బేగుసరాయ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4] జిల్లాలో 1200 కోట్ల నగదు బదిలీలు జరుగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ ఉంది

ప్రధాన ఉత్పత్తులు

[మార్చు]
  • వ్యవసాయం :- జిల్లాలో అర్హర్, మినుము, గోధుమ, మొక్కజొన్న, ఆవాలు, తిసి, పొద్దుతిరుగుడు వంటి పంటలు పండించబడుతున్నాయి.
  • వాణిజ్యపంటలు :- నూనెగింజలు, పొగాకు, జనుము, ఎండుమిరపకాయలు, టమేటా, అండి పంటలు పండించబడుతున్నాయి.
  • పడ్లతోటలు :- మామిడి, జామ, లిచి పంటలు పండించబడుతున్నాయి.
  • పరిశ్రమలు:- ఇండియన్ ఆయిల్ ఇండస్ట్రీ, బరౌని ధర్మల్ పవర్ స్టేషను, వందలాది చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. బరౌని వద్ద హెచ్.ఎఫ్.సి లిమిటెడ్ వారి ఎరువుల కంపెనీ ఉంది. ఇది 2003లో మూతపడింది.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

జిల్లాలో బరౌని రైల్వేస్టేషను ప్రధానమైనది. పలు రైళ్ళకు ఇది ఆరంభస్థానంగా ఉంది. ఇది రాజేంద్ర వంతెన ద్వారా దక్షిణ బీహార్ రాష్ట్రంతో అనుసంధానితమై ఉంది.

  • జాతీయరహదారి -28 మరొయు జాతీయరహదారి -31 దినకర్ చౌక్ వద్ద కలుసుకుంటాయి. ఇక్కడ నుండి దూరప్రాంతాలకు ప్రభుత్వ, ప్రైవేటు బసులు నడుపబడుతుంటాయి.

ఇక్కడి నుండి బీహార్ రాష్ట్ర ఇతర ప్రాంతాలకు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలకు బసు సౌకర్యం లభిస్తుంది. ప్రాంతీయ బసులను ప్రైవేట్ సంస్ంస్థలు నడుపితున్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,970,541,[5]
ఇది దాదాపు. అర్మేనియా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. మిసిసిపి నగర జనసంఖ్యకు సమం..[7]
640 భారతదేశ జిల్లాలలో. 128 వ స్థానంలో ఉంది..[5]
1చ.కి.మీ జనసాంద్రత. 1540 .[5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 26.44%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 895:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 63.87%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

సంస్కృతి

[మార్చు]

పర్యాటకం

[మార్చు]
  • నదులు :- గంగాలు, బుధి గంధక్, బాలన్, బైని, చంద్రభాగ.
  • కంవర్ ఝీల్ :- కబర్ ఝీల్ ఆసియాలోని అతిపెద్ద మంచినీటి చెరువుగా గుర్తించబడుతుంది. ఇక్కడ పక్షుల శరణాలయం ఉంది.
  • నోట్వర్తి :- ఇది గంగానది మీద బరౌని వద్ద నిర్మించబడిన వంతెన. ఇది వలస పక్షులకు విశ్రాంతి తీసుకునే ప్రదేశం. బరౌని ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌కు ప్రత్యేకత కలిగి ఉంది.

నౌలాఘర్

[మార్చు]

నౌలాఘర్ (86° 04' 00"/25° 33' 15") బేగుసరాయ్ జిల్లా బీర్పూర్ నౌలా వద్ద ఉంది.

మౌండ్

[మార్చు]

మౌండ్ పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది. మౌండ్ ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంటుంది. రహదారి మార్గం మౌండును రెండుగా చేస్తుంది. ఎ.ఐ.హెచ్ కల్చర్, బేగుసరాయ్ లోని జి.డి కాలేజ్‌కి చెందిన ఆర్కియాలనీ శాఖ మైండును రెండుమార్లు పరిశోధించింది. మౌండ్ ఉత్తరభాగం సహజ సౌందర్యం, మానవ నిర్మిత నీటికాలువలతో అందంగా ఉంటుంది. బీర్పూర్‌కు పశ్చిమంలో 3.5 కి.మీ దూరంలో ఉంది. ఇది 1.5 కి.మీ పొడవున విస్తరించి ఉంది. మౌండ్ తూర్పున ఫాంసిరై తోలా, పడమర మాక్వా పంచాయితీ, దక్షిణంలో బైంటి మద్యన ఉంది. తూర్పున రెండు నదులు సంగమిస్తున్నాయి.

పాటరీ

[మార్చు]

ఎన్.బి.పి, బ్లాక్ స్లిప్డ్, కాల్చినవి (మెరుగుదిద్దిన సాదా పాత్రలు) రెడ్ వేర్ (మెరుగుదిద్దిన సాదా పాత్రలు), లోపల నల్లని వెలుపల ఎర్రని పాత్రలు, పదార్ధాలను పెద్ద మొత్తంగా నిల్వౌంచగలిగిన పాత్రలు, నీటి కూజాలు, వంట పాత్రలు, చిన్న, పెద్ద ప్లేట్లు, బౌల్స్, లోతైన పెనం, చదునైన పెనం మొదలైన మట్టిపాత్రలు తయారుచేయబడుతున్నాయి.

1950- 1952 మద్యన ఆర్.కె చౌదరి ఈ మౌండును పరిశోధించాడు. ప్రాంతీయ నివాసి అరవింద్ ప్రసాద్ సింగ్ మౌండ్ వద్ద లభించిన నాణ్యాలను, పురాతన వస్తువులను భద్రపరచి ఉంచాడు. ఆయన వీటిని బేగుసరాయ్ లోని జి.డి కాలేజ్ మ్యూజియానికి దానంగా ఇచ్చాడు. ఇక్కడ విరిగిన స్థితిలో మూడవ విగ్రహ పాలుని నల్లరాతి విగ్రహాలు మ్యూజియంలో ప్రదర్శించబడుతున్నాయి. జి.డి కాలేజ్ బులెటిన్‌లో శాలాక్షరాలు ముద్రించబడ్డాయి.

అభయారణ్యం

[మార్చు]

1989లో జిల్లాలో 63 చ.కి.మీ వైశాల్యంలో " వన్యమృగ అభయారణ్యం " ఏర్పాటు చేయబడింది. .[8]

విద్య

[మార్చు]

1994 నుండి బేగుసరాయ్‌ జిల్లాలో ప్రముఖ కంపూటర్, మేజ్మెంటు విద్యాసంస్థ విద్యార్థులకు ఐ.టి, మేనేజ్‌మెంటు సంబంధిత ఉన్నతస్థాయి విద్యను అందిస్తుంది. ఈ సంస్థలో విద్యను అభ్యసించిన 30,000 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఇప్పటికే విద్యను అభ్యసిస్తున్నారు. 2013 డిసెంబరు 23న రాంధారి సింగ్ దినకర్ ఇంజనీరింగ్ కాలేజ్‌కు శంకుస్థాపన జరిగింది. దీనికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. ఇది బీహార్ రాష్ట్రంలో 8 వ ఇంజనీరింగ్ కాలేజీగా అవతరించనుంది.[9][10] జిల్లాలోని కాలేజీలన్ని లలిత్‌నారాయణన్ మిథిల విశ్వవిద్యాలయం (దర్భంగ) ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. జిల్లాలో ప్రముఖంగా జి.డి కాలేజ్, కో-ఆపరేటివ్ కాలేజ్, మహిళా కళాశాల, సి.ఎ.బి.ఎస్ ఇంటర్ కాలేజ్ (ఖంహర్ ;బేగుసరాయ్) ఇగ్నో, నలంద ఓపెన్ విశ్వవిద్యాలయం జి.డి కాలేజ్ అండ్ కో-ఆపరేటివ్ కాలేజ్‌లు ఉన్నాయి.

బేగుసరాయ్ జిల్లా ఉన్నత విద్యకు రాష్ట్రస్థాయిలో ప్రసిద్ధి చెంది ఉంది. ఎస్.టి పౌల్స్ స్కూల్ ఆర్ధ్వర్యంలో నిర్వహించబడుతున్న సైబర్‌స్కూల్ అనే కంప్యూటర్, ఇంఫర్మేషన్ స్కూల్ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తుంది. ఐ.టి గురుకుల్ విద్యార్థులకు సి.సి.ఎ, డి.సి.ఎ, ఎ.డి.సి.ఎ, పి.జి.డి.సి.ఎ, సి.ఎఫ్.ఎ, డి.ఎఫ్,ఎ, డి.సి.టి.టి, హెచ్.టి.ఎం.ఎల్, పి.హెచ్.పి.మొదలైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్సులను అందిస్తుంది. జిల్లాలో 3 కేంద్రీయ విద్యాలయాలు (కేంద్రీయ విద్యాలయ (ఐ.ఒ.సి.ఎల్ కాలనీ), హెచ్.ఎఫ్.సి కాలనీ, గర్హర) ఉన్నాయి.

జిల్లాలో పలు సి.బి.ఎస్.సి స్కూల్స్ (న్యూఢిల్లీ) ఉన్నాయి. జిల్లాలోని ఇతర స్కూల్స్:-

  • సెయింట్ పాల్ యొక్క స్కూల్,
  • బి.ఆర్. డి.ఎ.వి పబ్లిక్ స్కూల్,
  • డి.ఎ.వి పబ్లిక్ స్కూల్,
  • రామ్నిక్ బాబా పి.డి అకాడమీ భరద్వాజ్ గురుకుల్ (బోర్డింగ్ స్కూల్),
  • తక్షశిల, డి.పి.ఎస్ పాఠశాల ఎస్.టి. అన్నే (టిల్రాత్)
  • ఒక వైద్య కళాశాల,
  • ఆయుర్వేద వైద్య అధ్యయనాలు కోసం శివ్ కుమారి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ (బేగుసరాయ్ రైల్వే స్టేషను సమీపంలో). లోహినగర్, పొఖరియా, సర్వోదయా లలో జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జిల్లాలో బి.ఎస్.ఎస్ ఇంటర్నేషనల్ ఉన్నత పాఠశాల, బిష్ణుపూర్, బి.పి ఉన్నత పాఠశాల వంటి ప్రముఖ స్కూల్స్ ఉన్నాయి. చౌరాహి బకద్దా వద్ద పురాతనమైన ఆర్.కె.హెచ్.స్కూల్ ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Biak 1,904km2
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Armenia 2,967,975 July 2011 est.
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Mississippi 2,967,297
  8. Indian Ministry of Forests and Environment. "Protected areas: బీహార్". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
  9. "CM lays foundation of engineering college". Times of India. 23 December 2013. Retrieved 23 December 2013.
  10. "Nitish lists special tag cry as LS poll plank". The Telegraph. 23 December 2013. Retrieved 23 December 2013.

బయటి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]