సమస్తిపూర్ జిల్లా
సమస్తిపూర్ జిల్లా
समस्तीपुर जिलाضلع سمستی پور | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | దర్భంగా |
ముఖ్య పట్టణం | సమస్తిపూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,904 కి.మీ2 (1,121 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 42,54,782 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,800/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 63.81 % |
• లింగ నిష్పత్తి | 909 |
ప్రధాన రహదార్లు | NH28, NH 103 |
Website | అధికారిక జాలస్థలి |
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో సమస్తిపూర్ జిల్లా ఒకటి. సమస్తిపూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2904 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 27,16,929.
చరిత్ర
[మార్చు]జిల్లా ప్రాంతం కొంతకాల అస్థిరత్వం తరువాత ఒనివరాలు (సా.శ. 1325-1525) (సుగౌనా రాజవంశానికి చెందిన కామేశ్వర ఠాకూర్) ఆధీనంలో ఉండేదని దర్భంగా జిల్లా రికార్డుల ద్వారా తెలుస్తుంది. హిందూ రాజులను ముస్లిం పాలకులు ఈ ప్రాంతం నుండి తరిమివేయబడ్డారు. ఒనివరాలు కళలను పోషించారు. ఒనివరాలు సంస్కృత వేదాంతం, సాహిత్యానికి కేంద్రగా ఉండేది. ఈ కాలానికి చెందిన సాహిత్యకారులలో గాంధార, సంకర, వాచస్పతి మిశ్రా, విద్యాపతి, అమర్తకర, అమియకర వంటి పండితులు ప్రముఖులు. రాజవంశ మూలపురుషుడు పుసా రహదారి సమీపంలోని ఒయిని గ్రామ నివాసి. జిల్లా దక్షిణ ప్రాంతం హాజి ఇలియాస్ ఆధీనంలోనూ, ఉత్తర ప్రాంతం ఒనివారాల ఆధీనంలోనూ ఉండేది. ఆధునిక సమస్తిపూర్ ఉపవిభాగాన్ని పశ్చిమ బెంగాలుకు చెందిన హాజీ షంసుద్దీన్ ఇలియాస్ స్థాపించాడు. 1972లో సమస్తిపూర్ జిల్లాగా రూపొందింది.[1]
భౌగోళికం
[మార్చు]సమస్తిపూర్ జిల్లా వైశాల్యం 20904 చ.కి.మీ.[2] ఇది ఇండోనేషియా లోని మునా ఐలాండ్ వైశాల్యానికి సమానం[3]
సరిహద్దులు
[మార్చు]సమస్తిపూర్ జిల్లా ఉత్తర సరిహద్దులో ప్రవహిస్తున్న బగ్మతి నది జిల్లాను దర్భంగా జిల్లాను వేరుచేస్తూ ఉంది, పశ్చిమ సరిహద్దులో వారణాసి జిల్లా, ముజాఫర్ జిల్లాలో కొంత భాగం ఉంది, దక్షిణ సరిహద్దులో గంగానది, తూర్పు సరిహద్దులో బేగుసరాయ్ జిల్లా, ఖగారియా జిల్లాలో కొంతభాగం ఉనంది.
నదులు
[మార్చు]సమస్తిపూర్ జిల్లాలో బుధి గంధక్, భయా, కోసి, కమ్లా, కరేష్, ఝంవరి, బలన్ వంటి పలు నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లా దక్షిణంలో గంగానది ప్రవహిస్తుంది. .
విభాగాల వివరణ
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
తాలూకాలు | 4 దల్సింఘ్సరై, పతొరి, రొసెర, సమస్తిపూర్ సదర్ |
సమస్తిపూర్ ఉపవిభాగంలోని మండలాలు | 8 సమస్తిపూర్, తాజ్పూర్, మొర్వ, ఖాన్పూర్, సరైరంజన్, పూసా, వరిస్నగర్, కల్యాణ్పుర్. |
రొసెర మండలాలు | 6 రొసెర, హసంపుర్, బిథన్, శివాజీ నగర్, సింఘియ, బిభుతిపుర్ |
దల్సింఘ్సరై ఉపవిభాగంలోని మండలాలు | 3 దల్సింఘ్సరై, ఉజీర్పుర్, విద్యపతినగ్ర |
పతొరి ఉపవిభాగంలోని మండలాలు | పతొరి, మొహంపుర్, మొహియుద్దిన్ నగర్ |
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సమస్తిపూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]
పరిశ్రమలు
[మార్చు]సమస్తిపూర్ జిల్లాలో ఈస్ట్ సెంట్రల్ రైల్వే సబ్‌డివిజన్ ఉంది.జిల్లాలో చక్కెర మిల్లులు, పేపర్ మిల్లులు, జనపనార మిల్లులు, రైల్వే ఫ్యాక్టరీ ఉంది.
వ్యవసాయం
[మార్చు]సమస్తిపూర్ జిల్లాలో సారవంతమైన వ్యవసాయభూములు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా పొగాకు, మొక్కజొన్నలు, వరి, గోధుమ పండించబడుతున్నాయి. లిచి, మామిడి పండ్లు విస్తారంగా పండించబడుతున్నాయి. చంద్చౌర్ గ్రామంలో విస్తారంగా కూరగాయలు పండించబడుతున్నాయి. మానిక గ్రామంలో పొగాకు విస్తారంగా పండించబడుతుంది. మిక్తాపూర్‌లో జనపనార మిల్లు ఉంది. ప్రసిద్ధమైన ఈ మిల్లు 5,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన షేఖోపూర్‌లో మణిపూర్ వద్ద ప్రముఖ భగవతిస్థాన్ ఆలయం ఉంది. సమస్తిపూర్‌లో పలు చక్కెర మిల్లులు ఉన్నాయి. సమస్తిపూర్ చక్కెర ఉత్పత్తి రాష్ట్రంలో ప్రధానపాత్ర వహిస్తింది. సమస్తిపూర్‌లో అధికంగా ఉర్లగడ్డలు పండించబడుతున్నాయి. జిల్లాలో 29 కంటే అధికంగా కోల్డ్ స్టోరేజులు ఉన్నాయి. జిల్లా వార్షిక ఉర్లగడ్డల ఉత్పత్తి 6,50,000 క్వింటాళ్ళు.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 4,254,782,[5] |
ఇది దాదాపు. | రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | కెంటకీ నగర జనసంఖ్యకు సమం.[7] |
640 భారతదేశ జిల్లాలలో. | 45 వ స్థానంలో ఉంది.[5] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1465 .[5] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 25.33%.[5] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 909:1000 [5] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 63.81%.[5] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
సంస్కృతి
[మార్చు]సమస్తిపూర్ ప్రజల సంస్కృతి నిరాడంబరం, లౌకిక తత్వం కలిగి ఉంటుంది. జిల్లా జానపద సంగీతం, పురాతన మిథిలా చిత్రలేఖనం వంటి కళలకు గుర్తింపు పొందింది. పండుగ సంబరాలలో జానపద గీతాలు చోటుచేసుకుంటాయి. కథ్గోర్వా నృత్యం, నతౌవా నృత్యం, జానపదనృత్యం, డాం డామిన్, ఝిఝియా మొదలైన నృత్యరీతులను ప్రజలు అభ్యసిస్తుంటారు. ప్రఖ్యాత సమా చక్వా, డాం కాచ్ సంస్కృతి కూడా జిల్లాలో వాడుకలో ఉంది. బాత్ డాల్, చొఖా ప్రజల అభిమాన వంటకాలు. సాధారణంగా పురుషులు ధోతీ, కుర్తా స్త్రీలు చీర ధరిస్తుంటారు.
ఆలయాలు
[మార్చు]- నగర కేంద్రంలో థానేశ్వర్ ఆలయం (ప్రఖ్యాత శివాలయం) ఉంది. జిల్లాలో పలు ఇతర ఆలయాలు ఉన్నాయి. వీటిలో మొర్వా (మోహన్‌పూర్) ప్రముఖ కుందేశ్వర్ స్థాన్ ఆలయం ప్రధానమైనది.
- కెస్సోపట్టిలో ఉన్న పురాతన దుర్గా ఆలయంలో ప్రతిసంవత్సరం దుర్గాపూజ సమయంలో అనేకమంది భక్తులు దేవి ఆరాధనకు వస్తుంటారు. విద్యాపతి నగర్‌లో ప్రఖ్యాత విద్యాపతి బలేశ్వర్ స్థాన్ (శివాలయం) ఉంది. విద్యాపతినగర్‌లో ప్రఖ్యాత గురువు విద్యాపతి నిర్యాణం పొందాడు. ఉపవిభాగంలోని దెకరిలో గురు విద్యాపతి దాల్సింగ్‌సరై చివరిశ్వాస విడిచాడు.
- జిల్లాలోని పురాతన ఆలయాలలో మన్నిపూర్ భగవతిస్థాన్ ఒకటి. ప్రతిరోజు దుర్గా ఆలయానికి అనేకమంది భక్తులు దూరప్రాంతాల నుండి వస్తుంటారు. ఈ ప్రాంతంలో భక్తుల పాపాన్ని హరించి వారు కన్న కలలు నిజమౌతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయం 200 సంవత్సరాల పురాతనమైనది.
- సమస్తిపూర్‌కు 16 కి.మీ దూరంలో మొర్వా మండలంలో ఉన్న ఖుందేశ్వర్ శివాలయం హిందూ ముస్లిం సమైక్యతకు సాటిలేని ఉదాహరణగా నిలిచిఉంది. శివలింగం పక్కన ఖుద్నొ బీబి శిల్పం ఉంది. ఖుద్నొ బీబి శివలింగ స్థాపన చేసినట్లు ఆలయంలోని ఆధారాలద్వారా తెలుస్తుంది. మహాశివరాత్రి సందర్భంలో జిల్లా అంతటి నుండి ఆలయానికి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో ప్రాంతీయ ప్రజల సహకారంతో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. మహేశ్వరి ఉత్సవ సమయంలో జిల్లా అంతటి నుండి భక్తులు శివుని ఆరాధించడానికి వస్తుంటారు. జిల్లాలోని మొహియుద్దీన్నగర్ మండలంలోని హ్రైల్ గ్రామంలో ప్రబల కాళీ ఆలయం ఉంది.
ప్రముఖులు
[మార్చు]జిల్లాకు చెందిన పలువురు దేశవిదేశాలలో ఖ్యాతిగడించారు. సమస్తిపూర్‌కు చెందిన పలువురు దేశవిదేశాలలో ఖ్యాతిగడించిన శాస్త్రఙఉలు, నాయకులు, స్వతంత్రసమరయోధులు, రాజకీయనాయకులు, గుర్తింపు తెచ్చుకున్న మంత్రులు ఉన్నారు.
- Shri Satya Narayan Sinha|సత్యనారాయణ సింహా స్వతంత్రసమర యోధుడు, ఆయన జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో
మత్రిపదవి అలంకరించాడు.
- కర్పురి ఠాకూర్ సోషలిస్ట్ నాయకుడు, ఆయన రెండుమార్లు (1967-1977) బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఆయన ప్రస్తుత కర్పురి గ్రామంలో నివసించాడు.కర్పురి గ్రామానికి ఈ పేరు ఆయన ఙాపకర్ధం నిర్ణయించబడింది.
- శిల్ప సింగ్:- 2012 మిస్ యూనివర్స్ పోటీకి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఈ పోటీ 2012 డిసెంబరులో లాస్‌వెగాస్‌లో నిర్వహించబడింది.
- డాక్టర్ దియోదత్తా రాయ్ :- అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతదేశంలో జన్మించిన అమెరికన్ కేంసర్ స్కాలర్. ఆమె స్వగ్రామం. సమస్తిపూర్ జిల్లాలోని ఉమైద్పూర్.
డాక్టర్ రాయ్
[మార్చు]డాక్టర్ రాయ్ 1980లో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, 1984లో జవహర్లాల్ యూనివర్శిటీ (న్యూఢిల్లీ) నుండి లైఫ్ సైన్సులో మాస్టర్ డిగ్రీ పొందాడు. తరువాత 1985లో పోస్ట్ డాక్టొరల్ శిక్షణ కొరకు అమెరికా వెళ్ళాడు. ఆయన ప్రొఫెసర్, ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ " డిపార్ట్మెంటు ఆఫ్ ఎంవిరాన్మెంటు అండ్ ఆకుపేషనల్ హెల్త్ "చైర్ పర్సన్‌గా నియమించబడ్డాడు. 1999 - 2005 ఇంటర్నేషనల్ ఏజెంసీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేంసర్ వర్కింగ్ గ్రూప్ సభ్యుడుగా పనిచేసాడు. [10][11] Dr. Roy received Cancer Scholar Award (2014) from the American Association of Cancer Research.[12] ఆయన 15 మంది డాక్యొరల్ విద్యార్ధులకు సలహాదారుడుగా పనిచేసాడు. ఆయన వద్ద శిక్షణ పొందిన విద్యార్ధులు పలు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విద్యాసంస్థలలో డీన్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ మొదలైన ఉద్యోగాలు చేద్తున్నారు. ఆయన 7 జనరల్స్‌కు ఎడిటోరియల్ బోర్డ్ సభ్యుడుగా పని చేసాడు. ఆయన 100 పరిశోధనాపత్రాలు సమర్పించాడు. స్ప్రింగర్ వ్రాసిన పుస్తకం [13] , ఎల్సెవియర్ ఎంసైక్లోపీడియాకు సంపాదకత్వం చేసాడు [14] Some of his articles are most-cited in the field of estrogen carcinogenesis.[15]
విద్య
[మార్చు]జిల్లాలో చక్కని విద్యాసౌకర్యాలు ఉన్నాయి. జిల్లాలో జీల్లాలో సమస్తిపూర్ కాలేజ్, బి.ఆర్,బి కాలేజ్, ఆర్,ఎన్.ఆర్ కాలేజ్, సెయింట్ కబీర్ కాలేజ్.ఎస్. ఎం ఆర్ సి కె కళాశాల, డాక్టర్ ఎల్.కె.వి.డి. కాలేజ్. మొదలైన ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. జిల్లాలో " రాజేంద్ర అగ్రికల్చరల్ యూనివర్శిటీ (పూసా) " పేరుతో ప్రముఖ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11.
Muna 2,889km2
- ↑ 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Congo, Republic of the 4,243,929
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Kentucky 4,339,367
- ↑ http://www.spandidos-publications.com/COVER_LEGENDS/ijo_32_5_cover_legend.pdf
- ↑ http://rscphsw.fiu.edu/environmental_health/faculty_roy.html([permanent dead link]
- ↑ http://monographs.iarc.fr/ENG/Monographs/vol72/mono72-3.pdf([permanent dead link]
- ↑ http://monographs.iarc.fr/ENG/Monographs/vol91/mono91-3.pdf([permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-13. Retrieved 2014-12-08.
- ↑ http://www.springer.com/biomed/cancer/book/978-1-4419-6751-0([permanent dead link]
- ↑ http://www.extranet.elsevier.com/homepage_about/mrwd/nvrn/Editor%20Contact%20details.pdf
- ↑ http://jncimono.oxfordjournals.org/reports/most-cited
బయటి లింకులు
[మార్చు]- Samastipur Information Portal Archived 2012-03-23 at the Wayback Machine
- Samastipur District Official Website
- Samastipur District Profile Archived 2020-05-11 at the Wayback Machine
- Official site of Rajendra Agricultural University