బాబర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాబర్
చక్రవర్తి

బాబరు చిత్రం
పరిపాలన1526 – 1530
పూర్తి పేరుజహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్
చగ్తాయి/పర్షియన్ భాషﻇﻬﻴﺮ ﺍﻟﺪﻳﻦ محمد بابر
మకుటాలుమొఘల్ సామ్రాజ్య స్థాపకుడు
జననంFebruary,14, 1483
జన్మస్థలంAndijan
మరణంDecember 26, 1531 (age 47)
మరణస్థలంAgra
సమాధిBagh-e Babur
తరువాతి వారుహుమాయూన్
భార్యలుAyisheh Sultan Begum
బీబీ ముబారికా యూసుఫ్ జయీ
దిల్దార్ బేగం
గుల్నార్ అగాచెహ్
గుల్ రుఖ్ బేగం
మాహం అంగా
మాసూమెహ్ బేగం
నర్గుల్ అగాచె
సయ్యిదా ఆఫాక్
సంతానముహుమాయూన్, కుమారుడు
కాంరాన్ మిర్జా, son
Askari Mirza, son
Hindal Mirza, son
en:Gulbadan Begum, daughter
Fakhr-un-nisa, daughter
Altun Bishik, alleged son
వంశముతైమూరిద్
తండ్రిOmar Sheikh Mirza, Amir of Farghana
తల్లిQutlaq Nigar Khanum

బాబరు (ఆంగ్లం : Babur), (ఫిబ్రవరి 14, 1483 - డిిిిిిిిసెంబర్ ,26 1530). (పర్షియన్ :ﻇﻬﻴﺮ ﺍﻟﺪﻳﻦ محمد بابر ) ; ఇతని బిరుదనామములు - అల్ సుల్తాన్ అల్-ఆజమ్ వల్ లాహ్ ఖాన్ అల్-ముకఱ్రం జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాద్షాహ్ ఘాజీ, కాగా ఈతను 'బాబర్' నామముతోనే సుప్రసిద్ధుడయ్యాడు. బాబర్ 'మధ్య ఆసియా' కు చెందిన వాడు. దక్షిణాసియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను తండ్రివైపున తైమూర్ లంగ్ ('తైమూర్ లంగ్డా'), తల్లి వైపున చెంఘీజ్ ఖాన్ ల వంశాలకు చెందినవాడు.[1] ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ, భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించగలిగాడు.

రాజ్యస్థాపన

[మార్చు]
బాబర్ 'వంశవృక్షం'.

16వ శతాబ్దము తొలినాళ్లలో మంగోల్, తురుష్క, పర్షియన్, ఆఫ్హానీ యోధులతో కూడిన మొఘల్ సైన్యాలు, తైమూర్ వంశ యువరాజైన, జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ నాయకత్వంలో భారతదేశంపై దండెత్తాయి. బాబర్, మధ్య ఆసియా మొత్తాన్ని జయించిన మహాయోధుడు తైమూర్ లాంగ్ యొక్క ముని మనమడు. తైమూర్ 1398లో భారత్ పై డండయాత్రకు విఫలయత్నం చేసి సమర్‌ ఖండ్ కు వెనుదిరిగాడు. తైమూర్ స్వయంగా తాను మరో మంగోల్ యోధుడు చెంగీజ్ ఖాన్ వారసున్నని ప్రకటించుకొన్నాడు. ఉజ్బెక్ లచే సమర్‌ఖండ్ నుండి తరిమివేయబడిన బాబర్ మొదటగా 1504లో కాబూల్ లో తన పాలనను స్థాపించాడు. ఆ తరువాత ఇబ్రహీం లోఢీ పాలిస్తున్న ఢిల్లీ సల్తనతులో అంత:కలహాలను ఆసరాగా తీసుకొని దౌలత్ ఖాన్ లోఢీ (పంజాబ్ గవర్నరు), ఆలం ఖాన్ (ఇబ్రహీం లోఢీ మామ) ల ఆహ్వానంతో బాబరు 1526లో ఢిల్లీపై దండెత్తాడు.

అనుభవమున్న సేనానిగా బాబర్ తన సుశిక్షుతులైన 12వేల సైన్యముతో 1526లో భారతదేశంలో అడుగుపెట్టి లోఢీ యొక్క సమైక్యతలోపించిన లక్ష బలము కల భారీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్, సుల్తాన్ లోడీని నిర్ణయాత్మకముగా ఓడించాడు. తుపాకీ బళ్ళు, కదిలించగలిగే ఫిరంగీలు, అత్యుత్తమ ఆశ్వికదళ యుక్తులు, ఆ కాలము నాటి ఆంగ్లేయుల పొడవు ధనుస్సు కంటే అత్యంత శక్తివంతమైన మొఘలు విల్లుల సహాయముతో అద్వితీయమైన విజయాన్ని సాధించాడు బాబర్. ఆ యుద్ధములో సుల్తాన్ లోఢీ మరణించాడు. ఒక సంవత్సరము తర్వాత (1527) ఖన్వా యుద్ధంలో చిత్తోర్ రాజు రాణా sangraam సింగ్ నేతృత్వములోని రాజపుత్రుల సంఘటిత సేనను నిర్ణయాత్మకముగా ఓడించాడు. బాబర్ పాలనలో మూడవ పెద్ద యుద్ధము 1529లో జరిగిన గోగ్రా యుద్ధము. ఇందులో బాబర్ ఆఫ్ఘన్, బెంగాల్ నవాబు యొక్క సంయుక్త సేనలను మట్టికరిపించాడు. తన సైనిక విజయాలను పటిష్ఠపరచే మునుపే బాబర్ 1530లో ఆగ్రా వద్ద మరణించాడు. తన ఐదేళ్ళ చిన్న పాలనాకాలములో బాబర్ అనేక కట్టడాలను నిర్మించేందుకు శ్రద్ధ వహించాడు. కానీ అందులో కొన్ని మాత్రమే మనగలిగాయి. బాబర్ తన అత్యంత ముఖ్యమైన వారసత్యముగా భవిష్యత్తులో భారత ఉపఖండముపై సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాలనే తన స్వప్నాన్ని సాకారము చెయ్యగల వారసులను మిగిల్చిపోయాడు.

చరిత్ర

[మార్చు]

బాబర్ ఫిబ్రవరి 14, 1483 న జన్మించాడు.[2] ఇతడి జన్మస్థలం ఉజ్బెకిస్తాన్లో ఫెర్గనా లోయ లోని 'అందిజాన్' పట్టణం. ఇతని తండ్రి "ఉమర్ సేహ్ మిర్జా", [3] ఇతను ఫెర్గనా లోయ ప్రాంత పాలకుడు, ఇతని భార్య యూనుస్ ఖాన్ కుమార్తెయగు 'ఖుత్లుఖ్ నిగార్ ఖానమ్'. ఇతను మంగోలు జాతికి చెందిన బర్లాస్ తెగ వాడు, తరువాత ఈ తెగ తురుష్క ('టర్కిక్ తెగ') ప్రజలుగా మార్పు చెందారు,[4] పర్షియన్ సంస్కృతిని అలవర్చుకున్నారు.[5][6][7] ఇతడి మాతృభాష చగ్తాయి భాష, టర్కిక్ భాష, పర్షియన్ భాషలు కూడా బాగా తెలిసినవాడు.[8] ఇతను తన స్వీయచరిత్ర (ఆత్మకథ) ను 'బాబర్ నామా' పేరిట పర్షియన్ భాషలో రచించాడు.[9]

బాబరు ప్రశంసనీయమగు విమర్సనాశక్తిని, పర్షియన్, అరేబియన్, తుర్కీ భాషలలో అద్వితీయమగు పాండిత్యమును కలిగి యుండెను. తుర్కీ భాషలో ఈతడు పెక్కు కావ్యములను, చంధశాస్త్రములను రచించెను. సంగీతమునను, ధర్మశాస్త్రమునను కూడా ఈతనిచే రచింపబడిన గ్రంథములు ఉన్నాయి. తనజీవతమందు వివిధ విశేషములను తెలియపరచు స్వీయ చరిత్రము చరిత్రమునకును, వాజ్మయమునకును మిగుల ముఖ్యమైనది. నిరాడంబరమును, స్వాభావికమగుశైలి యీతని గద్యపద్యములకు గల ముఖ్యలక్షణము. నూతనమగు ఒక చంధస్సును, మరియొక అపూర్య లిపి ఈతనిచే కనుగొనబడింది. చిత్రలేఖనమున గూడ బాబరుకు అభిరుచి మెండుగా నుండెడిది. ఈపాదుషా విద్వాంసుల సమావేసములందును, గ్రంథాలయములందును విశేషకాలముగడుపుచుండెనట

సంపద

[మార్చు]

ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు. ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది. హుమాయున్‌కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్‌తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యవస్తువులు దానం చేయాల్సిందిగా సలహాఇచ్చారు. తనవద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆపైన కొద్దిరోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసినా వజ్రాన్ని నిలపుకున్నారని అక్బరునామాలో వ్రాశారు. ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది.[10]

హుమాయూన్‌కు బాబరు వ్రాసిన వీలునామా

[మార్చు]

భోపాల్ లోని ప్రభుత్వ గ్రంథాలయములో దొరికిన పత్రాల ప్రకారం బాబరు హుమాయూన్కు ఈ క్రింది వీలునామా వ్రాసాడు.

నా ప్రియ కుమారునికి, ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోదగినవి

నీ మనస్సులో మతవిద్వేషాలను ఉంచుకోవద్దు. న్యాయము చెప్పేటప్పుడు, ప్రజల సున్నితమైన మత విశ్వాసాలను, హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. గోవధను తప్పిస్తే స్థానికుల మనసులలో స్థానం సంపాదించవచ్చు. ఇవి నిన్ను ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్తాయి.

ప్రజల ప్రార్థనాలయాలను ఏ మతానికి చెందినవైనా ధ్వంసం చేయవద్దు. దేశ శాంతి కోసం పూర్తి సమాన న్యాయం అమలు చేయగలవు. ఇస్లామును ప్రచారంచేయటానికి, ఇతర మతాలను అన్యాయముతో, కౄరంగా అణచివేయటము అనే కత్తుల కన్నా ప్రేమా, ఆప్యాయత అనే కత్తుల ఉపయోగము ఎంతో గొప్పది. షియాలకు, సున్నీలకు మధ్య విభేదాలను తొలగించు. ఋతువుల గుణగణాలను చూచినట్లే, నీ ప్రజల గుణగణాలను చూడు.'"[ఆధారం చూపాలి]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Mughal Dynasty Archived 2007-12-31 at the Wayback Machine at Encyclopædia Britannica
  2. "Babar". Manas. University of California Los Angeles. Retrieved 2008-04-02.
  3. "Mirza Muhammad Haidar". Silk Road Seattle. Walter Chapin Center for the Humanities at the University of Washington. Retrieved 2006-11-07. On the occasion of the birth of Babar Padishah (the son of Omar Shaikh)
  4. "Britannica Academic". academic.eb.com. Retrieved 2023-02-02.
  5. Lehmann, F. "Memoirs of Zehīr-ed-Dīn Muhammed Bābur". Encyclopaedia Iranica. Retrieved 2008-04-02.
  6. "Timurids". The Columbia Encyclopedia (6th ed.). New York: Columbia University. Archived from the original on 2006-12-05. Retrieved 2006-11-08.
  7. "Timurids". The Columbia Encyclopedia (6th ed.). New York: Columbia University. Archived from the original on 5 డిసెంబరు 2006. Retrieved 2006-11-08.
  8. Iran: The Timurids and Turkmen Archived 2007-12-25 at the Wayback Machine.
  9. Dale, Stephen Frederic (2004). The garden of the eight paradises: Bābur and the culture of Empire in Central Asia, Afghanistan and India (1483-1530). Brill. pp. 15, 150. ISBN 9004137076.
  10. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.

యితర లింకులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బాబర్&oldid=4131302" నుండి వెలికితీశారు