అక్షాంశ రేఖాంశాలు: 25°47′05″N 84°43′39″E / 25.7848°N 84.7274°E / 25.7848; 84.7274

ఛప్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛప్రా
పట్టణం
ఛప్రా is located in Bihar
ఛప్రా
ఛప్రా
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°47′05″N 84°43′39″E / 25.7848°N 84.7274°E / 25.7848; 84.7274
రాష్ట్రంబీహార్
డివిజనుసారణ్
జిల్లాసారణ్
విస్తీర్ణం
 • Urban
38.26 కి.మీ2 (14.77 చ. మై)
Elevation36 మీ (118 అ.)
జనాభా
 (2011)
 • పట్టణం2,01,598
 • Urban
2,49,556
భాష
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
Pincode(s)
841 301, 841 302
Area Code(s)+91-6152
Vehicle registrationBR 04
లింగనిష్పత్తి900 (females per 1000 males)[3] /
Website

ఛప్రా భారత రాష్ట్రం బీహార్ లోని సారణ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది ఘఘరా నది, గంగా నదుల సంగమానికి సమీపంలో ఉంది.

18 వ శతాబ్దంలో డచ్చి, ఫ్రెంచి, పోర్చుగీసు, ఇంగ్లీషు వాళ్ళు ఈ ప్రాంతంలో పొటాషియం నైట్రేట్ శుద్ధి కర్మాగారాలను స్థాపించడంతో ఛప్రా పట్టణం, నది ఆధారిత మార్కెట్‌గా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీనిని 1864 లో మునిసిపాలిటీగా ఏర్పరచారు. ప్రధాన రైల్వే స్టేషన్ ఛప్రా జంక్షన్. ఛాప్రాలో అంబికా భవానీ అనే పేరుగల [4] శక్తి పీఠం ఉంది.

భౌగోళికం

[మార్చు]

ఛప్రా 25°47′05″N 84°43′39″E / 25.7848°N 84.7274°E / 25.7848; 84.7274 నిర్దేశాంకాల వద్ద,[5] సముద్ర మట్టం నుండి 36 మీటర్ల ఎత్తున ఉంది.

పట్టణ విశేషాలు

[మార్చు]

భారతదేశంలో కెల్లా అతిపెద్దదైన రెండు అంతస్థుల పైదారిని (ఫ్లై ఓవరు) ఛప్రాలో నిర్మిస్తున్నారు.[6] 3.5కి.మీ. పొడవైన ఈ పైదారి మహాత్మా గాంధీ చౌక్ నుండి నగరపాలిక చౌక్ వరకు ఉంటుంది.[7] బీహార్ రాజ్య పుల్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్, కేంద్ర రోడ్ల నిధి (సిఆర్ఎఫ్) నుండి 411,31 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మిస్తోంది.[8][9] ఇది శాంటా క్రజ్-చెంబూర్ లింక్ రోడ్‌లోని 1.8 కి.మీ. రెండు అంతస్థుల పైదారి కంటే పొడవైనది.[10] ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు 2018 జూలైలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పునాది వేశాడు. ఇది 2022 జూన్ నాటికి పూర్తి చెయ్యాలని తలపెట్టారు.[11]

శీతోష్ణస్థితి

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Chhapra
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 23.1
(73.6)
25.8
(78.4)
31.0
(87.8)
35.1
(95.2)
35.0
(95.0)
34.9
(94.8)
32.5
(90.5)
32.8
(91.0)
32.5
(90.5)
31.6
(88.9)
29.0
(84.2)
24.8
(76.6)
30.7
(87.2)
సగటు అల్ప °C (°F) 9.2
(48.6)
11.0
(51.8)
15.1
(59.2)
19.1
(66.4)
21.2
(70.2)
22.9
(73.2)
23.8
(74.8)
24.2
(75.6)
23.8
(74.8)
21.2
(70.2)
15.8
(60.4)
10.6
(51.1)
18.2
(64.7)
సగటు అవపాతం mm (inches) 13.0
(0.51)
14.0
(0.55)
9.0
(0.35)
29.0
(1.14)
76.0
(2.99)
139.0
(5.47)
353.0
(13.90)
254.0
(10.00)
193.0
(7.60)
73.0
(2.87)
6.0
(0.24)
7.0
(0.28)
1,166
(45.9)
Source: Accuweather[12]

జనాభా

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, ఛప్రా అర్బన్ అగ్లోమెరేషన్ జనాభా 2,12,955.[13] ఛప్రా అర్బన్ అగ్లోమెరేషన్‌లో ఛప్రా (నగర్ పంచాయతీ), సంధా (జనగణన పట్టణం) ఉన్నాయి.[14] ఛప్రా నగర పంచాయతీలో మొత్తం జనాభా 2,01,597, వీరిలో 1,06,250 మంది పురుషులు, 95,347 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి 897. ఆరేళ్ళ లోపు పిల్లలు 27,668. చాప్రాలో ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 2011 నాటికి 81.30%.[15]

పట్టణ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "CPRS Patna About Us". CRPS. Archived from the original on 5 March 2016. Retrieved 28 October 2016.
  2. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 9 March 2019.
  3. "Chapra City Census 2011 data". www.census2011.co.in.
  4. "जानिए बिहार के तीन शक्तिपीठों में से एक सारण की अंबिका भवानी की महिमा". 29 September 2014. Archived from the original on 9 August 2016.
  5. "Maps, Weather, and Airports for Chapra, India". www.fallingrain.com. Archived from the original on 10 May 2008.
  6. "Chhapra to get Bihar's first double-decker flyover". The Times of India.
  7. "Two-deck flyover cost: Rs 411cr".
  8. "CM to open highway at Chhapra". The Times of India. 10 July 2018. Retrieved 27 December 2020.
  9. "Chhapra road bounty". Archived from the original on 2018-07-12. Retrieved 2021-01-28.
  10. "Saran to beat Mumbai marvel". Archived from the original on 2018-07-12. Retrieved 2021-01-28.
  11. "Flyover first on Lalu's once turf". Archived from the original on 2018-07-12. Retrieved 2021-01-28.
  12. "Accuweather: Weather for Chhapra, India". Accuweather. 2011. Archived from the original on 3 September 2014. Retrieved on 22 November 2011.
  13. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived (PDF) from the original on 13 November 2011. Retrieved 16 April 2012.
  14. "Constituents of urban Agglomerations Having Population 1 Lakh & above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived (PDF) from the original on 17 June 2016. Retrieved 16 April 2012.
  15. "Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived (PDF) from the original on 7 May 2012. Retrieved 16 April 2012.


"https://te.wikipedia.org/w/index.php?title=ఛప్రా&oldid=3941094" నుండి వెలికితీశారు