నవాదా
నవాదా | |
---|---|
పట్టణం | |
Coordinates: 24°53′N 85°32′E / 24.88°N 85.53°E | |
దేశం | India |
రాష్ట్రం | బీహార్ |
ప్రాంతం | మగధ |
జిల్లా | నవాదా |
Elevation | 80 మీ (260 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 1,09,141 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 805110,805111 |
టెలిఫోన్ కోడ్ | 06324 |
ISO 3166 code | IN-BR |
Vehicle registration | BR-27 |
లింగనిష్పత్తి | 1.14 ♂/♀ |
నవాదా బీహార్ రాష్ట్రం, నవాదా జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. అదే పేరుతో ఉన్న డివిజనుకు ముఖ్యపట్టణం కూడా. ఇది 24º 53 'ఉత్తర అక్షాంశం, 85º 33' తూర్పు రేఖాంశం వద్ద ఖురి నదికి ఇరు వైపులా విస్తరించి ఉంది. ఈ పేరు నౌ-వాడా నుండి ఉద్భవించింది. దీనికి అర్థం కొత్త పట్టణం.[2] 1973 జనవరి 26 న నవాదా ముఖ్యపట్టణంగా నవాదా జిల్లా ఏర్పడింది.
భౌగోళికం
[మార్చు]నవాదా 24°53′N 85°32′E / 24.88°N 85.53°E వద్ద [3] సముద్ర మట్టం నుండి 80 మీటర్ల ఎత్తున ఉంది. ఖురి నది పట్టణం గుండా పోతుంది, నదికి ఎడమ ఒడ్డున పాత విభాగం, కుడి ఒడ్డున ప్రభుత్వ కార్యాలయాలు, ఉప జైలు, డిస్పెన్సరీ, పాఠశాలలతో కూడిన కొత్త పట్టణం ఉంటుంది.
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, నవాదా జనాభా 109,141. లింగనిష్పత్తి 1,000 మంది పురుషులకు 957 మంది మహిళలు. సగటు అక్షరాస్యత 74%. ఇది జాతీయ సగటు 63.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 81%, స్త్రీల అక్షరాస్యత 67%. నవాదా జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.[4] హిందీ, మగధి, ఉర్దూలు ఈ ప్రాంతంలో మాట్లాడే ప్రధాన భాషలు.
రైలుమార్గం
[మార్చు]- పాట్నా రైల్వే స్టేషన్ ay గయా రైల్వే స్టేషన్ → నవాదా రైల్వే స్టేషన్
రోడ్లు
[మార్చు]- పాట్నా నుండి ఎన్‌హెచ్ 31 ద్వారా నవాదాకు రహదారి సౌకర్యం ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "View Population". Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-03-08. Retrieved 2021-01-20.
- ↑ Falling Rain Genomics, Inc - Nawada
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-10-07. Retrieved 2021-01-20.