Jump to content

మోతీహారి

అక్షాంశ రేఖాంశాలు: 26°39′00″N 84°55′00″E / 26.65000°N 84.91667°E / 26.65000; 84.91667
వికీపీడియా నుండి
మోతీహారి
పట్టణం
Coat of arms of మోతీహారి
మోతీహారి is located in Bihar
మోతీహారి
మోతీహారి
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26°39′00″N 84°55′00″E / 26.65000°N 84.91667°E / 26.65000; 84.91667
దేశం India
రాష్ట్రంబీహార్
జిల్లాతూర్పు చంపారణ్
 • Rank04
Elevation
62 మీ (203 అ.)
జనాభా
 (2011)[1]
 • Total1,26,158
భాష
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
845401,845435,845437
టెలిఫోన్ కోడ్06252
ISO 3166 codeIN-BR
Vehicle registrationBR-05

మోతీహారి బీహార్ రాష్ట్రం, తూర్పు చంపారణ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది రాష్ట్ర రాజధాని పాట్నాకు ఉత్తరంగా 150 కి,.మీ. దూరంలో ఉంది..

భౌగోళికం

[మార్చు]

మోతీహారి వాయువ్య బీహార్‌లో, 26° 39' ఉత్తర అక్షాంశం, 84° 55' తూర్పు రేంఖాంశం వద్ద ఉంది. [3] ఇది రాష్ట్ర రాజధాని పాట్నా నుండి వాయువ్యంగా సుమారు 150 కి.మీ. దూరం లోను, బేతియా నుండి 45 కి.మీ., ముజఫర్పూర్ నుండి 72 కి.మీ., మెహ్సీ నుండి 40 కి.మీ., చాకియా నుండి 30 కి.మీ., సీతామఢీ నుండి 75 కి.మీ. దూరం లోనూ ఉంది ఇది ఒక సరస్సుకు తూర్పు ఒడ్డున ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, మోతీహారి జనాభా 1,26,158, వీరిలో 67,861 మంది పురుషులు, 58,297 మంది మహిళలు. లింగ నిష్పత్తి 859. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 16,870. మోతీహారిలో అక్షరాస్యుల సంఖ్య 92,798, ఇది జనాభాలో 73.6%. పురుషుల్లో అక్షరాస్యత 76.2% కాగా, స్త్రీలలో 70.5%.. మోతీహారిలో ఏడేళ్ళకు పైబడీనవారిలో అక్షరాస్యత 84.9%. ఇందులో పురుషుల అక్షరాస్యత 88.1%, స్త్రీల అక్షరాస్యత 81.2%. షెడ్యూల్డ్ కులాల జనాభా 7,373, షెడ్యూల్డ్ తెగల జనాభా 333. 2011 నాటికి పట్టణంలో 22,224 గృహాలు ఉన్నాయి. [1]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, 2011 లో మోతీహారి జనాభా 1,01,506, వీరిలో పురుషులు 54,629, స్త్రీలు 46,877. లింగ నిష్పత్తి 858. మోతీహారి నగరంలో మొత్తం అక్షరాస్యులు 69,576. వీరిలో 40,265 మంది పురుషులు కాగా, 29,311 మంది మహిళలు. అక్షరాస్యత రేటు 68.5%. ఏడేళ్ళకు పైబడిఅ వారిలో (ప్రభావశీలమైన) అక్షరాస్యత 80.3%. పట్టణంలో ఆరేళ్ళ లోపు పిల్లలు 14,910. బాలల్లో లింగ నిష్పత్తి 909.[4]

శీతోష్ణస్థితి

[మార్చు]

అధిక ఉష్ణోగ్రతలు, ఏడాది పొడవునా సమానంగా ఉండే అవపాతం మోతోహారి శీతోష్ణస్థితి ప్రత్యేకత. దీన్ని కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ఉప రకం " Cfa " (తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం) గా వర్గీకరించారు

శీతోష్ణస్థితి డేటా - Motihari
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
[ఆధారం చూపాలి]

మోతీహారి నుండి భారతదేశంలోని వివిధ నగరాలకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి. నగరానికి సేవలు అందించే ప్రధాన రైల్వే స్టేషన్ బాపుధామ్ మోతీహారి రైల్వే స్టేషను. న్యూ ఢిల్లీ, ముంబై, జమ్మూ, కోల్‌కతా, గౌహతిలకు ఇక్కడి నుండి నేరుగా రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆసియా రహదారి 42, జాతీయ రహదారి 28 ఎ, రాష్ట్ర రహదారి 54 లు పట్టణం గుండా వెళ్తాయి. సమీప విమానాశ్రయం పాట్నాలో (150 కి.,మీ.) ఉంది. దర్భంగా విమానాశ్రయం ప్రారంభమైన తరువాత, ఇది సమీప విమానాశ్రయ మౌతుంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census of India: Motihari". www.censusindia.gov.in. Retrieved 20 December 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 23 March 2019.
  3. "Google Maps". Google Maps (in ఇంగ్లీష్). Retrieved 25 January 2020.
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.


"https://te.wikipedia.org/w/index.php?title=మోతీహారి&oldid=3121921" నుండి వెలికితీశారు