గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్
![]() | |||||
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | Superfast Express | ||||
తొలి సేవ | 01 జనవరి 1929 | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | చెన్నై సెంట్రల్ | ||||
ఆగే స్టేషనులు | 37 (T.No.12615) / 36 (T.No. 12616) | ||||
గమ్యం | న్యూఢిల్లీ | ||||
ప్రయాణ దూరం | 2,181 కి.మీ. (1,355 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 35 hours 5 minutes | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
రైలు సంఖ్య(లు) | 12615 / 12616 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | AC First, AC Two Tier, AC Three Tier, Sleeper Class, Unreserved | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Yes | ||||
పడుకునేందుకు సదుపాయాలు | Yes | ||||
ఆహార సదుపాయాలు | Yes | ||||
చూడదగ్గ సదుపాయాలు | Large and Small windows | ||||
బ్యాగేజీ సదుపాయాలు | Luggage-cum-Brake Van | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 మిమీ (5 అడుగులు 6 అం) | ||||
వేగం | 61.78 km/h (38.39 mph) average with halts | ||||
|
గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్, (సాధారణంగా అందరూ దీనిని జి.టి లేదా జి.టి. ఎక్స్ ప్రెస్ అని పిలుస్తుంటారు.) రైలు నెంబర్లు 12615/12616. ఇది భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో కొత్త ఢిల్లీ రైల్వే స్టేషన్, చెన్నై సెంట్రల్ మధ్య ఇది ప్రతి రోజు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు . అతి పురాతన, చారిత్రక రైళ్లలో జి.టి. ఎక్స్ ప్రెస్ కూడా ఒకటి.
చరిత్ర[మార్చు]
ఈ రైలును మద్రాసు, దక్షిణ మరాఠ రైల్వే ప్రవేశపెట్టెను. తొలిసారిగా 1929లో ఈ రైలు ప్రస్తుత కర్నాటక రాష్ట్రములోని మంగళూరు నుండి ప్రస్తుత పాకిస్థానులోని పెషావర్ వరకు నడిచింది. మద్రాసు దీని ప్రధాన కేంద్రం.[1] ప్రస్తుతం భారత రాజధాని కొత్త ఢిల్లీ, తమిళనాడు రాజధాని చెన్నై మధ్య ప్రయాణించే ఈ రైలు. ఒకప్పటి బ్రిటీష్ ఇండియాలో భాగాంగా ఉన్న లాహోర్, తమిళనాడులోని కోయంబత్తురు, ఊటి (ఉదకమండలం), కున్నూరు లకు సమీపంలో ఉన్న మేట్టుపాళయం నడుమ ప్రయాణించేది. దేశంలోని పలు ప్రాంతాల మీదుగా నడిచే ఈ జి.టి.ఎక్స్ ప్రెస్ రైలు అప్పట్లో సుదీర్ఘ దూరం ప్రయాణించే రైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.[2] ఈ రైలు మొత్తం 2,186 కి.మీ (1,358 మైళ్లు) ప్రయాణ దూరాన్ని 35 గంటల 35 నిమిషాల్లో అధిగమిస్తుంది. ఈ మార్గంలో చెన్నై, కొత్త ఢిల్లీలతో కలుపుకుని మొత్తం 38 స్టేషన్లలో ఈరైలు ఆగుతుంది. ఇప్పటికీ భారతదేశంలో అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో ఇదీ ఒకటిగా ఉంది. ప్రఖ్యాత గ్రాండ్ ట్రంక్ రోడ్ పేరు మీద ఈ రైలుకు, మార్గానికి ఈ పేరు పెట్టారు.
జోను , డివిజను[మార్చు]
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.
షెడ్యూలు , సేవలు[మార్చు]
ఈ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. భారతీయ రైల్వే ఈ రైలుకు 12615/12616 నెంబర్లను కేటాయించారు. 12615 నెంబరు గల రైలు చెన్నై – కొత్త ఢిల్లీ మార్గంలో ప్రయాణిస్తుంది.[3] అదేవిధంగా 12616 నెంబరు గల రైలు తిరుగు ప్రయాణంలో కొత్త ఢిల్లీ – చెన్నై మధ్య ప్రయాణిస్తుంటుంది.
రేక్ , బోగీలు[మార్చు]
సాధారణంగా జి.టి. ఎక్స్ ప్రెస్ లో 24 బోగీలు (కార్లు) ఉంటాయి. అవి ఈ క్రింది తరగతులుగా విభజించారు:
- 1 x ఏసీ I వ తరగతి, ఏసీ II టైర్
- 2 x ఏసీ II టైర్
- 3 x ఏసీ III టైర్
- 13 x III టైర్ స్లీపర్
- 4 x సాధారణ/రిజర్వరేషన్ లేనివి
- 1 x ప్యాంట్రీ
కొన్నిసార్లు అదనంగా III టైర్ స్లీపర్ బోగీని చేర్చుతారు. జి.టి. తన మొత్తం ప్రయాణ మార్గంలోరాయపురం షెడ్ కు చెందిన సింగిల్ డబ్ల్యుఏపీ-7 ఏసీ ఎలక్ట్రిక్ లోకమొటివ్ ఇంజిన్ తో లాగబడుతుంది.
ఇతర రైళ్లతో పోలిక[మార్చు]
గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రస్తుతం కొత్త ఢిల్లీ, చెన్నై సెంట్రల్ మధ్య నడుస్తోంది. ఈ రెండు స్టేషన్లు కాకుండా మధ్యలో మరో 34 చోట్ల ఈ రైలు ఆగుతుంది. ఇదే మార్గంలో నడిచే తమిళనాడు ఎక్స్ ప్రెస్ కేవలం 9 మధ్యంతర స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. సాంకేతికంగా చెప్పాలంటే తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైలు హజ్రత్ నిజాముద్దీన్, చెన్నై సెంట్రల్ మధ్య నడుస్తూ ఈ మార్గంలో నడిచే వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందింది. ఈ రైలు మొత్తం ప్రయాణాన్ని28 గంటల 10 నిమిషాల్లో తన గమ్యాన్ని చేరుతుంది. చెన్నై గరీభ్ రథ్ ఎక్స్ ప్రెస్ 9 మధ్యంతర స్టేషన్లలో ఆగుతూ న్యూఢిల్లీ, చెన్నై మధ్య సుమారు ఇంతే కాలంలో ప్రయాణిస్తుంది. తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు హజ్రత్ నిజాముద్దీన్, మధురై జంక్షన్ మధ్య ప్రయాణిస్తూ హజ్రత్ నిజాముద్దీన్, చెన్నై ఎగ్ మోర్ మధ్య దూరాన్ని 34 గంటల 50 నిమిషాల్లో అధిగమిస్తుంది. ఈ మధ్య కేవలం 4 స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. (ఇది ఆగే 5వ స్టేషన్ గా చెన్నై బీచ్ స్టేషన్ కూడా తర్వాత చేర్చారు.)
బయటి లింకులు[మార్చు]
- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30. CS1 maint: discouraged parameter (link)
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30. CS1 maint: discouraged parameter (link)
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30. CS1 maint: discouraged parameter (link)
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537
- ఐ.ఆర్.ఎఫ్.సి.ఎ. హోమ్
- భారతీయ రైల్వేల అధికారిక సైట్
- జి.టి. ఎక్స్ ప్రెస్ మార్గ పటం
మూలాలు[మార్చు]
- ↑ "VIII". Report by the Railway board on Indian Railways for 1929-30:Volume I (PDF)
|format=
requires|url=
(help). Calcutta: Central Publication Branch, Government of India. 1930. p. 71.|access-date=
requires|url=
(help)CS1 maint: discouraged parameter (link) - ↑ S. Shankar. "Classic Trains of India". Indian Railways Fan Club Association. Archived from the original on 4 మే 2015. Retrieved 5 November 2013. Check date values in:
|archive-date=
(help)CS1 maint: discouraged parameter (link) - ↑ "Grand Trunk Express". cleartrip.com. CS1 maint: discouraged parameter (link)