Jump to content

డార్జిలింగ్ మెయిల్

వికీపీడియా నుండి
డార్జిలింగ్ మెయిల్
Darjeeling Mail
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ మెయిల్
ప్రస్తుతం నడిపేవారుతూర్పు రైల్వే జోన్
ప్రయాణికుల దినసరి సంఖ్యస్లిప్ మార్గం కింద వయా న్యూ జల్పైగురి ద్వారా హల్దిబారి వరకు కోలకతా - న్యూ జల్పైగురి మధ్య ప్రాచుర్యం పొందిన రైలు
మార్గం
మొదలుసీల్డా
ఆగే స్టేషనులుబర్ధమాన్, బోల్పూర్, మాల్డా టౌన్, కిషన్గంజ్
గమ్యంస్లిప్ మార్గం కింద వయా న్యూ జల్పైగురి ద్వారా హల్దిబారి వరకు
ప్రయాణ దూరం567 కి.మీ.(సీల్డా-న్యూ జల్పైగురి)
624 కి.మీ.(సీల్డా-హల్దిబారి )
సగటు ప్రయాణ సమయం9 గం.55 ని.లు(సీల్డా-న్యూ జల్పైగురి)[1]
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)12343/12344
సదుపాయాలు
శ్రేణులు1వ ఎసి (1), 2వ ఎసి (2), 3వ ఎసి (7), స్లీపర్ (9), జనరల్ (5)
ఆహార సదుపాయాలుప్యాంట్రీ కార్ అందుబాటులో లేదు - ఒక ఆరంభ స్టేషను వద్ద ఆహారం కొనుగోలు చేయాలి
సాంకేతికత
రోలింగ్ స్టాక్సిలిగురి షెడ్ డబ్ల్యుడిపి4 / డబ్ల్యుడిపి4బి లోకోమోటివ్
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగంసగటు వేగం 60 కి.మీ./గం. గరిష్ఠ వేగం 110 కి.మీ./గం. సాధారణంగా 70-90 కి.మీ./గం. వద్ద నడుస్తుంది.

డార్జిలింగ్ మెయిల్ భారతదేశం యొక్క తూర్పు ప్రాంతంలో పురాతన రైళ్లులో ఒకటి. స్వాతంత్ర్యమునకు పూర్వం రోజుల నుండి నడుస్తున్నది, ఇప్పటికీ పనిచేస్తోంది. ఇది సిలిగురిలో న్యూ జల్పైగురి వద్ద డార్జిలింగ్ హిమాలయ రైల్వేను కలుపుతుంది. కోలకతా-సిలిగురి మార్గం, హల్దిబారి స్లిప్ మార్గము కోసం ఇది ఒక ప్రధాన రైలు.

చరిత్ర

[మార్చు]

తూర్పు బెంగాల్ ద్వారా అమలు చేయుట

[మార్చు]

బ్రిటిష్ కాలంలో ఉత్తర బెంగాల్ అన్ని కనెక్షన్లు తూర్పు బెంగాల్ ద్వారా కలుపబడ్డాయి.

1878 నుండి, కోలకతా (అప్పుడు కలకత్తా అని పేరు) నుండి సిలిగురి వరకు రైల్వే మార్గం, రెండు ల్యాప్లుగా ఉంది. మొదటి ల్యాప్ తూర్పు బెంగాల్ స్టేట్ రైల్వే పాటుగా 185 కిలోమీటర్ల ప్రయాణం కలకత్తా స్టేషను (తరువాత సీల్దా పేరు మార్చబడింది) నుండి పద్మ నది దక్షిణ ఒడ్డున ఉన్న దామూక్దేహ్ ఘాట్ వరకు, తరువాత ఫెర్రీ ద్వారా నదిని దాటడం, రెండవ ల్యాప్ ఉత్తర బెంగాల్ రైల్వే లోని 336 కి.మీ. మీటర్ గేజ్ రైలు మార్గము ప్రయాణం ఉన్న లింక్ పద్మ నది ఉత్తర ఒడ్డున ఉన్న సారాఘాట్ నుండి సిలిగురి వరకు ఉంది.[2]

పద్మ నది అంతటా 1.8 కిలోమీటర్ల పొడవైన హారింగ్టన్ బ్రిడ్జ్ 1912 సం.లో అందుబాటులోకి వచ్చింది.[3] 1926 సం.లో వంతెన ఉత్తర విభాగం మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్‌గా మార్పు చేశారు. అందువలన మొత్తం కలకత్తా - సిలిగురి రైలు మార్గం బ్రాడ్ గేజ్‌గా మారింది.[2]

అందువలన రైలు మార్గం ఈ విధంగా నడిచింది: సీల్దా → రాణాఘాట్ → భేరమర → హారింగ్టన్ బ్రిడ్జ్ → ఇస్వర్ది → సంతహార్ → హిల్లీ → పరబ్తిపూర్ → నిల్ఫమరి → హల్దిబారి → జల్పాయిగురి → సిలిగురి.

భారతదేశం విభజన

[మార్చు]

డార్జిలింగ్ మెయిల్ విభజన ముందు రోజుల్లో ఈ మార్గంలో నడిచింది. భారతదేశం యొక్క విభజన తర్వాత కూడా ఇది కొన్ని సంవత్సరాలు ఈ మార్గంలో నడిచింది. ఇది విభజన ముందు రోజుల్లో అస్సాం మెయిల్కు అనుసంధానం (కనెక్ట్ ) కొరకు ఉపయోగంగా సంతహార్ నుండి గౌహతి వరకు ఇది నడిచింది.[4][5]

గంగా నది అంతటా పడవ ప్రయాణం

[మార్చు]

1947 సం.లో భారతదేశం యొక్క విభజనతో, కోలకతా, సిలిగురి అనుసంధానం (కనెక్ట్ ) కొరకు పశ్చిమ బెంగాల్ లేదా బీహార్ లలో గంగా నది అంతటా ఏ వంతెన లేక ప్రధాన అడ్డంకిగా మారి ఉంది. సిలిగురికి సాధారణంగా అంగీకరించబడు మార్గం మాత్రము సాహిబ్ గంజ్ లూప్ ద్వారా సక్రిగలికు ఉంది లేదా కొన్నిసార్లు సాహిబ్ గంజ్ కనుమల ద్వారా మార్గం ఉంది. గంగా నది అంతటా పడవలో ప్రయాణించి మణిహరి ఘాట్ నకు చేరుకోవచ్చు. అప్పుడు మీటర్ గేజ్ రైలు మార్గముతో కతిహార్, బార్సోయి ద్వారా కిషన్గంజ్ కు చేరుకుని తదుపరి చివరకు నారో గేజ్ మార్గము ద్వారా సిలిగురి చేరుకునేవారు.[6] 1949 సం.లో కిషన్గంజ్ - సిలిగురి విభాగం మీటర్ గేజ్ కు మార్చారు.[2]

ఫరక్కా బారేజ్ ద్వారా ప్రయాణం

[మార్చు]

1960 సం. ప్రారంభంలో, ఫరక్కా బారేజ్ నిర్మాణం చేసినప్పుడు, మరింత విప్లవాత్మకమైన మార్పులు జరిగినాయి. భారతీయ రైల్వేలు కోలకతా నుండి నూతన బ్రాడ్ గేజ్ రైలు లింక్ రూపొందించారు, ఒక గ్రీన్‌ఫీల్డ్ సైట్ లో దక్షిణ సిలిగురి టౌన్ నిర్మించారు. పూర్తిగా కొత్తగా బ్రాడ్ గేజ్ స్టేషనుతో, న్యూ జల్పైగురి రైల్వే స్టేషను ఏర్పడింది.[2]

గంగా నది అంతటా 2,240 మీటర్లు (7,350 అడుగులు) పొడవుతో ఉన్న ఫరక్కా బారేజ్ రైలు-, -రోడ్డు వంతెనను కలిగి ఉంది. ఈ రైలు వంతెన, 1971 సం.లో ప్రజల సేవల కొరకు తెరిచారు. తద్వారా, బర్హర్వ → అజీంగంజ్ → కట్వా లూప్ లైన్ నుండి మాల్దా టౌన్ వరకు, న్యూ జల్పైగురి, ఉత్తర బెంగాల్‌ లోని ఇతర రైల్వే స్టేషన్లకు అనుసంధానం ఏర్పడింది.[7][8] అప్పటి నుంచి, డార్జిలింగ్ మెయిల్ హౌరా - న్యూ జల్పైగురి రైలు మార్గము (లైన్) ఉపయోగించి ప్రయాణిస్తూ ఉంది.[9]

ఒక నివాళి

[మార్చు]
డార్జిలింగ్ మెయిల్ - ఎసి 3 టైర్
డార్జిలింగ్ మెయిల్ - స్లీపర్ క్లాస్

ఇక్కడ డార్జిలింగ్ మెయిల్‌కు ఒక శ్రద్ధాంజలి: "పశ్చిమాన డెక్కన్ క్వీన్ వలె తూర్పున డార్జిలింగ్ మెయిల్ ఒక చారిత్రక స్థితిని పొందినదిగా చేసుకుంది. నావరకు డార్జిలింగ్ మెయిల్ రైలు ప్రతి సెలవులో నన్ను ఇంటికి తీసుకు వెళ్ళింది, అది శలవుల ముగింపులో తిరిగి నన్ను నా బోర్డింగ్ పాఠశాలకు తీసుకు వచ్చింది. నాకు ఎల్లప్పుడూ 43 అప్ రైలు చాలా ప్రియమైనది. అలాగే 44 డౌన్ రైలుతో అంటే నేను అంత సంతోషముగా ఉండేవాడిని కాదు అని నేను ఆ కోణంలో అంచనా వేసుకున్నాను. అయితే, డార్జిలింగ్ మెయిల్ నిశ్శబ్దంగా నా మనస్సులో ఒక గుర్తు (మార్క్) ను మాత్రం ఏర్పాటు చేసింది. నేను ప్రారంభ డెబ్భైల (1970 సం.) నుండి అనగా అది డబ్ల్యుపి ఇంజను ద్వారా నెట్టబడే రోజుల్లో ఉన్నప్పుడు ఈ రైలులో ప్రయాణించే వాడిని అని అనుకుంటున్నాను. ఆ రోజులలో లోకోమోటివ్‌ను, మెయిల్ లో పనిచేసిన సిబ్బంది న్యూ జల్పైగురి నుండి రాంపూర్హట్ వరకు తీసుకు వచ్చేవారు. అక్కడినుండి (అనగా రాంపూర్హట్ నుండి) రాంపూర్హట్ లోకో, సిబ్బంది రైలును (సీల్డా వరకు ఉన్న మొత్తం రైలు మార్గము) దాకా తీసుకు వచ్చేవారు. ఉత్తర బెంగాల్‌లో ఒక పాత సామెత ఉంది. ఇది నేను అంచనా వేసినది ఇప్పటికీ నిజమైనది. ఇది ఈ క్రింది విధంగా చెప్పబడింది: న్యూ జల్పైగురి స్టేషనుకు డార్జిలింగ్ మెయిల్ రావడంతో న్యూ జల్పైగురి జీవితం వికసిస్తుంది (స్ప్రింగ్స్), సాయంత్రం దాని (డార్జిలింగ్ మెయిల్) నిష్క్రమణతో (న్యూ జల్పైగురి నిద్రపోతుంది) అది పడుకుంటుంది. ఆ తొలి రోజులలో 19:15 గం. అప్ దిశలో మెయిల్ సీల్డా, డౌన్ దిశలో న్యూ జల్పైగురి వదిలి బయలు దేరి ఉన్నప్పుడు చాలా ప్రసిద్ధ సమయం. రైల్వే కాలనీలో నా ఇంటి నుండి చిన్నతనంలో ప్రతి రోజు సాయంత్రం నేను డబ్ల్యుపి ఇంజను ద్వారా మెయిల్ రైలును ముందుకు నెట్టబడే దృశ్యాన్ని చూస్తూ ఉండటం జరిగేది. ఆ తర్వాత బండి (కాబ్) ఒక ఎరుపు మిణుగురు వెలుగు కలిగి, తరువాత కాంతి వెలుగులు (లైట్ల స్ట్రింగ్) విరజిమ్మడం అనేది మాత్రం అది ఏనాటికి మరచిపోలేని మధురమైన నిత్య ముద్ర వేసింది. ఎనభై దశకాలలో (1980 సం.లలో) డీజిల్ ఇంజనుతో నడిచే రోజులలో కూడా, నేను సెలవుల్లో ఇంట్లో ఉన్నప్పుడు, నేను మెయిల్ నిష్క్రమణ అనేది మాత్రం నిత్యం ఒక మతపరమైనదిగా, ఆచారంగా చూడటం జరిగేది. రాత్రి 19:15 గంటల సమయంలో ఒక డబ్ల్యుడిఎం-2 ఇంజను పైకి ప్రత్యేక ధ్వని చేయడం ప్రతి ఒక్కరూ వినేవారు, అది లైట్ల వెలుగులు విరజిమ్ముతూ ఉంటూ, కొన్ని నిమిషాల్లో దానిని బయలు దేరడానికి తరలించేవారు. రైలు చాలా ప్రజాదరణ పొందిన కారణంగా, సంవత్సరంలో ఏ సమయంలో అయినా ఈ రైలుకు రిజర్వేషన్లు పొందడం అనేది మాత్రము చాలా కష్టంతో కూడుకున్న పని. అంతేకాక, ఒక బెర్త్ పొందడానికి వెయిటింగ్ జాబితా ప్రయాణికుల మధ్య ఒక నిజమైన పోరాటం ఉంటూ ఉండేది. టిటిఈ లకు నిజంగా ఒక మంచి సమయం, మెయిల్ లో పని చేయడం ఒక అదృష్టం. అంతేకాకుండా ప్రయాణానికి అనువుగా ఉండే హల్దిబారి నుండి రెండు స్లిప్ కోచ్‌లు, కతిహార్ నుండి రెండు స్లిప్ కోచ్‌లు కూడా మెయిల్ కలిగి ఉంది. ఇది కుమెద్పూర్ వద్ద వేరు చేయబడుతుంది. కతిహార్ నకు ఆ స్లిప్ కోచ్‌లు తరువాత రద్దు చేసినప్పటికీ బర్సోయి సమీపంలో చిన్న జంక్షన్ అయిన కుమెద్పూర్ వద్ద మెయిల్ మాత్రం ఆగడం కొనసాగింది. రైలు మార్గము కుమెద్పూర్ వద్ద కతిహార్ నకు వెళ్ళేందుకు విడిపోతుంది". ”[10][11] డార్జిలింగ్ మెయిల్ లో సాధారణంగా ఒక మృదువైన ప్రయాణం (రన్) కలిగి ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు కుదుపులు పొందుతుంది.[12][13]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Darjeeling Mail 12343". Clear Trip. Archived from the original on 2015-09-19. Retrieved 2012-03-04.
  2. 2.0 2.1 2.2 2.3 "India: the complex history of the junctions at Siliguri and New Jalpaiguri". IRFCA. Retrieved 2011-11-12.
  3. "Hardinge Bridge". Banglapaedia. Archived from the original on 2012-01-19. Retrieved 2011-11-12.
  4. Joydeep Dutta and Harsh Vardhan. "Trains of Fame and Locos with a Name, part 2". IRFCA. Retrieved 2012-02-22.
  5. "Geography - International". IRFCA. Retrieved 2012-02-22.
  6. "my school i wish". Madhyamgram Re-visited after 15 years. Archived from the original on 2011-07-08. Retrieved 2011-01-23.
  7. Salman, Salman M. A.; Uprety, Kishor (2002). Conflict and cooperation on South Asia's international rivers: a legal perspective. World Bank Publications. pp. 135–136. ISBN 978-0-8213-5352-3. Retrieved 2011-07-05.
  8. R.P.Saxena. "Indian Railway History timeline". Archived from the original on 2012-07-14. Retrieved 2011-11-20.
  9. "Darjeeling Mail (12343)". ixigo. Archived from the original on 2012-05-28. Retrieved 2012-02-22.
  10. Joydeep Dutta. "A tribute to Darjeeling Mail". IRFCA 2004. Archived from the original on 2012-10-28. Retrieved 2012-02-22.
  11. John Lacey. "Reflections on Joydeep's Darjeeling Mail Tribute". RFCA. Archived from the original on 2011-08-03. Retrieved 2012-02-22.
  12. "Darjeelng Mail horror run, Train reaches Sealdah 11 hours late". Calcutta, India: The Telegraph, 12 March 2008. 2008-03-12. Retrieved 2012-02-22.
  13. "Man dead on Darjeeling MailI". Calcutta, India: The Telegraph, 30 March 2010. 2010-03-30. Retrieved 2012-02-22.

బయటి లింకులు

[మార్చు]
External video
Darjeeling Mail-WDP4 magic with 8 AC coaches
Darjeeling Mail at Kamarkundu Junction