జాల్నా - దాదర్‌ ముంబై జన శతాబ్ది ఎక్స్ ప్రెస్

వికీపీడియా నుండి
(ఔరంగాబాద్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Janshatabdi Express (Mumbai - Aurangabad) Route map

జాల్నా-ముంబయి జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ అనేది ఒకే రోజు ఇరు మార్గాల్లో నడిచే రైలు (అంటే ఒకరోజులో బయలు దేరిన నుంచి గమ్యాన్ని చేరుకుని, అదేరోజు తిరుగు ప్రయాణంలో తన ఆరంభ స్థానానికి చేరుకుంటుంది). మహారాష్ట్రలో జాల్నా నుంచి రాష్ట్ర రాజధాని ముంబయి స్టేషన్లను కలుపుతూ ఈరైలు నడుస్తుంటుంది. జాల్నా - దాదర్‌ స్టేషన్ల మధ్య నడిచే జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ అనేది అతి వేగంగా, సౌకర్యవంతంగా ఉండే రైలుగా పేరు పొందింది.

చరిత్ర[మార్చు]

సంస్కృత భాషలో “జన్” అంటే ప్రజలు అని అర్థం. "శతాబ్ది" అనగా నూరు సంవత్సరములు అని అర్థము. 1988-వ సంవత్సరములో స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ శతజయంత్యుత్సవములను పురస్కరించుకొని భారతీయ రైల్వేలు దేశ వ్యాప్తముగ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టిరి.తదుపరి కొన్ని యేళ్ళకు శతాబ్ది బళ్ళతో పోలిస్తే కొంత తక్కువ ధరతో ప్రయాణించే జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్ళు ప్రవేశపెట్టబడినవి. జన్ శతాబ్ది అనేది అతి తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగించే, ప్రధాన మెట్రో పాలిటన్ నగరాలకు తీసుకువెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్. శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్ల విభాగంలో ఇది దిగువ శ్రేణికి చెందుతుంది.[1]

జాల్నా జన్ శతాబ్ది[మార్చు]

12071/72 నెంబర్లు గల జాల్నా జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు దాదర్, జాల్నా పట్టణాల మధ్య నడుస్తుంటుంది. దక్షిణ రైల్వే ఆధ్వర్యంలో ఈ సూపర్ ఫాస్ట్ రైలు ప్రతీరోజు నడుస్తుంటుంది. ముంబయి సి.ఎస్.టి. (చత్రపతి శివాజీ టెర్మినల్) వరకు ఈ రైలు విస్తరించబడింది. 2013 జూలై 1 నాడు సవరించిన కొత్త కాల నిర్ణయం పట్టిక ప్రకారం దాదర్ వరకు మాత్రమే తిరిగి మార్పు చేశారు. ఇప్పుడు ఇది 12051/52 నెంబరు గల దాదర్ మడగావ్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ రేక్ తో భాగం పంచుకుంటోంది. జాల్నా నుంచి బయలుదేరే రైలు 12072 నెంబరుతో ఉదయం 04.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు దాదర్ చేరుకుంటుంది. ఈ మధ్య దూరాన్ని సుమారుగా 6.5 గంటల సగటు కాలంతో మొత్తం 374 కిలోమీటర్లు (232 మైళ్లు) ప్రయాణం చేస్తుంది. ఈ మార్గంలో ఇది మన్మడ్ జంక్షన్, నాసిక్ రోడ్, కల్యాణ్ జంక్షన్, థానే స్టేషన్లలో ఆగుతుంది. అదేవిధంగా రైలు నిర్వహణ కోసం కాస్రా, ఇగత్ పురి స్టేషన్లలోనూ ఈ రైలు ఆగుతుంది.[2]

తిరుగు ప్రయాణంలో దాదార్ నుంచి ఈ రైలు [3] 12071 నెంబర్ తో మధ్యాహ్నం 14.00 గంటలకు బయలు దేరి జాల్నాకు రాత్రి 11.35 గంటలకు చేరుకుంటుంది.[4] జాల్నా జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలులో తొమ్మిది బోగీలుంటాయి. వీటిలో కేటగిరి వారిగా చూస్తే ఆరు జన శతాబ్ది తరగతి చైర్ కార్లు, ఒక ఏసీ ఛైర్ కారు, రెండు లగేజ్ కం బ్రేక్ వ్యాన్లు ఉంటాయి.[5]

జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ (12071) గురించి కొన్నిముఖ్యాంశాలు

 • బయలుదేరే స్థానం-దాదర్
 • గమ్యస్థానం-జాల్నా
 • రైలు నడిచే రోజులు సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది

గ్యాలరీ[మార్చు]

 • 12072 జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు బోర్డు
 • 12072 జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ బోగీ
 • 12072 జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు నాన్ ఏసీ బోగీ
 • దాదర్ స్టేషనులో ఆగిన 12072 జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు

మార్గం-షెడ్యూలు[మార్చు]

సంఖ్య స్టేషను పేరు (కోడ్) వచ్చే సమయం బయలుదేరే సమయం ఆగే సమయం ప్రయాణ దూరం రోజులు మార్గం
1 దాదర్ (డి.ఆర్.) Starts 14:00 0 0 km 1 1
2 థానే (టి.ఎన్.ఎ.) 14:23 14:25 2 min 25 km 1 1
3 కల్యాణ్ జంక్షన్ (కె.వై.ఎన్) 14:40 14:43 3 min 45 km 1 1
4 నాసిక్ రోడ్ (ఎన్.కె.) 17:08 17:10 2 min 179 km 1 1
5 మన్మాడ్ జంక్షన్ (ఎం.ఎం.ఆర్.) 18:10 18:15 5 నిమి. 252 కి.మీ. 1 1
6 ఔరంగాబాద్ (ఎ.డబ్ల్యూ.బి.) 20:10 20.15 5 నిమి. 365 కి.మీ 1 1
7 జాల్నా (జె) 20:35 ముగింపు 0 426 కి.మీ 1 1

బయటి లింకులు[మార్చు]

ఇతర పరికరాలు[మార్చు]

 • దేశీయ చవక విమాన టికెట్లు
 • అంతర్జాతీయ విమాన సర్వీసులు
 • విమాన సీట్ల సమాచారం
 • భారతీయ హోటళ్లు
 • ఐ.ఆర్.టి.సి. రైల్వే రిజర్వేషన్
 • భారతీయ రైల్వే పి.ఎన్.ఆర్. స్టేటస్
 • ప్రయాణ మార్గదర్శి
 • సెలవుల ప్యాకేజీలు
 • బస్ బుకింగ్

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Janshatabdi".
 2. "Indiarailinfo.com".
 3. "Aurangabad Jan Shatabdi Express". cleartrip.com.
 4. "Indiarailinfo".
 5. "Indian Rail Gov". indianrail.