కొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గం
కొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గము | |||
---|---|---|---|
అవలోకనం | |||
రకము (పద్ధతి) | అంతర్నగర రైలు మార్గం | ||
వ్యవస్థ | విద్యుదీకరించబడింది | ||
స్థితి | పనిచేస్తోంది | ||
లొకేల్ | కేరళ | ||
చివరిస్థానం | కొల్లం జంక్షను తిరువనంతపురం సెంట్రల్ | ||
స్టేషన్లు | 18 | ||
సేవలు | 1 (కొల్లం - తిరువనంతపురం) | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | 4 జనవరి 1918 | ||
యజమాని | దక్షిణ రైల్వే | ||
నిర్వాహకులు | తిరువనంతపురం రైల్వే డివిజను | ||
పాత్ర | At–grade | ||
డిపో (లు) | కొల్లం మేము షెడ్ | ||
రోలింగ్ స్టాక్ | WAP-1, WAP-4 electric locos; WAP-7 WDS-6, WDM-2, WDM-3A, WDP-4 and WDG-3A, WDG-4 | ||
సాంకేతికం | |||
లైన్ పొడవు | 65 కిలోమీటర్లు (40 మై.) | ||
ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||
ఆపరేటింగ్ వేగం | 110 kilometres per hour (68 mph) | ||
|
కొల్లం-తిరువనంతపురం ట్రంక్ లైన్ కేరళ లోని కొల్లం, తిరువనంతపురం నగరాలను కలుపే దక్షిణ రైల్వే జోన్‌లోని రైలు మార్గం. మీటర్ గేజ్ యుగంలో మద్రాస్-క్విలాన్ లైన్ పొడిగింపుగా ఈ లైను 1918 జనవరి 4 న మొదలైంది.
చరిత్ర
[మార్చు]ట్రావెన్‌కోర్ వాణిజ్య రాజధానిగా ఉన్న క్విలాన్ (కొల్లాం) ను మద్రాస్‌తో అనుసంధానించే ఉద్దేశంతో దక్షిణ భారత రైల్వే కంపెనీ 1902లో క్విలాన్-సెంగోట్టై రైలు మార్గాన్ని ప్రారంభించింది. మిరియాలు, జీడిపప్పు, తదితర సుగంధ ద్రవ్యాలను సాఫీగా రవాణా చేయడానికి క్విలాన్ నగరాన్ని మద్రాస్‌తో అనుసంధానించాలని పోర్ట్ ఆఫ్ క్విలాన్, నగరం లోని వాణిజ్య వర్గాలు బ్రిటిష్ పాలకులను కోరాయి. [1] 1918 జనవరి 4 న, దక్షిణ భారత రైల్వే కంపెనీ కొల్లం - తిరువనంతపురం పొడిగింపును చాల వరకు ప్రారంభించింది. టెర్మినస్‌ను త్రివేండ్రం సెంట్రల్ (తంపనూర్)కి మార్చి, 1931లో ప్రారంభించారు. [2]
పరిపాలన
[మార్చు]దక్షిణ రైల్వే జోన్‌లోని తిరువనంతపురం రైల్వే డివిజన్ పరిపాలనా నియంత్రణలో ఉన్న ఈ మార్గం దక్షిణాన తిరువనంతపురం - కన్యాకుమారి లైన్, ఉత్తరాన కొల్లం - కాయంకుళం లైన్, తూర్పున కొల్లం-పునలూర్-సెంగోట్టై లైన్‌తో కలుపుతుంది. [2] [3]
స్టేషన్లు
[మార్చు]నం. | స్టేషన్ | వర్గం | సగటు రోజువారీ ప్రయాణీకులు | సగటు రోజువారీ ఆదాయం |
---|---|---|---|---|
1 | కొల్లం జంక్షను | NSG 3 | 23,285 | 18,48,050 |
2 | ఎరవిపురం | HG 2 | 225 | 3,022 |
3 | మెయ్యనాడ్ | NSG 6 | 412 | 7,200 |
4 | పరవూర్ | NSG 5 | 2,761 | 40,480 |
5 | కప్పిల్ | NSG 6 | 43 | 513 |
6 | ఎదవ | NSG 6 | 532 | 3,024 |
7 | వర్కాల శీవగిరి | NSG 4 | 11,427 | 3,04,661 |
8 | ఆకతుమూరి | HG 3 | 34 | 677 |
9 | కడక్కవూరు | NSG 6 | 967 | 18,844 |
10 | చిరయింకీళు | NSG 5 | 2,581 | 39,965 |
11 | పెరుంగుజి | HG 2 | 93 | 859 |
12 | మురుక్కంపుజ | NSG 6 | 195 | 2,937 |
13 | కనియాపురం | NSG 6 | 345 | 3,474 |
14 | కజకూట్టం | NSG 5 | 1881 | 75,342 |
15 | వెలి | HG 2 | 62 | 995 |
16 | కొచ్చువేలి | NSG 3 | 1,720 | 666420 |
17 | తిరువనంతపురం పెట్టా | NSG 6 | 914 | 14,307 |
18 | తిరువనంతపురం సెంట్రల్ | NSG 2 | 39,157 | 52,91,536 |
సేవలు
[మార్చు]కొల్లాం-తిరువనంతపురం మార్గంలో ప్రస్తుతం 67 జతల ప్రయాణీకుల సర్వీసులు ఉన్నాయి, వీటిలో 25 జతలు రోజువారీ సర్వీసులు (4 జతల పాసెంజరు రైళ్ళు, 18 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 3 జతల సూపర్ ఫాస్ట్ రైళ్లు) నడుస్తున్నాయి. కొల్లాం జంక్షన్ రాష్ట్రంలోని 2వ అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషను. మొత్తం వార్షిక ప్రయాణీకుల పరంగా అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో 4 వది.
మూలాలు
[మార్చు]- ↑ "Kollam Municipal Corporation". Archived from the original on 20 అక్టోబరు 2017. Retrieved 15 June 2015.
- ↑ 2.0 2.1 "History of Quilon". Retrieved 15 June 2015.
- ↑ Jimmy, Jose. "Cochin Harbour Terminus". Trainweb. Retrieved 15 June 2015.