కొల్లం-సెంగొట్టాయ్ శాఖా రైలు మార్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 కొల్లాం-సెంగోట్టై రైల్వే లైన్ (గతంలో క్విలాన్-చెంకోట లైన్ అని పిలిచేవారు) దక్షిణ భారతదేశంలోని రైలు మార్గం. ఇది కేరళ రాష్ట్రంలోని కొల్లం జంక్షను నుండి సెంగొట్టై వరకు నడుస్తుంది. క్విలాన్-షెంకోట్టా రైలు మార్గం పూర్వపు ట్రావెన్‌కోర్ రాష్ట్రంలో మొదటి రైలు మార్గం. ఇది ఒక శతాబ్దానికి పైగా పాతది. కొల్లం-సెంగోట్టై సెక్షన్ 1904లో బ్రిటీష్ వారు ప్రారంభించిన కొల్లాం - చెన్నై మీటర్-గేజ్ రైలు మార్గంలో భాగం. లైన్ పూర్తిగా బ్రాడ్ గేజ్‌గా మార్చబడింది.

కొల్లం-సెంగోట్టాయ్ మీటర్-గేజ్ మార్గ నిర్మాణాన్ని ట్రావెన్‌కోర్ మహారాజా ఉత్రం తిరునాల్ సంకల్పించాడు. దీనిని దక్షిణ భారత రైల్వే కంపెనీ, ట్రావెన్‌కోర్ రాష్ట్రం, మద్రాస్ ప్రెసిడెన్సీలు సంయుక్తంగా నిర్మించాయి. 1888లో సర్వే అనంతరం 1900లో పనులు ప్రారంభించి 1902 నాటికి పూర్తి చేశారు. ఈ మార్గంలో మొదటి గూడ్స్ రైలు 1902లో ప్రయాణించగా, మొదటి ప్యాసింజర్ రైలు 1904లో మొదలైంది. మొదటి మీటర్ గేజ్ సేవలను 1904 జూలై 1 న ట్రావెన్‌కోర్ మహారాజా మూలం తిరునాల్ 21 తుపాకుల వందనంతో కొల్లం నుండి మొదటి ప్యాసింజర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. బ్రిటీష్ వారు కొల్లం నుండి చెన్నైకి అటవీ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పులను రవాణా చేయడానికి పశ్చిమ కనుమల దిగువ ప్రాంతంలో రైలు మార్గాన్ని నిర్మించారు.

కాలక్రమం

[మార్చు]
 • 1888 క్విలోన్-మద్రాస్ రైలు కోసం సర్వే ప్రారంభమైంది.
 • 1899 - క్విలాన్-మద్రాస్ రైలు లింక్ కోసం సర్వే పూర్తయింది [1]
 • 1900 - క్విలాన్ నగరాన్ని మద్రాసుతో అనుసంధానించడానికి కొల్లం-సెంగోట్టై మీటర్-గేజ్ రైలు మార్గానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.
 • 1902 - కొల్లాం-సెంగోట్టై రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి
 • 1904 - జూన్ 1న ట్రావెన్‌కోర్‌కు చెందిన హిజ్ హైనెస్ మూలం తిరునాళ్ రామవర్మ కొల్లాం రైల్వే స్టేషన్‌లో కొల్లాం-సెంగోట్టై రైలు మార్గంలో మొదటి ప్యాసింజర్ రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు.
 • 1998 - కొల్లం-సెంగోట్టై రైల్వే లైన్ గేజ్ మార్పిడి అధికారికంగా ప్రారంభమైంది
 • 2007 - మే 1న, కొల్లం-పునలూర్ సెక్షన్‌లో రైలు సేవలను ఆపేసారు
 • 2010 - మే 10న, కొల్లం-పునలూర్ బ్రాడ్-గేజ్ సెక్షన్ సేవలు మొదలయ్యాయి [2]
 • 2018 - మార్చి 31న, ప్యాసింజర్ రైలు సేవల కోసం మొత్తం కొల్లం-సెంగోట్టై మార్గం తెరవబడింది. [3] [4] [5] ఈ మార్గంలో మొదటి ప్యాసింజర్ రైలు తాంబరం–కొల్లాం–తాంబరం ప్రత్యేక రైలు సర్వీసు. ( [6] )

బ్రాడ్ గేజ్ మార్పిడి

[మార్చు]

పునలూర్-సెంగోట్టై సెక్షన్ 325-కిమీ కొల్లాం-సెంగోట్టై- తెన్కాసి - తిరునెల్వేలి - తిరుచెందూర్ గేజ్ మార్పిడి ప్రాజెక్ట్‌లో భాగం. తెన్‌కాసి- విరుదునగర్ ట్రంక్ రూట్‌లో భాగం. సెంగోట్టై-తిరుచెందూర్ సెక్షన్ గేజ్ మార్పిడి పూర్తయింది.

కొల్లం-పునలూర్ సెక్షన్

[మార్చు]

కొల్లం జంక్షన్- పునలూర్ మీటర్-గేజ్ రైలు మార్గం నుండి బ్రాడ్-గేజ్ మార్పిడి పనులకు 1998లో పునలూర్ వద్ద పునాది రాయి వేయబడింది. గేజ్ మార్పిడి పనిని సులభతరం చేసేందుకు, పునలూర్-కొల్లాం మీటర్-గేజ్ విభాగంలో సేవలు 2007 మే 1 న ఆపేసారు. గేజ్ మార్పిడి దాదాపు 11 సంవత్సరాలు పట్టింది. 2010 మే 10 న మొదలైంది. పునలూర్ నుండి కొల్లం, మదురై, గురువాయూర్, కన్యాకుమారి, పాలక్కాడ్ జంక్షన్‌లను కలిపే ప్యాసింజర్ రైలు సేవలు ప్రస్తుతం నడుస్తున్నాయి.

పునలూర్-సెంగోట్టై సెక్షన్

[మార్చు]

పునలూర్ -సెంగోట్టై సెక్షన్‌లో గేజ్ మార్పిడి పనిని సులభతరం చేయడానికి, సెక్షన్‌లో రైలు సేవలను 2010 సెప్టెంబరులో ఆపేసారు. 49.2-కిమీ పునలూర్-సెంగోట్టై సెక్షన్ గేజ్ మార్పిడి పనులు 2017 డిసెంబరులో పూర్తయ్యాయి. 2018 మార్చిలో రైళ్ళు తిరగడం మొదలైంది.


మూలాలు

[మార్చు]
 1. "Kollam Municipal Corporation". Archived from the original on 20 అక్టోబరు 2017. Retrieved 21 June 2017.
 2. "Kollam-Sengottai train service likely from May". The Hindu. Kozhikode. 21 December 2016. Retrieved 21 June 2017.
 3. "Sengottai-Kollam railway line reopens after eight years". The New Indian Express. 1 April 2018. Retrieved 2 April 2018.
 4. "Chennai to Kollam train will resume after eight years". The New Indian Express. 31 March 2018. Retrieved 2 April 2018.
 5. "Special trains announced between Tambaram and Kollam". Times of India. 30 March 2018. Retrieved 2 April 2018.
 6. "First train from Chennai on Punalur line has commuters ready to roll". Times of India. 1 April 2018. Retrieved 2 April 2018.