జోలార్‌పేట-షొరనూర్ రైలు మార్గం
జోలార్‌పేట-షొరనూర్ రైలు మార్గం | |||
---|---|---|---|
అవలోకనం | |||
స్థితి | పనిచేస్తోంది | ||
లొకేల్ | తమిళనాడు, కేరళ, కర్ణాటక | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | 1861 | ||
యజమాని | భారతీయ రైల్వేలు | ||
నిర్వాహకులు | దక్షిణ రైల్వే, నైరుతి రైల్వే | ||
డిపో (లు) | ఈరోడ్, జోలార్‌పేట | ||
రోలింగ్ స్టాక్ | WDM-2, WDM-3A, WDM-3D, WDG-3A, WDG-4, WDP-4B/D డీజిల్ లోకోలు; WAG-7, WAP-4,WAP-7, WAG-9 ఎలక్ట్రిక్ లోకోలు. | ||
సాంకేతికం | |||
ట్రాక్ పొడవు | ప్రధాన మార్గం: 418 కి.మీ. (260 మై.) శాఖా మార్గాలు Salem–Yeshvantapur 229 కి.మీ. (142 మై.) Salem–Mettur Dam 39 కి.మీ. (24 మై.) Irugur–Coimbatore–Mettupalayem 54 కి.మీ. (34 మై.) | ||
ట్రాక్ గేజ్ | 5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజి | ||
ఆపరేటింగ్ వేగం | 140 km/h | ||
అత్యధిక ఎత్తు | జోలార్‌పేట 405 మీటర్లు (1,329 అ.) కోయంబత్తూరు 411 మీటర్లు (1,348 అ.) యశ్వంతపూర్ 919 మీటర్లు (3,015 అ.) | ||
|
జోలార్‌పేట-షోరనూర్ లైన్ చెన్నై సెంట్రల్-బెంగళూరు సిటీ లైన్‌లోని జోలార్‌పేటను, కేరళలోని షోరనూర్‌ను కలుపుతుంది. జోలార్‌పేట వద్ద అరక్కోణం, కాట్పాడి మీదుగా చెన్నై/తిరుపతి వైపు నుండి అనేక శాఖల లైన్లు వస్తాయి. అవి - జోలార్‌పేట-బంగారుపేట్-బెంగళూరు, సేలం-ఓమలూరు-మెట్టూర్ డ్యామ్/ధర్మపురి-హోసూర్-యశ్వంతపూర్, సేలం-నమక్కల్-కరూర్, సేలం-విరుద్ధాపురం-విరుద్ధాపురం ఈరోడ్-కరూర్, ఇరుగూర్/పోదనూరు-కోయంబత్తూరు-మెట్టుపాళయం, పాలక్కాడ్-దిండిగల్. షోరనూర్ నుండి, రైల్వే లైన్లు కేరళలోని కోజికోడ్, నిలంబూర్, త్రిస్సూర్ వైపున మరింత శాఖలుగా ఉన్నాయి. ఈ నెట్‌వర్క్ కేరళలోని రైల్వే నెట్‌వర్క్‌ను తమిళనాడు, కర్ణాటకలోని నెట్‌వర్క్‌లకు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకూ అనుసంధానిస్తుంది.
చరిత్ర
[మార్చు]1856లో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైలు సేవ, భారతదేశంలో మూడవది మద్రాసు రైల్వే ద్వారా రాయపురం వేయసరపాడు నుండి వాలాజా రోడ్ (ఆర్కాట్) వరకు నిర్వహించబడింది. మద్రాసు రైల్వే దాని ట్రంక్ మార్గాన్ని 1861లో బేపూర్ / కడలుండి (కాలికట్ సమీపంలో) వరకు విస్తరించింది [1]
మీటర్-గేజ్ పోడనూర్-మెట్టుపాళయం లైన్ను 1873లో తెరిచారు. యునెస్కో హెరిటేజ్ ట్రాక్, నీలగిరి మౌంటైన్ రైల్వేను రెండు దశల్లో ప్రారంభించారు. మెట్టుపాళయం-కూనూర్ సెక్షన్ను 1899లో ప్రారంభించారు. దీన్ని 1908 లో [2] ఉదగమండలం (ఊటీ) వరకు విస్తరించారు. పోదనూరు-మెట్టుపాళయం సెక్షన్ను 2000ల ప్రారంభంలో బ్రాడ్ గేజ్‌గా మార్చారు.
రెండు నారో గేజ్ కరువు-రక్షణ మార్గాలను ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభ సంవత్సరాల్లో తెరవడం జరిగింది. 25.25 మై. (41 కి.మీ.) పొడవున్న తిరుపత్తూరు-కృష్ణగిరి లైన్ 1905లోను, 18.5 మై. (30 కి.మీ.) -పొడవున్న మొరప్పూర్-ధర్మపురి లైన్ను 1906లోనూ ప్రారంభించారు. దీన్ని – 54.5 మై. (88 కి.మీ.) పొడవున హోసూర్ వరకు పొడిగించారు. హోసూర్-ధర్మపురి లైన్ను 1941లో నిలిపివేసారు. ఇతర రెండు లైన్లను 1945లో మూసివేసారు. [3] [4]
అరక్కోణం-జోలార్‌పేట-సేలం-ఈరోడ్-పాలక్కాడ్-ఎర్నాకులం లైన్ను "గ్రూప్ B" లైన్‌గా వర్గీకరించబడినప్పటికీ, దీని వేగం 130 km/h వరకు ఉంటుంది. గరిష్టంగా అనుమతించిన వేగం 110 కిమీ/గం [5]
ఈరోడ్ లోని డీజిల్ లోకో షెడ్డులో WDM-2, WDM-3A, WDM-3D, WDG-3A, WDG-4 లోకోలు ఉన్నాయి. ఈరోడ్ లోనే ఉన్న ఎలక్ట్రిక్ లోకో షెడ్డులో WAG-7, WAP-4, WAP-7 లోకోలున్నాయి. ఇది భారతీయ రైల్వేలలో అతిపెద్ద WAP-4 లోకో షెడ్డు. దేశంలోని ఎలక్ట్రిక్ రైళ్ల కోసం కొన్ని పొడవైన మార్గాలను నిర్వహిస్తుంది. [6]
జోలార్‌పేటలో ఎలక్ట్రిక్/డీజిల్ ట్రిప్ షెడ్ ఉంది. [6]
ప్రయాణీకుల కదలిక
[మార్చు]ఈ లైన్‌లో ఉన్న సేలం, కోయంబత్తూర్, ఈరోడ్, పాలక్కాడ్‌లు భారతీయ రైల్వేలోని టాప్ వంద బుకింగ్ స్టేషన్‌లలో ఉన్నాయి. [7]
మూలాలు
[మార్చు]- ↑ "IR History – Early days". 1832–1869. IRFCA. Retrieved 23 December 2013.
- ↑ "Mettupalam-Udhagamandalam (Ooty) Train". india invites. Archived from the original on 24 December 2013. Retrieved 23 December 2013.
- ↑ "Salem District (1916)". IRFCA. Retrieved 29 December 2013.
- ↑ "Chronology of Railways in India, Part 3 (1900–1947)". IRFCA. Retrieved 29 December 2013.
- ↑ "Chapter II : The Maintenance of Permanent Way". Archived from the original on 3 December 2013. Retrieved 23 December 2013.
- ↑ 6.0 6.1 "Sheds and Workshops". IRFCA. Retrieved 23 December 2013. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "sheds" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 10 May 2014. Retrieved 23 December 2013.