మలబార్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
'మలబార్ ఎక్స్‌ప్రెస్'
Malabar Express
మంగళూరు రైల్వే స్టేషన్
సారాంశం
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వేలు
మార్గం
మొదలుమంగళూరు సెంట్రల్
ఆగే స్టేషనులు54
గమ్యంతిరువనంతపురం సెంట్రల్
ప్రయాణ దూరం634 km (394 mi)
సగటు ప్రయాణ సమయం14 గం. 40 ని.లు
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)16629 / 16630
సదుపాయాలు
శ్రేణులు3 టైర్ ఎసి, 2 టైర్ ఎసి, ఫస్ట్ క్లాస్ (కొత్త ఫస్ట్ క్లాస్ కోచ్లు లేకపోవడమే కారణంగా, దక్షిణ రైల్వే లోని అన్ని రైళ్లు నుండి ఫస్ట్ క్లాస్ కోచ్లు తొలగించడానికి 2014, సెప్టెంబర్ 1 నుండి నిర్ణయం తీసుకోవడం జరిగింది), స్లీపర్ క్లాస్, జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలులేదు
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
సాంకేతికత
రోలింగ్ స్టాక్7
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)

మలబార్ ఎక్స్‌ప్రెస్ (మలయాళం: മലബാര് എക്സ്പ്രസ്സ്), భారతదేశంలో మంగళూరు సెంట్రల్ నుండి తిరువనంతపురం సెంట్రల్ వరకు నడిచే ఒక రైలు సేవ.[1] భారతదేశం యొక్క నైరుతి తీర ప్రాంతం యొక్క మలబార్ తీరం పేరు ఈ రైలుకు పెట్టారు. ఇది ఉత్తర కేరళలో మలబార్ ప్రాంతం నుండి దక్షిణాన వరకు కలుపుతుంది కనుక రైలుకు మలబార్ ఎక్స్‌ప్రెస్ పేరును సూచించినట్లుగా తెలుస్తుంది. మంగళూరు, తిరువంతపురం సెంట్రల్ మధ్య రైలు దీర్ఘకాలం నడిచిన సమయం ఒకటి ఉంది.

ఈ రైలు తన భోగీ (రేక్‌) లతో పాటుగా ఇతర రైలు బండ్ల అయిన 16603/04 → మావెలి ఎక్స్‌ప్రెస్, 12601/02 → మంగళూరు సెంట్రల్ - చెన్నై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ మెయిల్, 22637/38 → వెస్ట్ కోస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ యొక్క భోగీ (రేక్) ^లను కూడా పంచుకుంటుంది. త్రివేండ్రం నుండి షోరనూర్ వరకు రైలు యొక్క లింక్ ఇంజను డబ్ల్యుఎపి -4 ఈరోడ్ దగ్గర ఉంది, షోరనూర్ నుండి మంగళూరుకు జిఒసి/ ఈడి అనే -4డి ఇంజను ద్వారా రైలు ప్రయాణిస్తుంది.

కేరళలో అత్యంత ప్రాచుర్యం పొందిన రైళ్లు జాబితా యందు మలబార్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒకటి.

చరిత్ర

[మార్చు]

రైలు ప్రారంభంలో మద్రాసు, మంగళూరు మధ్య ప్రవేశపెట్టి అమలు పరిచారు. ఆ సమయంలో రైలు పేరు మద్రాస్ - మంగళూరు మలబార్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఉంది. 1963 సం.లో ఈ రైలు మార్గం కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ వరకు విస్తరించారు. తరువాత మళ్ళీ ఈ రైలు మార్గం తిరువంతపురం సెంట్రల్ వరకు విస్తరించబడింది.[2].

మార్గము

[మార్చు]

ఈ రైలు మంగళూరు సెంట్రల్, తిరువంతపురం సెంట్రల్ మధ్య నడుస్తుంది. రైలు సంఖ్య: 16629 → 18:30 గంటల వద్ద త్రివేండ్రం నుండి మొదలవుతుంది, 10:10 గంటలకు తదుపరి రోజు మంగళూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు: 16630 → 18:15 గంటల వద్ద మంగళూరు వద్ద బయలు దేరి, 09:10 గంటలకు తదుపరి రోజు త్రివేండ్రానికి చేరుకుంటుంది.[3][4]

కోచ్ కంపోజిషన్

[మార్చు]

ఇది 23 కోచ్‌లు (13 → స్లీపర్ క్లాస్, 4 → 3-టైర్ ఎసి (బిఈ 1 జోడింపు తర్వాత), 1 → 2-టైర్ ఎసి, 4 → రెండవ తరగతి,, 1 → బ్రేక్ వ్యాన్-కమ్-రెండవ సిట్టర్) కలిగి ఉంది.

విరామాలు

[మార్చు]

ఈ రైలుకు మొత్తం 52 విరామాలు ఉన్నాయి.[5]

 • మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషను
 • ఉల్లాల్
 • మంజేశ్వర్
 • ఉప్పల
 • కుంబ్ల
 • కాసరగోడ్
 • కోతికులం
 • పల్లికేరే
 • కన్హన్గడ్
 • నిలేశ్వర్
 • త్రికరిపూర్
 • పయ్యనుర్
 • ఎజ్హిమల
 • పయన్గది
 • కన్నాపురం
 • వలపట్టణం
 • కన్నూర్
 • తలస్సేరి
 • వదకర
 • కోయిలన్డి
 • కోజ్హిక్కోడే
 • ఫెరోక్
 • పర్పనంగది
 • తానూర్
 • తిరుర్
 • కుట్టిప్పురం
 • షోరనూర్ జంక్షన్
 • త్రిస్సూర్ రైల్వే స్టేషను
 • ఇరింజలకుడా
 • చలకుడి
 • అన్గామాలి
 • ఆలువ
 • ఎర్నాకులం టౌన్/జంక్షన్
 • పిరవోం రోడ్
 • కొట్టాయం
 • చంగానసేరి
 • తిరువల్ల
 • చెంగన్నూర్
 • మవేలికర
 • కాయంకుళం జంక్షన్
 • కరునగాప్పల్లీ
 • సస్థంకొట్ట
 • మున్రోతురుట్టు
 • కొల్లం జంక్షన్
 • పరవుర్
 • వర్కాల
 • కదకవుర్
 • చిరయిన్కిల్
 • మురుక్కంపుజ్హ
 • కజ్హకుట్టం
 • త్రివేండ్రం పెట్ట
 • త్రివేండ్రం సెంట్రల్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-11-19.
 2. https://en.wikipedia.org/wiki/Malabar_Express
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-08-29. Retrieved 2015-11-19.
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-08-18. Retrieved 2015-11-19.
 5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-07. Retrieved 2015-11-19.