కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
(కాకినాడ - సికింద్రాబాదు ఎసి ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
Cocanada AC Express 04.jpg
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
స్థితిఆపరేటింగ్
స్థానికతఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే జోను, భారతీయ రైల్వేలు
మార్గం
మొదలుసికింద్రాబాద్ జంక్షన్
ఆగే స్టేషనులు09
గమ్యంకాకినాడ
ప్రయాణ దూరం589 కి.మీ. (1,932,000 అ.)
సగటు ప్రయాణ సమయం10 గం.లు, 35 ని.లు
రైలు నడిచే విధంసికింద్రాబాద్ నుండి కాకినాడ టౌన్ వరకు - వారానికి మూడు రోజులు (సోమ, బుధ , శుక్రవారములు) కాకినాడ టౌన్ నుండి సికింద్రాబాద్ వరకు - వారానికి మూడు రోజులు (ఆది, మంగళ , గురువారములు)
సదుపాయాలు
శ్రేణులుఎసి స్లీపర్ 1వ తరగతి, 2వ తరగతి , 3వ తరగతి
వికలాంగులకు సదుపాయాలుభారతీయ రైల్వేలు ప్రామాణికం
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఉంది
చూడదగ్గ సదుపాయాలుఅన్ని భోగీలకు శుభ్రమైన పెద్ద కిటికీలు
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద సదుపాయం ఉన్నది.
సాంకేతికత
రోలింగ్ స్టాక్రెండు
పట్టాల గేజ్బ్రాడ్‌గేజ్ (1,676 mm)
విద్యుతీకరణ5,350 hp (3,989 kW)
వేగం55 కి.మీ./గంటకు సరాసరి వేగం"
మార్గపటం
Cocanada AC Express (Kakinada - Secunderabad) Route map.jpg

కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ [1] ఇది కాకినాడ టౌన్ రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2] కాకినాడ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వారానికి మూడు రోజులు సికింద్రాబాద్ నుండి కాకినాడ టౌన్ వరకు నడిచే విధంగా నాటి భారతీయ రైల్వేలు మంత్రి దినేష్ త్రివేది, 2012-13 రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. ఈ ఎసి ఎక్స్‌ప్రెస్ భీమవరం టౌన్, విజయవాడ జంక్షన్ మీదుగా నడిపించే విధంగా ప్రతిపాదించారు.[3]

రేక్ (భోగీలు)[మార్చు]

ఈ రైలుకు ఎసి స్లీపర్ 1వ తరగతి (1ఎ) - 1 భోగీ, 2వ తరగతి - 5 బోగీలు, 3వ తరగతి - 10 బోగీలు, ఈఒజి (ఎండ్ ఆఫ్ జనరేషన్) కార్లు - 2 బోగీలు ఉంటాయి.

ఇంజను[మార్చు]

కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ యొక్క ప్రయాణ రైలు మార్గమునకు విద్యుద్దీకరణ పనులు కొద్ది దూరము వరకే చేయుట వలన కాకినాడ టౌన్ నుంచి విజయవాడ వరకు ఉన్న రైలు మార్గము విభాగం వరకు విజయవాడ డిపోకు చెందిన డబ్ల్యుఎఎం4/ డబ్ల్యుఎపి4 ఇంజను ద్వారా లాగబడుతుంది. ఆ తదుపరి విద్యుత్తు ఇంజను అందుబాటును బట్టి లాలగూడా డిపోకు చెందిన డబ్ల్యుఎపి7/ డబ్ల్యుఎపి4, విజయవాడ డిపోకు చెందిన డబ్ల్యుఎఎం4/డబ్ల్యుఎపి4 ఇంజను ద్వారా విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు లాగబడుతుంది.

చరిత్ర[మార్చు]

కాకినాడ యొక్క నైరుతి భాగము (ఇప్పుడు సర్పవరం) తెలుగులో కోకనాడము అని పిలుస్తారు. ఈ ప్రాంతము ఎర్ర లోటస్‌ (కలువలు) తో నిండి చెరువులు అంతటా పూర్తిగా నిండి ఉంటుంది. చివరకు ఇది కోకనాడగా మారింది. అందువల్ల రైలుకు గతకాలపు ఆనవాళ్ళకు గుర్తుగా కాకినాడ పేరు పెట్టారు. ఈ రైలుకు 2012 డిసెంబరు 14 నాడు కాకినాడ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టబడింది.

రైలు ప్రయాణము[మార్చు]

రైలు నంబరు : 12775 కాకినాడ టౌన్ నుండి గం. 22.15 ని.లకు బయలుదేరి, గం. 08:50 ని.లకు సికింద్రాబాద్ చేరుకునే విధంగా పరిచయం చేస్తున్న సమయంలో ముందుగా నిర్ణయించబడింది. అదేవిధముగా రైలు నంబరు : 12776 సికింద్రాబాద్ నుండి గం. 21.15 ని.లకు బయలుదేరి, గం. 07:45 ని.లకు కాకినాడ టౌన్ చేరుకునే విధంగా పరిచయం చేస్తున్న సమయంలో ముందుగా నిర్ణయించబడింది. ఇప్పుడు ఈ సమయాలు మార్చబడ్డాయి.[4][5][6]

సేవలు (సర్వీస్)[మార్చు]

కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ టౌన్ నుండి సికింద్రాబాద్ వరకు మొత్తం 9 విరామములతో చేరుతుంది. ఈ రైలు 589 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రైలు గంటకు 54 కి.మీ. సరాసరి వేగంతో నడుస్తుంది.

ఈ రైలు నంబరు : 12775 / 12776 కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం తదుపరి, రైలునకు శాశ్వతంగా 2015 జనవరి 29 నుండి ఒక ఎసి టూ టైర్ కోచ్ (46 బెర్త్లు) కూడా కాకినాడ టౌన్ నుండి జత కలిసింది. అదేవిధముగా 30 వ జనవరి 2015 నుండి సికింద్రాబాద్ నుండి జత కలిసింది.[7]

రైలు నిలుపుదల స్టేషన్లు[మార్చు]

ఈ రైలు రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది.

భోగీలు కూర్పు[మార్చు]

బోగీలు కూర్పు (అమరిక) ఈ క్రింద విధముగా ఉంటాయి. అవసరార్థము బోగీలు అమరికలు మారుతూ ఉంటాయి.

Loco 0 L 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
BSicon LDER.svg 0 L EOG B1 B2 B3 B4 B5 B6 B7 B8 B9 B10 A1 A2 A3 A4 H1 EOG BZA

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]