కొత్తవలస-కిరండల్ రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తవలస-కిరండల్ రైలు మార్గము
Araku valley view.jpg
విశాఖపట్నం జిల్లా లోని అరకు వ్యాలీ మీదుగా నడుస్తున్న
కొత్తవలస-కిరండల్ రైలు మార్గము
అవలోకనం
స్థితిపనిచేస్తున్నది
లొకేల్ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా , ఛత్తీస్‌ఘడ్
చివరిస్థానంకొత్తవలస
కిరండల్
స్టేషన్లు48
ఆపరేషన్
ప్రారంభోత్సవం1966
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులు2003 మార్చి వరకు ఆగ్నేయ రైల్వే జోన్, 2003 ఏప్రిల్ నుండి తూర్పు తీర రైల్వే జోన్
సాంకేతికం
ట్రాక్ పొడవు445 km (277 mi)
ట్రాక్ గేజ్1,676 మిమీ (5 అడుగులు 6 అం) బ్రాడ్ గేజ్
మార్గ పటం
కి.మీ.
పెందుర్తి వరకు
0 కొత్తవలస
విజయనగరం వరకు
9 మల్లివీడు
15 లక్కవరపుకోట
26 శృంగవరపుకోట
33 బొడ్డవార
45 శివలింగాపురం
52 తైదా
62 చిమిడిపల్లి
71 బొర్రా గుహలు
82 కరకవలస
90 షిమిలిగుడ
103 అరకు
112 గోరాపూర్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
ఒడిశా రాష్ట్రం
125 దర్లిపుట్
135 పదువా
145 భేజా
156 మచ్చకుందా
169 పాలిబా
177 సుకు(ఎస్‌ఎక్స్‌వి)
177 సుకు(ఎస్‌యుకెయు)
188 కోరాపుట్
రాయగడ నకు
189 కోరాపుట్ క్యాబిన్ బి
195 మనబార్
204 జార్తి
215 మలిగుర
222 చట్రిపుట్
229 జేపూర్
238 ధనపూర్ ఒరిస్సా
246 ఖడప
250 చార్‌ముల్లా కుసుం
261 కోటాపూర్ రోడ్
ఒడిషా రాష్ట్రం
చత్తీస్‌గఢ్ రాష్ట్రం
269 అంబగాంవ్
279 అమగుర
287 నాకాటి సేమ్రా
293 జగదల్‌పూర్
302 కుమార్ మారంగా
310 తోపోకల్
316 బడే ఆరాపూర్
327 దిల్మిలి
338 సిలాక్ ఝోరీ
347 కుమార్ సాద్రా
360 కక్లూర్
372 కావర్‌గాంవ్
381 డబ్‌పల్
392 గిడం
400 దంతెవారా
412 కమలూర్
424 భాంన్సీ
434 బచేలీ
443 కిరండల్
అరకు లోయ లోని మానాబార్ రైల్వే స్టేషను.

కొత్తవలస-కిరండల్ రైలు మార్గము 2003 నుండి తూర్పు తీర రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజనుకు 2003 సం. నుండి సంక్రమించింది. ఈ మార్గము 2003 వరకు ఆగ్నేయ రైల్వే జోన్ పరిధిలో ఉంది. ఇది ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌ఘడ్ మూడు రాష్ట్రాల గుండా వెళుతుంది.

చరిత్ర[మార్చు]

1960 లో, భారత రైల్వే మూడు ప్రాజెక్టులను చేపట్టింది: కొత్తవలస - అరకు - కోరాపుట్ - జేయ్పోర్ - జగదల్పూర్ - దంతెవార - కిరండల్ రైలు మార్గము, ఝార్సుగూడ - సంబల్పూర్ - బార్గర్ - బాలంగీర్ - టిట్లాఘర్ ప్రాజెక్ట్, బీరమిట్రాపూర్ - రూర్కెలా - బిమ్లాగర్ - కిరిబురు ప్రాజెక్ట్. అన్నీ కలిసి తీసుకున్న మూడు ప్రాజెక్టులు ముఖ్యంగా డిబికే ప్రాజెక్ట్ అని లేదా దండకారణ్య - బోలాంగిర్ - కిరిబురు ప్రాజెక్ట్ పిలువబడ్డాయి.[1] ఐరన్ ఓర్ రవాణా కోసం జపాన్ ఆర్థిక సహాయంతో ఆగ్నేయ రైల్వే పరిధిలో 1966-67లో కొత్తవలస-కిరండల్ రైలు మార్గము తెరవబడింది.[2]

భౌగోళికం[మార్చు]

ఈ రైలు మార్గము, అరకు వ్యాలీ ద్వారా తూర్పు కనుమల కొండ విభాగాలు మీదుగా వెళ్ళుతుంది. ఇది దేశంలోని అతి ఎత్తున ఉన్న బ్రాడ్ గేజ్ రైలు మార్గం. [3] ఈ రైలుమార్గం మొత్తం 58 సొరంగాలు, 84 ప్రధాన వంతెనలను కలిగి ఉంది. ప్రతి సొరంగం 520 మీటర్ల వరకు ఉంటుంది.

విద్యుద్దీకరణ[మార్చు]

ఈ రైలుమార్గం యొక్క విద్యుద్దీకరణ నాలుగు దశల్లో పూర్తయింది. కిరండల్-జగదల్‌పూర్ విభాగం 1980 లో పూర్తయింది. 1981 లో జగదల్పూర్-కోరాపుట్ విభాగం, కోరాపుట్-అరకు-వాల్తేరు విభాగం 1982 లోను పూర్తయ్యాయి. 1982 నాటికి కొత్తవలస-కిరండల్ రైలు మార్గము పూర్తిగా విద్యుద్దీకరణ చేయబడింది. [4]

పరిధి[మార్చు]

ఈ కొత్తవలస-కిరండల్ రైలు మార్గము 445 కి.మీ. (277 మైళ్ళు) పొడవు ఉంది, వీటిలో 138 కి.మీ. (86 మైళ్ళు) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గోరాపూర్ వరకు, 131 కి.మీ. (81 మైళ్ళు) ఒడిశాలో ఖదేపా వరకు, 194 కి.మీ. (121 మైళ్ళు) దూరం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కిరండల్ వరకు ఉంది. ఈ మార్గంలో అత్యధిక రూటు కి.మీ. కలిగినవి మెదటిది ఛత్తీస్‌గఢ్ కాగా, రెండవది ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా 3వ రాష్ట్రంగా ఉన్నాయి.[5] కొత్తవలస-కిరండల్ రైలుమార్గం గ్రూపు ఇ-స్పెషల్ క్లాస్ మార్గంగా వర్గీకరించబడింది, దీనిలో వేగం 100 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉండాలి.[6]

పనితీరు[మార్చు]

ఈ రైలుమార్గం ప్రధానంగా సరుకు రవాణా ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. ఇది వాల్తేరు డివిజనుకు అత్యధిక లాభదాయకమైన ఆదాయ వనరుగా ఉంది. కేవలం ఈ మార్గం ద్వారా సుమారుగా రూ.3000 కోట్ల లాభం వస్తుంది. బైలదిలా గనుల నుండి ఇనుప ఖనిజం ఈ మార్గం ద్వారా విశాఖపట్నంకు రవాణా చేయబడుతుంది.[7]

మూలాలు[మార్చు]

  1. Baral, Chitta. "History of Indian Railways in Orissa" (PDF). Retrieved 2012-12-12. Cite web requires |website= (help)
  2. "History of Waltair Division". Mannanna.com. మూలం నుండి 11 అక్టోబర్ 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 12 డిసెంబర్ 2013. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  3. "The Hindu Business Line : Kottavalasa-Kirandul line — An obstacle course". www.thehindubusinessline.com. Retrieved 2016-06-04.
  4. "IR Electrification History". IRFCA. Retrieved 2013-01-23. Cite web requires |website= (help)
  5. "Doubling of line between Kirandul, Kothavalasa mooted". The Hindu (ఆంగ్లం లో). 2008-03-07. ISSN 0971-751X. Retrieved 2016-06-04.
  6. "Chapter II – The Maintenance of Permanent Way". Retrieved 2013-12-12. Cite web requires |website= (help)
  7. "kirandul line news". Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]