Jump to content

రంజీతా కౌర్

వికీపీడియా నుండి
రంజీతా కౌర్
జననంరంజీతా మీర్జా
(1956-09-22) 1956 సెప్టెంబరు 22 (వయసు 68)
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు1976–ప్రస్తుతం
భార్య / భర్తరాజ్ మసంద్
పిల్లలు1

రంజీతా కౌర్ (జననం 1956 సెప్టెంబరు 22) ఒక భారతీయ నటి.[1][2] ఆమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టిఐఐ)లో శిక్షణ పొందింది. ఆమె దాదాపు 50 చిత్రాలలో నటించింది. ఆమె వివిధ రకాల పాత్రలను పోషించింది. ఆమె చిత్రాలలో లైలా మజ్ను (1976), అంఖియోం కే ఝరోఖో సే (1978), పతి పత్ని ఔర్ వో (1978) వింటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. ఆమె మూడుసార్లు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలకు ప్రతిపాదింంచబడింది.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె రాజ్ మసంద్ ను వివాహం చేసుకుంది. వారికి స్కై అనే కుమారుడు ఉన్నాడు.[4][5] రంజీతా గతంలో తన భర్త రాజ్, కుమారుడు స్కై లతో కలిసి అమెరికా వర్జీనియాలోని నార్ఫోక్ లో నివసించారు. ఆ తరువాత, వారి కుటుంబం పూణేలోని కోరేగావ్ పార్కుకు మారింది. అయవతే, వారికి వర్జీనియాలో 7-ఎలెవెన్ దుకాణాల శ్రేణి ఉంది.[6]

ఆమె సోదరి రుబీనా ఏక్ మై ఔర్ ఏక్ తూ చిత్రంలో రాజీవ్ టాండన్ (రవీనా టాండన్ సోదరుడు) సరసన కనిపించింది.

కెరీర్

[మార్చు]

లైలా మజ్ను చిత్రంలో రిషి కపూర్ సరసన కథానాయికగా రంజీతా కౌర్ తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[7] ఆ తరువాత, ఆమె పతి పత్ని ఔర్ వోలో సంజీవ్ కుమార్ తో జతకట్టింది. సచిన్ పిల్గొంకర్ తో అంఖియోన్ కే ఝరోఖోన్ సే వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఆమె మిథున్ చక్రవర్తితో కలిసి సురక్ష, తరానా, హమ్సే బడ్కర్ కౌన్, ఆదత్ సే మజ్బూర్, బాజీ, ఘర్ ఏక్ మందిర్ (1984) వంటి చిత్రాలలో అద్భుతమైన జంటగా పేరు తెచ్చుకున్నారు. సత్తే పే సత్తా చిత్రంలో ఆమె అమితాబ్ బచ్చన్ కు కథానాయికగా నటించింది.

రాజశ్రీ కుటుంబం విజయవంతమైన చిత్రాలలో నటించిన ఆమె వారితో చక్కని అనుబంధం కలిగి ఉంది. ఆమె రిషి కపూర్, సచిన్ పిల్గొంకర్, రాజ్ బబ్బర్, రాజ్ కిరణ్, దీపక్ పరాషర్, వినోద్ మెహ్రా, అమోల్ పాలేకర్ లతో కలిసి అనేక చిత్రాలలో నటించింది. చిత్ర పరిశ్రమ నుండి నిష్క్రమించడానికి ముందు ఆమె చివరి చిత్రం 1990లో వచ్చిన గుణహోన్ కా దేవతా.

ఆమె 1990ల మధ్యలో కొన్ని టెలివిజన్ ధారావాహికల్లో కనిపించింది, ఆ తర్వాత నటన నుండి విరామం తీసుకుంది. 15 సంవత్సరాల తరువాత, ఆమె అంజానేః ది అన్ నోన్ (2005) చిత్రంతో సినిమాల్లోకి తిరిగి వచ్చింది. 2008లో ఆమె జిందగి తేరే నామ్ చిత్రంలో నటించింది, ఇది మిథున్ చక్రవర్తితో ఆమెను తిరిగి కలిపించింది. 2011లో, ఆమె అంఖియోం కే ఝరోఖో సేకి సీక్వెల్ అయిన జానా పెహ్చానాలో సచిన్ పిల్గొంకర్ తో కలిసి తిరిగి నటించింది.[8] 2024 నాటికి ఇది ఆమె చివరి చిత్రం.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
1976 లైలా మజ్ను లైలా రిషి కపూర్ తొలి సినిమా
1978 అంఖియోం కే ఝరోఖోన్ సే లిల్లీ ఫెర్నాండెజ్ ఉత్తమ నటిగా 1979 ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది
1978 దమాద్
1978 పతి పత్ని ఔర్ వో నిర్మలా దేశ్పాండే ఉత్తమ సహాయ నటిగా 1979 ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది
1979 మేరీ బీవీ కీ షాదీ ప్రియా బర్తేండు (పీ)
1979 భయానక్ రేను
1979 సురక్షా ప్రియా
1979 తారానా రాధ
1980 ఆప టూ ఐస న ద వర్షా ఒబెరాయ్
1980 యూనిస్ బీస్
1980 ఖ్వాబ్
1981 అర్మాన్ ఆర్తి
1981 ధవన్ షీలా
1981 దర్ద్
1981 హమ్ సే బద్కర్ కౌన్
1981 క్రోడీ గుడ్డి
1981 లాపర్వా సంధ్య
1982 రాజ్పుత్ కామ్లీ
1982 ఉస్తాది ఉస్తాద్ సే సీమా
1982 సత్తే పే సత్తా సీమా సింగ్
1982 సన్ సజ్నా బసంతి
1982 తేరి కసమ్ శాంతి ఉత్తమ సహాయ నటిగా 1983 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలకు నామినేట్ చేయబడింది
1982 హత్కడి
1983 హద్సా దొంగ.
1983 కౌన్? కైసె? రేను/షీలా
1983 మెహందీ మాధురి 'మధు'
1983 ముఝే ఇన్సాఫ్ చాహియే
1983 వో జో హసీనా
1984 బాజీ నూరా
1984 రాజ్ తిలక్ సప్నా
1986 కిస్మత్వాలా
1986 కత్ల్ సీత (నర్స్)
1989 దో ఖైదీ శ్రీమతి అమర్ సిన్హా
1989 గావాహి
1990 దీవానా ముజ్ సా నహి అనిత సోదరి
1990 గుణహోన్ కా దేవతా శ్రీమతి బల్దేవ్ శర్మ
2005 అంజానే: ది అన్నోన్ రోమా
2011 జానా పెహ్చానా మిస్. ఆశా
2012 జిందగి తేరే నామ్ శ్రీమతి సింగ్

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం
1979 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ నటి అంఖియోం కే ఝరోఖోన్ సే ప్రతిపాదించబడింది
ఉత్తమ సహాయ నటి పతి పత్నీ ఔర్ వో ప్రతిపాదించబడింది
1983 తేరీ కసం ప్రతిపాదించబడింది

మూలాలు

[మార్చు]
  1. "कभी इस एक्ट्रेस के घर के बाहर लगती थी मेकर्स की लाइन, एक छोटी सी गलती ने बर्बाद कर दिया करियर". Amar Ujala (in హిందీ). 22 September 2019. Retrieved 28 March 2021.
  2. "Entertainment News: Latest Hollywood & Bollywood News, Movies Releases & Reviews". The Indian Express. Archived from the original on 27 September 2007. Retrieved 15 December 2019.
  3. Farook, Farhana (3 March 2018). "Memories of another day". Filmfare (in ఇంగ్లీష్). Retrieved 29 March 2021.
  4. "'We are back to normal', says Ranjeeta Kaur's family after husband alleges abuse by yesteryear actress, son". Pune Mirror (in ఇంగ్లీష్). 27 May 2019. Archived from the original on 28 మే 2019. Retrieved 15 December 2019.
  5. "Entertainment News: Latest Hollywood & Bollywood News, Movies Releases & Reviews". The Indian Express. Archived from the original on 27 September 2007. Retrieved 15 December 2019.
  6. Mike Gruss (15 May 2011). "From Bollywood to Big Gulps... and back". HamptonRoads.com. Archived from the original on 14 October 2011. Retrieved 15 December 2019.
  7. Lalwani, Vivek (13 September 2020). "Exclusive! Ranjeeta Kaur on Bollywood: Too much toxicity in the film industry now". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 December 2021.
  8. Malani, Gaurav (15 September 2011). "Jaana Pehchana: Movie Review". The Times of India. Retrieved 6 July 2018.