Jump to content

భద్ర (సినిమా)

వికీపీడియా నుండి
భద్ర
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం బోయపాటి శ్రీను
నిర్మాణం దిల్ రాజు
కథ బోయపాటి శ్రీను
చిత్రానువాదం బోయపాటి శ్రీను
తారాగణం రవితేజ,
మీరా జాస్మిన్,
అర్జన్ బజ్వా,
ప్రకాష్ రాజ్,
ప్రదీప్ రావత్,
బ్రహ్మాజీ,
ఝాన్సీ (నటి), మురళీమోహన్,
సునీల్,
పద్మనాభం
ఈశ్వరీరావు[1]
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంభాషణలు కొరటాల శివ
ఛాయాగ్రహణం ఆర్థర్ ఏ విల్సన్
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ 12 మే 2005
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన సినిమా భద్ర. రవితేజ, మీరా జాస్మిన్, అర్జన్ బజ్వా, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ యాక్షన్‌-ఫ్యాక్షన్‌ చిత్రం 'అపదలో ఉన్న అమ్మాయిని ఆదుకున్న 'భద్ర' అనే యువకుని కథ. రాయలసీమలో తన స్నేహితుడి కుటుంబం యొక్క హత్యలకు పగతీర్చుకోవాలననుకునే ఒక యువకుడి కథ నేపథ్యంగా నిర్మితమైన ఈ సినిమా మే 12, 2005న విడుదలైంది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి మరిన్ని భాషల్లో పునఃనిర్మితమైంది.

పాటల జాబితా

[మార్చు]

తిరుమల వాసా , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.సుమంగళి

జస్ట్ డో ఇట్ , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.టిప్పు , తన్విషన్

సా సా స్యే :రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.కార్తీక్, కె ఎస్ చిత్ర

నువ్వు నాకు మనసిస్తే , రచన:కులశేఖర, గానం.మల్లిఖార్జున్, సుమంగళి

ఓ మనసా , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.రవివర్మ

ఎర్ర కోకా పచ్చ రైకా , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.పుష్పావనం కుప్పుస్వామి , ఉష

ఏ ఊరే చిన్నదాన ,రచనం,: విశ్వ , గానం. టిప్పు, కల్పన

తిరుమల వాసా, గానం.వీణా బై దేవీ (ఇన్స్ట్రుమెంటల్)

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.