జలంధర చంద్రమోహన్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జలంధర చంద్రమోహన్
M.vasundara, writer.png
జలంధర చిత్రం
జననంజలంధర
16 జూలై 1948
చెన్నై
నివాసంహైదరాబాదు
ఇతర పేర్లుమల్లంపల్లి జలంధర
చదువుబి.ఎ (ఎకనమిక్స్)
ప్రసిద్ధులురచయిత్రి
మతంహిందూ
జీవిత భాగస్వామిచంద్రమోహన్
పిల్లలుమధురమీనాక్షి
మాథవి
తల్లిదండ్రులు

జలంధర చంద్రమోహన్‌ (మల్లంపల్లి జలంధర) తెలుగు రచయిత్రి.[1] ఆమె గృహలక్ష్మి స్వర్ణకంకణం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం కూడా పొందారు.[2] ఆమె ప్రముఖ రచయిత్రి డా. తెన్నేటి లత పేరిట ఏర్పాటు చేసిన వంశీ సాహితీ పురాస్కారాన్ని అందుకున్నారు. చంద్రమెహన్‌, జలంధరలకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం బహూకరించారు.[3] ఆమె తెలుగు కళాసమితీ పురస్కారాన్ని అందుకున్నారు.[4]

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె జూలై 16, 1948 న జన్మించారు.[5] ఆమె ప్రముఖ వైద్యుడైన గాలి బాలసుందర రావు గారి కుమార్తె.[6] ఆమె బి.ఎ ఎకనమిక్స్ చదివారు. ఆమె ప్రముఖ తెలుగు సినీనటుడు చంద్రమోహన్ భార్య.

ఈమె రాసిన కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపిస్తాయి.కథాంశాల్లో కూడా నవ్యత ఉంది. సంఘంపైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి.[7]

ఆమె ఎన్నో కథలు, నవలలు రాసింది. చంద్రమోహన్ తో పెళ్లి కాకముందు నుంచే రచనలు చేస్తోంది. వారికి ఇద్దరమ్మాయిలు. పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్టు. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మసిస్టు. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలోనే ఉంటున్నారు.[8][9]

కథలు[మార్చు]

కథ పత్రిక పత్రిక అవధి ప్రచురణ తేది
అగ్ని పుష్పం వనిత పక్షం 1980-08-01
అభిమానులతో ఉగాది వనిత పక్షం 1991-04-01
ఆకాశంలో మల్లెపూలు రచన మాసం 2005-08-01
ఆటోగ్రాఫ్ ఆంధ్రజ్యోతి (దీపావళి) వార్షిక 1989-11-10
ఆత్మహత్య చతుర మాసం 1983-09-01
ఉత్తర వాహిని ఆంధ్రజ్యోతి (దీపావళి) వార్షిక 1988-11-10
ఉపాసన ఆంధ్రప్రభ వారం 1993-11-17
ఉప్పెన వనిత పక్షం 1987-11-01
ఎర్రమందారాలు మహిళ మాసం 1979-11-01
కానుక ఆంధ్రప్రభ వారం 1973-10-31
కుటుంబం ప్రియదత్త వారం 2001-03-28
గడ్డిపూలు వనిత పక్షం 1975-10-01
చిత్రశిల ఆంధ్రప్రభ వారం 2000-10-28
చెలిమ వనిత పక్షం 1987-06-01
తులసి మొక్క వనిత పక్షం 1982-12-01
తేజస్విని ఆంధ్రజ్యోతి (దీపావళి) వార్షిక 1994-11-10
తొడిమపట్టు వనిత పక్షం 1993-12-01
దీపకళిక రచన మాసం 1994-05-01
నర్తకి ఆంధ్రప్రభ వారం 1971-09-08
నల్లబట్టలు ఆంధ్రజ్యోతి వారం 1988-12-30
నిర్మోహదర్పణం ఆంధ్రజ్యోతి (దీపావళి) వార్షిక 1990-11-10
నివేదన ఆంధ్రప్రభ వారం 1996-11-13
నీడవెనుక నిజం వనిత పక్షం 1978-09-01
నృత్యార్పణ జ్యోతి వార్షిక 1989-11-10
పిచ్చి తల్లి ఈనాడు ఆదివారం 1996-01-21
పూర్ణిమ రచన మాసం 2000-01-01
భవాని ఆంధ్రప్రభ వారం 1970-04-01
మదరిండియా ఆంధ్రజ్యోతి వారం 1972-07-21
మనోధర్మం ఆంధ్రజ్యోతి (దీపావళి) వార్షిక 1992-11-10
మరొకజయ వనిత పక్షం 1984-01-01
మలుపు రచన మాసం 1999-01-01
మహాగాయని ఆంధ్రజ్యోతి వారం 1989-07-21
మహోత్సవం రచన మాసం 2002-04-01
మిధ్యాబింబాలు వనిత పక్షం 1988-09-01
ముంగిట్లోముత్యాలు ఆంధ్రజ్యోతి (దీపావళి) వార్షిక 1991-11-10
మైనపు బొమ్మ ఇండియా టుడే వారం 1994-02-21
రక్షమైథిలి ఆంధ్రజ్యోతి వారం 1991-08-09
రథోత్సవం విపుల మాసం 1982-02-01
రససిద్ధి కళాసాగర్ ప్రత్యేకం 1994-11-10
వెలుతురు రచన మాసం 2003-12-01
శరణులఘోష వనిత పక్షం 1985-04-01
శుభాకాంక్షలు వనిత పక్షం 1995-08-01
శ్రద్దాంజలి వనిత పక్షం 1988-03-01
సహాయం ఇండియా టుడే వారం 1999-02-02
సాధన ఇండియా టుడే వారం 2001-04-17
సాలభంజిక పత్రిక మాసం 2009-04-01
సాలభంజిక పత్రిక మాసం 2007-10-01
సాలభంజిక వనిత పక్షం 1981-10-01
సూర్యోదయం ఆంధ్రజ్యోతి (దీపావళి) వార్షిక 1993-11-10
స్ధిత ప్రజ్ఞత వనిత పక్షం 1987-08-01
స్నేహ ఆంధ్రజ్యోతి వారం 1990-03-23
స్మృతి చిహ్నం వనిత పక్షం 1985-07-01
స్వధర్మం ఈనాడు ఆదివారం 2004-02-01

నవలలు[మార్చు]

స్మృతి చిహ్నం ఆత్మహత్య తమసోమా జ్యోతిర్గమయ

  • జలంధర కథలు - కథా సంపుటం
  • పున్నాగపూలు - నవల[10]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]