గాలి బాలసుందర రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గాలి బాలసుందర రావు ప్రముఖ వైద్యులు[1] మరియు వైద్యశాస్త్ర రచయిత. ఆయన ప్రముఖ తెలుగు సినీనటుడు చంద్రమోహన్ కు మామగారు. ఈమె కుమార్తె జలంధర చంద్రమోహన్ ప్రముఖ రచయిత్రి.[2] ఆయన చెన్నైలోని ప్రముఖ వైద్యశాలలో అసిస్టెంటు సర్జన్ గా తన సేవలనందించారు.[3]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన ఆరోగ్య శాస్త్ర ప్రచారకులు. ఉన్నత విద్యాభ్యాస అనంతరం చెన్న పట్టణంలొ వైద్య వృత్తిని అవలంభించారు. పలు వ్యాధులు చికిత్సలో నూతన సంవిధానాలను ఆవిష్కరించారు. చెన్నపురి తెలుగువారికి విశేష వైద్యసేవలను అందించారు. వివిధ వైద్యశాగ్ర గ్రంథాలను రచింది వైద్యశాస్త్రాన్ని సన్నిహితం చేసారు. తెలుగు ప్రజల ఆరోగ్య సంరక్షణకు, అంకితమై విశేష కృషి చేసారు.

ఆయనకు బాల్య నుండి డాక్టరు అకవాలనే అభిలాష ఉండేది. అందుకోసమై కృష్ణా జిల్లా వాస్తవ్యుడైన ఆయన జీవశాస్త్ర అధ్యయనానికి విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నంలో మెడికల్ కళాశాలలో వైద్య విద్యనభ్యసించారు. [4] ప్రముఖ వైద్యులు డాక్టర్ గాలి బాలసుందర రావు ఇంట్లో జరిగే రాజకీయ సమావేశాలకు తిలక్ క్రమం తప్పకుండా హాజరయ్యేవారు.[1]

రచనలు[మార్చు]

  • వైరసులు వ్యాథులు : ఇందులో జలుబు, న్యుమోనియా , మీజిల్స్ రూబెల్లా , చేకేన్ ఫాక్సు డెంగు , శాండుప్లైఫీవర్ , ఎల్లో ఫీవర్, రేబిస్,గవదబిళ్ళలు ,లింఫ్ గ్రంధులు , దెబ్బతినే సుఖవ్యాధి, ట్రాకోమా, వైరస్ మెనింజైటిస్ , హెర్బ్ స్ , పేరాసైటుల వల్ల కలిగే రోగములు మొదలగు వాటి గురించి వివరించారు.[5]
  • క్రిమిదోషాలు-నివారణ : ఈ పుస్తకములో పెన్సిలిన్,యంటిబయోటిక్స్ , టెట్రాసైక్లిన్లు, న్యుమోనియా, రుమాటిక్ ఫీవర్, టాన్సిలైటీస్ , స్కారేటుఫీవర్, గడ్డలు, రాచకురుపులు, గనోరియా, మెనింజైటీన్ ,మొదలగు వ్యాధులు లక్షణాలు, చికిత్సల గురించి వివరించడం జరిగింది.[6]
  • క్రిమిదోషాలు-నిరోధము : క్రిమి దోషములు నిరోధము అనే ఈ పుస్తకములు బాక్టీరియముల వల్ల కలిగే రోగములు, వాటి నివారణ నిరోధములను గురించి వివరిస్తున్నవి.[7]
  • మనం-మన దేహస్థితి-3 : ఔషథకాండ 1 [8]
  • మనం-మన దేహస్థితి : రోగకాండ [9]

నాటకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]