Jump to content

బన్నీ అండ్ చెర్రీ

వికీపీడియా నుండి
బన్నీ అండ్ చెర్రీ
బన్నీ అండ్ చెర్రీ సినిమా పోస్టర్
దర్శకత్వంరాజేష్ పులి
రచనతిరుమలశెట్టి గిరీష్ కిరణ్ (మాటలు)
నిర్మాతహారున్ గని, రజత్ పార్థసారధి
తారాగణంప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభా
ఛాయాగ్రహణంరవికుమార్
కూర్పుమోహన్-రామారావు
సంగీతంశ్రీవసంత్
నిర్మాణ
సంస్థ
హారున్ గని ఆర్ట్స్
విడుదల తేదీ
14 డిసెంబరు 2013 (2013-12-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

బన్నీ అండ్ చెర్రీ 2013, డిసెంబరు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. హారున్ గని ఆర్ట్స్ పతాకంపై హారున్ గని నిర్మాణ సారథ్యంలో రాజేష్ పులి దర్శకత్వం వహించిన ఈ చత్రంలో ప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభా తదితరులు నటించగా, శ్రీవసంత్ సంగీతం అందించాడు.[1]

కథా నేపథ్యం

[మార్చు]

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బన్నీ (ప్రిన్స్), ఉద్యోగంలేని బిటెక్ గ్రాడ్యుయేట్ చెర్రీ (మహాత్ రాఘవేంద్ర) ఇద్దరు వేర్వేరు జీవితాలను గడుపుతుంటారు. బన్నీకి వితంతువు తల్లి (సీత), చెర్రీకి టాక్సీ డ్రైవర్ తండ్రి (పోసాని కృష్ణ మురళి) ఉంటారు. బన్నీ ప్రియురాలు కావ్య (సభ), చెర్రీ ప్రియురాలు పింకీ (క్రాంతి). ఒకరోజు ప్రమాదంలో బన్నీ, చెర్రీ గాయపడతారు. ఒకరోజు ప్రమాదంలో, బన్నీ, చెర్రీ గాయపడతారు. రక్తం గడ్డకట్టడం వల్ల శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని భావించిన న్యూరోసర్జన్ (యండమూరి వీరేంద్రనాథ్) న్యూరాన్ల మార్పిడికోసం డాక్టర్ సక్సేనా (సుమన్) ను సంప్రదించి, వారి జ్ఞాపకాలను మార్పిస్తాడు. ఆ తర్వాత వారిద్దరి జీవితంతో ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: రాజేష్ పులి
  • నిర్మాత: హారున్ గని, రజత్ పార్థసారధి
  • మాటలు: తిరుమలశెట్టి గిరీష్ కిరణ్
  • నటులు: ప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభా
  • సంగీతం: శ్రీవసంత్
  • ఛాయాగ్రహణం: రవికుమార్
  • కూర్పు: మోహన్-రామారావు
  • పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, పోతుల రవికిరణ్, కరుణాకర్
  • నృత్యం: భాను
  • నిర్మాణ సంస్థ: హారున్ గని ఆర్ట్స్
  • విడుదల: 14 డిసెంబరు 2013

మార్కెటింగ్

[మార్చు]

2013, ఆగస్టు 7వ తేదీన సినీ దర్శకనిర్మాత మారుతి చిత్ర లోగోను ఆవిష్కరించగా, సినీ దర్శకనిర్మాత తేజ ఈ చిత్ర టీజర్ విడుదలచేశాడు.[1]

ఇతర వివరాలు

[మార్చు]
  1. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[2]
  2. దర్శకుడిగా రాజేష్ కు, హీరోయిన్స్ గా కృతి, సభాలను తొలిచిత్రమిది.[3]
  3. చిత్ర ప్రచారంకోసం అల్లు అర్జున్ (బన్నీ), రామ్ చరణ్ (చెర్రీ) ముద్దుపేర్లతో సినిమా పేరు పెట్టారు.[3]
  4. చిత్రానికి ప్రతికూల సమీక్షలు వచ్చాయి.[3]

స్పందనలు

[మార్చు]
  • "ఓ అసాధారణ విషయాన్ని సామాన్య ప్రేక్షకుడికి అందించాలంటే ఎంతో హోమ్ వర్క్ చేయాలి. కానీ ఈ సినిమా చూస్తుంటే ఆడుతూ పాడుతూ… సరదా సరదాగా తీసేసినట్టుగా అనిపిస్తుంది. పోనీ నటీనటులతో అయినా ఏమైనా పరిపక్వత ఉందా అంటే అదీ లేదు. బన్ని గా ప్రిన్స్, చెర్రిగా మహత్ రాఘవేంద్ర ఏ స్థాయిలోనూ మెప్పించలేదు. కథానాయికలో సభ కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. కృతి ఓవర్ యాక్షన్ తట్టుకోవడం కష్టమే. మెమొరీ ఛేంజ్ ఆపరేషన్ గురించి యండమూరి లాంటి వ్యక్తితో చెప్పిస్తే ఆడియెన్స్ కన్వెన్స్ అవుతారని దర్శకుడి భావించాడేమో కానీ… అది సఫలం కాలేదు. సుమన్, బ్రహ్మానందం, గౌతంరాజు, పోసాని, అపూర్వ, జూనియర్ ఎస్వీయార్ వంటి వారు ఉన్నా ఆ పాత్రలు ఏమాత్రం పండలేదు. శ్రీవసంత్ సంగీతమూ సో…సో…గానే ఉంది. మొత్తం మీద ఆడియెన్స్ బ్రెయిన్ సిమ్ ను డామేజ్ చేయడానికే ఈ సినిమా తీసినట్టున్నారు దర్శక నిర్మాతలు రాజేశ్ పులి, హారున్ గని!"[4] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్, ఫిల్మ్ జర్నలిస్ట్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 సాక్షి, సినిమా (17 August 2013). "'బన్నీ ఎన్ చెర్రీ' స్టిల్స్". Sakshi. Archived from the original on 1 మే 2020. Retrieved 1 May 2020.
  2. Seshagiri, Sangeetha (17 December 2013). "Box Office Report: Ajith's 'Aata Arrambam', Sundeep's 'Venkatadri Express' and Other Films". International Business Times, India Edition.
  3. 3.0 3.1 3.2 "Bunny N Cherry Movie Review {2/5}: Critic Review of Bunny N Cherry by Times of India" – via timesofindia.indiatimes.com.
  4. వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్. "బ్రెయిన్ సిమ్ ను డామేజ్ చేసే 'బన్ని ఎన్ చెర్రి'!". ఓంప్రకాశ్ రాతలు గీతలు. Retrieved 15 February 2024.