Jump to content

ఆమె (సినిమా)

వికీపీడియా నుండి
ఆమె
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం నరేష్,
ఊహ
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ సిరి చిత్ర
భాష తెలుగు

ఆమె 1994 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ఊహ, శ్రీకాంత్, నరేష్ ముఖ్యపాత్రల్లో నటించారు.[1][2][3]


1994సంవత్సరానికి ఉత్తమ నటి ఊహా , నంది పురస్కారం .

శ్రీనివాస రావు ఇంట్లో పెళ్ళైన కొద్ది రోజులకే వైధవ్యం ప్రాప్తించిన ఊహ అనే అమ్మాయిని చూసి విక్రం ఇష్టపడతాడు. ఆమెని పెళ్ళి చేసుకోవాలని అడుగుతాడు. ఊహ తన గతాన్ని గురించి అతనికి చెబుతుంది. శ్రీనివాస రావు పరమ పిసినారి. కొడుకు ఆంజనేయులు ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. కొడుకుకి పెళ్ళి చేయడానికి వధువు ఎలాంటిదైనా పరవాలేదు కానీ కట్నం మాత్రం దండిగా రావాలని కోరుకుంటాడు. అందుకోసం ఓ ఊబకాయం కలిగిన అమ్మాయినీ, పెళ్ళికి ముందే మోసపోయి గర్భవతి అయిన అమ్మాయినీ పెళ్ళి సంబంధాలుగా చూస్తాడు. కానీ ఆంజనేయులు ఆ సంబంధాలన్నీ తిప్పి కొడతాడు.

సుబ్రహ్మణ్యం ఒక సాధారణ ఉద్యోగి. అతని కుటుంబం చాలా పేదరికంలో ఉంటుంది. కనీసం పిల్లలకు సరైన బట్టలు కూడా కుట్టించలేని దీన స్థితి. దానికి తోడు అతని అల్లుడు ఆ ఇంట్లోనే తిష్ట వేసి ఏ పనీ లేకుండా తిని తిరుగుతుంటాడు. అతని కూతురు ఊహను ఆంజనేయులు ప్రేమిస్తాడు. వాళ్ళు కట్నం ఇవ్వలేరని శ్రీనివాసరావు ఒప్పుకోడు. ఆంజనేయులు మాత్రం తండ్రిని ఎదిరించి ఊహతో పెళ్ళికి ఒప్పిస్తాడు. కానీ శోభనం రోజునే ప్రమాదంలో మరణిస్తాడు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీత దర్శకత్వం వహించాడు.[5][6] , పాటల రచయిత భువనచంద్ర .

  • నాగమణీ నాగమణీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఊహల పల్లకిలో ఊగుతున్నదీ వధువు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చల్లగాలికీ ఈడు వచ్చింది , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • అమ్మమ్మ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఓ చల్లగాలీ ఓదార్చిపోవా , గానం. గిరీశం, రాధిక.

మూలాలు

[మార్చు]
  1. "Remembering EVV Satyanarayana on his birth anniversary - Kannada Movie News". Indiaglitz.com. 2014-06-10. Archived from the original on 2015-08-19. Retrieved 2015-04-30.
  2. "Srikanth interview - Telugu Cinema interview - Telugu film actor". Idlebrain.com. 2009-09-28. Retrieved 2015-04-30.
  3. "EVV Satyanarayana dies Б─⌠ A legend of his own league". Supergoodmovies.com. 22 జనవరి 2011. Archived from the original on 25 జూలై 2015. Retrieved 30 ఏప్రిల్ 2015.
  4. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
  5. "Aame - All Songs - Download or Listen Free - JioSaavn".
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-27. Retrieved 2017-10-23.