శంకరాభరణం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శంకరాభరణం
(1979 తెలుగు సినిమా)
Sankarabharanam.jpg
దర్శకత్వం కె.విశ్వనాథ్
నిర్మాణం ఏడిద నాగేశ్వరరావు
రచన జంధ్యాల
తారాగణం జె.వి.సోమయాజులు ,
మంజు భార్గవి,
రాజ్యలక్ష్మి,
చంద్రమోహన్,
అల్లు రామలింగయ్య,
తులసి,
నిర్మలమ్మ,
పుష్పకుమారి,
సాక్షి రంగారావు,
ఝాన్సీ,
వరలక్ష్మి,
అర్జా జనార్ధన రావు,
డబ్బింగ్ జానకి,
జిత్ మోహన్ మిత్ర
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి,
వాణి జయరాం,
ఎస్.పి.శైలజ
ఛాయాగ్రహణం బాలు మహేంద్ర
నిర్మాణ సంస్థ పూర్ణోదయా క్రియేషన్స్
విడుదల తేదీ 19
నిడివి 143 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శంకరాభరణం 1979లో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో నిర్మంచబడిన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంశలను కూడా పొందింది. ఈ చిత్రానంతరం చిత్రదర్శకుడు కె.విశ్వనాధ్ కళా తపస్విగా పేరొందాడు. గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాతో మంచి ప్రఖ్యాతి పొంది తెలుగు చలనచిత్రరంగంలో స్థానం సుస్థిరం చేసుకున్నారు. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే సినిమా ప్రభావం తెలుస్తోంది.ఈ చిత్రం యొక్క మొధటి చిత్రీకరణ రాజమహెంద్రవరం దగ్గరలో రఘుదేవపురం గ్రామ౦లొ మరియు ఎక్కువ భాగం ఆ పరిసర ప్రాంతాలలో చిత్రిీకరించబడింది.

చిత్ర కథ[మార్చు]

శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు తులసి (మంజు భార్గవి) ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. విధిలేని పరిస్థితులలో ఆమె శీలాన్ని నాశనం చేసి, శంకర శాస్త్రిని తులనాడిన ప్రతినాయకుడిని హతమారుస్తుంది. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. ఇలా కొంతకాలం అయిన తరువాత మంజు భార్గవి ఒక కొడుకుని కని ఎలాగోలా ప్రయత్నించి శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

ప్రజాదరణ పొందిన సంభాషణలు[మార్చు]

'పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి తన చేతులడ్డు పెట్టిన ఆ మహానుభావులెవరో వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను'

సినిమా చివరలో శంకర శాస్త్రి సభికులతో చెప్పే మాట

సభకు నమస్కారం

శంకర శాస్త్రి సభకు పరిచయం చేసుకొనే మాట. జంధ్యాల రాసిన ఈ వాక్యం ఎంత కీర్తిని పొందిందో ప్రస్తుతం దీన్ని వాడే వక్తల సంఖ్యను లెక్కిస్తే తెలుస్తుంది.

బ్రోచేవారెవరు రా... ఈ రాగలను అవహేళనగా గానం చేస్తున్న పండితుతో శాస్త్రి గారు కొపావెశం తో 'ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది. తాదాత్మ్యం పొందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి గంగాజలంలా పెల్లుబికిన భావమది, గీతమది. ఆధునికత పేరుతో, మిడి మిడి జ్ఞానంతో మన పూర్వీకులు మనకిచ్చిన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమమైన సంగీతాన్ని నాశనం, అపభ్రంశం చేయకయ్యా!' అని చెప్పి వెళ్ళీపోయినతరువాత పండితుడు శిష్యురాలతో నీకేమైనా అర్థమైన్ద? అని అడుగుతాడు ఓ.. అర్ధమైంది నీకు ఏమిరాదని.....

శాస్త్రీయ రాగాలను అవహేళన చేస్తున్న ఒక పండితునికి శంకర శాస్త్రి బుద్ది చెప్పే తీరిది.

" ప్రతి తెలుగువాడి గుండె లోతుల్లోకి" ఈ సినిమా వెళ్ళింది అని చెప్పటనికి ఇందులోని ప్రతి పాట నిత్య యవ్వనమై సజీవంగా ఇప్పటికీ వినిపించటమే అందుకు కారణం. సంగీతం గురించి ఇప్పుడు అప్పుడు చాలాతక్కువ మందికే తెలుసు, కానీ ఈ సినిమా చూసిన తరువాత పామరుని దగ్గరనుండి సంగీత విధ్వాంశులు దాకా శభాష్ అనిపిచ్చుకున్న ఏకైక తెలుగు సంగీత చిత్రం. ఇందులో నటించిన (జీవించిన ) నటీనటులు, సాంకేతిక నిపుణులు కు, దర్సక, నిర్మాత లకు నమ:సుమాంజలీలు. మూస:వేణుగోపాల్ నండూరి

పాటలు[మార్చు]

TeluguFilm Sankarabharanam.jpg

కే వి మహాదేవన్.

పాటలు
క్రమసంఖ్య పేరు గీత రచన గానం నిడివి
1. "ఏ తీరుగ నను దయ చూచెదవో"   శ్రీ భక్త రామదాసు వాణీ జయరాం  
2. "ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము"   వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం٫ ఎస్. జానకి  
3. "దొరకునా ఇటువంటి సేవ"   వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం  
4. "పలుకే బంగారమాయెనా"   శ్రీ భక్త రామదాసు వాణీ జయరాం  
5. "బ్రోచేవారెవరురా"   శ్రీ మైసూరు వాసుదేవాచార్యులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం  
6. "మాణిక్య వీణాముపలాలయంతి" (పద్యం) మహాకవి కాళిదాసు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  
7. "మానస సంచరరే"   శ్రీ సదాశివ బ్రహ్మేంద్రియస్వామి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం  
8. "రాగం తానం పల్లవి"   వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  
9. "శంకరా నాదశరీరాపరా"   వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  
10. "సామజ వరగమన"   వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి  

పాటల సాహిత్యం[మార్చు]

శంకరా నాథ శరీరాపరా

శంకరా నాద శరీరాపరా
వేద విహారహరా జీవేశ్వరా

శంకరా నాద శరీరాపరా
వేద విహారహరా జీవేశ్వరా

ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గానవిలక్షణ రాగమె యోగమనీ
ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గానవిలక్షణ రాగమె యోగమనీ

నాదోపాసన చేసినవాడను నీ వాడను నేనైతే
నాదోపాసన చేసినవాడను నీ వాడను నేనైతే

ధిక్కరీన్ద్రిజిత హిమగిరీన్ద్రిజిత కంఠరా నీలకంఠరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవతరించరా విని తరించరా
శంకరా నాద శరీరాపరా
వేద విహారహరా జీవేశ్వరా

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలూ
ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలూ
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలూ
ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలూ

పరవశాన శిరశూగంగా
ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరశూగంగా
ధరకు జారెనా శివగంగా

నా గానలహరి నువ్ మునుగంగా
ఆనంద వృష్టినే తడవంగా


శంకరా నాద శరీరాపరా
వేద విహారహరా జీవేశ్వరా


దొరకునా ఇటువంటి సేవ

దొరకునా... దొరకునా...దొరకునా...
దొరకునా...
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ

నీ పద రాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

రాగలనంతాలు నీ వేయి రూపాలు
భవరోహ తిమిరాన పోకార్చు దీపాలు
రాగలనంతాలు నీ వేయి రూపాలు
భవరోహ తిమిరాన పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై...
నా లోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
ఆ...
నాదాత్మకుడవై...
నా లోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
నిన్ను కొల్చువేళ దేవాధిదేవా
దేవాధిదేవా.... ఆ... ఆ...

దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడయు ఎదలోని సడులే మృదంగాలు
ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడయు ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై
నిన్నుకొల్చు వేళ మహానుభావా
మహానుభావా

దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

బహుమతులు[మార్చు]

Year Nominated work Award Result
1979 కె విశ్వనాధ్ జాతీయ చిత్ర బహుమతులు - సర్వోత్తమ సర్వమనొరంజక చిత్రము (స్వర్ణ పద్మము) విజేత
కె వి మహాదేవన్ జాతీయ చిత్ర బహుమతులు - ఉత్తమ సంగీతదర్శకులు విజేత
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ చిత్ర బహుమతులు - ఉత్తమ నేపథ్య గాయకుడు విజేత
వాణి జయరాం జాతీయ చిత్ర బహుమతులు - ఉత్తమ నేపథ్య గాయని విజేత
కె వి మహాదేవన్ నంది ఉత్తమ చిత్రాలు - స్వర్ణ నంది విజేత
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నంది ఉత్తమ నేపథ్య గాయకుడు విజేత
వాణి జయరాం నంది ఉత్తమ నేపథ్య గాయని విజేత
కె వి మహాదేవన్ నంది ఉత్తమ సంగీతదర్శకులు విజేత
వేటూరి సుందరరామమూర్తి
(శంకరా నాదశరీరాపరా పాటకు)
నంది ఉత్తమ గీత రచయిత విజేత
1980 జె వి సోమయాజులు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు బహుమతి - తెలుగు విజేత

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=శంకరాభరణం&oldid=2104774" నుండి వెలికితీశారు