నిండు హృదయాలు
నిండు హృదయాలు (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.విశ్వనాధ్ |
---|---|
నిర్మాణం | మిద్దే జగన్నాథరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు , వాణిశ్రీ, శోభన్ బాబు, చలం, గీతాంజలి, చంద్రకళ |
సంగీతం | టి.వి.రాజు |
ఛాయాగ్రహణం | ఎస్.ఎస్. లాల్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నిండు హృదయాలు 1969, ఆగష్టు 15న విడుదలైన తెలుగు సినిమా. ఎన్.టి.రామారావు, వాణిశ్రీ జంటగా నటించిన తొలి సినిమా ఇది.
సాంకేతికవర్గం
[మార్చు]- కథ: నాగర్ కోయిల్ పద్మనాభన్
- మాటలు: సముద్రాల రామానుజాచార్య
- సంగీతం: టి.వి.రాజు
- నృత్యం: చిన్ని, సంపత్,
- కళ: తోట
- కూర్పు: బి. గోపాలరావు
- పోరాటాలు: సాంబశివరావు
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. విశ్వనాథ్
- నిర్మాత: మిద్దే జగన్నాథరావు
నటీనటులు
[మార్చు]- ఎన్.టి.రామారావు - గోపి
- శోభన్ బాబు - రాము
- చలం - మారుతి
- వాణిశ్రీ - శారద
- సత్యనారాయణ - వీర్రాజు, రాజశేఖర్
- త్యాగరాజు - శ్రీధర్
- రేలంగి - ప్రసాద్
- మోహిని - కామినీదేవి
- మాస్టర్ రాజ్‌కుమార్ - గోపి
- మాస్టర్ విశ్వేశ్వరరావు - మారుతి
- రుక్మిణి - జానకి
- మిక్కిలినేని - కానిస్టేబుల్
- ఛాయాదేవి - అనసూయ
- అల్లు రామలింగయ్య - గోవిందయ్య
- చంద్రకళ - గీత
- గీతాంజలి - లలిత
- విజయశ్రీ
- వై.విజయ
కథ
[మార్చు]వీర్రాజు దురాశపరుడు, దుష్టుడు. ఆర్టిస్టు శ్రీధర్ సాయంతో వీర్రాజు, ప్రెస్ ఓనర్ ప్రసాద్, కామినీదేవి దొంగనోట్లు ప్రింట్ చేస్తారు. పని పూర్తికాగానే శ్రీధర్‌ను దారుణంగా అంతం చేస్తాడు వీర్రాజు. శ్రీధర్ కుమారుడు గోపి వీర్రాజుపై పగ పెంచుకుంటాడు. వీర్రాజు పథకం ప్రకారం ప్రసాద్‌కు విషమిచ్చి, అతని కూతురు శారదను తనతో తీసుకెళ్తుంది కామిని. వీర్రాజు, కామిని ఊరొదిలి వెళ్లటంతో, పోలీసులు వీర్రాజు భార్య జానకిని అరెస్ట్ చేస్తారు. వారి కొడుకు చిట్టిబాబు అనాథగా మిగులుతాడు. అతనికి ఆ ఊళ్లో మరో అనాధ మారుతి తోడుగా నిలుస్తాడు. తండ్రికోసం అలమటించే గోపి కూడా వారితో కలుస్తాడు. ఈ ముగ్గురూ కానిస్టేబుల్ సాయంతో పెద్దవారవుతారు. ఆ ఊళ్లో గోవిందయ్య ఇంట్లో వీరు అద్దెకు చేరతారు. పెద్దవాడు గోపి టికెట్ కలెక్టర్‌గా, రాము ఉద్యోగిగా, మారుతి టైలరుగా జీవిస్తుంటారు. అనుకోని సంఘటనలో జానకి వీరికి తల్లిగా తోడై ఆప్యాయత అందిస్తుంది. కామిని ఇచ్చిన విషంతో పిచ్చివాడిగా మారిన ప్రసాద్, కూతురికోసం ఆవేదనతో డాక్టరు శారద పనిచేస్తున్న ఆస్పత్రికి చేరతాడు. రాజశేఖరంగా పేరు మార్చుకున్న వీర్రాజు, ఆ ఊళ్లో ధనవంతునిగా, పుణ్యమూర్తిగా, మంచివాడిగా గౌరవించబడుతుంటాడు. అదే ఊళ్లో వేశ్య అనసూయ కుమార్తె గీతను లోబర్చుకోబోయిన రాజశేఖరాన్ని గోపి గుర్తుపడతాడు. అతన్ని గుర్తించిన రాజశేఖర్, తన చేతి గుర్తులు కూతురు శారదచే తొలగింప చేసుకుంటాడు. పరస్పరం ప్రేమించుకుంటున్న శారద, గోపిల మధ్య ఇది సంఘర్షణకు దారితీస్తుంది. గోవిందయ్య కూతురు లలిత రామును ప్రేమించి, గోపి అంగీకారంతో వివాహం చేసుకుంటుంది. మారుతి ఇష్టపడిన గీతతో అతని వివాహం జరిపించి, గోపి ఇంటికి తీసుకొస్తాడు. లలిత అహంకారపూరిత స్వభావంవల్ల గోపి, మారుతి, ఇల్లొదిలి వెళ్లాల్సి వస్తుంది. రాము తన కుమారుడేనని గ్రహించిన జానకి, తనను కలిసిన రాజశేఖరంతో చెప్పటం, రాజశేఖరాన్ని అంతం చేయటానికి ముగ్గురు అన్నదమ్ములు ఏకంకావటం, చివరలో రాజశేఖరం.. గోపీ చేతిలో గాయపడి, భార్య వద్దకు వచ్చి పశ్చాత్తాపపడి, నేరాన్ని తనమీద వేసుకున్న గోపిని విడుదల చేసి జైలుకెళ్లటం, అంతకుముందు జరిగిన తుపాకి దాడిలో జానకి, భర్తముందే జైలులో మరణించటం, శారద, గోపిల కలయికతో చిత్రం సుఖాంతమవుతుంది[1].
పాటలు
[మార్చు]- రామా లాలీ మేఘశ్యామా లాలీ సామా రస నయనా దశరథ తనయా లాలీ - గానం: పి.సుశీల- రచన:సినారె
- అద్దంలాంటి చెక్కిలి చూసి ముద్దొస్తుందంటావా చెంపకు చేరెడు - సుశీల, ఘంటసాల - రచన: సినారె
- ఒకటి రెండు మూడు విడివిడిగా - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి, బి.వసంత బృందం - రచన: సినారె
- మనసివ్వు నుహుహుహూ మరి నవ్వు నవ్వే మనసే పువ్వుల - ఘంటసాల, సుశీల - రచన: సినారె
- మరి మరి విన్నానులే నీవే - పి సుశీల, ఎల్‌ఆర్ ఈశ్వరి - రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి
- ఏడుకొండల సామి- పఠాభి, బి.వసంత - రచన: సముద్రాల జూనియర్, కె.విశ్వనాథ్
- ఓ ప్రియా, ఓ ప్రియా - పి.సుశీల - రచన: సినారె
- మెత్తమెత్తని సొగసు వెచ్చవెచ్చని వయసు -ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన:సినారె
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ↑ సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (17 August 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 నిండు హృదయాలు". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 10 June 2020.