Jump to content

జీవన జ్యోతి (1975 సినిమా)

వికీపీడియా నుండి
జీవన జ్యోతి
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. విశ్వనాధ్
నిర్మాణం డి.వి.ఎన్. రాజు
కథ కె. విశ్వనాధ్
తారాగణం శోభన్ బాబు ,
వాణిశ్రీ,
సత్యనారాయణ,
రాజబాబు,
శుభ,
రమాప్రభ,
అమోల్ పాలేకర్
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ డి.వి.ఎస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

జీవన జ్యోతి 1975 నాటి తెలుగు సినిమా. ఈ చిత్రానికి K. విశ్వనాధ్ దర్శకత్వం వహించాడు. ఇందులో తల్లిగా, కుమార్తెగా వాణిశ్రీ డబుల్ పాత్రలో నటించింది. శోభన్ బాబు హీరో. ఈ చిత్రం ముఖ్యంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ప్రధాన అవార్డులను గెలుచుకుంది. దర్శకుడు కె. విశ్వనాథ్ ఈ చిత్రాన్ని హిందీలో సంజోగ్ (1985) గా జయప్రద, జీతేంద్రతో రీమేక్ చేశారు.[1] ఈ చిత్రాన్ని కన్నడలో బాలిన జ్యోతిగా, విష్ణు వర్ధన్ తో తీశారు. ఈ చిత్రాన్ని తాష్కెంట్‌లో జరిగిన ఆసియా, ఆఫ్రికా చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.[2][3]

హైదరాబాదులో ఉండే వాసు ఒక గ్రామానికి వెళతాడు, అక్కడ అతను లక్ష్మి అనే యువతితో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతని పట్ల ఆకర్షితురాలౌతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి తరువాత ఇద్దరూ వాసు తల్లిదండ్రులు, సోదరుడు పాండురంగారావు, వదిన జానకి, ఆమె కుమారుడు సోనులతో కలిసి జీవించడానికి వెళతారు. లక్ష్మి సోనుకు దగ్గరవుతుంది. ఆమెతో అతని సమయాన్ని గడపడం ప్రారంభిస్తుంది. ఇది జానకికి ఆందోళన కలిగిస్తుంది. దీని ఫలితంగా కొంత ఉద్రిక్తత ఏర్పడుతుంది. విషాదకరంగా, సోను కన్నుమూయడంతో, లక్ష్మి విషాదంలో మునిగిపోతుంది. ఆమె గర్భవతి అయి ఆడ శిశువుకు జన్మనిస్తుంది. కాని ఆమె మనస్సు నుండి సోను వీడిపోలేదు. ఆమె ప్రతి బిడ్డలోనూ సోనును చూస్తూనే ఉండటంతో, అది పిచ్చికి దారితీస్తుంది. ఆమెను పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. వాసు తన బాధాను మరచేందుకు మద్యానికి బానిసౌతాడు. తత్ఫలితంగా, అతడి కుమార్తెను జానకి, అతని సోదరుడు దత్తత తీసుకుని, ఆమె నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలియనీయకుండా పెంచుతారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, వారి కుమార్తె శోభ పెరిగి పెద్దదై, ఆమె ఒక పండంటి అబ్బాయికి జన్మనిస్తుంది. యుఎస్ లో స్థిరపడబోతోంది. బయలుదేరే ముందు, కుటుంబం మొత్తం లక్ష్మిని చూడడానికి వెళ్తారు. లక్ష్మి ఒక చెక్క ముక్కను పట్టుకొని, దుప్పటితో కప్పి, దాన్నే సోనుగా భావించి పాడుతూ ఉంటుంది. ఇక్కడే శోభ తన నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటుంది. ఇక్కడే ఆమె అంతిమ త్యాగం చేసే సందర్భం కూడా వస్తుంది.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  • "ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో" -
  • "ఎందుకంటే ఏం చెప్పను" -
  • "ముద్దుల మా బాబు" -
  • "సిన్నీ ఓ సిన్నీ" -

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Archived copy". Archived from the original on 2010-05-07. Retrieved 2020-08-03.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. Collections. Update Video Publication. 1991. p. 387.
  3. "Arts / History & Culture: Celebrating a doyen". The Hindu. 26 April 2012. Archived from the original on 1 జూలై 2012. Retrieved 5 September 2012.