చిత్రం శ్రీను
Jump to navigation
Jump to search
చిత్రం శ్రీను | |
జన్మ నామం | శ్రీనివాసులు |
జననం | హైదరాబాదు, భారతదేశం |
భార్య/భర్త | ఉమ |
ప్రముఖ పాత్రలు | చిత్రం,మంత్ర |
చిత్రం శ్రీను ఒక తెలుగు హాస్యనటుడు. ఇతడి అసలు పేరు శ్రీనివాసులు. దర్శకుడు తేజ తన తొలి చిత్రమైన చిత్రం ద్వారా ఇతడిని తెలుగు తెరకు పరిచయం చేసాడు. ఆ చిత్ర విజయంతో ఇతని పేరు చిత్రం శ్రీనుగా స్థిరపడి పోయింది. ఇతని స్వంత ఊరు ఖమ్మం. దాదాపు 260 సినిమాల్లో నటించాడు. చిత్రం, ఆనందం, వెంకీ, దుబాయ్ శీను, బొమ్మరిల్లు, మంత్ర, 100% లవ్, ఆది అతనికి మంచి పేరును, గుర్తింపును తెచ్చాయి.[1]
నటించిన చిత్రాలు
[మార్చు]- ఒకటో నంబర్ కుర్రాడు (2002)
- గౌరి (2004)
- బూచమ్మ బూచోడు (2014)
- వేట (2009)
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)
- ఆలస్యం అమృతం (2010)
- అరకు రోడ్ లో (2016)
- ఈ మాయ పేరేమిటో (2018)
- వాడేనా (2018)
- భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు (2019)
- బిచ్చగాడా మజాకా (2019)
- వలయం (2020)
- పండుగాడి ఫొటో స్టూడియో (2019)
- కార్పొరేటర్ (2021)
- మా ఊరి పొలిమేర (2021)
- కళాపురం (2022)
- రాజయోగం (2022)
- పోయే ఏనుగు పోయే (2023)
- మోహన్కృష్ణ గ్యాంగ్ లీడర్ (2023)
- మా ఊరి పొలిమేర 2 (2023)
- మూడో కన్ను (2024)
- ఫైలం పిలగా (2024)
- బహిర్భూమి (2024)
- లగ్గం (2024)
- వీక్షణం (2024)
వివాదాలు
[మార్చు]ఇతడు మొదటి భార్య ఉండగానే సినీ నృత్యకారిణి మనీటాను రెండవ వివాహం చేసుకొన్నాడు. దీనితో ఇతడి మొదటి భార్య ఉమ ఇతనిపై కేసు పెట్టింది[2]
మూలాలు
[మార్చు]- ↑ విలేఖరి. "260 సినిమాల్లో నటించా". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 14 July 2016.
- ↑ http://thatstelugu.oneindia.in/movies/terachatu/2009/09/arrest-warrant-to-chitram-seenu-100909.html[permanent dead link]