చిత్రం (సినిమా)
చిత్రం (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తేజ |
---|---|
నిర్మాణం | రామోజీరావు |
రచన | తేజ |
తారాగణం | ఉదయ కిరణ్, రీమా సేన్, తనికెళ్ళ భరణి |
సంగీతం | ఆర్.పి. పట్నాయక్ |
గీతరచన | కులశేఖర్ |
ఛాయాగ్రహణం | రసూల్ |
కూర్పు | శంకర్ |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
విడుదల తేదీ | మే 25, 2000 |
భాష | తెలుగు |
చిత్రం, 2000లో నిడుదలైన ఒక తెలుగు సినిమా. అతి తక్కువ బడ్జెట్‌తో, అధికంగా క్రొత్తవారితో నిర్మింపబడిన ఈ కాలేజీ పిల్లల ప్రేమ ఇతివృత్తంగా సాగుతుంది. ఈ సినిమాతో తేజ, ఉదయకిరణ్ వంటివారు తెలుగు చిత్రరంగానికి పరిచయమయ్యారు.
చిత్ర కథ
[మార్చు]రమణ (ఉదయ్ కిరణ్)ది ఒక మధ్య తరగతి కుటుంబం. రమణకు సంగీతమంటే ఆసక్తి. కాలేజీలో కొంతమంది స్నేహితులతో కలిసి ఒక బృందంగా సాధన చేస్తుంటాడు. తల్లితండ్రులు ఒక ప్రమాదంలో మరణించగా జానకి (రీమా సేన్), ఆమె ఆక్క అమెరికానుండి తిరిగి వచ్చి రమణ చదువుతున్న కాలేజీలో చేరతారు. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న జానకి, రమణలు ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. జానకి గర్భవతి అవుతుంది. ఆధునిక యువతి అయిన జానకి గర్భం తొలగించటానికి ఒప్పుకోక పోవటంతో ఇబ్బందికరమైన పరిస్తితులలో ఇంకా కాలేజీలో చదువుతుండగానే అప్పటికప్పుడే పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకొని ఒకింట్లో నివశిస్తుంటారు. పిల్లవాడిని పెంచుకుంటూ పరీక్షలకు చదువుకొంటూ ఉంటారు. కుటుంబ పోషణకు సంపాదించడానికి రమణ నానా ఇబ్బందులూ పడుతుంటాడు. మధ్యలో జానకిపై విసుక్కుటుంటాడు. రమణకు బిడ్డను అప్పగించి జానకి వెళ్ళిపోతుంది. ఇలా సాగుతుంది కథ.
పాటలు
[మార్చు]- ఢిల్లీనుండి గల్లీదాక - రవివర్మ, కౌసల్య
- మావో మావో - ఆర్.పి. పట్నాయక్, నిఖిల్, రవివర్మ, కౌసల్య
- ఏకాంత వేళ ఈ కాంత సేవ - కౌసల్య, మల్లిఖార్జునరావు
- చీమలు దూరని - బృందగానం
- ఊహల పల్లకిలో- ఉషా, నిఖిల్
- కుక్క కావాలి - నిఖిల్, సందీప్, రవివర్మ, గాయత్రి, ఉత్తేజ్, చేతన, తేజ, రమణ, ఆర్.పి. పట్నాయక్