తిరుపతి ప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుపతి ప్రకాష్
జననంతిమ్మాపురం కరణం రవి ప్రకాష్ రావు
(1972-08-22) 1972 ఆగస్టు 22 (వయస్సు: 47  సంవత్సరాలు)
హిందూపురం
నివాసంహైదరాబాదు
వృత్తినటుడు
తల్లిదండ్రులు
  • టి.కె. రామమూర్తి రావు (తండ్రి)
  • సత్యవతి (తల్లి)

తిరుపతి ప్రకాష్ ఒక తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్యపాత్రలు పోషిస్తుంటాడు. 180కి పైగా సినిమాలలో నటించాడు. ఈటివి లోనూ, జీ తెలుగు లోనూ 5 టెలి సీరియల్స్ లో నటించాడు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే హాస్యకార్యక్రమంలో పటాస్ ప్రకాష్ అనే ఒక బృందం పేరుతో హాస్య ప్రదర్శనలిస్తుంటాడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతని అసలు పేరు తిమ్మాపురం కరణం రవి ప్రకాష్ రావు. 1972 ఆగస్టు 22 న టి.కె. రామమూర్తి రావు, సత్యవతి దంపతులకు అనంతపురం జిల్లా, హిందూపురంలో జన్మించాడు. కర్నూలు లోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. చిన్నప్పటి నుంచే నాటకాలలో, విచిత్రవేషధారణ పోటీల్లో పాల్గొనేవాడు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బి.ఏ చదివాడు. మలేషియాలోని మల్టీమీడియా విశ్వవిద్యాలయం నుంచి నటనలో కోర్సు చేశాడు. [1] ఈవివి సత్యనారాయణ అతని పేరును తిరుపతి ప్రకాష్ గా మార్చాడు. మిమిక్రీ కూడా చేయగలడు.

కెరీర్[మార్చు]

1991 లో వచ్చిన నాని ప్రకాష్ తొలిసినిమా. ఇందులో ప్రకాష్ లారీ డ్రైవర్ సర్దార్జీ పాత్రలో నటించాడు. ఈవివి దర్శకత్వంలో వచ్చిన జంబలకిడిపంబ సినిమాతో ప్రకాష్ కు గుర్తింపు వచ్చింది. ప్రకాష్ పవన్ కల్యాణ్ అభిమాని కావడంతో పవన్ చాలా వరకు సినిమాలలో నటించాడు. హిట్లర్, వారసుడు, మాయాజాలం, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు. మాటీవీలో వచ్చిన సంబరాల రాంబాబు అనే సీరియల్ కూడా ప్రకాష్ కు గుర్తింపునిచ్చాయి.

సినిమాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. "తెలుగు హాస్యనటుడు తిరుపతి ప్రకాష్". nettv4u.com. Retrieved 6 September 2016.