మాస్టర్ (1997 సినిమా)

వికీపీడియా నుండి
(మాస్టర్ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మాస్టర్
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం సురేష్ కృష్ణ
నిర్మాణం అల్లు అరవింద్
తారాగణం చిరంజీవి ,
సాక్షి శివానంద్
సంగీతం దేవా
ఛాయాగ్రహణం ఛోటా కె నాయుడు
కూర్పు వెళ్ళైస్వామి
నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్
భాష తెలుగు

మాస్టర్ 1997లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, సాక్షి శివానంద్ ప్రధాన పాత్రలు పోషించారు. దేవా సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో చిరంజీవి మొదటి సారిగా పాట పాడాడు. అల్లు అరవింద్ నిర్మించాడు. ఛాయాగ్రహణం చోటా కె. నాయుడు నిర్వహించాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో డిటిఎస్‌లో రికార్డ్ చేసిన తొలి చిత్రం ఇది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.[1]

కథ[మార్చు]

కళాశాల ప్రిన్సిపాల్ జనార్దనరావు ( విజయ్ కుమార్ ), విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించాలని భావిస్తాడు. అతని ఒకప్పటి విద్యార్థి రాజ్‌కుమార్ ( చిరంజీవి ) ను అక్కడ తెలుగు లెక్చరర్‌గా నియమిస్తాడు. అతను ఆదర్శవంతమైన లెక్చరర్. రాజ్‌కుమార్ విద్యార్థులతో కలిసిపోతాడు. వారిని నియంత్రించడానికి వారితో కలిసిపోయి వారిలో ఒకడవుతాడు. అతని విద్యార్థులలో ఒకరు కాంచన ( సాక్షి శివానంద్ ) అతనితో ప్రేమలో పడుతుంది. తనను పెళ్ళి చేసుకోమని అడుగుతుంది. అతను ఆమెను మర్యాదగా తిరస్కరిస్తాడు.. తన గతం ఆమెకు తెలిస్తే ఆమె తన ప్రతిపాదనను రద్దు చేసుకుంటుందని చెబుతాడు. తన గతం గురించి చెబుతాడు.

ఢిల్లీలో తన విద్యార్థి రోజుల్లో, రాజ్‌కుమార్ జనార్దన్ రావు కుమార్తె ప్రీతి ( రోషిని ) తో ప్రేమలో పడతాడు . విక్రమ్ ( సత్య ప్రకాష్ ) కూడా ఆమెను ప్రేమిస్తాడు. ప్రీతి తన మాటలను తిరస్కరించినప్పుడు, విక్రమ్ ఆమెను కోపంతో చంపేస్తాడు. రాజ్‌కుమార్ విక్రమ్‌ను చంపి ఐదేళ్లపాటు జైలుకు వెళ్తాడు. జైలు శిక్ష అనుభవించిన తరువాత, అతను లెక్చరర్‌గా తిరిగి వస్తాడు. ప్రీతి తప్ప మరెవరినైనా ప్రేమించడం గురించి తాను ఆలోచించను కూడా లేనని కాంచనతో చెబుతాడు.

ఒక రోజు, రాజ్‌కుమార్, జనార్దన రావు జాగింగ్ చేస్తున్నప్పుడు వారు, రాజ్ కుమార్ చంపేసినట్లు భావించే విక్రమ్‌ను చూస్తారు. ఆశ్చర్యపోయిన రాజ్‌కుమార్, అతన్ని చంపడానికి అతని వెంట వెళ్ళడానికీ ప్రయత్నిస్తాడు. జనార్దన్ రావు అతన్ని ఆపి, ప్రీతీని చంపినది విక్రమ్ సోదరుడు, మాఫియా డాన్ డిఆర్ ( పునీత్ ఇస్సార్ ) అని చెప్తాడు. రాజ్‌కుమార్‌ను అతన్ని తరచి నపుడు, అప్పటికే అతడి జీవితంలో ఐదేళ్ళు పోగొట్టుకున్నందున, తనను మళ్ళీ కోల్పోతాననే భయంతో తాను తరువాత తెలుసుకున్న విషయాలను చెప్పలేదనీ జనార్దన్ అతనికి చెబుతాడు. నిస్సహాయంగా, రాజ్‌కుమార్ తన కోపాన్ని మింగివేస్తాడు.

ఇంతలో, రాజ్‌కుమార్ విద్యార్థి దిలీప్ డీఆర్ కుమార్తెతో ప్రేమలో పడతాడు. DR కి భయపడి, వారిద్దరూ పెళ్ళి చేసుకునేందుకు రాజ్‌కుమార్‌ను సహాయం అడుగుతారు. అతను తన ప్రమేయం గురించి జనార్దన్ రావును ఒప్పించి అతని సమ్మతిని తీసుకుంటాడు. వారికి పెళ్ళి చేసే ప్రయత్నంలో, రాజ్‌కుమార్ డిఆర్ పంపిన రౌడీలను ఎదుర్కొంటాడు. ఈ ప్రక్రియలో అతను డిఆర్, విక్రమ్ ఇద్దరినీ చంపి మళ్ళీ ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తాడు. జైలు శిక్ష తరువాత తన కోసం ఎదురుచూస్తున్న కాంచనను రాజ్‌కుమార్ వివాహం చేసుకోవడంతో కథ సంతోషంగా ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

ఈ చిత్రం లోని పాటలు[మార్చు]

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."తమ్ముడూ అరె తమ్ముడూ"చిరంజీవి[2] 
2."ఇంట్లోకి వెల్కం అంటూ"రాజేష్, సౌమ్య 
3."బియ్యెస్సీ అయినాగానీ"చంద్రబోఇస, కృష్ణరాజ్, రాజేష్ 
4."తిలోత్తమా"హరిహరన్, సుజాత 
5."బావున్నారా"రాజేష్, సౌమ్య 

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-02-09. Retrieved 2020-08-21.
  2. http://mio.to/album/Master+%281997%29