రోషిణి (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోషిణి
Roshini.jpg
జననం
రాధిక సదనా

వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1996-1998
తల్లిదండ్రులుషామా కాజీ, చందర్ సదనా
బంధువులునగ్మా (అక్క)
జ్యోతిక (అక్క)
సూరజ్ సదనా (సోదరుడు)

రోషిణి తెలుగు, తమిళ చలనచిత్ర నటి.[1][2] చిరంజీవితో మాస్టర్, బాలకృష్ణతో పవిత్ర ప్రేమ సినిమాల్లో నటించింది.

జీవిత విషయాలు[మార్చు]

షామా కాజీ, చందర్ సదనా దంపతులకు ముంబైలో రోషిణి జన్మించింది. నగ్మా, జ్యోతికలు రోషిణి సోదరీమణులు.[3]

సినిమారంగం[మార్చు]

సెల్వా దర్శకత్వంలో వచ్చిన తమిళ కామెడీ చిత్రం శిష్యా సినిమాలో నగ్మా ప్రోత్సాహంతో రోషిణి తొలిసారిగా నటించింది.[4] ఆ తరువాత 1997లో చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టి, పవిత్ర ప్రేమ, శుభలేఖలు వంటి తెలుగు చిత్రాలలో నటించింది. తక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమాలు రావడంతో 1997లో తనకు వచ్చిన సినిమా ఆఫర్లను తిరస్కరించింది. కె. బాలచందర్ నిర్మించిన తుళ్ళి తిరింత కాలం (1998) సినిమాలో నటించింది. ఈ చిత్రంలోని నటనకు ప్రశంసలు అందుకుంది.[5] నెపోలియన్ సరసన పులి పిరందా మన్ చిత్రం ముందకుసాగక పోవడంతో తరువాత రోషిణి చిత్ర పరిశ్రమ నుండి తప్పుకుంది.[6]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమాపేరు పాత్రపేరు భాష
1997 శిష్యా పూజా/అను తమిళం
1997 మాస్టర్ ప్రీతి తెలుగు
1998 పవిత్ర ప్రేమ రాణి తెలుగు
1998 శుభ లేఖలు తెలుగు
1998 తుళ్ళి తిరింత కాలం దేవి తమిళం

మూలాలు[మార్చు]

  1. https://www.filmibeat.com/tamil/movies/sishya.html#cast
  2. http://www.tollymasala.com/news/hits-and-flops-of-chiranjeevi
  3. "Tamil movies :Jyothika drives her sister away". www.behindwoods.com.
  4. "rediff.com, Movies: Showbuzz! Simran gives way to sis Monal".
  5. "Thulli Thirintha Kaalam: Movie Review". Archived from the original on 2017-05-09. Retrieved 2020-08-07.
  6. "A-Z (V)". Archived from the original on 24 April 2013.

ఇతర లంకెలు[మార్చు]