ఆలీబాబా అరడజను దొంగలు
ఆలీబాబా అరడజను దొంగలు | |
---|---|
![]() ఆలీబాబా అరడజను దొంగలు విసిడి కవర్ | |
దర్శకత్వం | ఇ.వి.వి. సత్యనారాయణ |
కథా రచయిత | మరుధూరి రాజా (మాటలు) |
దృశ్య రచయిత | ఇ.వి.వి. సత్యనారాయణ |
కథ | ఇ.వి.వి. సత్యనారాయణ బలభద్రపాత్రుని రమణి |
నిర్మాత | కె. చిన్ని |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, రవళి, శ్రీకన్య |
ఛాయాగ్రహణం | బాబ్జీ |
కూర్పు | నాయని మహేశ్వర రావు |
సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | మెలోడి మూవీస్[1] |
విడుదల తేదీ | 1994 ఆగస్టు 12 |
సినిమా నిడివి | 150 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆలీబాబా అరడజనుదొంగలు 1994, ఆగస్లు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. మెలోడి మూవీస్[2] పతాకంపై కె. చిన్ని నిర్మాణ సారథ్యంలో ఇ.వి.వి. సత్యనారాయణ[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రవళి, శ్రీకన్య నటించగా,[4] విద్యాసాగర్[5] సంగీతం అందించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.[6]
కథ[మార్చు]
పోలీసు అలీబాబా (రాజేంద్ర ప్రసాద్) 6మంది చిన్న దొంగలు కోటయ్య అండ్ కో (కోట శ్రీనివాసరావు, అలీ, మల్లికార్జున రావు), బ్రహ్మమ్ బ్రదర్స్ (బ్రాహ్మానందం, రాళ్ళపల్లి, చిడతల అప్పరావు) అనే రెండు వేర్వేరు ముఠాలకు సంబంధించిన కథ. ఈ రెండు ముఠాలు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి, వారి దొంగతనాలతో నగరంలో గందరగోళాన్ని, అల్లకల్లోలాన్ని సృష్టిస్తాయి. వారిని పట్టుకోవడానికి అలీబాబాను ప్రత్యేకంగా నియమిస్తారు. ఈ రెండు ముఠాలకు ఇద్దరు సోదరీమణులు పులన్ దేవి (రవళి), పూజా బేడి (శ్రీకన్య) ఉంటారు. 6మంది దొంగలు కుట్ర పన్ని, అలీబాబాను పక్కతోవ పట్టించి తమ చెల్లెల్లను ఇచ్చి వివాహం చేస్తారు. అలీబాబా తన ఇద్దరు భార్యలు, 6మంది బావమరుదులతో ఎలాంటి బాధలు పడ్డాడు, వాటినుండి ఎలా బయటపడ్డాడన్నది మిగతా కథ.
నటవర్గం[మార్చు]
- రాజేంద్ర ప్రసాద్ (ఆలీబాబా)
- రవళి (పూలన్ దేవి
- శ్రీకన్య (పూజా బేడి)
- కైకాల సత్యనారాయణ (ఎప్.పి)
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం (బ్రహ్మాం బ్రదర్స్)
- ఆలీ (నటుడు) (కోటయ్య అండ్ కో)
- మల్లికార్జునరావు (కోటయ్య అండ్ కో)
- రాళ్ళపల్లి (బ్రహ్మాం బ్రదర్స్)
- గిరిబాబు (ఆలీబాబా బాబయ్)
- విశ్వనాథన్ (అప్పాజీ)
- ఐరన్ లెగ్ శాస్త్రి (పిండాల శాస్త్రి)
- తిరుపతి ప్రకాష్ (మహిళా కానిస్టేబుల్)
- చిడతల అప్పారావు (బ్రహ్మాం బ్రదర్స్)
- ధమ్ (కానిస్టేబుల్)
- విద్యాసాగర్
- సిల్క్ స్మిత (ఎప్.పి. భార్య)
- నిర్మలమ్మ (బాలమణి)
సాంకేతికవర్గం[మార్చు]
- చిత్రానువాదం, దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ
- నిర్మాత: కె. చిన్ని
- మాటలు: మరుధూరి రాజా
- కథ: ఇ.వి.వి. సత్యనారాయణ, బలభద్రపాత్రుని రమణి
- సంగీతం: విద్యాసాగర్
- ఛాయాగ్రహణం: బాబ్జీ
- కూర్పు: నాయని మహేశ్వర రావు
- నిర్మాణ సంస్థ: మెలోడి మూవీస్
పాటలు[మార్చు]
Untitled | |
---|---|
ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[7]
No. | Title | Lyrics | గాయకులు | Length |
---|---|---|---|---|
1. | "బాబా బాబా ఆలీబాబా (రచన: భువనచంద్ర)" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 5:20 | |
2. | "నీ పేరే నా ప్రేమ (రచన: వేటూరి సుందరరామ్మూర్తి)" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:02 | |
3. | "ఎర్ర బుగ్గలు చూసుకో (రచన: భువనచంద్ర)" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 4:07 | |
4. | "కస్సు కస్సుమన్నది (రచన: భువనచంద్ర)" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 4:21 | |
5. | "రంభ నాకు పెద్దపాప (రచన: భువనచంద్ర)" | చిత్ర, మాల్గాడి శుభ | 4:56 | |
6. | "నీ పైట జారిపోతే (రచన: భువనచంద్ర)" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో | 4:59 | |
Total length: | 28:45 |
స్పందన[మార్చు]
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక దర్శకుడు ఇ. వి. వి. సత్యనారాయణ గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా "ఇవివి సూపర్-హిట్ కామెడీ, వినోదాత్మక చిత్రాలలో ఒకటి"గా పేర్కొంది.[8]
మూలాలు[మార్చు]
- ↑ "Alibaba 6 Dongalu (Overview)". IMDb.
- ↑ "Alibaba 6 Dongalu (Banner)". Movie Cation.
- ↑ "Alibaba 6 Dongalu (Direction)". Telugu Cinema Profile.
- ↑ "Alibaba 6 Dongalu (Cast & Crew)". Pluz Cinema. Archived from the original on 4 June 2016. Retrieved 20 May 2016.
- ↑ "Alibaba 6 Dongalu (Music)". Tollywood Times.com. Archived from the original on 1 July 2016. Retrieved 20 May 2016.
- ↑ "Alibaba 6 Dongalu (Review)". The Cine Bay.
- ↑ "Alibaba Aradajanu Dongalu (Songs)". Saavn.com.
- ↑ "EVV Satyanarayana passes away". Times of India. 22 January 2011. Archived from the original on 19 ఏప్రిల్ 2012. Retrieved 12 August 2020.
{{cite news}}
: Check date values in:|archive-date=
(help)
బయటి లంకెలు[మార్చు]
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- Articles with short description
- Short description is different from Wikidata
- 1994 తెలుగు సినిమాలు
- Articles using infobox templates with no data rows
- ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలు
- తెలుగు హాస్యచిత్రాలు
- రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన చిత్రాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- మల్లికార్జునరావు నటించిన చిత్రాలు
- గిరిబాబు నటించిన చిత్రాలు
- రాళ్ళపల్లి నటించిన సినిమాలు