ఐరన్ లెగ్ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐరన్ లెగ్ శాస్త్రి
జననం
గునుపూడి విశ్వనాథ శాస్త్రి

తాడేపల్లి గూడెం
మరణం2006 జూన్ 19
తాడేపల్లి గూడెం
మరణ కారణంగుండెపోటు
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
పిల్లలుప్రసాద్

ఐరన్ లెగ్ శాస్త్రి గా ప్రాచుర్యం పొందిన గునుపూడి విశ్వనాథ శాస్త్రి హాస్యనటుడు. పలు చిత్రాల్లో పురోహితుని పాత్ర పోషించాడు. 150 కి పైగా చిత్రాల్లో నటించాడు.[1] మొదట్లో సినిమా కార్యక్రమాలకు పౌరోహిత్యం చేసే ఈయనను దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ అప్పుల అప్పారావు చిత్రం ద్వారా నటుడిగా పరిచయం చేశాడు.[2] ప్రేమ ఖైదీ, అప్పుల అప్పారావు, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆవిడా మా ఆవిడే, పేకాట పాపారావు మొదలైన సినిమాలు ఆయనకు నటుడిగా పేరు తెచ్చిన చిత్రాలు. 2006 జూన్ 19న చనిపోయే ముందు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఆయన కుటుంబ సభ్యులు తమను ఆర్థికంగా ఆదుకోమని ప్రభుత్వాన్ని అర్థించారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. స్వస్థలం తాడేపల్లి గూడెం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మొదట్లో సినిమాల ప్రారంభోత్సవాలకు పౌరోహిత్యం వహించేవాడు. దర్శకుడు ఇ. వి. వి. సత్యనారాయణ ఆయనకు సినిమాల్లో నటుడిగా అవకాశం ఇచ్చాడు. 1991 లో ఆయన నటించిన అప్పుల అప్పారావు చిత్రంలో పాత్ర పేరు ఐరన్ లెగ్ శాస్త్రి. తర్వాత ఆయనకు ఆ పేరే స్థిరపడిపోయింది.[3] ఈయన కొడుకు ప్రసాద్ ఎం.బి. ఎ చదివి ఉద్యోగం చేస్తూ అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నాడు.[1]

సినిమాలు[మార్చు]

మరణం[మార్చు]

2006 నుంచి గుండెకు సంబంధించిన వ్యాధితో బాధ పడ్డాడు. జూన్ 19, 2006లో తన స్వస్థలం తాడేపల్లి గూడెంలో మరణించాడు. చివరి రోజుల్లో ఆయనకు పచ్చ కామెర్లు కూడా సోకింది. చనిపోయే ముంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఆయన కుటుంబ సభ్యులు తమను ఆర్థికంగా ఆదుకోమని ప్రభుత్వాన్ని అర్థించారు. వారి కుటుంబ పరిస్థితిని గమనించిన సంపూర్ణేష్ బాబు 25000 రూపాయలు సహాయం చేశాడు.[4] నటుడు సందీప్ కిషన్ కూడా కొంత ఆర్థిక సాయం అందజేశాడు.[5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "తండ్రి బాటలో." ntnews. 2020-06-19. Retrieved 2020-09-03.
  2. "'Iron Leg' Shastri dead". filmibeat.com. ఫిల్మీ బీట్. Retrieved 19 September 2017.
  3. Nathan, Archana. "There is a reason why Yash is rocking, Venkat is a fish and Srinivasan is a coconut". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-03.
  4. "Sampoo helps Iron Leg Shastri's family". telugucinema.com. telugucinema.com. Archived from the original on 25 మే 2018. Retrieved 19 September 2017.
  5. శశికాంత్ మాధవ్. "Iron Leg Sastry Family in Troubles and Seeking Help". chitramala.in. Retrieved 19 September 2017.